Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 2004 · When You Give Up Delusion, You Yourself Are Brahman
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
When You Give Up Delusion, You Yourself Are Brahman
25 October 2004, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
His poems 519
Also in his talks
(3)
16 July 2000
Prema Is God, God Is Prema
22 November 2000
That Which Makes Oneness Known Is True Education
18 July 2008
God alone is the true Guru
ఏప్రేమ
శక్తిచే
ఈ
ధారుణీ
చక్ర
మిరుసు
లేకుండగా
తిరుగుచుండు
ఏ
ప్రేమ
శక్తిచే
నెల్ల
నక్షత్రాలు
నేల
రాలక
మింట
నిలచియుండు
ఏ
ప్రేమ
శక్తిచే
ఈ
పుడమి
బడక
కడలిరాయుడు
కాళ్ళు
ముడుచుకొనియె
ఏ
ప్రేమ
శక్తిచే
ఏడేడు
లోకాలు
గాలి
దేవుడు
సురటీలు
విసరె
ఆ
మహా
ప్రేమశక్తియే
ఆత్మశక్తి
అద్భుతమనంతమద్వితీయమగు
శక్తి
నిండియున్నది
బ్రహ్మాండ
భాండమెల్ల
ఈ
మహా
సృష్టియంతయు
ప్రేమమయమె
జీవితములో
మనము
సత్యవస్తువును
దర్శించవలెనన్న
ఏ
సాధనలూ
చేయనక్కరలేదు.
భగవంతునికి
బ్రహ్మ
అనీ,
విష్ణువనీ,
మహేశ్వరుడనీ
అనేక
పేర్లు
పెడుతున్నాము.
కాని,
ఈ
రూపములు
ఎవ్వరికీ
కనిపించటం
లేదు.
కేవలం
శక్తి
ఒక్కటి
మాత్రమే
ప్రేమస్వరూపమై
సర్వత్రా
సంచరిస్తున్నది.
ప్రేమచేతనే
మానవత్వము
దైవత్వముతో
ఏకమగుచున్నది.
మానవత్వమునందే
దైవత్వమున్నది.
దైవత్వముతో
సన్నిహిత
సంబంధబాంధవ్యము
నేర్పరచుకున్నప్పుడే
మానవుడు
సర్వశక్తులతో
కూడినవాడవుతాడు;
సర్వసమర్థుడవుతాడు.
మానవత్వముకంటే
మించిన
శక్తి
మరొకటి
లేదు.
మానవుడు
దివ్యశక్తిని
ఎక్కడినుండో
తెచ్చుకోనక్కర్లేదు.
మానవునియందే
దివ్యశక్తి
పూర్తిగా
నిండియున్నది.
ఆ
శక్తి
లేక
ఈ
మానవశక్తి
ఒంటరిగా
పనిచేయలేదు.
వేదములు
‘అహం
బ్రహ్మాస్మి’,
‘తత్త్వం
అసి’,
‘ప్రజ్ఞానం
బ్రహ్మ’,
‘అయమాత్మా
బ్రహ్మ’
అని
ప్రబోధిస్తున్నాయి.
2
▾
Meaning
Keep
His poems 287
Also in his talks
(21)
15 June 1973
The Bond of Prakṛti and the Paramātma
24 August 1989
Those Who Recognised the Paramātma Are the Gopīs
25 December 1989
Yearn for the Grace of God
4 April 1992
Neither swelling with joy nor sinking in sorrow: winning equanimity is the aim of Ugādi
15 January 1996
Only one who masters the mind can reach Mādhava
2 July 1996
Satya Alone Is God
29 August 1996
To Go Back to Where It Was Born Is the Nature of Every Living Being
8 September 1996
The Unseen Divinity Is the Basis of the World Fashioned as the Seen
22 September 1997
God delights in the feeling, not in outward show
26 February 1998
The power of saṅkalpas
18 April 1998
The universe is the form of Viṣṇu
4 September 1998
Remembering the Name of God Removes All Sorrow
26 September 1998
God Is the Very Foundation of the World
28 September 1998
The Five Elements Are the Very Forms of the Paramātma
23 November 2001
Self-confidence is the very stairway to Ānanda
13 March 2002
The divine power of attraction
10 September 2002
The Inner Meaning of Vināyaka Worship
8 October 2005
Remembering the Name is the way across
5 December 2006
Teachers alone are the real leaders
11 February 2007
Prema for God is the divine medicine for every worry
28 June 2008
Thinking of Rāma removes every worry
కాని
ఈ
మహావాక్యములను
సరిగా
అర్థం
చేసుకొనలేక
మానవుడు
మాయలో
మునిగిపోతున్నాడు.
నిజంగా
మానవత్వమునందే
సర్వశక్తులూ
ఇమిడియున్నవి.
కాని
మానవుడు
ఏవో
శక్తులను
సాధించి
బాధలనుండి
విముక్తి
పొందాలని
ఆశిస్తున్నాడు.
పుట్టుట
ఒకచింత
భూమినుండుట
చింత
సంసారమొక
చింత
చావు
చింత
బాల్యమంతయు
చింత
వార్ధక్యమొక
చింత
జీవించుటొక
చింత
చెడుపు
చింత
కర్మలన్నియు
చింత
కష్టములొక
చింత
సంతసమొక
చింత
వింత
చింత!
సర్వచింతలు
బాపెడి
సర్వేశుప్రేమను
గొనుడు
ఇకనైన
ప్రజలార
కోర్కెమీర!
నిజంగా
ఏది
చింత
లేనిది?
జీవితంలో
అన్నీ
చింతలచేతనే
ముడిపడియున్నవి.
అయితే
ఇవి
చింతలు
కావు;
మానవత్వాన్ని
వదలి
దైవత్వాన్ని
చేరుకోవటానికి
ఇవి
సోపానములని
గుర్తించాలి.
స్వప్నము
మాయా
కల్పితము
ప్రేమస్వరూపులారా!
“రాత్రి
స్వప్నములో
స్వామి
వచ్చాడు”
అని
మీరనుకుంటారు.
కాని,
నేను
ఎవరికీ
స్వప్నములో
పోవటం
లేదు.
మీ
సంకల్పమే
పూర్తిగా
ఉన్నప్పుడు
అది
మీకొక
రూపముగా
కనిపిస్తుంది.
స్వప్నములో
భగవంతుని
దర్శించామని,
ధ్యానములో
దైవాన్ని
చూశామని
కొందరు
చెబుతుంటారు.
ఇవన్నీ
వారివారి
భ్రమలేగాని,
నిజమైన
శక్తులు
కావు.
స్వప్నము
ఎక్కడుంది?
భగవంతుడు
ఎక్కడున్నాడు?
దర్శించటం
ఎక్కడ?
స్వప్నములో
కనిపించేవన్నీ
కేవలం
మాయాశక్తులే.
ఇది
ఒకవిధమైన
భ్రాంతియే!
ఈ
భ్రాంతిని
ఏనాడు
దూరము
గావించుకుందుమో
ఆనాడే
మనలో
నిజశక్తి
ప్రారంభమౌతుంది.
కొందరు
“మేము
దైవమును
ధ్యానిస్తున్నాము”
అంటారు.
ఆ
ధ్యానములో
గొప్ప
ప్రకాశమును
చూశామంటారు.
3
▾
Meaning
Keep
అసలు
ధ్యానమంటే
ఏమిటి?
మనస్సులో
ఎట్టి
చంచలత్వమూ
లేకుండా,
ఎట్టి
భ్రాంతియు
లేకుండా,
దేనితోను
సంబంధము
లేకుండా
ఉండటం.
మనిషి
ఎక్కడున్నాడో
అక్కడ
మనస్సున్నది.
“మనయేవ
మనుష్యాణాం
కారణం
బంధమోక్షయోః”
బంధనకుగాని,
మోక్షమునకుగాని
మనస్సే
కారణం.
మోక్షమంటే
ఏమిటి?
నిత్యసత్యమైన
ఆనందమును
అనుభవించటమే
మోక్షము.
ఈ
ఆనందము
ఎక్కడ
నుండో
వచ్చేది
కాదు;
మన
హృదయస్థాయినుండియే
ఆవిర్భవిస్తుంది.
మనస్సు
మహాచంచలమైనది.
ఈ
సంబంధ
బాంధవ్యములన్నీ
మాయాకల్పితములు.
పెండ్లి
చేసుకున్న
తరువాతనే
ఇరువురిమధ్య
భార్యా
భర్తల
సంబంధము
ఏర్పడుతున్నది.
అంతకు
పూర్వం
కూడా
నీవున్నావు,
ఆమె
ఉన్నది.
ఈ
సంబంధ
బాంధవ్యము
ఎక్కడినుండి
వచ్చింది?
అది
కేవలము
మనస్సుయొక్క
సంబంధమే!
భ్రాంతియొక్క
శక్తియే!
ఈవిధమైన
మాయాశక్తులను
మహత్తరమైన
శక్తులని
భావించుకోవటం
చాలా
పొరపాటు.
మొట్టమొదట
ఈ
మాయాశక్తిని
తొలగించుకోవాలి.
ఈ
మాయ
ఎప్పుడు
తొలగిపోతుందో
అప్పుడే
సర్వము
తెలుస్తుంది.
నీవే
బ్రహ్మ,
నీవే
విష్ణువు,
నీవే
శివుడవు
ప్రేమస్వరూపులారా!
ఆ
మాయకూడా
ప్రేమతో
చేరి
ఉంటుంది.
ప్రేమ
లేనిది
ఎక్కడా
ఏదీ
కనిపించదు.
సర్వం
ప్రేమమయం.
ఈ
సంబంధ
బాంధవ్యములన్నీ
ప్రేమచేతనే
కలుగుచున్నవి,
ప్రేమచేతనే
పెరుగుచున్నవి,
ప్రేమచేతనే
తరుగుచున్నవి.
పుట్టటం,
పెరగటం,
తరగటం
ఈ
మూడూ
ప్రేమసంబంధమే.
మానవులు
ఎన్నో
రకములైన
సాధనలు
సల్పుతున్నారు.
ఈ
సాధనలు
భ్రమనుండి
ఏర్పడినటువంటివి.
బ్రహ్మగాని,
విష్ణువుగాని,
మహేశ్వరుడుగాని
ఏ
ఒక్క
సాధనలోనూ
కనిపించరు.
ఈ
కనిపించేవన్నీ
మన
హృదయ
భావములే.
జగత్తునందు
బ్రహ్మలేడు;
విష్ణువు
లేడు;
ఈశ్వరుడు
లేడు.
ఉన్నదంతా
ఒక్క
మానవత్వమే.
కాని,
ఈ
సత్యాన్ని
నమ్మక,
దైవత్వము
కావాలని
మానవత్వములో
విచారణ
చేస్తే
ఏమి
కనిపిస్తుంది?
మానవత్వమే
కనిపిస్తుంది.
నీవు
మానవత్వములో
విష్ణువును
చూచినట్లుగా
అనుకుంటావు.
అయితే
విష్ణువు
ఎక్కడినుండో
రాడు.
నీవు
ఊహించే
స్వరూపము
విష్ణువు
కాదు.
అది
నీ
భ్రమ.
విష్ణువు
లేడు,
బ్రహ్మలేడు,
ఈశ్వరుడూ
లేడు.
ఉన్నది
ఒక్కడే
-
మానవుడు.
4
▾
Meaning
Keep
మనిషియందే
సర్వము
ఇమిడియున్నది.
నీవే
బ్రహ్మ,
నీవే
విష్ణువు,
నీవే
శివుడవు.
“అన్నీ
నేనే”
అని
అనుకుంటే
ఏ
చింతా
ఉండదు.
“నేనే
బ్రహ్మ,
నేనే
విష్ణువు,
నేనే
ఈశ్వరుడు”.
ఈవిధమైన
భావమును
పెంచుకుంటే
ఇంక
ఏవిధమైన
‘డౌట్స్’కూ
అవకాశముండదు.
మానవత్వముకంటే
మించిన
శక్తి
ఈ
జగత్తునందు
ఎక్కడా
కానరాదు.
మిగిలిన
శక్తులు
నీవు
కల్పించుకున్న
కల్పనలేగాని,
నిజమైన
శక్తులు
కావు.
కొందరు
“దైవానికి
కోపం
వచ్చింది”
అనుకుంటారు.
దైవానికి
కోపమూ
లేదు,
ప్రేమా
లేదు.
ఇవన్నీ
మీరే
కల్పిస్తున్నారు.
మీరు
నిరంతరం
ప్రేమలో
ఉండండి
అప్పుడు
ఈ
కోపతాపములు
ఏమాత్రము
కనిపించవు.
ప్రేమయే
మీ
స్వరూపము.
ప్రతి
మానవుడూ,
ప్రతి
ప్రాణికూడను
పుట్టటము,
పెరగటము
ప్రేమచేతనే
జరుగుతున్నది.
ప్రేమ
తప్ప
మరొక
శక్తి
లేదు.
ఈ
సత్యాన్ని
మీరు
విచారణ
చేసి
భ్రమలను
దూరం
చేసుకోవటానికి
ప్రయత్నించాలి.
భ్రమలో
బ్రహ్మ
లేడు.
బ్రహ్మలో
భ్రమ
లేదు.
ఈ
జగత్తంతయు
‘రిప్లెక్షన్’,
రియాక్షన్,
‘రిసౌండ్’
దివ్యాత్మస్వరూపులారా!
బ్రహ్మ
అనగా
చైతన్యమే!
చైతన్యము
సర్వత్రా
ఉంటున్నది.
చైతన్యమే
ఆత్మశక్తి.
అట్టి
శక్తి
మీయందే
ఉంటున్నది.
ఈ
శక్తియే
ప్రతి
వ్యక్తియందు
చేరి
ఆయా
రూపాలను
దర్శింపజేస్తున్నది.
మానవత్వములో
ఉన్న
శక్తి
దివ్యమైనది,
భవ్యమైనది,
దానిని
గుర్తించుకున్నప్పుడు
మీరు
సర్వవిధములుగా
శాంతి,
సంతోషాలను
అనుభవించగలరు.
‘డివైన్
పవర్’
అనేది
ఒక
ప్రత్యేకమైన
శక్తి
కాదు.
మీ
ఏకాగ్రత
యొక్క
శక్తియే
‘డివైన్
పవర్’గా
మారుతున్నది.
కనుక,
మొట్టమొదట
మీ
‘డివినిటీ’ని
మీరు
గుర్తించుకోవటానికి
ప్రయత్నం
చేయండి.
గ్రంథములలో
చదివే
విషయాలు
మీకు
కొన్ని
భ్రమలు
కల్పిస్తున్నాయి.
కొన్నికొన్ని
శక్తులు
పుడుతున్నట్లుగాను,
నశిస్తున్నట్లుగాను
మిమ్మల్ని
భ్రమింపజేస్తున్నాయి.
పుట్టేవి,
పెరిగేవి,
నశించేవి
అన్నీ
మీ
భ్రమలే.
ఈ
భ్రమలకు
మీరు
ఏమాత్రం
లొంగకూడదు.
మీరు
నిత్య
సత్యమైన
తత్త్వాన్ని
గుర్తించవలెనంటే
ఈ
జగత్తులో
కనిపించేవన్నీ
వట్టి
భ్రమలే
అని
తెలుసుకోండి.
మీరు
ఎక్కడైనా
కొండదగ్గరికి
పోయి
‘ఓ’
అని
గట్టిగా
అరిస్తే,
తిరిగి
అదే
శబ్దము
మీకు
వినిపిస్తుంది.
ఆ
వినిపించే
శబ్దము
మరొకరు
వేసిన
కేక
కాదు.
మీనుండి
వెలువడిన
ధ్వనియే
ప్రతిధ్వనిగా
మారి
మీకు
వినిపిస్తున్నది.
5
▾
Meaning
Keep
అదేవిధముగా,
మంచిచెడ్డలు
రెండూ
మీనుండి
ఏర్పడినటువంటివేగాని,
ఎక్కడినుండో
వచ్చి
మీలో
చేరటం
లేదు.
మీరు
ఏదైనా
ఒక
పదమును
తీసికొని
దానిని
పదేపదే
చదువుతూ
ఉంటే
అది
మీకు
కంఠస్థమైపోతుంది.
ఆ
కంఠస్థమైనది
మీది
కాదు;
అది
కేవలం
ప్రతిధ్వని.
ఈ
జగత్తులో
అన్నీ
‘రిప్లెక్షన్’,
‘రియాక్షన్’,
‘రీసౌండ్’
-
ఈ
మూడూ
తప్ప
మరొకటి
లేదు.
కనుక
ఇవన్నీ
భ్రమలేగాని
సత్యము
కాదు.
‘రియాలిటీ’
నీయందే
ఉన్నది
మీ
హృదయమునుండి
ఏ
భావము
ఆవిర్భవిస్తుందో
అదొక
రూపాన్ని
ధరిస్తుంది.
అదికూడా
మీయందే
ఉంటున్నది.
అంతకంటే
మించి
మీరు
సాధించగలిగేది
ఏదీ
లేదు.
ఉదాహరణకు
మీరు
రామస్వరూపాన్ని
చూడాలనుకుంటున్నారు.
కన్నులు
మూసుకొని
మీరు
ఆ
రామస్వరూపాన్ని
స్మరిస్తూ
రండి.
అదే
మీకు
‘రిఫ్లెక్షన్’గా
కనిపిస్తుంది.
రామాయణంలో
రామశక్తిని
గొప్పగా
వర్ణిస్తూ
వచ్చారు.
అయితే
ఆ
రామశక్తికూడా
మీకంటే
ప్రత్యేకంగా
లేదు.
ప్రజలలో
ఒకవిధమైన
చైతన్యమును
మేల్కొల్పే
నిమిత్తమై
ఆవిధంగా
వర్ణించారుగాని,
నిజానికి
రాముడు
నీవే;
కృష్ణుడు
నీవే;
ఈశ్వరుడు
నీవే.
“నేనే
ఈశ్వరుడను”
అని
భావించు.
అప్పుడు
నీవే
ఈశ్వరుడవైపోతావు.
నిన్ను
నీవు
కృష్ణునిగా
భావించుకో.
ఆ
కృష్ణుడే
నీవైపోతావు.
అన్నీ
నీనుండి
వచ్చే
‘రిఫ్లెక్షన్’,
‘రియాక్షన్’
‘రీసౌండ్’లే!
నీవే
సత్యమైనవాడవు.
You
are
the
reality.
దైవత్వము
మానవాకారములోనే
కనిపిస్తున్నదిగాని,
ప్రత్యేకంగా
లేదు.
‘నాకు
ఈశ్వరుడు
కనిపించాడు’
అని
అనుకుంటున్నావు.
ఆ
ఈశ్వరత్వమును
నీవు
కేవలం
మానవాకారంగానే
చూస్తున్నావుగాని,
దీనికి
అతీతమైనతత్త్వముగా
చూడటం
లేదు.
కాబట్టి
నీకంటే
అధికుడు
మరొకడు
లేడు.
సర్వమూ
నీయందే
ఉన్నది.
సర్వమూ
నీవే
అవుతున్నావు.
కాని,
నీవు
ఉన్నదానిని
మరచిపోతున్నావు;
లేనిదానిని
కల్పించు
కుంటున్నావు.
ఈ
భ్రమలను
దూరం
చేసుకున్నప్పుడే
నీకు
సాక్షాత్
బ్రహ్మను
చూడటానికి
వీలవుతుంది.
అందరూ
ఒక్కటే,
అందరిలో
ఉన్నది
నీవే!
అన్నింటికీ
ప్రేమయే
ప్రధానమైనది.
ప్రేమను
మించిన
దైవము
లేదు.
ప్రేమను
వదిలితే
ఏదీ
లేదు;
సర్వం
శూన్యమైపోతుంది.
ప్రేమను
ఒక
ఆకారముగా
నిర్మించుకో.
అదే
నీలో
నిలిచిపోతుంది.
6
▾
Meaning
Keep
ధ్యానము,
ధ్యానమని
కనులు
మూసుకొని
కూర్చొని,
లేనివన్నీ
కల్పించుకొని
చివరికి
నిన్ను
నీవే
మరచిపోతే
నీకు
కనిపించేది
ఏదీ
లేదు.
“నేనే
సర్వము,
నేనే
దైవము.
అన్ని
రూపములయందు
ఉన్నది
నేనే”
అని
గుర్తించు.
నీ
రూపమే
అనేకవిధాలుగా
మార్పుచెందుతున్నది.
పుట్టినప్పుడు
నీవు
చిన్నబిడ్డగా
ఉన్నావు.
అప్పుడు
నిన్ను
Child
అన్నారు.
పెరుగుతూ
పెరుగుతూ
కొంతకాలానికి
Boy
గా
మారినావు.
క్రమక్రమేణా
యువకుడవవుతావు.
ఈ
Child,
Boy,
Youth
ఈ
ముగ్గురూ
నీవే
కాదా!
అదేవిధముగా,
అందరిలో
ఉన్నది
నీవే.
అందరూ
ఒక్కటే.
All
are
one,
be
alike
to
everyone.
ఇదే
నీవు
నేర్చుకోవలసింది.
నీప్రేమను
స్థిరంగా
ఉంచుకో.
అంతకంటే
మించిన
సాధన
మరొకటి
లేదు.
అదే
ఆధ్యాత్మిక
సాధన.
అదే
దివ్యమైన
సాధన.
దివ్యత్వముతో
కూడిన
భావమును
నీవు
శాశ్వతముగా
నిలుపుకోవటానికి
ప్రయత్నం
చేయి.
నీవు
నిద్రిస్తూ
ఉండినా
నీ
భావము
కదులుతూనే
ఉంటుంది.
ఆ
కదిలే
‘రిఫ్లెక్షనే’
నీకు
కలగా
కనిపిస్తుంది.
సత్యమైన
వస్తువును
నీవు
చూడాలి.
అదే
సాక్షాత్
ఆకారము
-
సాక్షాత్కారము.
అదే
నీ
శాశ్వతమైన
రూపము.
అట్టి
శాశ్వతమైన
తత్త్వముపై
మనస్సు
నిల్పుకోవటానికి
నీవు
అభ్యాసం
చేయాలి.
అప్పుడు
కనులు
మూసినా,
కనులు
తెరచినా
అదియే
నీకు
సాక్షాత్కరిస్తుంది.
నీవు
ఎన్నెన్నో
రూపాలను
ఆశిస్తున్నావు.
కాని,
ఎన్ని
ఆశించినప్పటికీ
నిన్ను
నీవు
మరచిపోకూడదు.
నీవే
ఇన్ని
రూపములలో
ఉంటున్నావు.
నీవే
ఇన్ని
రూపములుగా
మారిపోతున్నావు.
రూపములు
మారినప్పటికీ
నీవు
ఏమాత్రము
మారటం
లేదు.
ఇవన్నీ
కలలుగా
కనిపిస్తుంటాయి.
కలలన్నీ
కల్లలే!
ఈ
భ్రమను
నీవు
ఏనాడు
దూరము
చేసుకుంటావో
ఆనాడే
నీకు
బ్రహ్మ
సాక్షాత్కరిస్తాడు.
ఈ
బ్రహ్మ
ఎవరు?
నీయొక్క
స్వరూపమే.
ఆ
సాక్షాత్కరించే
తత్త్వము
నీవేగాని,
మరొకటి
కాదు.
నీవు
స్వప్నములో
ఏదో
చూశావు.
ఆ
చూసినది
నిన్ను
నీవేగాని,
ఎవరినో
కాదు.
నిన్ను
నీవు
మరచిపోకుండా
నీతత్త్వాన్ని
నీవు
సాక్షాత్కరింపజేసుకో.
దైవశక్తులు,
దైవవిభూతులు
అన్నీ
నీయందే
ఉంటున్నవిగాని,
మరొక
ప్రదేశమునుండి
రావటం
లేదు.
నిజంగా
అవి
నీయందే
ఉన్నాయని
నీకు
ఎట్లా
తెలుస్తుంది?
నీ
దృష్టిని
అంతర్ముఖము
గావించుకొని
నిన్ను
నీవు
చూసుకో.
ఈ
విధంగా
ప్రాక్టీసు
చేస్తూ
రావాలి.
‘రియాలిటీ’
నీయందే
ఉన్నది.
‘రియాక్షన్’,
‘రిఫ్లెక్షన్’,
‘రీసౌండ్’
మూడూ
నీనుండి
వచ్చినవేగాని,
బయటినుండి
వచ్చినవి
కావు.
7
▾
Meaning
Keep
ఆకారమునుంచే
భ్రమలు
కలుగుతున్నాయి
పిల్లల్లారా!
‘రియాలిటీ’నుండి
వచ్చిన
ఆకారము
‘రియాలిటీ’నే
కప్పిపుచ్చుతున్నది.
మీకు
‘రియాలిటీ’
సాక్షాత్కరించాలంటే
ఏమి
చేయాలో
మున్ముందు
చెబుతాను.
మీరు
చేస్తున్న
‘మెడిటేషన్’
సరియైనది
కాదు.
ఏదో
ఒక
ఆకారాన్ని
పెట్టుకొని
మీరు
దానినే
పెంచుకుంటూ
పోతున్నారు.
ఆ
ఆకారమును
ఎవరు
తెచ్చుకున్నారు?
మీరే
తెచ్చుకున్నారు.
ఆకారమునుంచే
భ్రమలు
కలుగుతున్నాయి.
ఆ
భ్రమలను
వదలిపెడితే
అప్పుడే
సాక్షాత్కారమవుతుంది.
కనుక,
దైవత్వము
వేరే
ఎక్కడో
ఉన్నదని
భావించకండి.
మీరే
దైవము.
‘అన్నీ
నేనే’
అనే
తత్త్వాన్ని
మీరు
వదలకుండా
పట్టుకోండి.
‘రియాలిటీ’
మీయందే
ఉన్నది.
ప్రేమచేతనే
ఇది
మీకు
లభిస్తున్నది.
ప్రేమ
లేక
దేనినీ
మనం
సాధించలేము.
ప్రేమయే
సర్వమునకు
ఆధారము.
ప్రేమయే
దైవము,
దైవమే
ప్రేమ.
దైవము
మీయందే
ఉంటున్నాడు.
ఇటువంటి
ఏకత్వాన్ని
మీరు
భావించుకోండి.
‘ఏకంసత్’.
ఏకత్వమే
సత్యము.
ఏకత్వమే
దైవత్వము.
అదే
నీవు;
నీవు
అదే.
అది
‘నేనే’;
‘నేనే’
అది.
దైవము
నీకంటే
వేరు
లేడు.
కాని
నిన్ను
నీవు
మరచిపోతున్నావు.
నిన్ను
నీవు
మరచిపోతే
అన్నింటినీ
మరచినవాడవవుతావు.
కాబట్టి,
నిన్ను
నీవు
మరువవద్దు.
‘నేనే
దైవము’
అనే
భావమును
మరువకుండా,
మార్చుకోకుండా
పెట్టుకో.
‘అహం
బ్రహ్మాస్మి’,
‘తత్
త్వం
అసి’
-
ఇదే
వేదాంతములో
చెప్పినది.
ఆది
శంకరులవారు
అద్వైత
సిద్ధాంతమును
ప్రబోధించి,
తాము
అందులోనే
లీనమైపోయారు.
మీరు
ఇన్ని
విని,
ఇన్ని
చూసికూడా
తిరిగి
ద్వైతములో
మునిగిపోవటం
మంచిది
కాదు.
‘నేనే
దైవము’,
‘నేను
నేనే’
...
ఈ
ఉత్తమమైన
భావమును
స్థిరంగా
నిల్పుకోండి.
‘రాముడు
కలలో
వచ్చాడు’
అంటూ
మీరు
అజ్ఞానాన్ని
పెంచుకుంటున్నారు.
ఇవన్నీ
కలలే!
ఇది
సత్యమెట్లా
అవుతుంది?
నిద్ర
ఉండినంత
వరకు
కల
కనిపిస్తుంది;
నిద్ర
లేకపోతే
కనిపించదు.
అజ్ఞానమనే
నిద్రయే
ద్వైతభావానికి
మూలకారణం.
ప్రేమయే
మీ
గమ్యము,
ప్రేమచేతనే
మీ
జన్మధన్యము
ప్రేమస్వరూపులారా!
ప్రేమను
మీరు
భద్రముగా
పెట్టుకోండి.
ఎన్ని
ఆటంకములు
కలిగినా
ప్రేమను
మాత్రం
మీరు
వదలకూడదు.
ప్రేమయే
దైవము.
ప్రేమయే
మీ
గమ్యము.
ప్రేమచేతనే
మీ
జన్మ
ధన్యము.
8
▾
Meaning
Keep
అన్నింటియందు
ఏకత్వాన్ని
తీసుకోండి.
మీకేమైనా
‘డౌట్సు’
కలిగితే
అడగండి,
తప్పక
తీరుస్తాను.
సత్యాన్ని
బోధించటానికి
నేనెప్పుడూ
సంసిద్ధంగానే
ఉంటాను.
క్రమక్రమేణా
మీ
భావములను
తగ్గించుకుంటూ
రండి.
ఈ
భావములే
భ్రమలుగా
మారిపోతున్నాయి.
భ్రమను
త్యజించి
మీరు
బ్రహ్మగా
మారాలి.
మీ
దేహమునందే
బ్రహ్మ
ఉంటున్నాడు.
‘అహం’
‘బ్రహ్మ’
రెండూ
కలసి
ఒక్కటే.
కాబట్టి
రెండింటి
ఏకత్వానికై
మీరు
సాధన
చేయండి.
అదియే
దైవత్వానికి
రాజమార్గము.
మీరు
ధ్యానము
చేయాలనుకుంటే,
ఆ
ధ్యానములో
ఏమేమో
ఊహించుకోకండి;
వస్తువాహనాదులను
తలచుకోకండి.
మీ
నిజతత్త్వాన్ని
మీరు
తలచుకోండి.
మీ
నిజతత్త్వాన్ని
మీరు
ధ్యానించుకోండి.
అందులోనే
సర్వము
ఇమిడియున్నది.
అప్పుడే
ఏకత్వమును
గుర్తించటానికి
వీలవుతుంది.
‘యూనిటీ’
(ఏకత్వము)
అనేది
‘ప్యూరిటీ’
(పవిత్రత)ని
కలిగిస్తుంది.
‘ప్యూరిటీ’
అనేది
‘డివినిటీ’
(దివ్యత్వము)గా
మారిపోతుంది.
Previous
←
Foster the Spirit of Sacrifice
Next
Only When Oneness Is Experienced Does Human Birth Find Its Fulfilment
→