Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 2004 · Only When Oneness Is Experienced Does Human Birth Find Its Fulfilment
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Only When Oneness Is Experienced Does Human Birth Find Its Fulfilment
22 November 2004, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
His poems 107
Also in his talks
(1)
22 November 1989
Conduct Yourselves with Humility and Obedience
ప్రేమ
స్వరూపులారా!
ఈనాటి
ప్రపంచము
యొక్క
పరిస్థితులు
మీకు
తెలియనివి
కావు.
దైవాన్ని
గురించి
చెప్పుటకు
ఎక్కడా
ఏ
మాత్రము
అవకాశము
లేదు.
ధనమె
దైవంబయ్యె
దర్పంబె
మతమయ్యె
స్వార్థమే
బుద్ధికి
స్థానమయ్యె
అహము
ఫేషను
అయ్యె
ఆశలందంబయ్యె
ధర్మంబు
వమ్మయ్యె
ధాత్రిలోన
దయయు
హీనంబయ్యె
నయము
శూన్యంబయ్యె
కపటమే
జీవుల
కాంతులయ్యె
ప్రేమానురాగముల్
రోగాల
పాలయ్యె
కామాంధులుగ
జేసె
కలిని
చదువు
ఇలాంటి
పరిస్థితులయందు
ప్రేమను
గురించి
ఏరీతిగా
బోధించటానికి
వీలవుతుంది?
నేడు
లోకంలో
ధర్మమనేది
ఎక్కడా
కనిపించటం
లేదు.
దైవము
ఒక్క
ప్రేమకు
తప్ప
అన్యమార్గములో
గోచరించడు.
ప్రేమ
అనగా
కేవలం
లౌకిక
విషయాలకు
సంబంధించినదిగా
మీరు
భావిస్తున్నారు.
మీ
స్వార్థము
కోసం
మీరు
ఇతరులను
ప్రేమిస్తున్నారు.
ఇటువంటి
స్వార్థపూరితమైన
ప్రేమతో
దైవాన్ని
దర్శించటానికి
వీలుకాదు.
నిజంగా
విచారణ
చేస్తే,
స్వార్థరహిత
ప్రేమయే
దైవత్వము.
పామరుడు
మొదలుకొని
పరమహంసవరకు
ప్రేమతత్త్వం
అందరిలోనూ
సమత్వంగానే
ఉన్నది.
నేనెల్లప్పుడు
ప్రేమను
గురించే
బోధిస్తుంటాను.
నాకు
ప్రేమ
తప్ప
అన్యమార్గములేవీ
తెలియవు.
ప్రేమగల
వ్యక్తికి
ప్రతి
వస్తువులోనూ,
ప్రతి
జీవిలోనూ
పరమాత్మ
తత్త్వము
గోచరిస్తుంది.
2
▾
Meaning
Keep
Also in his talks
(27)
5 September 1987
Today satsaṅga is what man needs most urgently
5 October 1992
What man must seek is real, eternal happiness
23 November 1997
The God who fills everything is ‘I’
5 April 1998
Who can recognise the principle of Śrī Rāma
14 April 1998
God pervades all
26 September 1998
God Is the Very Foundation of the World
28 September 1998
The Five Elements Are the Very Forms of the Paramātma
11 October 1998
Human Life Is the Fruit of Our Resolves
21 November 1999
No sādhana greater than service
26 March 2001
The principle that is the root and base
23 November 2001
Self-confidence is the very stairway to Ānanda
25 December 2001
Though faiths differ, Mādhava is one
16 March 2003
The principle of Prema: the divine power of attraction
21 March 2004
I am you, you are I
11 April 2004
Truth itself is the form of God
15 April 2004
The principle of Prema is Divinity itself
17 October 2004
Develop the Feeling of the One Ātma
25 December 2004
Pray for the Sake of God's Prema
8 March 2005
Śivatva is the very consciousness in all beings
23 November 2005
All Are Embodiments of God
26 February 2006
All is full of Brahman
30 March 2006
See only good, do only good, be good
14 April 2006
Fix your mind on Divinity; place your trust in Oneness
2 May 2006
The body itself is the temple; you yourself are God
11 August 2006
Divinity is attained only through Prema for God
13 April 2008
The Name of Rāma is best; the thought of Rāma is enough
24 May 2008
Remembering the Name is the way across
సర్వతః
పాణిపాదం
తత్సర్వతోక్షి
శిరోముఖం
సర్వతః
శ్రుతిమల్లోకే
సర్వమావృత్య
తిష్ఠతి
కాబట్టి
దైవము
వేరు,
ప్రకృతి
వేరు
అని
విభజించటానికి
వీలు
లేదు.
ఇది
ప్రేమించతగినది.
అది
ప్రేమించతగనిది
అని
నిర్ణయం
చేసే
అధికారం
ఎవ్వరికీ
లేదు.
ప్రేమయే
దైవము,
దైవమే
ప్రేమ.
దైవము
అనే
పేరు
వినిపిస్తున్నది
గాని,
రూపము
కనిపించదు.
అయితే
దైవమును
దర్శించాలని
మనం
అచంచలమైన
దీక్షను
పూనినప్పుడు
ప్రేమ
అనేది
ఒక
స్వరూపాన్ని
ధరించి
సాక్షాత్కరిస్తుంది.
అన్నిటియందు
దైవత్వం
సమత్వంగా
ఉన్నది.
ఇటువంటి
పరిస్థితిలో
ఒకటి
దైవస్వరూపమని,
మరొకటి
కాదని
ఏ
రీతిగా
నిర్ణయించగలము!
మీ
అందరియందు
ప్రేమ
ఉన్నది.
కాబట్టి
మీరందరూ
దైవస్వరూపులే!
ప్రేమతత్త్వం
ఎటువంటిది?
ప్రేమను
మాటల్లో
వర్ణించటానికి
వీలుకాదు.
దానిని
అనుభవించి
ఆనందించవచ్చును.
కాబట్టి,
ఆనందమే
ప్రేమస్వరూపమని
చెప్పవచ్చును.
ప్రేమ
ప్రతి
మానవునియందున్నది.
కాని,
ఒక్కొక్కరు
ఒక్కొక్కవిధంగా
దానిని
వినియోగించుకుంటున్నారు.
ప్రేమతత్త్వం
కేవలం
మానవునిలోనే
గాక
ప్రతి
జీవిలోనూ
ఉన్నది.
ప్రతి
ప్రాణియందు
‘డివినిటీ’
(దివ్యత్వం)
ఉన్నది.
‘డివినిటీ’
యందే
ప్రేమతత్త్వం
ఇమిడియున్నది.
కాని,
ఈనాటి
మానవుడు
‘డివినిటీ’ని
విస్మరించి
‘ఎనిమిటీ’ని
(ద్వేషమును)
పెంచుకుంటున్నాడు.
‘ఎనిమిటీ’ని
అణచివేసి
మనం
ప్రేమను
అనుభవించి,
ఆనందించి,
అందరికీ
అందించినప్పుడే
దైవత్వాన్ని
పొందగలము.
ఈ
ప్రపంచములో
ప్రేమ
ఒక్కటి
తప్ప
మిగిలినవన్నీ
మార్పు
చెందునవే!
ప్రేమమార్గమే
నిత్యసత్యమైన
మార్గము.
నిత్యసత్యమైన
ప్రేమ
ఒక్క
దైవత్వమునందు
మాత్రమే
గోచరిస్తుంది.
ఏకత్వము
నందే
దైవత్వము
సాక్షాత్కరిస్తుంది.
మనం
దైవత్వమునకు
అనేక
రూపనామములు
కల్పించి
ఆరాధిస్తున్నాము.
కాని,
నిజంగా
దైవత్వము
రూపనామములకు
అతీతమైనది.
‘దైవం
మానుష
రూపేణ’
‘సర్వతః
పాణి
పాదం....’
ఇటువంటి
దైవత్వానికి
ఏ
పేరని
పెట్టగలము?
పేర్లు
ఎన్ని
పెట్టినప్పటికీ
ప్రేమతత్త్వము
మారదు.
‘శృంగారములు
వేరు,
బంగారమొక్కటే’.
బంగారము
ఎక్కడినుండి
వచ్చింది?
3
▾
Meaning
Keep
భూమి
నుండియే
పుట్టింది.
అదే
రీతిగా
దైవత్వం
కూడా
మానవ
దేహమునందే
ఉన్నది.
‘దైవం
మానుష
రూపేణ’.
మన
కంటికి
కనిపించే
ప్రతి
వ్యక్తీ
దైవస్వరూపుడే!
చూడండి,
ఇక్కడ
అనేక
శిరస్సులు,
అనేక
హస్తములు,
అనేక
నేత్రములు
గోచరిస్తున్నాయి.
అన్ని
శిరస్సులు
కూడను
దైవము
యొక్క
శిరస్సులే!
దీనిని
పురస్కరించుకొనియే
వేదము
“సహస్ర
శీర్షా
పురుషః
సహస్రాక్షః
సహస్రపాత్”
అన్నది.
Transcendental
love
is
divinity
అట్టి
దైవత్వమును
ఎట్లు
అనుభవించాలి?
గాఢమైన
నిశ్శబ్దములో,
ఏకాత్మ
భావంతో
మనం
అనుభవించాలి.
నిశ్శబ్దములో
చాలా
గొప్ప
శక్తి
ఇమిడి
ఉన్నది.
గాఢమైన
నిశ్శబ్దములోనే
భగవత్తత్త్వమును
అనుభవించటానికి
వీలవుతుంది.
కనుకనే
Silence
is
gold
అన్నారు.
భగవంతుడు
మనకు
నోరిచ్చినది
కేవలం
మాట్లాడటం
కోసం
కాదు.
అతిగా
మాట్లాడటం
వలన
మనం
నోటిని
దుర్వినియోగపరచిన
వారమౌతాము.
కనుక,
సాధ్యమైనంత
వరకు
మనం
నిశ్శబ్దమును
పాటించాలి.
ప్రాచీన
కాలంలో
ఋషులు
మౌనవ్రతమును
పాటించేవారు.
మౌనమనగా
కేవలం
వాగ్బంధన
మాత్రమే
కాదు;
సంకల్పములను
అరికట్టుకోవాలి.
అప్పుడే
దివ్యత్వమనే
Transcendental
Power
మనకు
సాక్షాత్కరిస్తుంది.
ఇది
అవాఙ్మానస
గోచరము.
ఇట్టి
దివ్యశక్తి
ప్రతి
మానవునియందు
కూడా
ఉంటుంది.
కేవలం
ఏకత్వముతో
కూడిన
ప్రేమద్వారా
మాత్రమే
దీనిని
మనం
అనుభూతిలోకి
తెచ్చుకోవచ్చును.
అట్టి
దివ్యానుభవాన్ని
పొందినప్పుడు
ఎక్కడ
చూసినా
మనకు
సత్యస్వరూపము
సాక్షాత్కరిస్తుంది.
కేవలం
బాహ్య
దృష్టికి
కనిపించే
దృశ్యములు
మనలను
అనేకరకాలుగా
భ్రమింపజేస్తున్నాయి.
నిశ్శబ్దంగా
కనులు
మూసుకొని
అంతర్దృష్టితో
విచారణ
చేస్తే
సత్యము
మనకు
అర్థమవుతుంది.
ఇటువంటి
దివ్యానుభవమును
మాటల్లో
వర్ణించటానికి
వీలుకాదు.
మనం
చూస్తున్నదంతయు
పరమాత్మ
స్వరూపమే.
అట్టి
పరమాత్మునికి
ఏ
పేరు
పెట్టవచ్చును!
కనుక,
పరమాత్ముణ్ణి
ఒక
ప్రత్యేకమైన
రూపనామములకు
పరిమితం
చేయటం
చాలా
పొరపాటు.
ఆనందమే
పరమాత్మస్వరూపము.
4
▾
Meaning
Keep
Also in his talks
(20)
23 November 1978
Faith Is the Foundation of the Spiritual Path
8 November 1986
Through the Name we can attain the Named!
30 September 1987
Understand the Sai principle well
5 March 1992
‘Adhyātmavidyā vidyānāṁ’
14 January 1995
Prema is like a compass
24 June 1996
A Life without Character Is a Lifeless Life
17 July 1997
The principle of the Ātma and divinity
21 April 1998
The body itself is foremost for the practice of Dharma
14 August 1998
Prema Alone Is the Path, Prema Alone the Goal
30 September 1998
God's Prema Is Eternal, Everlasting
19 November 1998
Women Alone Are the Root Cause of Bhārata's Greatness
2 April 2003
Leave the delusion of the body; think of God
18 May 2003
Prema is the very essence of the Paramātma
21 October 2003
I have come only to reveal your true nature
14 January 2005
When the heart is filled with Prema, life is filled with Ānanda
23 June 2005
Recognise the fundamental principle
14 April 2006
Fix your mind on Divinity; place your trust in Oneness
21 May 2006
Service to society is itself the right sādhana
11 August 2006
Divinity is attained only through Prema for God
28 July 2007
Every human being is God
నిత్యానందం
పరమసుఖదం
కేవలం
జ్ఞానమూర్తిం
ద్వంద్వాతీతం
గగనసదృశం
తత్త్వమస్యాది
లక్ష్యం
ఏకం
నిత్యం
విమల
మచలం
సర్వధీ
సాక్షిభూతం
భావాతీతం
త్రిగుణరహితం
.....
దివ్యత్వము
సర్వత్రా
గోచరిస్తున్నది.
కాబట్టి
మనము
దివ్యత్వము
కొరకై
అన్వేషించటం
చాలా
పొరపాటు.
అన్ని
రూపాలలోనూ
దైవత్వం
ఉన్నది;
అన్ని
రూపాలు
కూడా
దైవానివే!
ఒకే
బంగారముతో
అనేక
ఆభరణాలు
తయారైనట్లుగా,
ఒక్క
దైవత్వము
అన్ని
రూపాలనూ
ధరిస్తున్నది.
కాబట్టి
మొట్టమొదట
దైవత్వమనేది
ఒకటున్నదనే
నమ్మకము
మనయందు
కలగాలి.
చూడటానికి
తగిన
ప్రయత్నం
చేస్తే
దైవత్వం
తప్పక
కనిపిస్తుంది.
ప్రాచీన
ఋషులు
ఎన్నో
విధములైన
సాధనలు
చేసి,
గాఢమైన
నిశ్శబ్దము
నందు
దైవత్వమును
అనుభవించ
గలిగారు.
మనస్సు
ఉండినంతవరకు
మనకు
దైవసాక్షాత్కారం
కలుగదు.
కాబట్టి
మనస్సును
నాశనం
చేయాలి.
మనస్సనేది
అన్నిచోట్ల
అందరియందు
ఉంటున్నది.
మనస్సుకు
ఒక
ఆకారం
లేదు.
ఒక్క
దైవస్వరూపాన్ని
మీరు
కల్పించుకోండి.
ఆ
స్వరూపంలో
మీ
మనస్సును
ఇముడ్చుకోండి.
అప్పుడు
మనస్సే
మాధవత్వంగా
మారిపోతుంది.
మనస్సును
క్షణక్షణమూ
మార్చుకోకూడదు.
కాని
ఈనాటి
మానవుని
మనస్సు
అన్నివిధాలుగా
చలిస్తూనే
ఉన్నది.
ఇటువంటి
చలించే
మనస్సును
మనం
ఆధారము
చేసుకోకూడదు.
చలించనటువంటి
దైవత్వాన్ని
మనం
దృఢంగా
నమ్మాలి.
మీరు
కల్పించుకొన్న
దైవ
స్వరూపాన్ని
ఏమాత్రము
మార్చుకొనక
కనులు
మూసుకొని
ఆ
రూపాన్నే
స్మరిస్తూ
రావాలి.
ఏకత్వమునందే
అనేకత్వము
పుడుతున్నది
‘ఏకం
ఏవ
అద్వితీయం
బ్రహ్మ’
ఉన్నది
ఒక్కటే!
అదే
అనేక
రూపనామములను
ధరించినది.
దానిని
మీరు
ఒకే
మనసుతో
పట్టుకోవాలి.
“నిర్గుణం
నిరంజనం
సనాతనం
నికేతనం
నిత్య
శుద్ధ
బుద్ధ
ముక్త
నిర్మలస్వరూపిణం”.
అట్టి
దివ్యత్వం
మీ
యందే
ఉన్నది.
మీ
యందున్న
దివ్యత్వమును
మీరు
చూసుకోకుండా
ఎక్కడెక్కడికో
పోయి
వెతుకుతున్నారు.
5
▾
Meaning
Keep
మీ
అంతర్భావమే
మీకు
బహిర్ముఖంగా
కనిపిస్తున్నది.
బయట
కనిపించేదంతా
కేవలం
‘రిఫ్లెక్షన్’
మాత్రమే.
మీరు
‘రియాలిటీ’ని
మనస్సులో
పెట్టుకోండి.
మీరు
కోరవలసినది
ఒక్కటే.
అదే
దైవత్వము.
అదే
ఏకత్వము.
ఏకత్వము
లేకపోతే
అనేకత్వము
గోచరించదు.
అనేకత్వము
ఏకత్వమునందే
పుడుతున్నది;
ఏకత్వము
నందే
పెరిగి
ఏకత్వమునందే
లీనమైపోతున్నది.
కాబట్టి
ఏకత్వమును
మనము
హృదయమునందు
నిలుపుకోవాలి.
చర్మచక్షువులు
కాదు,
జ్ఞానచక్షువు
ముఖ్యం
ప్రేమతత్త్వాన్ని
ఎంత
త్వరగా
పెంచుకుంటే
అంత
త్వరగా
మనము
దైవత్వాన్ని
చూడగలము.
దేహ
భావమును
వీడనంతవరకు
మనకు
దైవత్వము
గోచరించదు.
దేహభావమువలననే
మనకు
అనేక
భేదములు
గోచరిస్తున్నాయి.
ఇక్కడ
కనిపిస్తున్నటువంటి
వేలాది
నేత్రములూ,
హస్తములూ,
పాదములూ
అన్నీ
భగవంతునివే!
ఇట్టి
సత్యాన్ని
గుర్తించవలెనన్న
మీరు
దేహభావమును
నిర్మూలం
చేసుకోవాలి.
అనేకత్వంలో
ఉన్న
ఏకత్వాన్ని
గుర్తించినప్పుడు
ఒక్క
క్షణంలోనే
మీకు
దైవత్వము
గోచరిస్తుంది.
కాని
అనేకత్వములో
ఉన్న
ఏకత్వమే
దైవత్వమనే
సత్యము
మీకు
అర్థం
కావటం
లేదు.
దీనిని
అర్థం
చేసుకోవాలంటే,
మీ
మనస్సులో
ఉన్న
భావమును
పూర్తిగా
మార్చుకోవాలి.
మనం
కంటి
అద్దాలను
వేసుకున్నప్పుడు
ఆ
అద్దాల
రంగు
ఎటువంటిదో
బయటి
దృశ్యము
కూడా
అదే
రంగుతో
కనిపిస్తుంది.
కాబట్టి
మీరు
దేహభావమనే
‘రంగు
అద్దాలను’
తీసివేసి
‘రియాలిటీ’ని
దర్శించండి.
ప్రేమను
ఒక్కదానిని
మీరు
గట్టిగా
పట్టుకోండి.
ప్రేమచేతనే
మీరు
దైవత్వమును
చూడగలరు.
మీరు
ఏప్రదేశమునకు
వెళ్ళినప్పటికీ
ప్రేమయే
తోడుగా
ఉండి
మిమ్మల్ని
కాపాడుతుంది.
ప్రేమ
ఒక్కటే
‘రియాలిటీ’.
మిగిలినదంతయు
‘రిఫ్లెక్షన్’,
‘రియాక్షన్’,
‘రిసౌండ్’.
మొట్టమొదట
మీరు
మానసిక
స్థిరత్వాన్ని
పెంచుకోండి.
మీ
మనస్సును
నిశ్చలంగా
ఉంచుకోవాలంటే
ఒక్కమాటను,
ఒక్కబాటను
అనుసరించండి;
ఒక్క
దైవస్వరూపమును
మీ
మనస్సులో
స్థిరం
చేసుకోండి.
మీ
చర్మచక్షువులకు
కనిపించే
దృశ్యమును
చూసి
భ్రమించకండి.
చర్మచక్షువులు
కాదు
జ్ఞానచక్షువు
మనకు
కావాలి.
6
▾
Meaning
Keep
ప్రేమస్వరూపులారా!
“త్వమేవ
మాతాచ
పితా
త్వమేవ...
”
అన్నట్లుగా,
మీ
తల్లి,
తండ్రి,
బంధువు,
మిత్రుడు
అంతా
భగవంతుడే
అని
విశ్వసించండి.
భగవంతునిపై
‘డౌట్స్’
పెట్టుకోకండి.
‘డౌట్స్’
వల్లనే
మీ
మనస్సు
అయోమయమై
పోతున్నది.
ధ్యానము
ఎలా
చేయాలని
చాలామంది
నన్ను
అడుగుతుంటారు.
నేను
చెప్పేది
ఒక్కటే
-
మీ
నమ్మకమును
ఒకదానిపై
ఉంచుకోండి.
చలించని
మనస్సును,
భ్రమించని
దృష్టిని
అలవరచుకోండి.
ఏదో
ఒక
రూపాన్ని
నిర్ణయించుకొని
దానిని
మీ
హృదయంలో
నిలుపుకోండి.
అదియే
మీరు
చేయవలసిన
ధ్యానము.
ఇటువంటి
సాధన
చేసినప్పుడు
మీకు
దైవత్వము
తప్పక
గోచరమవుతుంది.
ప్రేమకు
మించినటువంటి
సాధన
మరొకటి
లేదు.
ప్రేమస్వరూపుడైన
పరమాత్మను
మీరు
దర్శించాలంటే,
మీ
ప్రేమను
ఒక్క
దైవమార్గములో
మాత్రమే
ప్రవేశపెట్టాలి.
అనేకమంది
భగవంతుని
దర్శించాలని
ధ్యానం
చేస్తుంటారు.
ధ్యానమంటే
కేవలం
మానసిక
ఏకాగ్రత
కాదు;
నిశ్చలమైన
భావమును
అలవరచుకోవాలి.
మనస్సే
అన్నిటికీ
మూలం.
మనస్సు
వల్లనే
మనకు
సర్వం
గోచరిస్తున్నది.
మీ
భావములో
కలిగే
మార్పే
బాహ్యంగా
ప్రతిబింబిస్తుంది.
అన్ని
మార్పులూ
మీయందే
కలుగుతున్నాయి.
ప్రతి
క్షణము
కూడా
మీ
మనస్సు
మార్పు
చెందుతూనే
ఉన్నది.
అసలు
మనస్సు
మారటానికి
వీలే
లేదు.
దానికా
శక్తి
లేదు.
దానిని
మీరే
అనేక
మార్గాలలో
పంపుతున్నారు
గాని,
దానికి
స్వతస్సిద్ధంగా
ఎక్కడికీ
పోవటానికి
చేతకాదు.
కాబట్టి,
మీ
మనస్సును
నిశ్చలంగా
ఉంచుకునే
ప్రయత్నం
చేయండి.
దైవత్వాన్ని
మనస్సులో
స్థిరం
చేసుకోండి.
అప్పుడు
మీకు
ఎక్కడ
చూసినా
దైవస్వరూపం
గోచరిస్తుంది;
గొప్ప
తేజస్సుతో
కనిపిస్తుంది.
కాని,
అది
ఉన్నదా,
లేదా
అని
మీరు
మనస్సులో
సందేహాలకు
తావివ్వటం
వల్లనే
దైవత్వం
మీకు
కనిపించటం
లేదు.
మొట్టమొదట
మీ
భావాన్ని
స్థిరంగా
పెట్టుకోండి.
మనస్సుకు
మీరు
బానిసలు
కావద్దు.
మనస్సును
మీ
బానిసగా
చేసుకోవాలి.
మానవత్వము
వచ్చింది
దేనికోసం?
తిండి
తీర్థాదులతో
కాలమును
వ్యర్థం
చేయటం
కోసం
కాదు.
పంచకర్మేంద్రియాలు,
పంచ
జ్ఞానేంద్రియాలు,
పంచ
కోశములు,
పంచ
భూతములు...
వీటన్నిటి
యొక్క
ఏకత్వాన్ని
గుర్తించాలి.
త్రికరణశుద్ధిగా
ప్రయత్నిస్తే
ఏకత్వానుభవం
మనకు
సులభంగా
కలుగుతుంది.
7
▾
Meaning
Keep
ఏకత్వానుభవం
ఒక్క
మానవునికి
మాత్రమే
సాధ్యం.
ఏకత్వమును
అనుభవించటానికే
మీరు
పుట్టారు
గాని,
అనేకత్వంలో
సంచరించటానికి
కాదు.
ఏకత్వంలోనే
మీ
జీవితాన్ని
అంత్యం
గావించుకోవాలి.
అప్పుడే
మీ
జన్మ
సార్థకమవుతుంది.
భక్తులకు
ఉండవలసినది
అచంచలమైన
విశ్వాసము
అన్ని
రంగాలలోనూ
ప్రథమ
స్థానంలో
నిలిచిన
ఒక
బాలికకు
ఈ
రోజు
నేను
‘ఆల్
రౌండర్
గోల్డ్
మెడల్’
ఇచ్చాను.
ఆ
అమ్మాయి
పుట్టినప్పటినుండి
డయాబెటీస్
పేషంటు.
తల్లిదండ్రులు,
డాక్టర్లు
ఆమెకు
ఎన్నో
మందులిస్తూ
వచ్చారు.
కాని
ఫలితం
లేకపోయింది.
ఆ
అమ్మాయిది
అచంచలమైన
విశ్వాసము.
కనుకనే,
బ్లడ్
షుగర్
ఏ
స్థాయిలో
ఉన్నప్పటికీ
ఆమెకు
ఏమాత్రం
బాధ
కలుగటం
లేదు.
“మీరేమీ
చింతించకండి.
స్వామి
నావెంట
ఉన్నారు”
అని
తల్లిదండ్రులకు
ఆమె
ధైర్యం
చెబుతూ
ఉంటుంది.
ఈ
విధంగా
ఇప్పటికి
16
సం॥లు
గడచిపోయాయి.
పుట్టపర్తిలో
12వ
తరగతి
వరకు
చదివి
తరువాత
అనంతపురం
కాలేజీలో
చేరింది.
స్వామి
బోధను
మనస్సులో
పెట్టుకొని,
తన
బాధను
మరచిపోయి,
నిశ్చలమైన
భక్తివిశ్వాసాలతో
ఆమె
కాలము
గడుపుతున్నది.
ఒక్కొక్క
దినము
చూస్తే
ఆమె
బ్లడ్
షుగర్
చాలా
ఎక్కువగా
ఉంటుంది.
ఎన్ని
మందులిచ్చినప్పటికీ
ఆ
మందులేవీ
పనిచేయటం
లేదు.
ఇది
మందులతో
నయమయ్యేది
కాదు;
స్థిరమైన
నమ్మకమే
ఆమెను
కాపాడుతుంది.
‘ఈ
జబ్బు
నిన్నేమీ
చేయలేదు.
దైవత్వాన్ని
పరిపూర్ణంగా
నమ్ముకో.
ఎవ్వరి
మాటలూ
నీవు
చెవికి
చేర్చుకోకు’
అని
స్వామి
ఆ
అమ్మాయికి
గట్టిగా
చెప్పాడు.
అందువల్లనే
ఇంతటి
ఉన్నతస్థాయికి
వచ్చింది.
ఇంకా
పై
చదువు
కూడా
చదువుతుంది.
ఎవరికైనా
సరే,
ఒక్కమాటపైన
నమ్మకము
కుదరాలి.
తనకు
షుగర్
ఎక్కువగా
ఉన్నదనే
చింత
ఆమెకు
ఏమాత్రం
లేదు.
‘వస్తుంది,
పోతుంది.
దానితో
నాకేమీ
సంబంధం
లేదు’
అని
ఆమె
ధైర్యంగా
ఉన్నది.
ఈ
విధంగా
మనం
దేనికీ
వెఱవకూడదు.
దేహము
‘మలినపు
కొంప,
రోగముల
మ్రగ్గెడు
సేవక
గంప...
’
ఇటువంటి
దేహతత్త్వమును
మనం
నమ్మకూడదు.
దేహానికి
వచ్చిన
బాధను
దేహానికే
వదలిపెట్టాలి
గాని,
దానిని
మనసుకు
చేర్చుకోకూడదు.
ఆ
అమ్మాయి
తండ్రి
పుట్టపర్తి
కాలేజీలో
ప్రొఫెసర్గా
పనిచేస్తున్నాడు.
8
▾
Meaning
Keep
His poems 323
Also in his talks
(7)
7 October 1986
The Dharma that belongs to the Ātma is Svadharma
21 November 1987
Believe service itself to be the great sādhana
14 January 1989
The man of virtue alone is strong
25 January 1990
Journeying toward God
27 June 1996
Too Much Talk Harms the Mind, Little Talk Gives Great Ease
11 August 2001
Prema alone is My wealth
21 January 2007
All parties must become one for the good of the country
అనంతపురం
నుండి
టీచర్లు
ఆయనకు
ఫోను
చేసి
‘మీ
బిడ్డకు
షుగర్
చాలా
ఎక్కువగా
ఉన్నది;
క్లాసులకు
రాలేకపోతున్నది.
ఏమి
చేయాలి
మేము?’
అని
అడుగుతుంటారు.
అతను
నా
వద్దకు
వచ్చి
బాధపడితే
నేను
ధైర్యం
చెబుతుంటాను.
రెండవ
దినానికి
అది
తగ్గిపోతుంది.
ఆమె
యొక్క
భక్తి
ప్రపత్తులే
దీనికి
కారణం.
పట్టినదేదియో
పట్టనే
పట్టితివి
పట్టు
నెగ్గెడు
దాక
అట్టెయుండు
కోరినదేదియో
కోరనే
కోరితివి
కోర్కె
చెల్లెడుదాక
కొలిచియుండు
అడిగినదేదియో
అడుగనే
అడిగితివి
అడిగినదిడుదాక
విడువకుండు
తలచినదేదియో
తలచనే
తలచితివి
తలపు
తీరెడుదాక
తరలకుండు
పోరు
పడలేక
తానైన
బ్రోవవలయు
ఒడలు
తెలియక
నీవైన
అడుగవలయు
అంతియేగాని
మధ్యలో
ఆపివేసి
తిరిగిపోవుట
భక్తుని
దీక్ష
కాదు
అటువంటి
దృఢమైన
భక్తివిశ్వాసాలతో
ఆమె
జీవితం
గడుపుతున్నది.
ఒక్కొక్కసారి
దేహంలో
రక్తం
తగ్గిపోయి
చాలా
బలహీనంగా
ఉంటుంది.
అలాంటి
పరిస్థితిలో
కూడా
తాను
ఎంతో
పనిచేస్తుంటుంది.
ఇది
నిజమైన
భక్తి.
స్థిరమైన
నమ్మకమునే
ఆధారం
చేసుకొని
ఆమె
తన
జీవితాన్ని
గడుపుతున్నది.
ఆమె
చదువులో
ఫస్టు,
పనులలో
ఫస్టు.
అన్నింటిలోనూ
ఫస్టు.
అందుకే
ఆమెకు
‘ఆల్
రౌండర్
గోల్డ్
మెడల్’
ఇవ్వటం
జరిగింది.
Previous
←
When You Give Up Delusion, You Yourself Are Brahman
Next
Service to Society Is Itself Life's Supreme Goal
→