Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1996 · Forbearance Is a Safe Armour for Man
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Forbearance Is a Safe Armour for Man
26 June 1996, Sai Kulwant Hall
1
▾
Meaning
Keep
His poems 70
Also in his talks
(9)
7 February 1980
Be human
10 February 1980
Education in the Sai era
5 July 1996
For Every Kind of Sādhana, Prema Is Life Itself
19 August 1996
The Mind Itself Is the Root Cause of Bondage and Mokṣa
16 July 1997
Love for God, fear of sin, morality in society
5 April 1998
Who can recognise the principle of Śrī Rāma
4 September 1998
Remembering the Name of God Removes All Sorrow
6 May 2001
The sweetness of a mother's Prema is beyond words
22 August 2001
Vināyaka is the embodiment of all the gods
క్షమ
సత్యము
క్షమ
ధర్మము
క్షమ
యోగము
క్షమ
అహింస
క్షమ
యజ్ఞమగున్
క్షమ
ఆచారము
క్షమ
దయ
క్షమయే
ఆధారమగును
సర్వంబునకున్.
విద్యార్థులారా!
మానవుడు
సాధించవలసినది
ప్రప్రథమములో
ప్రధానమైనది
క్షమ.
ఈ
పవిత్రమైన
క్షమ
గ్రంథముల
చేత
తెలుసుకొనేది
కాదు.
అధ్యాపకుల
చేత
బోధింప
బడేది
కాదు.
మిత్రుల
చేత
అందుకోబడేది
కాదు.
లేక
మార్కెట్టులో
కొనేది
కాదు.
కంపెనీ
సప్లై
చేసేది
కాదు.
నిత్యజీవితములో
సత్యమైన
మార్గమున
ప్రవేశించి
అభ్యాస
రీతిగా
పొందవలసినదేగాని
మరొకరీతిగా
లభ్యమయ్యేది
కాదు.
నిత్యజీవితములో
సత్యమార్గము
ననుసరించి
ధర్మమార్గము
చేత
పొందవలసినదే
ఈ
క్షమ.
ఈ
క్షమ
మానవునికి
ఒక
భద్రమైన
కవచము.
ఎన్ని
కష్టములు
సంభవించినా,
ఎన్ని
బాధలు
సంభవించినా,
ఎన్ని
దుఃఖములు
ప్రాప్తించినా
మనము
దీనికి
లొంగక
పొంగక
కృంగక
ఈ
క్షమ
అనే
కవచము
ధరించి
తద్వారా
మనము
తట్టుకొని
నెట్టుకొని
ముందుకు
సాగాలి.
క్షమ
యొక్క
శక్తి
మరొక
దానికి
లేదు.
ఇది
మానవుని
ప్రధానమైన
విలువ.
ఈ
మానవతా
విలువైన
క్షమను
ఈనాడు
మానవుడు
విస్మరించి
కేవలము
ప్రాకృతమైన,
లౌకికమైన
వృత్తిలో
పాల్గొని
తన
మానవతా
విలువను
తాను
కోల్పోతున్నాడు.
కాని
మానవుడు
ఈనాడు
నిత్యజీవితములో
అనుభవించే
కష్టసుఖములకు
తాను
లొంగిపోయి
ఈ
క్షమను
కోల్పోతున్నాడు.
జీవితము
చాలా
విలువైనది.
జీవితము
చాలా
సుదీర్ఘమైన
ప్రయాణము.
జీవితము
జీవించవలసినది.
జీవితము
చాలా
పవిత్రమైనది.
ఇట్టి
పవిత్రమైన
జీవితములో
దివ్యమైన
మార్గము
అవలంబించటానికి
క్షమ
ఎంతైనా
అవసరము.
కొన్ని
కష్టములందే
ఈ
క్షమ
అభివృద్ధి
గాంచుతుంది.
కష్టములు
లేక
క్షమను
పెంచుకోటానికి
వీలుకాదు.
The
pleasure
is
an
interval
between
two
pains
అని.
కష్టములు
మానవుని
విలువలను
గుర్తింప
చేసేవి.
దుఃఖములు
మానవుని
మానవత్వము
ప్రకటింప
చేసేవే.
పంచపాండవులు
కష్టములందే
తమ
క్షమను
కాపాడుకోగలిగారు.
కనుక
కష్టములు
సుఖముల
నందించే
సోపానములే.
అయితే
ఈ
క్షమను
కూడా
సమయస్ఫూర్తిగా
మనం
వినియోగించుకోవాలి.
ఏ
సమయమందు
ఎవరికి
ఏ
విధంగా
ఈ
క్షమను
ఉపయోగించాలనే
విధి
విధానము
మనము
2
▾
Meaning
Keep
His poems 361
Also in his talks
(12)
7 February 1980
Be human
30 July 1987
To nurture sacred feelings in the heart is education
6 March 1989
God is the embodiment of Prema
8 October 1989
Be Pure in Thought, Word and Deed
22 May 1990
Mastery of the Senses
20 May 1991
The End Of Education Is Character
20 October 1996
When the Heart Is Turned to Prema, the World Turns to Brahman
25 April 1998
Every Person Longs for Śānti
26 September 1998
God Is the Very Foundation of the World
22 November 2001
True education brings the wealth of character
19 January 2002
Hospitals must not become business centres
28 October 2003
Loving the Ātma principle is spirituality itself
గుర్తించాలి.
మహమ్మద్గోరీ
పృథ్వీరాజుపై
పదిహేడు
పర్యాయములు
దండెత్తి
వచ్చాడు.
కాని
ఈ
పదిహేడు
పర్యాయములు
గోరీ
అపజయమునే
పొందాడు.
విశాల
హృదయుడు,
పవిత్ర
భావములు
కలిగినవాడు
పృథ్వీరాజు.
క్షమ
అతని
స్వభావము.
ఈ
పదిహేడు
పర్యాయములు
తనచేత
చిక్కబడినప్పటికిని
క్షమించి
అతనిని
వదలిపెట్టాడు.
కాని
గోరీ
దీనికి
కృతజ్ఞత
వెలిబుచ్చక
కృతఘ్నుడుగా
మారిపోయాడు.
మానవునకు
కృతజ్ఞత
అనేదే
తెలియదు.
స్వార్థము
స్వప్రయోజనములలో
మునగటం
చేత
మానవత్వము
ఇన్ని
విధములైన
చిక్కులకు
గురికావలసి
వచ్చింది.
ఈ
స్వార్థమునకు
ఒక
పరిమితము
ఉండాలి.
స్వప్రయోజనమునకు
ఒక
పరిమితముండాలి.
కాని
గోరీ
ఈ
విధమైన
క్షమ
గుర్తించుకోలేక
పోయాడు.
జయచంద్రుని
సహవాసము
చేత
తిరిగి
పృథ్వీరాజుపై
దండెత్తి
వచ్చి
పృథ్వీరాజును
ఓడించాడు.
కాని
పదిహేడు
పర్యాయములు
క్షమించిన
పృథ్వీరాజుకు
కృతజ్ఞత
చూపక
పృథ్వీరాజు
యొక్క
కన్నులను
తీయించాడు.
చూశారా!
ఈ
క్షమను
క్రూరుని
వద్ద
కొంత
పరిమితము
పెట్టుకోవాలి.
క్షమ
మంచిదే
గాని
మితిమీరి
నడిచే
వ్యక్తుల
దగ్గర
ఈ
క్షమ
ఏమాత్రము
ఉపకారము
చేయదు.
సకల
విద్యలు
నేర్చి
సభ
జయించగవచ్చు
శూరుడై
రణమందు
పోరవచ్చు
రాజరాజై
పుట్టి
రాజ్యమేలగవచ్చు
హేమగోదానముల్
ఈయవచ్చు
గగనమందున
చుక్కలు
లెక్కగొనవచ్చు
జీవరాసుల
పేర్లు
చెప్పవచ్చు
కాని
దేహేంద్రియాదుల
నరికట్టి
మనసు
నిల్పియు
నంతర్ముఖము
చేసి
అనవరత
నిశ్చలమైన
చిత్తుడై
నిలువగా
లేరు
మానవుల్
నియతితోడ
ఇంద్రియ
నిగ్రహము
అత్యవసరము.
దైవార్పిత
భావము
చేత
ఈ
క్షమను
మనం
అభివృద్ధి
గావించుకోవచ్చు.
దైవార్పిత
భావము
లేక,
దైవానుగ్రహము
లేక,
దైవ
ప్రీతి
లేక
ఈ
క్షమాగుణము
మనము
అభివృద్ధి
పరచుకోలేము.
క్షమయే
దైవము.
సత్యమే
దైవము.
ప్రేమయే
దైవము.
ప్రేమతత్వము
పొందినప్పుడు
3
▾
Meaning
Keep
Also in his talks
(4)
29 April 1992
So long as rāga, fear and anger remain, divinity is not understood
2 September 1992
Teaching equal-mindedness is the chief aim of Divinity
16 July 1996
Develop Virtues and Contemplate on God
4 September 1996
Kṛṣṇa Is Not One Thing and Kṛṣṇa's Word Another
సత్యము
క్షమ
మన
స్వాధీనమై
పోతాయి.
సక్కుబాయి
పండరి
పురములో
రాత్రింబవలు
రంగా
రంగా
యని
విచారిస్తూ
తన
లక్ష్యమును
తన
దీక్షను
రంగనిపై
ఉంచి
అనేక
కష్టములకు
గురికావలసి
వచ్చింది.
తెల్లవారి
మొదలు
రాత్రి
పరుండినంతవరకు
అత్త
భర్తల
చేత
అనేక
బాధలు
అనుభవిస్తూ
వచ్చింది.
కాని
ఈ
క్షమయే
ఆమెకు
బలమునందిస్తూ
వచ్చింది.
ఈ
క్షమా
గుణమే
శాంతిని
ఓర్పును
కలుగచేసింది.
ఈమెను
హింసించాలని
అనేక
కఠినమైన
పనులు
అందిస్తూ
వచ్చారు.
ఏమి
చేసినా
దైవార్పిత
భావముతో
చేస్తూ
వచ్చింది.
సర్వము
భగవత్ప్రీత్యర్థముగా
భావిస్తూ
వచ్చింది.
నిలువ
నీడ
లేని
బ్రతుకు
నీకొరకని
మోయుదాన
రంగా
నిలువదురా
నా
మనసు
నీ
చూపులు
దూరమైన
కలలోనైన
కనులకు
గానరావా
కృష్ణా!
నిన్ను
విడచి
నే
నిలువలే
రా
కానగరావా!
వేదసారమంత
తీసి
నాదబ్రహ్మముగను
మార్చి
వేణువందు
తిరగబోసి
గాన
రూపముగను
మార్చి
॥
పాట
పాట
పాడుమా
కృష్ణా
పలుకు
తేనెలొలుకునటుల
మాటలాడుమా
ముకుంద
మనసు
తీరగా
॥
పాడుతూ
బస్తాడు
బియ్యము
విసిరి
విసిరి
అలసి
పోయింది.
యద్భావం
తద్భవతి.
ఎట్టి
భావమో
అట్టి
ఫలము
ఎట్టి
భావమో
అట్టి
గుణము.
ఎట్టి
కర్మయో
అట్టి
ఫలము.
భగవద్విషయములో
పల
భయమునకు
తావులేదు.
ఈ
విధమైన
ధైర్యము
చేత
క్షమను
పెంచుకోవాలి.
కట్టకడపటికి
భక్తపరాధీనుడైన
భగవంతుడు
సక్కుబాయిని
ఆనందింప
చేయు
నిమిత్తమై
రంగడే
సక్కుబాయి
వేషము
ధరించి
ఇంటిలో
ఇంటి
పనులు
చేస్తూ
సక్కుబాయిని
పండరిపురం
పంపించాడు.
పాడింది
ఒక్కతూరి.
ఎంతకాలము
బాధల్
రంగా
ఎందుకోసము
గాథల్
న్యాయము
లేదా
నాలో
వాదా
నాపై
కరుణయు
రాదా
నీ
దాసిని
నే
నౌనా
కాదా
నీచ
పరచ
మర్యాదా!
నిజముగా
నేను
నీ
దాసురాలైతే
నాకెందుకీ
బాధలు.
నాలో
ఏదో
దోషముంది.
నాలో
ఏదో
అపచారమున్నది.
కనుకనే
నీవింత
ఆలస్యము
చేస్తున్నావు.
నా
దోషము
తెల్పి
నా
దోషము
నిర్మూలనం
చేయి.
తక్షణం
పాండురంగడు
ప్రత్యక్షమై
పాండురంగడే
సక్కుబాయిలో
చేరాడు.
జగత్తంతా
బ్రహ్మమయము.
అందరూ
బ్రహ్మస్వరూపులే.
4
▾
Meaning
Keep
Also in his talks
(6)
15 September 1986
The inner meaning and greatness of the festival of Onam
27 February 1995
Every atom is the form of God
25 August 1998
The Whole World Is Filled with Viṣṇu
14 January 2000
Bhakti and Śaraṇāgati
2 July 2004
If you call ‘Sai!’ with Prema, I answer ‘Here I am!’
30 March 2006
See only good, do only good, be good
అందరు
దైవాకారులే.
తాను
సక్కుబాయిలో
ప్రవేశించి
సక్కుబాయిని
పండరిపురం
పంపి
తాను
ఇంటిలో
కాపురము
చేస్తూ
వచ్చాడు
సక్కుబాయి
వలె.
దైవము
ఎక్కడ
చూచినా
ఉంటున్నాడు.
ఇందుగలడందు
లేడని
సందేహము
వలదు
చక్రి
సర్వోపగతుం
డెందెందు
వెదకి
జూచిన
నందందే
గలడు
....
నీ
హృదయము
పరిశుద్ధము
కావాలి
గాని
దైవదర్శనము
కష్టము
కాదు.
దైవదర్శనము
అంత
సులభమైనది.
కాని
నీ
హృదయ
మాలిన్యము
చేత
దైవత్వాన్ని
నీవు
పొందలేక
పోతున్నావు.
ప్రకాశముగా
నున్న
సూర్యుని
చూడాలంటే
కన్నులు
తెరవాలి.
సూర్యుడు
ప్రకాశిస్తున్నప్పటికిని
ఏరీతిగా
కనిపిస్తాడు.
మన
హృదయ
నేత్రము
పరిశుద్ధముగా
ఉండాలి.
పవిత్రముగా
ఉండాలి.
అప్పుడే
దైవత్వము
ఎక్కడ
చూచినా
సాక్షాత్కరిస్తుంది.
ఎక్కడ
చూచినా
పాణి
పాదములతో
ఉంటున్నాడు.
కాని
మానవుని
మనస్సు
దట్టమైన
మాలిన్యముతో
కప్పబడి
ఉంటున్నది.
ప్రాకృత
చింతలతో
ఉంటున్నాది.
భౌతిక
వాంఛలతో
చేరి
ఉంటున్నాది.
అస్థిరము
అశాశ్వతము
అయిన
వాంఛలతో
కూడి
ఉంటున్నాది.
కనుక
నిత్యసత్యమైన
దైవత్వమును
దర్శించాలంటే
హృదయము
పరిశుద్ధము
కావాలి.
అద్దము
మంచిదే
ఈ
అద్దములో
నీ
ప్రతిబింబము
కనిపించదు.
కారణం
ఏమిటి?
అద్దమునకు
వెనుక
భాగము
పాదరసము
పూసినప్పుడే
నీ
ప్రతిబింబము
కనిపిస్తుంది.
పాదరసము
పూత
లేక
నీ
ప్రతిబింబము
కనిపించదు.
ఆ
పాదరసమే
ప్రేమ.
మన
హృదయమనే
అద్దమునకు
పాదరసమనే
ప్రేమ
పూసినప్పుడే
రెండవ
వైపున
సాక్షాత్కారము
తక్షణమే
లభ్యమవుతుంది.
మానవుడు
ఈనాడు
ప్రేమరసమును
పూయటం
లేదు.
ద్వేషము,
అసూయ,
డంబము,
ఆడంబరము
ఇత్యాది
దుర్గుణముల
చేత
నిండి
ఉంటున్నాది
హృదయము.
దైవానుగ్రహము
ఎంత
కలిగినప్పటికిని
దానిని
అర్థము
చేసుకొనలేక
స్వార్థము
చేత
మానవత్వము
పూర్తి
కోల్పోతున్నారు.
తన
భావమే
తనకు
ఆ
విధంగా
ప్రతిబింబిస్తున్నాది.
అంతేగాని
దైవమందు
ఎట్టి
మార్పులు
ఉండవు.
దైవము
ఎప్పుడు
నిర్గుణం
నిరంజనం
సనాతనం
నికేతనం
నిత్యశుద్ధబుద్ధ
నిర్మల
స్వరూపిణం!
కాని
మన
భావములో
ఆ
విధముగా
భ్రాంతి
పడి
పోతున్నాది.
గజరాజు
ప్రార్థించాడు.
నారాయణుడు
రక్షించే
నిమిత్తమై
పోతున్నాడు.
లక్ష్మికి
5
▾
Meaning
Keep
Also in his talks
(3)
25 January 1990
Journeying toward God
22 February 2001
God's grace comes only through the right use of the senses
12 October 2002
The So'ham principle itself is the principle of the Trimūrti
భయము
వేసింది.
అడిగెదనని
కడువడి
జను
అడిగిన
తన
మగడుడుగదని
నెడ
నుడుగున్
వెడవెడసిడి
ముడి
తడబడ
అడిగడదు
జడిమ
అడిగిన
ఎడలన్.
ముందుకు
పోలేదు.
వెనుకకు
రాలేదు.
అద్వైతము
యొక్క
ప్రభావము
తనపై
ప్రసరించింది.
అర్థాంగి
అయినా
ఆ
దివ్యత్వము
చేత
ఒక
దిగ్భ్రాంతి
కలుగుతూ
వచ్చింది.
అడిగితే
చెబుతాడో
చెప్పడో
అని
సందేహము
కలుగుతూ
వచ్చింది.
ఈ
సందేహము
ఎప్పుడు
కలిగింది?
దోషము
ఉండినప్పుడే
కలుగుతూ
వచ్చింది.
ఏ
దోషము?
నా
దగ్గర
ఉన్న
విష్ణువు
నాకు
చెప్పకుండా
వెళ్లిపోతున్నాడే
అనే
అహంకారము
ఇక్కడ
మూలకారణము.
అహంకారము
మహా
చెడ్డది.
ఈ
అహంకారమే
మానవుని
అధఃపతనము
గావిస్తుంది.
ఈ
అహంకారము
అణగద్రొక్కితే
దివ్యత్వమనే
ప్రేమ
తత్వము
మనకు
సాక్షాత్కరిస్తుంది.
ఈ
అహంకారము,
ఆడంబరము,
అసూయ
ఇత్యాది
దుర్గుణములు
లేకుండా
పోవాలంటే
క్షమ
మనకు
సత్యం
క్షమ
మనకు
యోగం.
క్షమ
మనకు
దైవం.
క్షమ
మనకు
సర్వస్వము.
నీవు
ఏ
తపస్సు
చేయనక్కరలేదు.
ఏ
అడవులకు
పోనక్కరలేదు.
ఏ
విధమైన
సాధనలు
చేయనక్కరలేదు.
నిర్మలమైన
ప్రేమ
నీ
హృదయము
నుండి
ఆవిర్భవించాలి.
ఈనాటి
ప్రేమలు
కేవలము
పలుకులలో
మాత్రమే
ఉచ్చరిస్తున్నారు
గాని
హృదయమునుండి
ఆవిర్భవించటం
లేదు.
ప్రేమించినట్టుగా
నటిస్తున్నారే
గాని
ప్రేమ
యొక్క
స్వరూపమును
మీరు
గుర్తించటం
లేదు.
ప్రేమకు
భయము
లేదు.
ప్రేమకు
క్రోధము
లేదు.
ప్రేమకు
ద్వేషము
లేదు.
ప్రేమ
ఎప్పుడు
పరిపూర్ణముగా
నిర్మలముగా
ఉంటుంది.
భగవంతునిపై
అనేక
సందేహములు
ప్రారంభమవుతూ
ఉంటాయి.
ప్రేమ
లేని
సమయమందే
ఈ
సందేహములు
రావటం.
నిజముగా
ప్రేమ
ఉంటే
సందేహములుండవు.
తమ
సర్వస్వము
భగవంతునికి
అర్పిస్తుంటారు.
భక్తులకు
పరాధీనుడై
ఉంటాడు
భగవంతుడు.
భక్తునికి
మరొక
పనే
లేదు.
దైవము
యొక్క
చింతనే
భక్తునికి
భక్తుని
చింతనే
భగవంతునకు.
దాసునికి
హితము
బోధించటమే
గురువు
యొక్క
లక్ష్యము.
ఆజ్ఞను
పరిపాలించటమే
భక్తుని
యొక్క
పరమ
లక్ష్యము.
ఈ
రెండింటిని
విస్మరించి
తనకు
అవసరము
వచ్చినదాని
అనుసరిస్తున్నాడు
ఈనాటి
మానవుడు.
ఇది
సరైనది
కాదు.
ప్రేమ
6
▾
Meaning
Keep
Also in his talks
(2)
19 November 1987
Selfless service is the key to karma-yoga
29 August 1996
To Go Back to Where It Was Born Is the Nature of Every Living Being
ఎలాంటిది.
ద్రౌపది
యొక్క
ఐదుగురు
పుత్రులను
చీకటిలో
నిద్రించిన
వారిని
అశ్వత్థామ
గొంతులు
కోసి
వచ్చాడు.
ఏమాత్రము
తెలియని
బిడ్డలు.
కసికందులైన
బిడ్డల
గొంతు
కోశాడు.
కట్టకడపటికి
అర్జునుడు
అశ్వత్థామను
పట్టుకు
వచ్చాడు.
ద్రౌపది
దగ్గర
తెచ్చాడు.
క్షమ
ఎంత
గొప్పదో
చక్కగా
విచారించండి.
పరగన్
మా
మగవారలందరును
మున్
బాణప్రయోగోపసం
హరణాద్యాయుధ
విద్యలన్నియున్
ద్రోణాచార్యులచే
నభ్యసిం
చిరి
పుత్రాకృతినున్న
ద్రోణుడవు
నీచిత్తంబులో
లేశమున్
కరుణా
సంఘము
లేక
శిష్యసుతులన్
ఖండింపగా
పాడియే.
క్షమాగుణములో
క్షమిస్తున్న
ద్రౌపదిని
చూచి
భీమునికి
కోపం
వచ్చింది.
కొడుకుల
పట్టి
చంపెనను
కోపము
నొందదు
బాలఘాతుకున్
విడువు
మటంచు
చెప్పెడిది
వెఱ్ఱిది
ద్రౌపది.
వీడు
విప్రుడే
విడువగనేల
చంపుడు
మీరలు
వీని
చంపరేని
నా
పిడికిటి
పోటునన్
శిరమున్
భిన్నము
చేసెద
చూడు
డందరున్.
పోయి
కాళ్ళు
పట్టుకుంది
ద్రౌపది.
వెఱచిన
వాని
దైన్యమున
వేదన
నొందువాని,
నిద్రమై
మఱచిన
వాని
సౌఖ్యమున
మద్యము
ద్రావిన
వాని,
భగ్నుడై
పఱచినవాని,
సాధు
జడ
భావము
వానిని,
కావుమంచు
వా
చఱచిన
వాని
కామినుల
జంపుట
ధర్మము
కాదు
అర్జునా.
ఇది
న్యాయము
కాదు.
నా
బిడ్డలు
గతించినదని
నేను
ఎంత
బాధ
పడుతున్నానో
ఈ
అశ్వత్థామను
నీవు
చంపుతే
ఈ
అశ్వత్థామ
తల్లి
కూడా
అంత
బాధ
పడుతుంది
కదా.
నా
బిడ్డలు
ఎట్లైనా
చచ్చారు.
దుఃఖము
తప్పినది
కాదు.
ఇతనిని
చంపి
ఇతని
తల్లికి
ఎందుకు
దుఃఖము
నందించాలి?
ఇది
సరైన
క్షమ.
మన
బాధలు
ఎట్లా
ఉంటాయో
ఎదుటి
వాని
బాధలు
అట్లా
ఉంటాయనే
సత్యము
మనం
గుర్తించాలి.
పుత్రుల
యొక్క
వియోగము
చేత
ఎంత
బాధ
పడుతున్నానో
అశ్వత్థామ
తల్లి
ఆ
పుత్రుని
వియోగముచే
బాధ
పడుతుంది.
కనుక
అశ్వత్థామను
చంపకండి
అని
ప్రాధేయపడింది
భీమార్జునులను.
ఈ
కాలములో
ఏ
తల్లి
అయినా
అంత
క్షమను
అంత
ఓర్పును
కాపాడుకుంటుందా?
ఆమెయే
7
▾
Meaning
Keep
ద్రౌపది.
అగ్ని
స్వరూపములో
నున్నది
ద్రౌపది.
ఇంద్రియములను
అదుపులో
పెట్టుకొన్నది
ద్రౌపది.
అలాంటి
సతీమణులు
భారతదేశమందు
ఉద్భవించటం
చేత
ఈ
భారతదేశము
యొక్క
సంస్కృతి
అనేక
రకములుగా
ప్రకటిస్తూ
వచ్చింది.
అనాది
కాలము
నుండి.
ఎలాంటి
కష్ట
సమయమునందైనా
ఓపిక
పూని
శాంతితో
మన
జీవితమును
గడపటానికి
పూనుకోవాలి.
అనాది
కాలము
నుండి
క్షమ
ప్రతి
మానవుని
గుండెగా
నిల్చి
ఉంది.
శాంతి
మహర్షుల
సౌందర్యము.
క్షమను
కోల్పోటం
చేత
అనేక
సంవత్సరములు
తపస్సు
చేసిన
మహర్షులు
భ్రష్టులై
పోయారు.
రాజాధిరాజులు
క్షమ
లేక
రాజ్యమును
కోల్పోయారు.
క్షమను
కోల్పోవటం
చేత
పండితులు
పతనమై
పోతూ
వచ్చారు.
క్షమను
సర్వరక్షగా
మనం
భావించాలి.
అది
మనకు
గొప్ప
కవచము.
అట్టి
భద్రమైన
కవచము
మనము
ధరించి
అనిత్యము
అశాశ్వతమైన
లౌకిక
సుఖము
మనము
ధరించుకొని
దీనిని
భరించుకొన
లేక
అనేక
బాధలకు
గురౌతున్నాము.
విద్యార్థులారా!
క్షమ
చాలా
ప్రధానమైన
గుణము.
ఎలాంటి
పరిస్థితులందైనా
ఓపిక
మీరు
పట్టండి.
తొందరపాటు
పడకండి.
haste
makes
waste,
waste
makes
worry.
so
do
not
be
in
a
hurry.
మీరు
తొందరపడకండి.
శాంతముగా
భరించండి.
శాంతముతో
ఎంతైనా
సాధించవచ్చు.
‘శాంతము
లేక
సౌఖ్యము
లేదు
శాంతునికైనా
వేదాంతునికైనా
సారస
దళనయనా!’
శాంతము
లేనిదే
సౌఖ్యము
లేదు.
కనుక
ఈ
శాంతము
మనం
వహించాలి.
ఆ
శాంతమే
మనకు
రక్ష.
తొందరపాటు
పడకూడదు.
అందులో
విద్యార్థులలో
ఉడుకు
రక్తము
ప్రవహిస్తుంది.
కనుక
విద్యార్థులకు
క్షమ
అవసరము.
పరీక్షలను
ఎదుర్కొనుటకు
మనము
ఓర్పు
వహించాలి.
ఇతరులు
ఎన్ని
దుర్భాషలాడినా
ఓపికగా
తీసుకోవాలి.
ఏదో
వారన్నారని
మనము
కూడా
అంటే
మన
విలువైన
క్షమను
వ్యర్థము
చేసుకున్న
వారమవుతాము.
వారి
మాటలు
అల్పమైనవిగా,
విలువ
లేనివిగా
ఉండవచ్చును.
కాని
మన
క్షమ
చాలా
విలువైనది.
అట్టి
మసిబొగ్గుకు
ఈ
మాణిక్యమును
ధారపోయ
కూడదు.
క్షమ
మాణిక్యము.
పరులు
ఎన్ని
విధములైన
నిందారోపణలు
చేసినా
ఏమాత్రము
మనము
జంకకూడదు.
ఈనాడు
ఓపిక
లేకపోవటం
చేత
జీవితమునే
వ్యర్థము
గావించుకుంటున్నాము.
క్షణక్షణమునకు
కోపం
వస్తుంది.
కోపము
మహా
పాపము.
కాని
కొంతమంది
భగవత్ప్రార్థన
చేస్తూ
కూడా
ప్రక్కనున్న
వారితో
కోపం
చేత
అనేక
శబ్దములు
వాడుతుంటారు.
భజనలో
పక్కన
ఒక
అమ్మ
కూర్చుంది
అనుకోండి.
ఆమె
కొంత
స్థలం
ఇవ్వటం
లేదు.
కాని
చాలా
కష్టంగా
భరించుకుంటుంది.
8
▾
Meaning
Keep
అక్కడ
భరించుకోవాలి
మరి.
కాని
పక్కవ్యక్తిపై
కోపం
వచ్చి
భజన
అంతా
అయిన
తరువాత
శాంతి
చెప్తారు
శాంతిశాంతిశాంతి
అని
కోపమును
శాంతిలో
ప్రవేశపెడతారు.
ఇలాంటి
భక్తులు
ఏమి
శాంతి
సాధించగలరు.
ఇది
నాకు
ఒక
పరీక్ష
అని
శాంతి
శాంతి
శాంతి
అని
శాంతముగా
చెప్పాలి.
ఈ
శాంతి
కూడా
రౌద్రముగా
బయలుదేరుతున్నది.
అదే
భక్తి
రహితమైన
పాటలు.
నిజముగా
భక్తి
ఉంటే
ఎలాంటి
పరిస్థితి
యందైనా
సహన
భావము
వహించే
వారము.
చిన్న
చిన్న
విషయములకు
కూడా
మనం
కోపాన్ని
తెప్పించుకోకూడదు.
కాని
కోపాన్ని
తెప్పించుకుంటున్నాం.
ద్వేషాన్ని
పెంచుకుంటున్నాము.
కలహాలాడుతున్నాం.
కల్లోలము
చేస్తున్నాం.
సమాజములో
అశాంతిని
ప్రసరింప
చేస్తున్నాము.
కాదు
కాదు.
నీవు
శాంతిగా
ఉండు.
నీ
కుటుంబమును
శాంతిగా
పెంచుకో.
సమాజమునకు
శాంతినందించు.
అది
నీ
కర్తవ్యము.
అట్లు
కాక
నీకు
శాంతి
లేక,
సమాజమునకు
అశాంతి
అందివ్వటం
మహాపాపం.
కనుక
మనము
క్షమాగుణమును
అత్యవసరంగా,
ప్రధానమైన
ప్రాణముగా
భావించి
మనం
అభివృద్ధి
గావించుకోవాలి.
Previous
←
Man's Own Conduct Is the Cause of His Joys and Sorrows
Next
Too Much Talk Harms the Mind, Little Talk Gives Great Ease
→