Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 2008 · The Ātma alone is true; all the rest is a scene in a dream!
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
The Ātma alone is true; all the rest is a scene in a dream!
25 December 2008, Christmas, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
ప్రేమస్వరూపులారా!
జీసస్
ప్రేమతత్త్వమును
గురించి,
అతని
సందేశము
గురించి
మీకు
అనేక
పర్యాయములు
చెప్పియున్నాను.
ఈనాడు
ప్రత్యేకించి
జీసస్గురించి
మీకు
చెప్పవలసిందేమీ
లేదు.
మనము
చూచే
దృశ్యమంతయు,
వినే
విషయమంతయు,
చేసే
పనులన్నియు
కేవలం
స్వప్న
దృశ్యములే!
స్వప్నంలో
చూచినటువంటివి
ఎంతకాలం
ఉంటాయి?
నిద్రించినంతవరకు
మాత్రమే
ఉంటాయి.
అదేవిధముగనే,
చూచునంతవరకు
ఈ
తలలు
మనకు
కనిపిస్తూ
ఉంటాయి.
ఇవన్నీ
సత్యమని
మనం
అనుకుంటాము.
కాదు,
కాదు.
ఇదంతయు
ఒక
స్వప్నదృశ్యమే.
ప్రపంచములో
కనిపించేవన్నీ
కూడను
మార్పు
చెందుతూ
ఉంటాయి.
అన్నియు
అసత్యములే!
స్వప్న
దృశ్యములే!
ఒక్కటి
మాత్రమే
త్రికాలములయందు
శాశ్వతంగా
ఉంటుంది.
అదియే
ఆత్మతత్త్వము.
అదియే
ప్రేమతత్త్వము.
ఈ
ప్రేమ
ఆత్మనుండియే
ఆవిర్భవించినటువంటిది.
మనయందు
ప్రేమ
ఒక్కటి
ఉండెనా,
జగత్తంతయు
మన
స్వాధీనమవుతుంది.
ఎవ్వరినీ
బాధించకూడదు.
అందరినీ
ప్రేమించాలి.
Hurt
never,
love
ever.
సత్యమైనటువంటి
ఈ
ప్రేమతత్త్వమును
నిత్యమూ
స్మరిస్తూ
ఉండాలి.
You
are
not
one
person,
but
three.
1)
The
one
you
think
you
are.
2)
The
one
others
think
you
are.
3)
The
one
you
really
are.
నీవు
ఒక్క
వ్యక్తివి
కావు,
నీలో
ముగ్గురున్నారు.
1.
నీవు
అనుకొనే
నీవు
(దేహము)
2.
ఇతరులనుకొనే
నీవు
(మనస్సు)
3.
అసలైన
నీవు
(ఆత్మ).
“ఇది
నా
దేహము,
ఇది
నా
మనస్సు,
ఇది
నా
బుద్ధి,
ఇది
నా
చిత్తము”
అని
చెపుతుంటాము.
కాని,
‘నేను
ఎవరు?’
ఆ
ప్రశ్న
వేసుకునేవారు
ఎవ్వరూ
లేరు.
‘ఇది
నా
దేహము’
అన్నప్పుడు
‘నేను’
వేరు,
దేహము
వేరు.
‘ఇది
నా
ఇల్లు’
అంటావు.
కాని,
నీవు
ఎవరు?
ఇల్లు
ఎంతకాలం
ఉంటుంది?
కొంతకాలమే!
మార్పుచెందనటువంటిది
ఒక్కటే.
అదే
బ్రహ్మతత్త్వము.
అదే
ప్రేమతత్త్వము.
ఆ
ప్రేమను
నీవు
పట్టుకుంటివా,
సర్వమూ
నీకు
వశమైపోతుంది.
2
▾
Meaning
Keep
ఈనాడు
ప్రపంచంలో
ఎవరియందు
చూసినా
కోరికలు,
కోరికలు,
కోరికలు!
వీటిని
అదుపులో
పెట్టుకోవాలి.
కోరికలను
అరికట్టినప్పుడే
మనస్సు
నిశ్చల
మవుతుంది.
ఈనాటి
మానవునికి
ఎన్ని
ఉన్నా
తృప్తి
లేదు.
‘ఇంకా
కావాలి,
ఇంకా
కావాలి’
అని
ఆశిస్తున్నాడు.
అన్నీకూడను
కదలిపోయే
మేఘములే!
ఈ
‘పాసింగ్
క్లౌడ్స్’
(passing
clouds)
ను
పట్టుకొని
మనం
ఎందుకు
కోరికలు
పెంచుకోవడం!
చివరికి
మన
వెంట
వచ్చేది
ఏమీ
లేదు.
ఈ
జగత్తునందు
మనకు
అవసరమైనటువంటివి
ఉండవలసిందే!
మన
దేహమును
పోషించుకొనే
నిమిత్తం
మనము
కోరవలసినటువంటివి
కోరవలసిందే!
కాని,
మీరు
అధికంగా
కోరుతున్నారు.
ఎన్ని
సంవత్సరములు
ఉండినా
ఎప్పటికైనా
ఈ
దేహము
పోవునటువంటిదే!
కనుక,
మితిమీరిన
ఆశలు
పెట్టుకోకూడదు.
మీరు
భగవంతుణ్ని
చూడాలని
ఎంతగానో
ఆశిస్తున్నారు.
అయితే,
భగవంతుడు
ఎక్కడున్నాడు?
మీరందరూ
భగవత్స్వరూపులే!
“దైవం
మానుష
రూపేణ.”
దైవం
మీకంటే
వేరుగా
లేడు.
Men
are
more
valuable
than
all
the
wealth
of
the
world.
(ప్రపంచంలో
ఉన్న
సమస్త
సిరిసంపదలకంటె
మానవుడే
ఎంతో
విలువైనవాడు).
మనం
జంతువులను
చూస్తున్నాము;
క్రూరమృగములను
చూస్తున్నాము;
మనుష్యులను
చూస్తున్నాము.
‘నేను
మనిషినా?
జంతువునా?
క్రూరమృగమునా?’
అని
నీవు
యోచన
చేయాలి.
‘నేను
మనిషిని’
అని
అనుకున్నప్పుడు
నీలో
మానవతా
విలువలు
ఉండాలి;
నీవు
మానవునిగా
జీవించాలి;
మానవునికి
తగినటువంటి
ఆలోచనలు
నీలో
ఉండాలి.
మానవతా
విలువలలో
మొట్టమొదటిది
సత్యము.
అది
త్రికాలములయందు
మార్పు
చెందనటువంటిది.
అట్టి
సత్యమును
నీవు
అనుసరించాలి.
నీ
మంచిచెడ్డలకు
మూలం
నీ
తలంపులే!
ప్రేమ...
ప్రేమ...
ప్రేమ...
ప్రేమయే
దైవం,
ప్రేమలో
జీవించు!
ఆ
ప్రేమచేతనే
నీ
జీవితము
నిలుస్తున్నది.
ప్రేమ,
సత్యము
-
ఈ
రెండూ
చేరినప్పుడే
అహింస
ఏర్పడుతుంది.
3
▾
Meaning
Keep
మనలో
ప్రేమ
ఉన్నప్పుడు
అందరూ
మనకు
సోదరీ
సోదరులే!
ఒకరితో
ఒకరము
జగడం
వేసుకోము;
ఎవ్వరిపైనా
మనకు
కోపం
రాదు.
నీ
శత్రువునైనా
‘హలో
బ్రదర్’
అని
నీవు
పలుకరిస్తే,
అతనుకూడను
‘హలో
బ్రదర్’
అంటాడు.
“యద్భావం
తద్భవతి.”
కనుక,
మన
భావములు
మంచివిగా
ఉండాలి.
మనం
అనుభవించే
మంచిచెడ్డలన్నీ
మన
తలంపులే
మనకందిస్తున్నాయి.
నీకు
ఏదైనా
చెడు
జరిగిందంటే,
అది
భగవంతుడు
అందించింది
కాదు;
లేక
ఇంకెవరో
అందించింది
కాదు;
నీకు
నీవే
చెడు
చేసుకుంటున్నావు;
నీ
చెడ్డ
ఆలోచనలే
అందుకు
మూలకారణం.
నీకు
సుఖము
కలిగిందంటే
అదికూడను
నీ
తలంపులయొక్క
ఫలితమే!
కనుక,
నీవు
మొట్టమొదట
నీ
తలంపులను
పవిత్రం
చేసుకోవాలి.
తలంపులు
పవిత్రంగా
ఉన్నప్పుడే
జీవితం
‘హ్యాపీ’గా
ఉంటుంది.
‘ప్యూరిటీ’
ఉన్నచోటే
‘డివినిటీ’
ఉంటుంది.
కాని,
ఈనాడు
Divinity
ని
divide
చేస్తున్నారు.
‘డివినిటీ’ని
‘డివైడ్’
చేయకూడదు;
ఏకత్వంగా
భావించాలి.
‘యూనిటీ,
ప్యూరిటీ,
డివినిటీ’
(ఏకత్వం,
పవిత్రత,
దివ్యత్వం)
-
ఈ
మూడూ
చేరినప్పుడు
జీవితం
ఎంతైనా
హాయిగా
ఉంటుంది.
మంచి
గుణములుగాని,
చెడు
గుణములుగాని
మనకు
మనం
తెచ్చుకున్నటువంటివే!
అన్నీకూడను
కల్పితములే!
మానవుడు
సర్వమును
కల్పించుకుంటున్నాడు.
ఇక్కడ
ఈ
లైట్లు
ఎంత
అందంగా
కనిపిస్తున్నాయి!
ఇవన్నీ
చేసింది
ఎవరు?
మానవుడే!
మానవత్వము
లేకుండా
దైవత్వమనేది
చేకూరదు.
మనస్సు
పవిత్రం
కావాలి.
మానవతా
విలువలను
పెంపొందించుకోవాలి.
అప్పుడే
మనము
దైవత్వాన్ని
పొందటానికి
అర్హులమవుతాము.
మనస్సును
పవిత్రంగా,
నిశ్చలంగా
పెట్టుకో!
మన
ఇంద్రియములే
మనకు
చంచలత్వమును
కలిగిస్తున్నాయి;
అనేకవిధములైన
చెడుమార్గములలో
ప్రవేశపెడుతున్నాయి.
కాని,
మన
మనస్సు
పవిత్రంగా
ఉన్నప్పుడు
అవి
మనల్ని
మంచిమార్గంలో
నడిపిస్తాయి.
“మనోమూల
మిదం
జగత్.”
కనుక,
మనస్సును
పవిత్రంగా,
నిశ్చలంగా
పెట్టుకోండి.
దైవం
వేరు,
మానవుడు
వేరు
అనే
వ్యత్యాసం
పెట్టుకోవటంచేతనే
కలతలు,
confusion
(తికమకలు)
మనకు
కలుగుతున్నాయి.
‘కన్ఫ్యూజనే’
కాకుండా
fuse
కూడా
పోతున్నది!
కనుక,
మనము
భగవద్విషయంలో
‘కన్ఫ్యూజన్’
పెట్టుకోకూడదు.
4
▾
Meaning
Keep
His poems 515
Also in his talks
(18)
8 March 1986
This world itself is the form of God
26 February 1987
There is no sādhana greater than remembering the Name
25 December 1992
The divinity all religions teach is one!
23 November 1997
The God who fills everything is ‘I’
14 April 1998
God pervades all
18 April 1998
The universe is the form of Viṣṇu
25 September 1998
Man's True Kin
19 October 1998
Dīpāvali: Its Inner Meaning
23 November 1998
Sarvaṁ Khalvidaṁ Brahma
1 January 2000
Virtue is the adornment of man
14 January 2000
Bhakti and Śaraṇāgati
4 March 2000
The Ātma: The Five Kośas
20 November 2001
Spiritual education is essential alongside worldly education
23 November 2001
Self-confidence is the very stairway to Ānanda
24 July 2002
The Paramāṇu Itself Is the Paramātma
19 February 2004
Unity is Jñāna, multiplicity is ignorance
25 December 2004
Pray for the Sake of God's Prema
3 September 2005
Give up attachment to the body and believe in oneness
ఎల్లప్పుడు
ఒక
స్థిరమైన
నమ్మకం
ఉండాలి.
ఇప్పుడు
లోకంలో
ఎన్నోవిధాలుగా
అశాంతి
చెలరేగుతున్నది;
అనేకమంది
అనేకరకాలైన
దుర్మార్గాలకు
పాల్పడుతున్నారు.
ఇప్పుడు
మనము
చేయవలసింది
ఏమిటి?
దైవచింతన
చేస్తే
చాలు!
ఆత్మచింతనతో
మనం
బ్రతకాలి.
ఏ
బాంబులూ,
ఏ
ఆయుధములూ
మనము
ఉపయోగించనక్కర్లేదు.
ఎప్పుడూ
శాంతంగా
ఉందాం.
ఏది
జరిగినా
మన
మంచికోసమే!
ఏదో
వారు
చేశారు,
వీరు
చేశారు
అనే
భావాన్ని
పెట్టుకుంటే
వారిపైన
మనకు
ద్వేషం
వస్తుంది.
కనుక,
మనం
శాంతంగా
దైవచింతన,
ఆత్మచింతన
చేయాలి.
నీవు
ఆత్మచింతనలో
ఉన్నప్పుడు
ఈ
ప్రాకృత
చింతలు
నిన్ను
ఏమాత్రమూ
భయపెట్టవు.
తుదిశ్వాసవరకు
విశ్వాసం
నిశ్చలంగా
ఉండాలి
దేహము
ప్రాకృతమైనది;
పుడుతుంది,
చస్తుంది.
కాని,
పరమాత్మకు
చావు,
పుట్టుకలు
లేవు.
చావు
పుట్టుక
లేనట్టి
శాశ్వతుండు
ఆది
మధ్యాంత
రహితు
డనాదివాడు
తాను
చావక
పుట్టక
చంపబడక
అంతటను
సర్వసాక్షియై
వెలుగుచుండు
అట్టి
ఆత్మస్వరూపుణ్ని
విస్మరించి
మనము
దేహ
సంబంధమైనటువంటి
నెగెటివ్
కోరికలను
ఎక్కువగా
కోరుతున్నాము.
ఈ
దేహము
ఏ
నిమిషంలో
ఎప్పుడు
పోతుందో
చెప్పలేము!
దేహమొక
నీటిబుడగ;
మనస్సు
ఒక
పిచ్చికోతి.
కనుక,
దేహమునుగాని,
మనస్సునుగాని
విశ్వసించకూడదు.
అయితే,
మనము
ఉన్నంత
వరకు
దేహమును
శ్రద్ధగా
పోషించుకోవాలి;
తరువాత
దానికదే
పోతుంది.
ఎవ్వరూ
ఈ
ప్రపంచంలో
శాశ్వతంగా
ఉండటం
లేదు.
శాశ్వతమైనది
ఒక్కటే,
అదే
ఆత్మ.
అందరూ
myself,
myself
అని
అంటున్నారు;
'I',
'I'
(నేను,
నేను)
అని
అంటున్నారు.
ఆ
‘సెల్ఫ్’
అనేదే
ఆత్మతత్త్వము.
'I'
(ఐ)
అనే
ఏకాక్షరమే
ఆత్మతత్త్వం.
మనము
రెండు
మనస్సులు
పెట్టుకోకూడదు.
The
one
with
dual
mind
is
half
blind
అన్నారు.
కనుక,
ఒకే
మనస్సు
ఉండాలి.
ఒకసారి
విశ్వాసం
మన
హృదయంలో
స్థాపించుకుంటే,
ఆ
విశ్వాసం
మనము
మరణించేంతవరకు
నిశ్చలంగా
ఉండాలి.
5
▾
Meaning
Keep
Also in his talks
(2)
15 April 2004
The principle of Prema is Divinity itself
30 March 2006
See only good, do only good, be good
కష్టం
వస్తే
ఒకవిధంగా,
సుఖం
వస్తే
ఇంకొకవిధంగా
మనం
మారకూడదు.
మార్పులేనిదే
ప్రేమ.
అలాంటి
ప్రేమను
పెంచుకోవాలి.
ఏది
చేసినా
దైవమే
చేస్తున్నాడు.
అంతా
దైవసంకల్పమేగాని,
నీ
సంకల్పం
ఏమాత్రమూ
కాదు.
ఏదో
‘నేను,
నేను’
అనుకుంటున్నావుగాని,
అది
కేవలం
నీ
అహంకారం.
చేసేది
నీవు
కానే
కాదు.
అసలు
‘నీవు’
ప్రత్యేకంగా
ఎక్కడున్నావు?
లేనే
లేవు.
నీలోపల
ఉన్నటువంటి
ఆత్మయే
చేస్తున్నది.
కనుక,
నీవు
అంటే
నీ
ఆత్మయే!
ఆత్మవిశ్వాసమే
సర్వమునకు
ఆధారము.
దైవం
తలుచుకుంటే
ఏమైనా
చేయవచ్చు
జీసస్‌ను
శిలువకు
కొట్టినప్పుడు
మదర్
మేరీ
వచ్చి
చాలా
ఏడ్చింది.
అప్పుడు
జీసస్
చెప్పాడు
-
“ఎందుకు
ఏడుస్తున్నావు?
ఇది
సహజము.
జరుగవలసింది
జరుగుతుంది.
కనుక,
నీవు
కంటిధారలు
కార్చకూడదు.”
అతను
అందరికీ
అన్నివిధాలుగా
సహాయం
చేశాడు.
ఎన్నియో
పర్యాయములు
బెస్తవారికి
బ్రెడ్
ఇచ్చాడు.
ఒకనాడు
బెస్తవారికి
ఒక్క
చేపకూడను
చిక్కలేదు.
అప్పుడు
జీసస్,
‘పీటర్!
వల
తీసికొని
నాతో
రా’
అన్నాడు.
కొంతదూరం
పోయిన
తరువాత
‘ఈ
స్థలములో
వేయి’
అన్నాడు.
ఆ
వలను
తిరిగి
లాగడానికి
పీటర్‌కు
చేతకాలేదు.
అనేకమంది
కలిసి
పట్టుకొని
దానిని
లాగవలసివచ్చింది.
ఎందుకంటే,
దానినిండుగా
చేపలు
పడ్డాయి.
ఈవిధంగా
దైవం
తలుచుకుంటే
ఏమైనా
చేయవచ్చు.
మంచిలోనే
చెడ్డ
ఉంది,
చెడ్డలోనే
మంచి
ఉంది
ప్రతి
ఒక్కటీ
భగవంతుని
ప్రసాదమే
అని
మనం
తెలుసుకోవాలి.
సుఖము
వస్తే,
అది
‘గాడ్స్
గిఫ్టే’
(భగవంతుని
ప్రసాదమే)!
కష్టము
కలిగితే,
this
is
also
God's
gift
(ఇదికూడా
భగవంతుని
ప్రసాదమే)
అనుకోవాలి.
మలేరియా
జ్వరం
వచ్చిందంటే
మీకు
చేదు
మాత్రలు
ఇస్తారు.
కాని,
అదికూడా
మీ
మంచి
కోసమే
కదా!
మంచి
చెడ్డలు
రెండును
కలసియుండు
వీని
విడదీయ
ఎవ్వరి
వశము
కాదు
మంచిని
ప్రత్యేకముగ
ఎందు
చూడబోము...
6
▾
Meaning
Keep
చెడు
అనేదికూడా
ప్రత్యేకంగా
ఎక్కడా
లేదు.
మంచిచెడ్డలు
కలిసి
ఒకటిగానే
ఉంటాయి.
కనుక,
మనము
రెండింటినీ
భగవంతుని
ప్రసాదంగానే
తీసుకోవాలి.
చెడు
వస్తే,
‘ఛీ,
ఇది
నాకక్కర్లేదు’
అంటాము.
కాని,
అట్లా
చేయకూడదు.
చెడ్డలోనే
మంచి
ఉంది;
మంచిలోనే
చెడ్డ
ఉంది.
కనుక,
మంచిచెడ్డలు
రెండూ
ఒకటే!
కేవలం
‘డిఫరెన్స్
ఆఫ్
టైమ్’
వల్ల
అవి
మనకు
వేరువేరుగా
కనిపిస్తున్నాయి.
ఈనాటి
రాత్రి
నీవు
ఫలం
తింటే
రేపటి
ఉదయానికి
అది
మలంగా
మారిపోతుంది.
అనగా,
మంచియే
చెడ్డగా
మారిపోతుంది.
కనుక,
మంచిచెడ్డలు
వేరువేరు
సమయములలో
కనిపిస్తాయిగాని,
రెండూ
ఒకే
సమయంలో
కానరావు.
మానవరూపంలోనే
దైవాన్ని
దర్శించాలి
ఈనాడు
మనము
చేయవలసిన
పని
ఒక్కటే
-
భగవంతుణ్ని
ప్రార్థించాలి.
ఆత్మవిశ్వాసము
ఒక్కటి
ఉంటే,
అన్నీ
లభిస్తాయి
మనకు.
మనలో
అదొక్కటి
లేకుండాపోతే,
ఎంత
ధనమున్నా,
ఎంత
ప్రోపర్టీ
ఉన్నా
అంతా
వ్యర్థమే!
‘ఇదంతా
భగవంతుని
ప్రసాదమే!
భగవంతుడే
అన్నీ
చేస్తున్నాడు’
అనే
భావాన్ని
మనం
ఎల్లప్పుడు
దృఢంగా
నిల్పుకోవాలి.
భగవంతుడు
ఎక్కడ
ఉన్నాడు?
నీయందే
ఉన్నాడు.
నీ
హృదయవాసి
భగవంతుడు.
నీ
ఆత్మయే
భగవంతుడు.
కనుక,
నీవు
భగవంతుణ్ని
వెతుకడానికి
ప్రయత్నం
చేయకూడదు.
భగవంతుడంటే
రాముడనీ,
కృష్ణుడనీ
అంటున్నావు.
ఈ
పేర్లు
దేహాలకు
సంబంధించినటువంటివి.
దేహము
కొంతకాలం
మాత్రమే
ఉంటుంది;
కాలం
గడిచేకొద్దీ
మార్పుచెందుతూ
ఉంటుంది.
పుట్టగానే
మానవుణ్ని
‘ఛైల్డ్’
(child)
అంటారు;
కొంచెం
పెరిగిన
తరువాత
‘బాయ్’
(boy)
అంటారు;
తరువాత
‘మేన్’
(man)
అంటారు;
ముసలితనం
వచ్చిన
తరువాత
‘గ్రాండ్
ఫాదర్’
(grandfather)
అంటారు.
ఛైల్డ్,
బాయ్,
మేన్,
గ్రాండ్‌ఫాదర్
అంతా
ఒకరే
కదా!
కేవలం
దేహం
మార్పు
చెందుతుందిగాని,
ఆత్మ
మాత్రం
ఒక్కటిగానే
ఉంటుంది.
ఇప్పుడు
భగవంతుడు
మానవరూపంలో
ఉన్నప్పటికీ,
మానవునిగా
ఉన్నప్పటికీ
అతనినే
మీరు
భగవంతునిగా
పెట్టుకోండి.
ఈ
దేహమును
దర్శించడానికి
మీరందరూ
వస్తున్నారు.
ఈ
‘ఫిజికల్
బాడీ’
(భౌతిక
దేహము)
‘ఎటర్నల్
డివినిటీ’ని
(నిత్య
సత్యమైన
దివ్యత్వాన్ని)
చూపిస్తుంది.
7
▾
Meaning
Keep
అది
దేహానికి
అతీతమైనది
(beyond
the
body).
దేహమే
లేకపోతే
మీరు
భగవంతుణ్ని
తెలుసుకోలేరు.
కనుక,
మానవ
రూపంలోనే
మీరు
దైవాన్ని
దర్శించి
అనుభవించాలి.
దేహమును
అలక్ష్యం
చేయవద్దు
మీరు
దేహబలమును,
బుద్ధిబలమును,
మనో
బలమును,
ఆస్తిపాస్తులను
చూసుకొని
అహంకార
పడుతుంటారు.
అహంకారము,
పొగరుబోతుతనము
ఏనాటికీ
మంచివి
కావు.
ఎప్పటికైనా
ఇవి
మనకు
ముప్పు
తెప్పించేటటువంటివే!
అధికారమును
బట్టి
కూడా
అహంకారం
వస్తుంటాది.
కాని,
అధికారం
ఎంతకాలం
ఉంటుంది?!
నీ
దేహమే
నీకుండదు.
అన్నీ
వచ్చి
పోతుంటాయి.
ఇట్టి
అశాశ్వతమైనవాటిని
మనం
శాశ్వతంగా
భావిస్తూ,
శాశ్వతమైన
ఆత్మతత్త్వాన్ని
ఏమాత్రమూ
లక్ష్యం
చేయటం
లేదు.
ఆత్మతత్త్వంపై
దృష్టి
పెట్టుకోండి;
దేహము
శాశ్వతం
కాదు.
అయితే,
ఉన్నంతవరకు
దేహారోగ్యాన్ని
కాపాడుకోవాలి.
‘ఇది
పోయేదే
కదా’
అని
అలక్ష్యం
చేయకూడదు.
దేహము
మనకు
భగవంతునియొక్క
వరప్రసాదం.
పాత్ర
ఉంటేనే
కదా
నీరు
నింపుకోగలుగుతాము.
పాత్రయే
లేకపోతే
నీరు
ఏవిధంగా
త్రాగగలము?
కనుక,
దేహం
సరిలేకపోతే
పరాధీనమైపోతాము.
పరాధీనం
కాకుండా
ఉండే
నిమిత్తం
మీరు
దేహాన్ని
జాగ్రత్తగా
చూసుకోవాలి.
మీ
టైమ్
వచ్చేంతవరకు
మీరు
దేహాన్ని
భద్రంగా
కాపాడుకోవాలి.
తుదిశ్వాసవరకు
ఆత్మవిశ్వాసాన్ని
మాత్రం
పోగొట్టుకోకూడదు.
‘నేను
ఎవరు?’
అని
ప్రశ్నించుకో!
ప్రేమస్వరూపులారా!
ఆత్మ
అనేది
ఎక్కడ
ఉన్నది?
అని
మనం
వెతుకనక్కర్లేదు.
అది
ఎక్కడ
చూసినా
ఉన్నది
-
in
you,
with
you,
around
you,
above
you,
below
you,
behind
you.
అలాంటి
సర్వత్రా
ఉన్నటువంటి
consciousness
(చైతన్యము)
పైన
నమ్మకం
పెట్టుకోకుండా
అశాశ్వతమైనవాటిపై
మీరు
నమ్మకం
పెట్టుకుంటున్నారు.
ఏది
శాశ్వతము?
అనేది
మీరు
మొట్టమొదట
యోచన
చేయాలి.
‘నేను
ఎవరు?’
అనే
ప్రశ్న
వేసుకోవాలి.
‘నేను
మానవుడను’
అని
మీరు
అనుకున్నప్పుడు
మీలో
మానవతా
గుణములుండాలి.
8
▾
Meaning
Keep
కేవలం
తినటం,
తిరగటం
-
ఇది
జంతువులు
చేసే
పని.
హింస
చేయడం
క్రూరమృగంయొక్క
లక్షణం.
మీరు
క్రూరమృగాలు
కాదు,
జంతువులు
కాదు;
మీరు
మానవులు.
కనుక,
మీరు
మానవతా
గుణములను
పెంచుకోవాలి.
మానవతా
గుణములంటే
సత్య,
ధర్మ,
శాంతి,
ప్రేమ,
అహింసలు.
అహింస
ఏర్పడాలంటే
మొట్టమొదట
మనలో
ప్రేమ
పుట్టాలి.
ప్రేమ
ఎప్పుడు
వస్తుంది?
శాంతితో
కూడియున్నప్పుడే
ప్రేమ
వస్తుంది.
సత్యధర్మములు
ఉన్నప్పుడే
శాంతి
కలుగుతుంది.
సత్యమే
లేకపోతే
శాంతి
లేనే
లేదు.
కనుక,
మీరు
సత్యమును,
ధర్మమును
రెండింటినీ
జోడించుకుంటే,
మీలోనే
శాంతి
ఏర్పడుతుంది.
సత్యధర్మములు
లేకపోతే
‘పీస్’
(peace)
ఉండదు;
అంతా
‘పీసెసే,
పీసెసే’
(pieces,
pieces)!
కనుక,
ఆ
రెండింటినీ
మీరు
పోషించుకోవాలి.
ప్రేమను
సత్యంతో
కాపాడుకోవాలి.
సత్యమనేది
ఒకరు
సృష్టించినటువంటిది
కాదు.
అది
మన
‘ఇన్నర్
సెల్ఫ్’
(అంతరాత్మ).
ఈ
సత్యము
లేనటువంటి
మానవుడు
జగత్తులోనే
లేడు.
కాని,
మానవుడు
తనలోపల
ఉన్నటువంటి
సత్యమును
మూసిపెట్టి
అసత్యమునకు
పాల్పడుతున్నాడు.
అసత్యమునుగురించి
తాను
ఆలోచిస్తున్నాడుగాని,
సత్యమునుగూర్చి
ఆలోచించడం
లేదు.
‘ఛీఫ్’ను
(భగవంతుణ్ని)
హృదయంలో
పెట్టుకుంటే
‘చీప్’
విషయాలపై
మనకు
దృష్టి
ఉండదు
రాధాకృష్ణుల
మధ్య,
సీతారాముల
మధ్య
ఉండే
ప్రేమతత్త్వం
గురించి
మీరు
ఎన్నో
డ్రామాలు
చూసి
ఉంటారు,
వేసి
ఉంటారు.
పది
నెలలు
లంకలో
ఉండినప్పటికీ
సీత
ఒక్కనాడైనా
రావణుణ్ని
తలెత్తి
చూడలేదు.
రావణుడు
రాముణ్ని
చులకన
చేసి
మాట్లాడుతుంటే
ఆమె
గడ్డిపోచ
నొకదానిని
పెరికి,
వాని
ఎదుట
పారేసి,
‘రామునియొక్క
శక్తితో,
రాముని
ప్రేమతో
పోల్చితే
నీ
శక్తి
ఈ
గడ్డిపోచవంటిది’
అని
చెప్పింది.
అంతటి
దృఢమైనటువంటి
విశ్వాసము
కలిగినది,
సీత.
మనముకూడను
అటువంటి
దృఢ
విశ్వాసమును
అభివృద్ధిపరచుకోవాలి.
నేడు
లోకంలో
ఎందరో
టెర్రరిస్టులు
హింసకు
పాల్పడుతున్నారు.
కాని,
మీ
హృదయంలో
ఆత్మను
విశ్వసించి,
ఆత్మప్రేమలో
మీరు
జీవించినప్పుడు
మిమ్మల్ని
ఎవ్వరూ
ఏమీ
చేయలేరు.
9
▾
Meaning
Keep
భగవంతుడు
ఎక్కడ
చూసినా
ఉన్నాడు.
అట్టి
దైవత్వాన్ని
వదలిపెట్టి
తాత్కాలికంగా
వచ్చిపోయే
వాటికి
మీరు
ఎంతో
విలువ
నిస్తున్నారు.
భగవంతుణ్ని
మీరు
‘చీప్’
(అలక్ష్యం)
గా
చూడకూడదు.
అతను
‘ఛీఫ్’
(Chief)!
ఆ
‘ఛీఫ్’ను
మన
హృదయంలో
పెట్టుకుంటే,
ఈ
‘చీప్’
విషయాలపై
మనకు
దృష్టి
ఉండదు.
ఇవంతా
‘చీప్’
(అల్పమైనవి)!
భగవంతుడు
ఒక్కడే
‘ఛీఫ్’
(ముఖ్యుడు)!
అతనిని
విశ్వసించాలి.
‘ఏసు’
అనండి,
‘రామా’
అనండి,
‘కృష్ణా’
అనండి,
‘అల్లా’
అనండి.
ఏ
పేరు
చెప్పినా,
పేర్లు
వేరువేరుగాని,
భగవంతుడు
ఒక్కడే.
ఇద్దరు
దేవుళ్ళు
లేరు.
ఉన్నది
ఒకే
దేవుడు.
“ఏకం
సత్
విప్రాః
బహుధా
వదన్తి”.
ఒకటి
పెట్టి
దాని
ప్రక్కన
ఎన్ని
సున్నలైనా
చుట్టండి.
అప్పుడు
దాని
విలువ
ఎక్కుతూ
ఉంటుంది.
నూరు
సున్నలు
పెట్టినా
ఒకటిని
తుడిచివేస్తే
ఏమీ
విలువ
ఉండదు.
భగవంతుడే
హీరో,
ప్రపంచమంతా
జీరో!
కనుక,
మొట్టమొదట
భగవంతుణ్ని
మీ
హీరోగా
పెట్టుకోండి.
భగవంతుణ్ని
స్మరిస్తే
మీకు
అంతా
జయమే
అవుతుంది;
ఏ
బాంబులూ
మిమ్మల్ని
ఏమీ
చేయలేవు.
అసలు
మానవునియందున్న
శక్తి
ఏ
బాంబుయందూ
లేదు.
బాంబును
చేసినవాడు
ఎవరు?
మానవుడే!
చేసినవాడు
గొప్పనా?
లేక,
చేయబడినది
గొప్పదా?
చేసినవాడే
గొప్పవాడు.
కనుక,
మానవుని
గొప్పతనాన్ని
మనము
గుర్తించాలి.
“నాకంటె
గొప్పవాడు
ఎవ్వరూ
లేరు.
భగవంతుడుకూడను
నాకంటే
వేరు
కాదు”
అనే
సత్యాన్ని
తెలుసుకోవాలి.
అందుకోసమే
వేదాంతము
“నిన్ను
నీవు
తెలుసుకో”
అని
చెప్పింది.
ఆత్మవిశ్వాసం,
దైవవిశ్వాసం
అభివృద్ధిపరచుకోండి!
‘నేను
ఎవరు?’
అన్న
ప్రశ్నకు
‘అహం
బ్రహ్మాస్మి’
అన్నదే
సరియైన
జవాబు.
“నేను
మానవుణ్ని
కాదు,
నేను
దైవాన్ని”
అని
గుర్తించాలి.
కేవలం
భౌతిక
దృష్టిలో
నీవు
మానవుడవు.
కాని,
అన్నింటినీ
మించిన
దైవశక్తి
నీయందే
ఉన్నది.
అది
నీదగ్గర
పెట్టుకొని
నీవు
చిన్నచిన్న
బాంబులకు
ఎందుకు
భయపడాలి?!
కనుక,
మీరు
ఆత్మతత్త్వాన్ని
గుర్తించండి,
ఆత్మవిశ్వాసాన్ని
అభివృద్ధిపరచుకోండి.
అందుకోసమనే,
‘మొట్టమొదట
సెల్ఫ్
(Self),
తరువాత
హెల్ప్
(help)’
అన్నాను.
10
▾
Meaning
Keep
సెల్ఫే
(ఆత్మయే)
నీకు
శాశ్వతము.
అదే
‘సుప్రీమ్
సెల్ఫ్’.
దేహము
బలహీనమైనప్పటికీ
ఆ
‘సుప్రీమ్
పవరే’
నిన్ను
నడిపిస్తుంది;
అదే
నీకు
‘హెల్ప్’
చేస్తుంది.
కనుక,
అందరుకూడను
దైవాన్ని
స్మరించండి.
ఈ
పేరు,
ఆ
పేరు
అని
కాదు;
ఏ
పేరైనా
స్మరించండి.
చక్కెరతో
ఎన్నో
రకములైన
స్వీట్లు
చేస్తుంటాము.
నీకు
ఏ
స్వీట్
కావాలో
ఆ
స్వీట్
తిను.
కాని,
అన్నింటిలో
ఉన్నది
చక్కెర
ఒకటే!
అదేవిధంగా,
everything
is
God
(సర్వం
బ్రహ్మమయం).
కనుక,
భగవంతుని
విషయంలో
మనము
‘డౌట్స్’
(సందేహాలు)
ఏమాత్రమూ
పెట్టుకోకూడదు.
ఈ
‘డౌట్స్’
మానవుణ్ని
చాలా
పాడుచేస్తున్నాయి.
మానవుడు
మానవునిగా
జీవించాలంటే
‘డౌట్స్’ను
దూరం
చేసుకోవాలి.
‘డౌట్స్’
మనలోపల
ఉండినంతవరకు,
అవి
poison
(విషం)
మాదిరి
పనిచేస్తుంటాయి.
లోపల
‘పాయిజన్’
ఉన్నంత
వరకు
మనము
ఏ
పదార్థము
తిన్నా
అది
‘పాయిజనే’
అవుతుంది
కదా!
కనుక,
మనం
‘డౌట్స్’కు
ఏమాత్రమూ
చోటివ్వకూడదు.
నీపైన
నీవు
నమ్మకం
పెట్టుకో!
అదే
‘సెల్ఫ్-ఫెయిత్’
(ఆత్మవిశ్వాసము).
అది
ఉంటే,
నిన్ను
ఎవ్వరూ
ఏమీ
చేయలేరు.
చుట్టూ
బాంబులు
పడినాకూడను
ఈ
‘సెల్ఫ్’ను
ఏమీ
చేయలేవు.
చాలామంది
భయపడుతుంటారు,
“అయ్యో,
ఎంతోమంది
టెర్రరిస్టులు
బాంబులు
వేస్తున్నారు,
అది
చేస్తున్నారు,
ఇది
చేస్తున్నారు”
అని.
మనము
దేనికీ
భయపడనక్కర్లేదు.
‘హరి
భజన
బినా
సుఖ
శాంతి
నహీ’
ప్రేమస్వరూపులారా!
మీరందరుకూడను
ఎంతో
భక్తితో,
ఎంతో
ఆశతో,
ఎంతో
ప్రేమతో
ఇక్కడ
చేరారు.
ఆ
ప్రేమను
మీరు
నిల్పుకోండి.
ఆ
ప్రేమచేతనే
‘నేను
దైవాన్ని,
నేను
దైవాన్ని’
అనే
భావాన్ని
అభివృద్ధిపరచుకోండి.
ఎవరైనా
వచ్చి
‘నీవెవరు?’
అని
అడిగితే,
'I
am
so
and
so'
(నేను
ఫలానా...)
అని
మీరు
చెప్పకూడదు;
'I
am
God'
(నేను
దైవాన్ని)
అని
చెప్పాలి.
'Not
only
I,
you
are
also
God'
(నేనే
కాదు,
నీవూ
దైవమే)
అని
చెప్పాలి.
అందరూ
దైవస్వరూపులే
అన్న
విశ్వాసాన్ని
మీరు
బలపరచుకోవాలి.
(‘ప్రేమ
ముదిత
మనసె
కహో
రామ
రామ
రామ్...’
మరియు
‘హరి
భజన
బినా
సుఖ
శాంతి
నహీ’
అనే
పాటలు
తాము
పాడి
భక్తులచే
భజన
చేయించిన
తరువాత
భగవాన్
తమ
దివ్యోపన్యాసమును
కొనసాగిస్తూ
ఇలా
అన్నారు).
11
▾
Meaning
Keep
“నాకు
సుఖం
కావాలి,
శాంతి
కావాలి”
అని
మీరు
కోరుకుంటారు.
ఆ
సుఖము,
శాంతి
ఎక్కడున్నాయి?
అవి
ఏ
షాపులోనూ
చిక్కవు;
కేవలం
హరి
భజనలోనే
లభిస్తాయి.
భగవంతుని
నామములోనే
సుఖము,
శాంతి
మనకు
లభిస్తాయి.
“హరి
భజన
బినా
సుఖ
శాంతి
నహీ”,
సుఖశాంతులు
నీనుండియే
ఆవిర్భవిస్తాయి.
నీ
శాంతికి,
నీ
సౌఖ్యానికి,
నీ
ఆనందానికి
నీ
హృదయమే
ఆధారం.
కనుక,
నీకు
శాంతి,
సుఖము,
ఆనందము
కావాలనుకుంటే
నీ
హృదయాన్ని
నీవు
చూసుకో!
Previous
←
Foster the feeling of the one Ātma, and unity!
Next
Know Thyself! You Will Know Everything
→