Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1992 · Without a base substance no object takes on form and name
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Without a base substance no object takes on form and name
10 May 1992, Brindavan
1
▾
Meaning
Keep
His poems 443
ఇసుకలో
వర్షజలధార
లింకిపోవు
మధురమై
నిల్చు
రేగడి
మట్టియందు
చిప్పలోబడి
ముత్యమై
చెన్నుమీరు
అటులె
ప్రాప్త్యనుసారమై
యలరు
భక్తి.
ప్రేమస్వరూపులారా!
జగత్తునందు
గల
నానా
రూప,
నామములకుకూడను
అధిష్టానమైన
ఆధారమన్నది
ఒకటున్నది.
మూలాధార
పదార్థము
లేక
ఎట్టి
పదార్థముకూడను
రూప,
నామములు
ధరించదు.
ఇది
ఒక
వెండిపాత్ర.
దీనికొక
రూపము,
ఒక
నామము
ఉన్నాయి.
కాని,
దీనికి
మూలాధారము
అయిన
పదార్థము
వెండి.
ఈ
పాత్రను
మనం
కరిగించినపుడు
వెండి
వెండిగా
నిలుస్తుంది.
దీని
రూప,
నామములు
ఎక్కడకు
పోయాయి?
మూల
పదార్థమునందు
అంతర్గతమై
పోయినాయి.
ఈ
జగత్తునందు
నానా
రూప,
నామములకు
మూలాధారమైన
తత్త్వము
దైవత్వము
అదే
విధముగనే
ఈ
జగత్తునందు
గల
నానా
రూప,
నామములకుకూడను
మూలాధార
తత్త్వము,
సాత్త్విక
తత్త్వము.
అదే
శుద్ధ
తత్త్వము.
దీనినే
దైవత్వము
అంటారు.
ఇలాంటి
దివ్యత్వముచేతనే
సర్వము
జగత్తునందు
రూప,
నామములు
ధరించుచున్నవి.
‘ఏకోహం
బహుస్యాం’
తనయొక్క
సంకల్పముచేతనే
అనేకత్వం
రూపొందుతుంది.
ఈ
అనేకత్వములోకూడను
ఏకత్వమే
ప్రధానమైన
మూలసూత్రము.
ఒకటి,
తొమ్మిది
అని
రెండు
అంకెలున్నాయి.
కాని,
గణితశాస్త్రమునందు
తొమ్మిది
మనం
పెద్ద
సంఖ్యగా
భావిస్తాం.
2
▾
Meaning
Keep
కాదు,
కాదు.
ఒకటే
అన్ని
సంఖ్యలకు
ఆధారము.
ఉదాహరణకు
1+1+1+1+1+1+1+1+1=9
అయిపోతుంది.
ఈ
ఒకటే
మూలాధారము.
ఈ
అనేకత్వమంతా
కూడను
ఏకత్వములో
ఇమిడి
పోయేటువంటిదే!
అదే
విధముగనే
మానవత్వమనేటువంటిది
ఏమిటి?
జనన,
మరణములకు
మధ్యగల
విశ్రాంతియే
మానవ
జీవితము
మానవ
జీవితమంటే
ఏమిటి?
జనన,
మరణములకు
మధ్యగల
విశ్రాంతియే
మనయొక్క
జీవితము.
అయితే
ఈ
విశ్రాంతి
కాలములో
మనము
అనేక
విధములైన
ఆశలకు
గురియౌతున్నాము.
మానవుడు
చెప్పేది
ఒకటి,
చేసేది
మరొకటి.
ఆలోచించేది
ఒకటి,
ఆచరించేది
మరొకటి.
ప్రయత్నించేది
ఒకటి,
ఫలితం
మరొకటి.
కారణమేమిటి?
తాను
ఆలోచించినది
క్రియారూపంలో
ఆచరించటం
లేదు.
మానవ
జీవితము
అనేక
ఆదర్శములతో
కూడినటువంటిది.
క్షణ,
క్షణమునకు
మానవుడు
అనేక
ఆశయాలను
తాను
ఆదర్శంగా
నిరూపించాలని
సంకల్పిస్తాడు.
కాని,
ఆ
సంకల్పానుసారంగా
ఆచరించడానికి
పూనుకోటం
లేదు.
చెప్పడం
ఒకటి,
చెయ్యడం
ఒకటి,
ఆలోచించటం
మరొకటి.
కనుకనే
మానవుడు
అనేక
విధములైన
దుఃఖములకు,
అశాంతులకు,
బాధలకు
గురియౌతున్నాడు.
కారణం-తన
జీవితము
తనకే
తృప్తిగా
ఉండటం
లేదు.
ఆత్మతృప్తి
లేనటువంటి
మానవునకు
అన్నియు
అశాంతులే!
ఎప్పుడు
ఈ
ఆత్మతృప్తి
మనకు
ప్రాప్తిస్తుంది?
ఈ
మూడింటిని
ఏకం
గావించినప్పుడే
ఆత్మతృప్తి
లభిస్తుంది.
తలచినది
చెప్పటము,
చెప్పినదాన్ని
ఆచరించటము.
కాని,
ఈనాడు
ఆలోచించటం
ఒకటి,
ఆచరించటం
మరొకటి.
మానవుడు
అనుభవించే
ప్రతి
బాధకూడను
మానవుని
ఉన్నతస్థాయికి
గొనిపోయే
సోపానమే!
ఈనాడు
లోకములో
అనేక
విధములైన
బాధలకు
మానవుడు
గురియౌతున్నాడు.
ఈ
బాధలు
మానవుని
హింసించే
నిమిత్తమై
ప్రారంభమౌతున్నాయా
లేక
మానవుని
ఉన్నతస్థాయికి
గొనిపోయే
నిమిత్తమై
ఆవిర్భవిస్తున్నాయా?
ప్రతి
బాధకూడను
మానవుని
ఉన్నతస్థాయికి
గొనిపోయేటువంటి
సోపానమే!
కనుక,
బాధలే
లేకుండిన
మానవునికి
సరియైన
బోధనే
లేదు.
బాధలే
అతనికి
సరియైన
బోధలు.
కనుకనే
‘రెండు
బాధలమధ్యలోనే
ఒక
సుఖముంటుండాది’
అన్నారు.
3
▾
Meaning
Keep
His poems 384
Also in his talks
(19)
25 March 1980
The four brothers
9 January 1988
God in the heart, work in the hands
3 September 1988
The body itself is a temple!
1 January 1992
Only when the differences of the upādhis are removed does the principle of the one Ātma become our own
4 April 1992
Neither swelling with joy nor sinking in sorrow: winning equanimity is the aim of Ugādi
29 August 1992
Life is fulfilled only when one born saying ‘Koham’ attains the experience of ‘Soham’
27 December 1992
If we can raise the value of man, the value of things comes down
22 September 1996
Though Forms and Names Differ, the Principle of Brahman Is One!
14 September 1997
The ideal of Bali Cakravarti
1 January 1998
Happiness and sorrow cannot be parted
9 July 1998
By God's Grace Anything Can Be Achieved
25 December 1998
Those Who Spread God's Prema Are the True Messengers of God
19 November 2000
Noble Sons Are Born Only When There Are Noble Resolves
18 November 2001
Man is the embodiment of Caitanya
11 April 2003
The ideal figures of the Rāmāyaṇa
13 April 2003
Make Your Parents Happy: That Is My Happiness
21 March 2004
I am you, you are I
23 August 2004
Do nāmasmaraṇa for peace of mind!
14 January 2005
When the heart is filled with Prema, life is filled with Ānanda
రెండు
బాధల
మధ్యలో
సుఖముండినట్టుగానే,
రెండు
సుఖముల
మధ్యలోనే
ఒక
బాధకూడా
ఉంటుండాది.
కష్టసుఖములు
రెండును
కలసియుండు
దీని
విడదీయ
నెవరికి
వశముగాదు
సుఖము
ప్రత్యేకముగ
నెందు
చూడరాదు
కష్టము
ఫలించెనేని
సుఖంబటండ్రు.
మానవుడు
ఈ
సత్యాన్ని
గుర్తించడానికి
ప్రయత్నించటం
లేదు.
బాధలు
కలిగినప్పుడు
క్రుంగిపోవటము,
సుఖములు,
ఆనందములు
లభించినపుడు
పొంగిపోవటము.
ఈ
పొంగిక్రుంగేటువంటి
తత్వములోనే
మానవుని
జీవితము
అంతమై
పోతుండాది.
కనుక,
పొంగిక్రుంగనటువంటి
సమత్వాన్ని
మానవుడు
అనుభవించాలి.
కష్టములో
ఒక
సుఖమున్నది.
సుఖములో
ఒక
కష్టమున్నది.
ఈ
సత్యాన్ని
మానవుడు
ఏనాడు
గుర్తించి,
సమత్వంతో
జీవితాన్ని
గడుపుతాడో
అట్టి
మానవునకే
నిజమైన
శాంతి
లభ్యమౌతుంది.
సమస్త
విశ్వము
మానవుని
సంకల్పమునందే
ఇమిడియుంటున్నది
మానవుని
సమస్త
సుఖదుఃఖములుకూడను
సంకల్పమనే
చిన్న
బీజములో
ఇమిడి
ఉంటున్నవి.
ఈ
సత్యాన్ని
మానవుడు
గుర్తించక,
తన
సంకల్పములను
అనేక
రీతులుగా
మార్చుకుంటూ
వెళ్తున్నాడు.
మనకు
అగోచరంగా
ఉండినటువంటి,
అవ్యక్తంగా
ఉండినటువంటి
పెద్ద
వృక్షము
చిన్న
విత్తనములో
ఇమిడి
ఉంటున్నది.
ఆ
యొక్క
విత్తనమును
నాటినపుడే
అది
పెరిగి
పెద్ద
వృక్షముగా
రూపొందుతుంది.
ఇంత
పెద్ద
వృక్షము
ఈ
కొమ్మలు,
రెమ్మలు,
కాయలు,
ఆకులు
ఇవన్నీకూడను
ఆ
చిన్న
విత్తనములోనే
ఇమిడి
ఉంటున్నవి.
అదే
విధముగా
మానవుని
సంకల్పము
అతి
సూక్ష్మమైనది
అయినప్పటికిని,
ఈ
సంకల్పమునందే
సమస్త
విశ్వము
ఇమిడి
ఉంటున్నది.
‘అణోరణీయాన్
మహతో
మహీయాన్.’
ఈ
అణువునందే
మహత్తరమైన
విశ్వము
ఇమిడి
ఉంటున్నది.
ఈ
అనంతమైన
విశ్వములోనే
అల్పమైన
బీజముకూడా
ఇమిడి
ఉంటున్నది.
పిల్లలకు
బాగా
తెలుసును.
4
▾
Meaning
Keep
మఱ్ఱివృక్షము
చాలా
పెద్దది.
కాని
దాని
విత్తనము
చాలా
చిన్నది.
ఈ
రెండుకూడను
ఒకదానికొకటి
అవినాభావ
సంబంధము,
అన్యోన్య
ఆశ్రయము.
రెండుకూడను
భిన్న
రూపములే
తప్ప,
వేరు
వేరు
కాదు.
విత్తనముయొక్క
అఖండ
స్వరూపమే
వృక్షము.
వృక్షముయొక్క
అల్ప
స్వరూపమే
విత్తనము.
సఫలమునకు,
విఫలమునకు
సంకల్పమే
కారణము
‘సంకల్ప
వికల్పాత్మకం
మనః.’
మానవుని
జీవితము
సంకల్ప
వికల్పాలతో
కూడినటువంటిది.
కనుక,
ఆ
సంకల్పములను
మనం
సరియైన
రీతిగా
వినియోగించుకోవాలి.
మానవుడు
తనకు
తోచినట్టుగా
సంకల్పాలను
చేస్తూ
పోతుంటాడు.
ఆ
సంకల్పాలు
నెరవేరెనా
తృప్తిపడుతుంటాడు.
ఈ
సంకల్పములు
విఫలమయ్యెనా
అసంతృప్తి
పడుతుంటాడు.
‘ఈ
విఫలము
గావడానికి
కారణమేమిటి?
ఫలము
గావడానికి
కారణమేమిటి?’
అనే
విషయాన్ని
మానవుడు
విచారించటం
లేదు.
ప్రతి
ఒక్కదానియందు
తన
లోపం
ఉండటంచేతనే
విఫలమౌతుండాది.
తన
హృదయములో
పవిత్రమైన
భావము
ఆవిర్భవించటంచేత
అది
సఫలమౌతుండాది.
సఫలమునకు,
విఫలమునకు
సంకల్పమే
కారణము.
సంకల్ప
వికల్పాత్మకమే
జగత్తు.
సంకల్పించుకొని
నేత్రములు
తెరచితివా
విశ్వమంతా
చూడగలుగుతున్నావు.
సంకల్పము
లేక
నీ
నేత్రములు
మూసికొంటివా
నీకు
ఏమాత్రము
రూపము
కనిపించటం
లేదు.
మన
నేత్రములే
మన
శాస్త్రములు.
మన
దృష్టియే
ఈ
సృష్టి.
కనుక,
సృష్టి
అంతయు
మన
దృష్టిలోనే
ఇమిడి
ఉంటున్నది.
‘యద్భావం
తద్భవతి’
మన
భావములు
ఉత్తమమైనవిగా
ఉండినప్పుడే
మనయొక్క
ఫలసిద్ధి
ఉత్తమమైనదిగా
రూపొందుతుంది.
మానవుని
కీర్తి,
మర్యాదలన్నీ
సమాజమునుండియే
ఆవిర్భవించాయి
జగత్తులో
అనేకమందియొక్క
ఉపకారాలను
మనం
అందుకుంటున్నాం.
ఈ
ఉపకారములే
లేకుండిన
మానవుడు
ఉన్నతస్థాయికే
పోలేడు.
పుట్టిన
తక్షణమే
తల్లి
మనకు
పాలిచ్చి
పెంచి
పోషిస్తుంది.
పెరిగిన
తర్వాత
తండ్రి,
గురువు
ఇతనికి
సరియైనటువంటి
స్థానమునందించి
విద్యా
బుద్ధుల్ని
గరుపుతారు.
తరువాత
మిత్రులంతా
చేరి
జగత్తులో
అనేక
రకములైన
సంబంధబాంధవ్యములలో
పడవేస్తారు.
5
▾
Meaning
Keep
ఆ
తరువాత
బంధువులు
అతనికి
ఒక
బంధన
కడతారు.
ఈ
విధంగా
ఒక్కొక్కరు
ఒక్కొక్క
విధమైన
రీతిలో
మానవుని
జీవిత
ప్రయాణములో
సహాయము
చేయడంగాని,
ఉపకారము
చేయడంగాని
జరుగుతుంది.
ఇతరుల
చేదోడు
వాదోడు
లేకుండా
మానవుడు
ఉన్నతస్థాయికిగాని,
అధోగతికిగాని
చేరుకోలేడు.
జీవయాత్రలో
పరుల
ఉపకారమును
పొందిన
మానవుడు
తోటి
మానవునకు
ఏమి
ఉపకారం
చేయగలుగుతున్నాడు?
ఉపకారికి
ఉపకారము
చేయుట
గొప్ప
కాదు;
అపకారికికూడను
ఉపకారము
చేయుట
గొప్పది!
మానవుడు
సమాజములో
జీవిస్తూ
తాను
ఈ
స్థాయికి
రావటంచేత
సమాజమునకుకూడను
తాను
కొంత
ఉపకారం
చెయ్యాలి.
తన
కీర్తి
మర్యాదలన్నీ
సమాజమునుండియే
ఆవిర్భవించినవి.
సమాజము
లేక
నీవు
ఇంతటి
స్థితికి
చేరుకోలేవు.
కనుక,
సమాజ
సంబంధమైన
సేవలు
చెయ్యాలి.
దీనినే
‘అష్టాదశ
పురాణేషు
వ్యాసస్య
వచనద్వయం-
పరోపకారః
పుణ్యాయ,
పాపాయ
పరపీడనం,’
అన్నారు.
మానవునియొక్క
ఆయుఃప్రమాణం
చాలా
తక్కువ.
ఈ
స్వల్పకాలములోనే
సత్యాన్ని
గుర్తించటానికి
మానవుని
హృదయము
అంగీకరించటం
లేదు.
కారణమేమనగా
అనిత్యము
అశాశ్వతము
అయిన
వాంఛలపైన
అధికమైన
ఆసక్తిని
పెంచుకోవడమే!
ఫలితంగా
మానవుడు
సత్యాన్ని
విస్మరించి,
అసత్యమైన
జగత్తునే
విశ్వసించి
నిత్యజీవితమును
గడుపుతున్నాడు.
మానవుడు
ఈనాడు
ఆధారాన్ని
వదలి
ఆధేయాన్ని
ఆశ్రయిస్తున్నాడు
మానవుడు
తెల్లవారి
మొదలు
రాత్రివరకు
అనిత్యము,
అసత్యము,
అశాశ్వతము
అయినదానినే
ఎక్కువగా
ప్రేమిస్తున్నాడు.
నిత్యసత్యమైన
దివ్యత్వాన్ని
ప్రేమించటానికి
ముందంజ
వెయ్యటం
లేదు.
ఆధారాన్ని
వదలి,
ఆధేయాన్ని
ఆశ్రయిస్తున్నాడు.
ఉపకారమునకు
మనము
ప్రత్యుపకారం
అందించటానికి
ప్రయత్నించాలి.
ఎవ్వరినికూడను
మనం
బాధించకూడదు.
నీ
చేతనైతే
ఉపకారం
చెయ్యి!
ఈ
సత్యాన్ని
ఏ
మానవుడు
నడుచుకుంటున్నాడు?
ఇది
చెడ్డ,
ఇది
మంచి
అని
తెలుసు.
చెడ్డ
చేస్తే
చెడ్డ
ఫలితం
లభిస్తుందనికూడా
తెలుసు.
కాని,
చెడ్డదాన్నే
మానవుడు
వరిస్తున్నాడు.
అలాగే
ఏది
మంచిది
కూడను
తనకు
తెలుసును.
6
▾
Meaning
Keep
ఆ
మంచి
చెయ్యటంవల్ల
మంచి
స్థితికి
పోతాననికూడా
తనకు
తెలుసును.
కాని,
మంచిని
చెయ్యటానికి
మనసు
అంగీకరించటం
లేదు.
దీనికి
కారణమేమిటి?
తన
సంకల్పము
వెనుక
ఉండిన
అంతఃకరణ
పరిశుద్ధముగా
లేకపోవటమే!
మానవుని
అంతఃకరణ
ఈనాడు
పూర్తి
స్వార్థంతో
నిండిపోయినది.
స్వార్థమనే
మట్టిలోనే
జీవితమనే
మొక్క
మొలుస్తూ
వచ్చింది.
కౌరవులు
తమ
స్వార్థ,
స్వప్రయోజనముల
నిమిత్తమై
పాండవులను
కష్టపెడుతూ
వచ్చారు.
ఇది
తప్పని
వారికి
తెలుసును.
కాని,
తెలిసే
చేశారు,
ఈ
దోషము.
తెలియక
చేస్తే
ఇది
ఒక
తప్పు.
తెలిసి
చేస్తే
పాపం.
తప్పుకు,
పాపమునకుండినటువంటి
వ్యత్యాసమింతే!
కృతజ్ఞత
విషయములో
కర్ణుడు
గొప్ప
ఆదర్శమును
నిరూపించాడు.
ఇతను
గొప్ప
త్యాగమూర్తి
మాత్రమే
కాదు.
తన
మాస్టర్
అయిన
దుర్యోధనునికి
ఎట్టి
సమయమునందు
తన
జీవితాన్ని
అంకితం
చెయ్యటానికి
సంసిద్ధంగా
ఉన్నాడు.
కౌరవ,
పాండవుల
అస్త్రవిద్యా
ప్రదర్శన
సందర్భమున
అందులో
కర్ణుడుకూడా
పాల్గొంటానని
ముందుకు
వచ్చాడు.
‘క్షత్రియులు,
రాజకుమారులు
మాత్రమే
ఇందులో
పాల్గొనటానికి
అర్హులు.
నీవెవరు?’
అని
ప్రశ్నించగా
‘నాకెట్టి
రాజ్యము
లేదు.
నేను
సూతుడను.
నేను
క్షత్రియుణ్ణి
కాదు,’
అనేటప్పటికి
అతనికి
అర్హత
లేదు,
వెనక్కి
పొమ్మన్నారు.
ఇంత
శక్తి
ఉండినప్పటికిని,
మహా
గుణవంతుడైనప్పటికిని,
గొప్ప
త్యాగశీలుడైనప్పటికిని,
ప్రాకృతమైన
ఫలితములు
పొందవలెనన్న
కొన్ని
నిబంధనలు
ఉంటాయి.
ఆ
సన్నివేశము
అతనికి
చాలా
తలవంపులుగా
వచ్చింది.
అతను
తలవంచుకొని
పొయ్యేలోపల
దుర్యోధనుడు
అతనికి
అడ్డు
తగిలి,
‘ఇలాంటి
శక్తిమంతుడైనటువంటివాడు
ఈ
జగత్తులో
అర్జునుని
తర్వాత
మరొకడు
లేడు.
పాండవులపైన
నేను
విరోధము
పూనినటువంటివాణ్ణి.
ఇలాంటి
కర్ణుడు
నావైపున
ఉంటుంటే
నేను
ఏనాటికైనా
పాండవులను
హతమార్చగలను,’
అనే
దురుద్దేశముచేత
కర్ణునికి
ఒక
సహాయము
చేశాడు.
ఏమి
చేశాడు?
ఆ
క్షణంలోనే
ఆ
మహా
సభయందు
కర్ణుని
అంగరాజ్యాధిపతిగా
చేశాడు.
అందుకు
కృతజ్ఞతగా
కర్ణుడు
తన
జీవితమంతాకూడను
దుర్యోధనునికి
అర్పితం
చెయ్యాలని
ఒక
ప్రతిజ్ఞ
చేసుకున్నాడు.
7
▾
Meaning
Keep
His poems 433
Also in his talks
(3)
9 October 1986
Man's transformation is itself the transformation of the universe
29 May 1989
Victory is only where Kṛṣṇa is
10 September 2002
The Inner Meaning of Vināyaka Worship
జగత్తులో
దుర్మార్గులైన
కుమారులు
ఉండవచ్చుగాని,
దుర్మార్గురాలైన
తల్లి
ఉండదు
పాండవులకు,
కౌరవులకు
యుద్ధం
ప్రారంభమయ్యే
సమయం
వచ్చింది.
యుద్ధము
నిలపాలని
కృష్ణుడు
అనేక
విధములుగా
వారిద్దరి
మధ్య
సంధి
కుదర్చటానికి
ప్రయత్నించాడు.
‘యుద్ధమువలన
ప్రజలకు,
బంధువులకు
ఇబ్బంది
కలుగుతుంది.
ప్రాణాలకు
హాని
కలుగుతుంది.
ఇలాంటి
యుద్ధము
చెయ్యకూడదు,’
అని
ఆనాడుకూడను
కృష్ణునియొక్క
సత్సంకల్పము.
కేవలం
వ్యక్తులయొక్క
అభిప్రాయభేదముల
నిమిత్తమై
ప్రజలను
హింసించటం
మంచిదికాదని,
అనేక
విధములుగా
బోధిస్తూ
రాయభారము
చేశాడు,
కృష్ణుడు.
అర్జునుడికి
కోపం
వచ్చింది.
‘కృష్ణా!
ఏమిటి
ఈ
రాయబారం?
కాలకూటమున
అమృతము
సృజింప
వీలా
భయద
దావాగ్నిలో
మల్లెపూలు
వెదజల్లు
లీల
ముష్కరుల
మ్రోల
హితోక్తులు
మేలా?
గుణజాల!
ఏల
ఈ
సంధి
మాటలిక
గోపాలా!
చాలు
చాలిక,
యుద్ధమునకు
సిద్ధమనక
కాల
హరణమిక
ఏల?
ఉత్తర
దక్షిణ
ధ్రువములు
కలియునా?
ఇక
నీయొక్క
రాయబారము
విరమించు’
మని
చెప్పేడు.
ఇక
కౌరవ,
పాండవ
యుద్ధము
రేపటినుంచి
ప్రారంభమని
ఇరుపక్షాలవారు
నిర్ణయం
చేశారు.
ఈ
విషయం
తెలుసుకుంది
కుంతీదేవి.
ఆమె
మాతృమూర్తి,
పాండవులకు.
కేవలం
పాండవులకు
మాత్రమే
కాదు,
కర్ణునికికూడను
ఆమె
మాతృమూర్తే!
కుంతికి
మొదటి
పుత్రుడు,
కర్ణుడు.
సూర్య
వరప్రసాదముతో
కలిగినటువంటివాడు.
సహజ
కవచకుండలములు
ధరించినటువంటివాడు.
ఈ
సత్యాన్ని
గుర్తించి
కుంతీదేవి
ఏ
సమయములో
కర్ణుడితో
మాటాడడానికి
అవకాశము
చిక్కుతుందా
అని
క్షణ,
క్షణముకూడను
కాచుకొని
తిరిగింది
పాపం!
దుర్మార్గులైనటువంటి
కుమారులైనా
ఉన్నారుకాని,
దుర్మార్గురాలైన
తల్లి
ఈ
జగత్తులో
లేదు.
కనుక,
తల్లిప్రేమచేత
కుంతీదేవి
ఈ
రీతిగా
కర్ణునికొరకు
కాచుకుంటూ
వచ్చింది.
8
▾
Meaning
Keep
కృతజ్ఞత
లేనివాడు
క్రూరమృగముకంటె
హీనుడు
ఒకనాడు
యుద్ధమునకు
ముందు
దినము
నదికి
వెళ్ళి
స్నానము
చేసి
సంధ్య
వార్చుకుంటున్నాడు,
కర్ణుడు.
కుంతీదేవి
దాసీలను
పెట్టింది,
కర్ణుడు
ఒంటరిగా
ఎక్కడికి
పోతాడో
కనిపెట్టి
తనకు
తెలుపమని.
ఆ
సమయాన్ని
పురస్కరించుకొని
తానూ
వేగంగా
నదీ
తీరానికి
వెళ్ళింది.
అక్కడ
ధ్యానములో
ఉన్నాడు,
కర్ణుడు.
అతని
ధ్యానమునకు
ఏమాత్రము
అభ్యంతరం
కలక్కుండా
వెనుకవైపున
నిలుచుకుంది,
తల్లి
కుంతీదేవి.
చాలా
కాలము
తర్వాత
కుమారుడైన
కర్ణుని
చూడటంచేత
ఆమెకు
పట్టరాని
దుఃఖమొచ్చింది.
‘భయంకరమైన
యుద్ధము
జరగబోతుండాదే,
ఇందులో
ఎవరు
నశిస్తారో,
ఎవరు
మరణిస్తారో,
అనేటువంటి
ఆందోళనచేత,
పుత్రవాత్సల్యంచేత
మరింత
దుఃఖములో
మునిగిపోయింది.
చివరకు
భరించుకోలేక
గట్టిగ
ఏడ్చింది.
పాపం,
ధ్యానములో
ఉండినటువంటి
కర్ణుడు
దిగ్గున
లేచాడు.
చూచేటప్పటికి
కుంతీదేవి.
ఆమె
తన
తల్లి
అని
కర్ణునకు
తెలియదు.
కాని,
కుంతి
పాండవుల
తల్లి
అని
మాత్రం
తెలుసు.
‘తల్లీ!
మీరెందుకిట్లా
దుఃఖిస్తున్నారు?
నేను
రాధా
పుత్రుడైన
కర్ణుడను.
మీకు
నమస్కరిస్తున్నాను.
మీ
దుఃఖమునకు
కారణమేమ’ని
ప్రశ్నించాడు.
అప్పుడు
కుంతీదేవి
‘నాయనా!
నీవు
రాధాపుత్రుడు
కాదు,
నీవు
నా
పుత్రుడే!
సూర్య
వరప్రసాదముచేత
నువ్వు
కలిగావు,
నాకు.
లోకనిందనుండి
తప్పించుకునే
నిమిత్తమై
ఆనాడు
నేను
నిన్ను
గంగలో
విడిచాను.
నేను
మహా
దుర్మార్గురాలను.
పసికందయినటువంటి
నిన్ను
నిర్దాక్షిణ్యంగా,
కఠినంగా
గంగలో
వదిలిపెట్టాను.
కేవలం
నా
మర్యాద
నిమిత్తమై,
నా
స్వార్థ
నిమిత్తమై
నిన్నీ
రీతిగా
వదిలిపెట్టాను.
నీవు
నా
మొట్టమొదటి
పుత్రుడవు.
పాండవులు
నీయొక్క
సోదరులు.
వారు
నీ
తమ్ముళ్ళే!
ధర్మజుడుకూడను
నీ
తమ్ముడే!
నాయనా!
నాకొక
మాట
ఇయ్యి.
మీరందరూకూడను
ఒక్కటిగా
ఉంటుంటే
ఏకచ్ఛత్రాధిపత్యాన్ని
ఏలవచ్చు.
నీవే
చక్రవర్తి
కావచ్చును.
నీ
ఆజ్ఞను
శిరసావహించి
పాండవులంతాకూడను
నీ
అడుగుజాడలలో
నడుస్తారు.
ఆవిధంగా
నేను
మాటనిస్తాను.
ఈ
భయంకరమైన
యుద్ధములో
నీవు
పాండవులపైన
ఏమాత్రము
విరోధము
పూనవద్దు.
వారిపట్ల
సోదరభావాన్ని
నీ
హృదయమునందుంచుకో!
ఈ
తల్లియొక్క
దుఃఖాన్ని
నీవు
కొంతవరకు
యోచించుకో!’
అని
చెప్పేటప్పటికి
అతని
మనస్సు
చాల
సందిగ్ధావస్థలో
పడిపోయింది.
తీవ్రమైన
ఆవేదనలో
మునిగిపోయాడు.
9
▾
Meaning
Keep
తుదకు
సత్యాన్ని
గుర్తించి
‘తల్లీ!
ఈ
విషయమును
నేను
అక్కడక్కడ
విన్నాను.
కాని,
తల్లిద్వారా
నేరుగా
నేనీ
సత్యాన్ని
ఏనాడుకూడా
వినలేదు.
పాండవులు
నా
సోదరులే!
నేను
కుంతీదేవి
కుమారుణ్ణే!’
అని
చెప్పి
‘ఈ
సమయములో
నేను
తల్లి
ఆజ్ఞను
శిరసావహించటమా?
లేక
నన్ను
ఇంత
ఉన్నత
స్థితికి
తెచ్చిన
ప్రభువు
దుర్యోధనునికి
నా
కృతజ్ఞతను
చూపించటమా?’
అని
తీవ్ర
సందిగ్ధములో
పడిపోయాడు.
‘ఆనాడు
నన్ను
గౌరవించి
నన్నొక
రాజుగా
చేసి
ఇంతటివాడుగా
చేసినటువంటిది
దుర్యోధనుడే!
దుర్మార్గుడుకానీ,
దుష్టుడుగానీ,
దురాచారవంతుడుకానీ
ఆ
దుర్యోధనుడే
నాకీ
గౌరవాన్నిచ్చాడు.
అటువంటివానికి
నేను
ద్రోహము
చెయ్యలేను.
నా
ప్రాణమునైన
ఇవ్వడానికి
సిద్ధంగా
ఉంటున్నాను.
కాని,
అతనికి
నేను
ద్రోహము
చెయ్యను.
అయితే
నీవు
తల్లివి
కనుక
నీకు
ఒక్క
వాగ్దానం
ఇస్తాను.
తల్లికి
ఇవ్వవలసిన
వాగ్దానం
ఒక్కటి,
నా
ప్రభువైన
దుర్యోధనునిపట్ల
నా
కర్తవ్యం
మరొకటి.
ఈ
రెండూ
రెండు
రెక్కలవంటివి.
రెండూ
రెండు
చక్రములవంటివి.
ఈ
రెండూ
లేకపోతే
నా
జీవితం
వ్యర్థమైపోతుంది.
తల్లీ!
నీ
ఆజ్ఞ
ప్రకారము
యుద్ధభూమిలో
నాకు
అవకాశం
చిక్కినప్పుడు
ధర్మజుణ్ణి,
భీముణ్ణి,
నకులుని,
సహదేవుని
చంపకుండా
వదలిపెడతాను.
వాళ్ళనేమాత్రమూ
నేను
హింసించను.
కాని,
అర్జునుని
మాత్రం
నేను
వదలను.
ఒకవేళ
ఈ
యుద్ధములో
నేను
చస్తినా
నీకు
కుమారులు
ఐదుగురు
పంచపాండవులు
మిగిలి
ఉంటారు.
లేక
అర్జునుడు
చచ్చెనా
అప్పుడుకూడా
మేము
నీకు
ఐదుమందే!
అర్జునుని
స్థానములో
నేనొస్తాను.
నేను
చస్తే
నా
స్థానములో
అర్జునుడొస్తాడు.
కాబట్టి
నీ
ఐదుగురు
కుమారులకు
ఏమాత్రము
లోటు
కలుగదు.
ఈ
విధముగా
నీకు
వాగ్దానమిస్తాన’నన్నాడు.
ఆ
విధంగా
చెప్పి,
తల్లియైన
కుంతీదేవి
పాదము
పట్టుకొని,
‘అమ్మా!
ఆనాడు
నిండు
సభలోపల
దుర్యోధనుడు
నా
గౌరవాన్ని
కాపాడాడు.
దుర్యోధనుడు
దుష్టుడే,
నాకు
తెలుసును.
పాండవులు
ధర్మమూర్తులే,
అదికూడా
నాకు
తెలుసును.
కాని,
అతను
నన్ను
కాపాడాడు.
ఆ
ఉపకారాన్ని
నేను
మరచిపోతినా,
అడవిలో
ఉన్నటువంటి
క్రూరమృగములకంటే
నేను
హీనుడైపోతాను.
కనుక,
నేను
ఆయొక్క
కృతజ్ఞతను
తెలపటం
నా
కర్తవ్యం.
కనుక,
నా
యజమానునకు
నా
జీవితమంతా
కృతజ్ఞత
చెప్పుకుంటున్నాను.
దీంట్లో
మాత్రము
నాకేమాత్రము
మార్పు
కలగదు’
అన్నాడు.
అప్పుడు
కుంతీదేవి
‘బ్రహ్మహత్యా
పాపమునకైనా
ఒక
పరిహారముంటుండాది.
10
▾
Meaning
Keep
గోహత్యా
పాపమునకైనా
పరిహారముంటుండాది.
శిశుహత్యా
పాపమునకైనా
పరిహారముంటుండాది.
గురుద్రోహమునకు,
దైవద్రోహమునకు
పరిహారమే
లేదు.
నీవు
కృతఘ్నుడు
అయినావంటే
క్రూరమృగముకంటే
హీనుడైపోతావు.
కనుక
కర్ణా!
నీవు
గుణవంతుడైతే
నాకంతే
చాలు.
అర్జునునిపైననే
నీవు
క్రోధం
పూనుతున్నావు.
దీనికి
నేను
సంతోషిస్తాను.
మిగిలిన
ధర్మజుణ్ణి,
భీముణ్ణి,
నకులసహదేవుల్ని
మాత్రం
నీవు
చంప
వద్దు’
అన్నది.
ఏ
మార్గమునందైనా
సరే,
టెస్టు
అనేది
మనకు
ఉండే
తీరాలి
ఈ
పాండవులయందుకూడను
ఎంతటి
ఉన్నతభావాలు
ఉంటుండాయో
చూడండి?
కుంతికి
పుట్టినవారు
ధర్మజుడు,
భీముడు,
అర్జునుడు
ముగ్గురే!
మారుటి
తల్లి
అయినటువంటి
మాద్రికి
పుట్టినవారు
నకుల,
సహదేవులు.
ఆ
తల్లి
మరణించే
సమయంలో
ధర్మజుడు
ఒక
ప్రమాణం
చేశాడు,
‘అమ్మా!
నా
తండ్రి
నిమిత్తమై
నీ
ప్రాణమును
అర్పితం
చేస్తున్నావు.
నా
స్వంత
సోదరులకంటే
ఈ
సోదరులిద్దరిని
నేను
అధికంగా
చూచుకుంటాను.
వారిని
నిజసోదరులుగా
విశ్వసించి
ప్రేమిస్తాను.’
పాండవుల
అరణ్యవాససమయములో
ఒకసారి
వారికి
దాహము
వేసింది.
ఆ
సందర్భంలో
ధర్మజుడు
ఒక
పరీక్షను
ఎదుర్కోవలసి
వచ్చింది.
జీవితంలో
ప్రతి
విషయములోను
ఒక
పరీక్ష
(టెస్టు)
ఉంటుండాది.
లేకపోతే
మనకు
రెస్టే
చిక్కదు.
ఒక
చిన్న
ఉద్యోగానికి
పోవాలనుకుంటే
అక్కడ
ఒక
టెస్టు
పెడతారు.
కాని,
ఆధునిక
యుగములో
దైవవిషయంలో
మాత్రం
టెస్టు
ఉండకూడదంటారు.
ఏ
మార్గమునందైనా
సరే,
నైతిక,
భౌతిక,
ధార్మిక,
ఆధ్యాత్మిక,
లౌకిక,
వైరాగ్య
అన్ని
విషయములలోకూడను
టెస్టు
అనేది
మనకు
ఉండే
తీరాలి!
కాని,
ఈ
విషయాన్ని
ఎవరూ
గుర్తించుకోలేక
‘స్వామీ!
మమ్మల్ని
టెస్ట్
చెయ్యకండి,’
అంటారు.
ఈ
టెస్టు
ఎంత
త్వరగా
జరుగుతుంటే
అంత
ఉన్నతస్థాయికి
త్వరత్వరగా
వెళ్ళిపోవచ్చును.
ఒకటో
క్లాసులో
కూర్చున్నటువంటివాడు
‘స్వామీ!
నన్ను
టెస్టు
చెయ్యద్దంటే
రెండోక్లాసుకు
వాడు
పోడానికే
వీల్లేదు.
టెస్ట్‌లో
పాస్
చేసి
రెండో
తరగతికి
పోయి,
అక్కడ
మళ్ళీ
టెస్ట్‌లో
పాస్
చేసి
మూడో
తరగతికి
పోతాడు.
11
▾
Meaning
Keep
ఈవిధంగా
ఒక్కోదానికి
ఒక్కో
టెస్ట్
జరిగిన
తర్వాతనే
ఉన్నతస్థాయికి
పోగలుగుతున్నాడు.
అదే
విధంగా
ఇక్కడ
ధర్మరాజునకుకూడా
ఒక
టెస్ట్
జరిగింది.
ఒకరోజు
అరణ్యంలో
వెడుతుండగా
ధర్మజునకు
దాహము
వేసింది.
దగ్గరలో
ఏదైనా
కొలను
ఉందేమో
చూచి
తనకు
త్రాగడానికి
కొంచెం
నీళ్ళు
తెచ్చిపెట్టమని
తమ్ముళ్ళను
కోరాడు.
భీముడు,
అర్జునుడు,
నకులుడు,
సహదేవుడు
వరుసగా
ఒకరి
తరువాత
ఒకరు
కొలనువద్దకు
వెళ్ళి
తిరిగి
రాలేదు.
అక్కడ
ఒక
యక్షుడు
వారిని
ఒక
ప్రశ్న
వేశాడు.
ముందుగా
ఒక
ప్రశ్నకు
సమాధానం
చెప్పి
తరువాత
కొలనులో
దిగుమని
చెప్పాడు.
కాని,
వారెవరూ
యక్షుని
ప్రశ్నకు
జవాబు
చెప్పలేకపోయారు.
ఎంతసేపైనాకూడను
తమ్ములు
రాలేదే
అని
వారిని
వెతుకుతూ
ధర్మజుడు
ఆ
కొలను
దగ్గరకు
వెళ్ళాడు.
అక్కడొక
యక్షుడు
‘ధర్మజా!
నాయొక్క
ప్రశ్నకు
నీ
సోదరులెవరూ
జవాబు
చెప్పలేకపోయారు.
మూర్ఛపోయారు.
నీవైనా
నా
ప్రశ్నకు
సరియైన
జవాబు
చెప్పి
తరువాత
నీ
దాహం
తీర్చుకో’
అని
చెప్పాడు.
ఏమిటా
ప్రశ్న?
చాలా
చిన్న
ప్రశ్న-‘నిద్రయందుకూడను
కన్నులు
తెరుచుకొని,
జాగ్రతయందుకూడను
కన్నులు
తెరుచుకొని
జీవించే
జీవి
ఎవరు?’
ఫక్కున
నవ్వాడు
ధర్మజుడు.
‘ఇది
చేప’
అన్నాడు.
ఇంత
సూక్ష్మమైన
తెలివిగలవాడు
ధర్మజుడని
ఆనందించి
ఆ
యక్షుడు
‘నీవు
వీరిలో
ఏ
తమ్ముణ్ణి
కోరినప్పటికి
నేను
బ్రతికిస్తా’నన్నాడు.
ధర్మజుడు
యోచించాడు.
మహా
భారతయుద్ధములో
అర్జునుడు
చాలా
అవసరము.
భీముడుకూడా
చాలా
అవసరము.
కాని
నకులసహదేవులు
అంత
అవసరం
కాదు.
అయినప్పటికి
తన
పినతల్లికి
ఇచ్చిన
మాటను
దక్కించుకునే
నిమిత్తము
సహదేవుణ్ణి
బ్రతికించమని
చెప్పాడు.
అప్పుడు
యక్షుడు
‘ధర్మజా!
నీ
యొక్క
కృతజ్ఞతకు
నేను
చాలా
మెచ్చుకున్నాను.
నీ
సొంత
తల్లి
బిడ్డల
ప్రాణములను
నీవు
కోరలేదు.
సవతితల్లి
బిడ్డలను
నీవాశిస్తూ
ఉంటున్నావు.
ఎంత
గొప్ప
విశాలబుద్ధి!
తప్పక
నేను
బ్రతికిస్తాన’ని
చెప్పి
ధర్మజుని
విశాలమైన
భావము,
ఆ
యొక్క
కృతజ్ఞతను
మెచ్చి
ధర్మజుని
తమ్ముళ్ళు
అందరినికూడను
బ్రతికించాడు.
ఈ
విధంగా
మనం
కృతజ్ఞతాభావమును
పెంపొందించుకున్నప్పుడు
ఒకటికి
నాలుగు
ఉత్తమ
ఫలములు
మనకు
లభిస్తుంటాయి.
12
▾
Meaning
Keep
కృతజ్ఞత
లేకుండా
సంకుచితమైన
భావములతో
కృతఘ్నుడుగా
మారిపోతే
మనకు
జరిగేటువంటి
ఫలితాలుకూడను
క్షీణించిపోతాయి.
ప్రాకృతమైన
విషయాలలోనే
ఇంత
గొప్ప
ఫలితముంటుండగా
భగవత్
సంబంధమైన
విషయాలలో
ఇంకా
ఎంత
గొప్ప
ఫలితముంటుండాది!
దైవాజ్ఞను
శిరసావహించడం
నేర్చుకుంటే
మీ
జీవితము
చక్కగా
బాగుపడుతుంది
విద్యార్థులారా!
మీకేమీ
తెలియనటువంటి,
అమాయకత్వంతో
కూడినటువంటి
జీవితమిది.
అజ్ఞానంతో
నిండినటువంటి
జీవితమిది.
కేవలం
ఆశలతో
నిండినటువంటి
జీవితమిది.
కేవలం
స్వార్థంతో
కూడినటువంటి
జీవితమిది.
స్వప్రయోజనాన్ని
ఆశించేటువంటి
జీవితమిది.
కాని,
ఇందులోకూడను
పవిత్రమైన
జీవితాన్ని
మనము
ఎంచుకోవాలి.
అదే
దైవాజ్ఞను
శిరసావహించటం!
ఆ
ఒక్కదానిని
మీరు
చక్కగా
నడుచుకుంటిరా,
మీ
జీవితము,
మీ
కుటుంబము,
మీ
సమాజము
సర్వముకూడను
బాగుపడిపోతాయి.
ఒక్క
పినతల్లి
కుమారుని
క్షేమాన్ని
కోరినటువంటి
ధర్మజునకు
తమ్ముళ్ళు
అందర్నీ
బ్రతికించాడు,
యక్షుడు.
దుర్యోధనుడు
ఎట్టి
దుర్మార్గుడైనా
అతడు
తనకు
ఉపకారము
చేసినందుకు
కృతజ్ఞత
చూపిస్తూ
వచ్చాడు,
కర్ణుడు.
ఈ
కృతజ్ఞతా
భావమునందు
కర్ణుడు
మహా
గొప్పవాడు.
ఆదర్శపురుషుడు.
‘నా
మాటను
నేను
దక్కించుకోవాలి’
అని
గొప్ప
నిర్ణయం
తీసుకున్నాడు.
మాటకు
ప్రాణము
సత్యము.
అది
లేకపోతే
ఆ
మాట
ప్రాణము
లేనటువంటి
మాటనే!
కనుక
మనం
మొట్టమొదట
ఆ
ప్రాణాన్ని
అంటే
సత్యమును
కాపాడుకోవాలి.
మాట
పోయినదంటే
మనిషి
పోయినట్టే!
మనము
ఎవరినుంచి
ఏ
విధమైన
ఉపకారము
పొందినామో
ఆ
ఉపకారాన్ని
మనం
జీవితంలో
మరవకూడదు.
దానికి
తిరిగి
ఏ
ఉపకారం
మనం
చెయ్యకపోయినప్పటికి
ఫరవాలేదు.
ఇతరులు
మనకు
చేసిన
ఉపకారాన్ని
ఒక్కతూరి
చింతించుకుంటే
చాలు,
అపకారం
మాత్రం
చేయకండి!
స్వార్థంకోసమని
ఉపకారం
బదులు
అపకారం
చెయ్యటానికి
పూనుకుంటుంటారు,
చాలామంది.
అది
చాలా
ప్రమాదాన్ని
కలుగజేస్తుంది.
తాత్కాలికంగా
నీకు
సుఖము
కలుగవచ్చును.
తాత్కాలికమైన
ఆనందము
లభ్యం
కావచ్చును.
కాని,
మున్ముందు
చాలా
ప్రమాదకర
పరిస్థితి
ఏర్పడుతుంది.
13
▾
Meaning
Keep
ఆనాడు
నీవు
కంటిధారలు
కారిస్తే
ఎవ్వరు
తుడుస్తారు?
అలా
కంటిధారలు
కార్చక
మునుపే
నీ
భావాన్ని
నీవు
పరిశుద్ధము
చేసుకోవాలి.
నీ
హృదయాన్ని
నీవు
ఎప్పుడు
పరిశుద్ధం
చేసుకుంటావో
అప్పుడే
నీకు
సర్వ
సిద్ధులు
లభ్యమౌతాయి.
అన్ని
విద్యలకంటే
ఆత్మవిద్య
చాలా
గొప్పది
విద్యార్థులారా!
మీరు
విద్యనభ్యసిస్తున్నారు.
ఈ
భౌతిక
జీవితంలో
విద్యకూడా
అవసరమే!
తాత్కాలికమైన
నీటి
బుడగవంటి
ఈ
జీవితానికి
ఈ
విద్యలుకూడా
కొంతవరకు
ఉపకారం
చేస్తుంటాయి.
కాని
ఈ
లౌకిక
విద్యలే
ప్రధానమని
మాత్రం
విఱ్ఱవీగకూడదు.
అన్ని
విద్యలకంటే
ఆత్మవిద్య
చాలా
గొప్పది.
‘నదీనాం
సాగరో
గతిః’
లౌకిక
విద్యలు
చిన్న
చిన్న
వంకలు,
కాలువలు
వంటివి.
కాని
భగవత్
అనుగ్రహమనేటువంటిది
పెద్ద
సముద్రమువంటిది.
ఇతర
విద్యలు
అన్నీకూడను
ఆధ్యాత్మిక
విద్యలో
లీనమయ్యేటువంటివి.
కనుక,
ఆధ్యాత్మిక
విద్యయే
లేకుండాపోతే
అట్టివాడు
అడవిలోని
మృగమే!
ఎన్ని
విద్యలు
నేర్చినప్పటికిని
వాడు
విద్యావిహీనుడే!
విద్యార్థులారా!
ఎంతమందితోనైనా
మీరు
మాటాడండి.
కాని,
అందరితో
మాత్రం
స్నేహాన్ని
చెయ్యకండి.
ఈనాడు
ఈ
స్నేహమనేదే
మానవుణ్ణి
అనేక
విధములుగా
చెరుపుతుండాది.
మాటలు
తియ్యగా
మాటాడతారు;
కాని,
హృదయం
మాత్రం
విషమయంగా
ఉంటుంటాది.
ఆ
హృదయాన్ని
చూచే
నేత్రము
మానవునికి
లేదు.
ఒక్క
భగవంతునియందు
తప్ప
ఇంకెవ్వరియందు
విశ్వాసముండకూడదు.
ఎవరిపైన
ద్వేషముండకూడదు.
ఎవ్వరిపైనాకూడా
విరోధం
వద్దు.
ఈనాడు
విద్యార్థులకు
ఈ
సూక్ష్మము
తెలియటం
లేదు.
ఏదో
‘స్నేహితులు,
స్నేహితులు’
అంటుంటారు.
మిమ్మల్ని
అధోగతికి
దిగజార్చేంతవరకు
ఈ
స్నేహితులు
మిమ్మల్ని
వదలరు.
ఎటువంటి
గాయమైనా
కొన్నాళ్ళకు
మాసిపోతుందిగాని
హృదయానికి
తగిలిన
గాయము
జన్మ
జన్మలకుకూడను
మానదు.
అందరూ
స్నేహితులు
కానేకారు.
వారి
వారి
స్వార్థము,
స్వప్రయోజనాన్ని
దృష్టిలో
ఉంచుకొని
‘హలో,
హలో,’
అంటూ
దగ్గరకు
చేరుతారు.
మీరు
అందరితోను
మాట్లాడండి,
అందరితోను
చేరండి;
కాని,
స్నేహంమాత్రం
చేయకండి!
14
▾
Meaning
Keep
Also in his talks
(14)
25 December 1986
Prema is God, God is Prema
7 July 1990
The Guru within
18 January 1996
The Ātmatattva alone is freedom
16 August 1996
‘Love all, worship all’
27 August 1996
When the Anātma Is Removed, the Ātma Is Seen Everywhere
8 September 1996
The Unseen Divinity Is the Basis of the World Fashioned as the Seen
20 July 1997
Human values alone are true kin
6 May 1998
God's Līlās Are Wondrous; They Hallow the Three Worlds
9 July 1998
By God's Grace Anything Can Be Achieved
18 November 1998
Samyak Dṛṣṭi
18 September 2004
Parents Are the Visible Embodiments of God
17 October 2004
Develop the Feeling of the One Ātma
28 September 2006
No worry troubles those who think of God without ceasing
6 May 2008
Honour your parents, love them, serve them!
ఎవ్వర్నీ
ద్వేషించకండి.
నీ
పనిని
నీవు
చేసుకుంటూ
పో!
భగవంతుడొక్కడే
నిజమైన
స్నేహితుడు
భగవంతుడొక్కడే
నీకు
నిజమైన
స్నేహితుడు!
త్వమేవ
మాతా
చ
పితా
త్వమేవ
త్వమేవ
బంధుశ్చ
సఖా
త్వమేవ
త్వమేవ
విద్యా
ద్రవిణం
త్వమేవ
త్వమేవ
సర్వం
మమ
దేవదేవ.
అని
చెప్పారు.
అతనొక్కడే
నిజమైనటువంటి
మిత్రుడు.
ఈనాడు
లోకంలో
మిత్రుడు,
మిత్రుడంటారు.
ఈ
మిత్రులే
మిత్రుల్ని
భస్మం
చేస్తున్నారు.
ఈ
మిత్రులే
మిమ్మల్ని
ముంచేస్తారు.
కనుక,
ఇలాంటి
దొంగ
మిత్రులతో
మీరు
చేరకూడదు.
నీ
కర్తవ్యాన్ని
నీవు
నిర్వర్తించు.
నీ
యొక్క
ప్రేమను
ఒక్క
భగవంతునికి
మాత్రమే
అర్పించు.
Previous
←
Only one who lives in the oneness of body, mind and Ātma is a human being
Next
Love The Motherland: Serve The World
→