Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 2003 · Easwaramma, the ideal mother
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Easwaramma, the ideal mother
6 May 2003, Easwaramma Day, Brindavan
1
▾
Meaning
Keep
Also in his talks
(1)
6 May 1998
God's Līlās Are Wondrous; They Hallow the Three Worlds
తల్లిగర్భమునుండి
ధనము
తేడెవ్వడు
వెళ్ళిపోయేనాడు
వెంట
రాదు
లక్షాధికారైన
లవణ
మన్నమెగాని
మెరుగు
బంగారంబు
మ్రింగబోడు
విత్తమార్జన
చేసి
విఱ్ఱవీగుటెగాని
కూడబెట్టిన
సొమ్ము
తోడరాదు
పొందుగా
మరుగైన
భూమిలోపలబెట్టి
దానధర్మము
లేక
దాచి
దాచి
తుదకు
దొంగల
కిత్తురో
దొరల
కగునొ
తనది
యనియెడు
నట్టిది
ధనము
కాదు
ఆత్మయొక్కటె
శాశ్వత
మరసి
చూడ
సత్యమును
తెలుపుమాట
ఈ
సాయిమాట
ప్రేమస్వరూపులారా!
‘దేహో
దేవాలయ
ప్రోక్తో
జీవోదేవస్సనాతనః’,
దేహమే
ఒక
దేవాలయము.
ఇందులో
నివసించే
జీవుడే
దేవుడు.
ప్రతి
దేవాలయములోను
ఒక
గంట
ఉంటుంది.
కాని,
దేహమనే
దేవాలయంలో
ఉన్న
గంట
ఎవ్వరికీ
కనిపించదు.
దీనిపేరు
‘అనాహతి’.
ఇది
ఒకరు
కొట్టేటటువంటి
గంట
కాదు.
నిరంతరము
తనంతట
తానే
మ్రోగుతూ
తన
కర్తవ్యాన్ని
నిర్వర్తిస్తూ
ఉంటుంది.
అదే
మన
దేహమునందున్న
గుండె.
దానినెవ్వరూ
కొట్టనక్కర్లేదు.
దేవుడు
మన
హృదయంలోనే
ఉండి
అక్కడ
‘గంట’
కొడుతున్నాడు.
అది
ఎప్పుడు
ఆగిపోతుందో
అప్పుడు
దేహము
నిర్జీవమైపోతుంది.
దేహములో
నిరంతరం
మ్రోగుతూ
ఉండే
గంటకు
‘శివం’
అని
పేరు.
అది
ఆగిపోయినప్పుడు
దేహము
‘శవం’గా
మారిపోతుంది.
ఈ
విశ్వమంతయు
విశ్వేశ్వరుని
మందిరమే!
2
▾
Meaning
Keep
ఈ
మందిరము
నందు
నిరంతరం
‘ఓం’
అనే
గంట
మ్రోగుతూనే
ఉన్నది.
దీనినే
‘శబ్దబ్రహ్మమయి,
చరాచరమయి,
జ్యోతిర్మయి,
వాఙ్మయి,
నిత్యానందమయి,
పరాత్పరమయి,
మాయామయి,
శ్రీమయి,’
అని
వర్ణించారు.
అట్టి
మంగళకరమైన
శబ్దమును
శ్రవణం
చేయడానికి
ప్రయత్నించక
మానవుడు
లోకసంబంధమైన
విషయాలను
శ్రవణం
చేస్తున్నాడు;
సచ్చిదానందస్వరూపమైన
దివ్యత్వాన్ని
అలక్ష్యం
చేస్తున్నాడు.
ఎవరు
నిజమైన
భక్తుడు?
ఒక
పర్యాయం
కాశీలోని
విశ్వేశ్వరాలయంలో
పూజారి
హారతి
ఇస్తూ
ఉండగా
పైనుండి
ఒక
బంగారుతట్ట
క్రిందపడింది.
‘పరమభక్తునికి
మాత్రమే
ఇది
లభ్యమౌతుంది.
భగవన్నామస్మరణ
చేయనివానికి
ఇది
లభ్యం
కాదు,’
అని
దానిపైన
వ్రాయబడి
ఉంది.
అది
చూసి
పూజారి
చాలా
ఆనందించాడు.
‘నేను
నిత్యం
సహస్రలింగార్చన
చేస్తున్నాను;
అభిషేకాలు
చేస్తున్నాను.
నిరంతరం
వేదమంత్రాలను
వల్లెవేస్తూ
కాలాన్ని
సార్థకం
గావించుకుంటున్నాను.
కనుక,
నాకంటే
పరమ
భక్తుడీ
లోకంలో
ఎవరున్నారు,’
అనే
భావనతో
ఆ
బంగారు
తట్టను
ముట్టుకున్నాడు.
తక్షణమే
అది
మట్టితట్టగా
మారిపోయింది.
తన
అహంకారానికి
సిగ్గుపడి
వెంటనే
దానిని
క్రింద
పెట్టేశాడు.
అది
మళ్ళీ
బంగారు
తట్టగా
మారిపోయింది.
ఆనాటినుండి
విశ్వేశ్వరాలయానికి
వచ్చిన
ప్రతి
వ్యక్తీ
ఆ
బంగారుతట్టను
ముట్టడం,
ముట్టిన
తక్షణమే
అది
మట్టితట్టగా
మారిపోవడం
...
ఈవిధంగా
కొంతకాలము
జరుగుతూ
వచ్చింది.
ఒకనాడొక
పరమభక్తుడు
ఆ
ఆలయములోకి
ప్రవేశించాడు.
అతడు
దమమును
సాధించినవాడు,
నిరంతరం
భగవన్నామస్మరణ
చేసేవాడు.
అతనిని
చూసి
పూజారి,
“అయ్యా!
మీరొకసారి
ఈ
తట్టను
ముట్టండి,”
అని
కోరాడు.
అందుకా
భక్తుడు,
‘నాకెలాంటి
ఆశలూ
లేవు.
ఆ
బంగారుతట్టతో
నాకు
పనిలేదు.
కాబట్టి,
నేను
దానిని
ముట్టను,”
అన్నాడు.
‘కనీసం
నా
తృప్తి
కొరకైనా
మీరు
దీనిని
ముట్టాలి,”
అని
పూజారి
అభ్యర్థించాడు.
సరే,
పూజారిని
అసంతృప్తిపరచడమెందుకని
అతడా
తట్టను
ముట్టాడు.
తక్షణమే
అది
మరింత
తేజోవంతముగా
ప్రకాశిస్తూ
వచ్చింది.
అక్కడున్న
ప్రజలు
ఆశ్చర్యచకితులై,
‘అయ్యా!
మీరు
ఎట్టి
పూజలు
చేస్తున్నారు?
3
▾
Meaning
Keep
His poems 324
Also in his talks
(12)
14 January 1988
Strive to recognise the oneness within the many!
31 October 1989
Do Your Duty as an Offering to God
24 May 1990
Hold the Reins
27 May 1991
Prasnopanishad - Answers To The Second And Third Students
5 October 1997
“Śarīramādyaṁ khalu dharmasādhanaṁ”
1 January 2000
Virtue is the adornment of man
12 April 2000
The Subtleties of Dharma in the Rāmāyaṇa
2 April 2003
Leave the delusion of the body; think of God
6 May 2004
Satisfying his mother is a son's first duty
6 May 2005
Only a son worthy of his mother's love can win God's grace
6 May 2006
If you love your parents, the whole world will love you
18 August 2006
Cast off the delusion of the body and foster attachment to God
ఏ
వ్రతము
నాచరిస్తున్నారు?
ఎలాంటి
సాధనలు
చేస్తున్నారు?’
అంటూ
అతనిపై
ప్రశ్నలవర్షం
కురిపించారు.
అప్పుడతను
చెప్పాడు,
‘నాయనలారా!
నేనెట్టి
జపముగాని,
తపముగాని,
యజ్ఞయాగాదులు
గాని
చేయడం
లేదు.
భగవంతునికి
బీదలంటే
ఎంతో
ప్రీతి.
కనుక,
నేను
బీదలకు
సేవ
చేస్తున్నాను.
జపతపాదులచేతగాని,
తీర్థయాత్రలచేతగాని
ముక్తి
లభించదు.
సంసార
సాగరమును
తరించాలంటే
సేవ
ఒక్కటే
మార్గం.’
ఈ
వింతను
చూసే
నిమిత్తం
అనేకమంది
శ్రీమంతులు
విశ్వేశ్వరాలయానికి
వచ్చారు.
శ్రీమంతులు
రావడంవలన
అనేకమంది
బీదవారు
కూడా
అక్కడికి
చేరుకున్నారు.
అక్కడ
చేరిన
బీదవారిని
చూసి
ఆ
పరమభక్తుడు,
‘భగవంతునికి
బీదలంటే
అమితమైన
ప్రేమ.
అందుకోసమే
ఇంతమంది
బీదవారిని
ఇక్కడికి
రప్పించుకున్నాడు.
ఇలాంటి
దీనులను,
దిక్కులేనివారిని
ఆదరించడమే
దైవానికి
ప్రీతి.
ఇదియే
నాకు
ప్రీతి.
బీదలను
ఆదరించి
ఆనందింపజేయడమే
నాకు
ఆనందము,”
అన్నాడు.
అతని
మాటలు
అక్కడ
చేరిన
శ్రీమంతులకు
కనువిప్పు
కల్గించాయి.
అనుగ్రహధనాన్ని
కూడబెట్టుకోవాలి
“లక్షాధికారైన
లవణమన్నమెగాని
మెరుగు
బంగారంబు
మ్రింగబోడు...
విత్తమార్జన
చేసి
విఱ్ఱవీగుటెగాని
కూడబెట్టిన
సొమ్ము
తోడరాదు...”
కాబట్టి,
డబ్బుకోసం
ప్రాకులాడే
బదులు
భగవంతుణ్ణి
ప్రార్థించండి.
హృదయపూర్వకంగా
భగవచ్చింతన
చేస్తే
మీకు
కావలసినవన్నీ
ఆయనే
అందిస్తాడు.
మీ
ప్రాప్తిని
మీరు
కాపాడుకోవాలి,
పుణ్యసంపదను
కూడబెట్టుకోవాలి.
జనని
గర్భమునుండి
జన్మించినప్పుడు
కంఠమాల
లవేవి
కానరావు
మంచిముత్యపు
సరుల్
మచ్చునకును
లేవు
మేల్మి
బంగరుదండ
మెడకు
లేదు
రత్నాల
హారముల్
రంజిల్లగా
లేవు
పచ్చలు
కెంపులు
పొదగ
లేదు
వజ్రాల
హారముల్
వర్ధిల్లగా
లేవు
గోమేధికంబులు
తోడ
లేవు
కలదు
కలదొక్క
మాల
మీ
కంఠమందు
ఎన్ని
చేసిన
అవియన్ని
ఎంచి
ఎంచి
మంచియైనను
చెడుగైన
త్రుంచకుండ
బ్రహ్మ
మీకిచ్చి
పంపును
బరువు
మాల
కర్మలన్నియు
చేర్చిన
కంఠమాల
4
▾
Meaning
Keep
ప్రతి
మానవుడు
తాను
చేసిన
మంచిచెడ్డలతో
కూర్చబడిన
కంఠమాలను
ధరించి
వస్తున్నాడు.
ఆ
మాల
లేకుండా
రావడానికి
ఎవ్వరికీ
వీలుకాదు.
కాని,
ఆ
సంగతి
మరచిపోయి
లోకసంబంధమైన
భోగభాగ్యములను
ఆశిస్తున్నాడు.
అవి
ఎంతకాలం
ఉండగలవు?
‘మాకురు
ధన
జన
యౌవన
గర్వం
హరతి
నిమేషాత్కాలస్సర్వం.’
కనుక,
దివ్యమైన,
భవ్యమైన
దైవానుగ్రహమనే
ధనమును
మనం
కూడబెట్టుకోవాలి.
ఈవిధమైన
బోధనలు
చేసి
ఆ
పరమ
భక్తుడు
విశ్వేశ్వరాలయమునుండి
బయటికి
అడుగుపెట్టాడు.
స్వార్థరహితప్రేమతో
కూడినదే
ఉత్తమ
ప్రార్థన
అతను
వెళుతూ
ఉంటే
ఆ
బంగారుతట్ట
కూడా
అతని
వెంట
వెళ్ళింది.
ఆ
తట్టతోపాటు
అనేక
కాసులు
కూడా
బయల్దేరినాయి.
వెంటనే
భిక్షగాళ్ళందరూ
అతని
వెనుక
వెళ్ళారు.
అప్పుడా
భక్తుడు,
‘నాయనలారా!
నన్నడిగితే
ప్రయోజన
మేమిటి?
భగవంతుడే
సర్వరక్షకుడు,
అందరినీ
మించిన
శ్రీమంతుడు.
కాబట్టి,
ఆయనను
మీరు
ప్రార్థించండి,’
అని
బోధించాడు.
అప్పుడా
తట్టనుండి
కాసులన్నీ
క్రిందపడిపోయాయి.
ఎవరెవరి
ప్రాప్తికొద్దీ
వారికి
లభ్యమైనాయి.
ఆ
దృశ్యాన్ని
చూసి
అతడు
ఆనందంగా
కళ్ళు
మూసుకున్నాడు.
అతనికి
విశ్వేశ్వరుడు
సాక్షాత్కరించాడు.
‘స్వామీ!
విశ్వేశ్వరా!
విశ్వమునకంతటికీ
ఈశ్వరుడవైన
నీకు
ఈ
బీదలను
రక్షించడం
చేతకాదా?
కరుణతో
వీరిని
కాపాడు,’
అని
ప్రార్థించాడు.
స్వార్థరహితమైన
ప్రేమతో
సర్వులను
రక్షించమని
కోరడం
ఉత్తమమైన
ప్రార్థన.
5
▾
Meaning
Keep
His poems 158
Also in his talks
(12)
6 October 1986
Serve the Lord of all in the form of society!
2 October 1988
Brahman Itself Is the Root Power of the World!
1 July 1996
Learning Without Practice Is Futile
27 August 1996
When the Anātma Is Removed, the Ātma Is Seen Everywhere
6 September 1996
Religion Is What Shows Forth the Oneness in Manyness
17 April 1998
Desires are the root of unrest
28 September 1998
The Five Elements Are the Very Forms of the Paramātma
25 December 1998
Those Who Spread God's Prema Are the True Messengers of God
9 October 2001
God in human form
12 March 2002
The worship of God protects the nation
25 December 2003
Give up the illusion of the body, and you yourself are God
11 February 2007
Prema for God is the divine medicine for every worry
అతని
పవిత్రమైన
ప్రార్థనకు
భగవంతుడెంతో
ఆనందించాడు.
ఎవరు
ప్రార్థన
చేసినప్పటికీ
అది
స్వార్థరహితమైనదిగా
ఉండాలి.
స్వార్థరహితమైన
ప్రార్థనయే
భగవంతుని
హృదయానికి
హత్తుకొనిపోతుంది.
భౌతికమైన
విషయాలను
లక్ష్యములో
పెట్టుకొని
ఎంత
ప్రార్థించినా
ప్రయోజనం
లేదు.
హృదయాన్ని
భగవదర్పితం
గావించాలి
నవవిధ
భక్తిమార్గములలో
ఆత్మనివేదనము
చిట్టచివరిది.
అదియే
నిజమైన
నివేదన.
అది
చేయకుండా
లోకసంబంధమైన
వస్తువాహనాదులు
అర్పితం
చేస్తే
అవి
భగవంతునికి
ఏమాత్రం
చెందవు.
ఏ
హృదయంబు
నొసగితివొ
ఈశ
నాకు
మగిడి
దానినే
అర్పింతు
మహితమూర్తి
పరగ
వేరేమి
తెత్తు
నీ
అర్చనకును?
అంజలి
ఘటింతు,
అందుకోవయ్య
నీవు!
భగవంతుడు
మీకు
ఏ
హృదయమును
ఇచ్చాడో
మరల
దానినే
భగవంతునికి
అర్పితం
చేయాలి.
మీరు
సంపాదించినది,
కూడబెట్టినది
భగవంతుడు
ఏమాత్రం
అంగీకరించడు.
మీరు
కూడబెట్టింది
భగవంతునికెందుకు?
భగవంతునికేమైనా
తక్కువ
ఉందా?
అతడు
విష్ణుస్వరూపుడు.
లక్ష్మీదేవి
తన
వక్షస్థలమునందే
ఉండగా
మీరిచ్చే
డబ్బు
ఏపాటిది!
పక్షివాహనుడైన
హరికి
లక్ష్మి
వక్షస్థలమునందే
ఉండగా
భిక్షమెత్తవలసిన
అవసరమేమున్నది?
కాబట్టి,
మీ
హృదయాన్ని
భగవంతుని
కివ్వాలి.
కాని,
ఈనాడు
భగవంతుడిచ్చిన
హృదయాన్ని
తిరిగి
భగవంతునికి
ఇవ్వడానికి
ఎవ్వరూ
సిద్ధంగా
లేరు.
తాము
కూడబెట్టినది
ఇస్తున్నారు.
అది
తుచ్ఛమైనటువంటిది,
అల్పమైనటువంటిది.
అలాంటి
దానిని
భగవంతుడు
కోరడు.
మీ
హృదయాన్ని
అర్పితం
చేయాలి.
అదే
‘అనాహత
ధర్మం’
అన్నారు.
దానిని
మనం
ధర్మం
చేయాలి.
మనం
పోషించవలసింది,
కూడబెట్టవలసింది
ఇదే!
ఈ
కలిప్రభావంచేత
భక్తిజ్ఞానవైరాగ్యములన్నీ
కృత్రిమంగా
జరిగి
పోతున్నాయి.
6
▾
Meaning
Keep
మానవుడు
పరుల
మెప్పుకోసం
పాటుపడుతున్నాడేగాని,
భగవంతుడు
మెచ్చుకొనే
పనులు
చేయడం
లేదు.
భగవంతుని
కేది
ఇష్టమో
అది
చేయాలి.
భగవంతునికేది
ఇష్టమో
అది
ఇవ్వాలి.
అట్లుగాకుండా,
కేవలం
మీ
ఇష్టాన్ని
మీరనుసరిస్తే
అది
భగవంతునికెట్లా
ఇష్టమౌతుంది?
భగవంతుడు
ఇష్టపడేది
ఒక్క
అనాహతప్రేమనే!
మీ
హృదయమే
తనకు
కావలసింది.
అదే
ఆనందనిలయము,
అదే
ప్రేమనిలయము.
అదే
సర్వమునకు
ఆధారము.
అట్టి
త్యాగమయమైన,
ప్రేమమయమైన,
ఆనందమయమైన
హృదయాన్ని
అర్పితం
చేయకుండా
కృత్రిమమైన
వస్తువులను
అర్పితం
చేస్తే
వాటిని
భగవంతుడు
పుచ్చుకోడు.
పుచ్చుకున్నట్లుగా
నటన
చేస్తాడుగాని,
దాన్ని
తీసిపారేస్తాడు.
బీదలకు
తగిన
సహాయం
చేయండి.
వాళ్ళు
చలితో
బాధ
పడుతుంటే
కప్పుకోవడానికి
బట్ట
ఇవ్వండి.
వాళ్ళ
కేది
అవసరమో
అది
ఇవ్వండి.
అంతేగాని,
మీకిష్టమైనది
మీరిస్తూపోతే,
అది
భగవంతునికి
ఇష్టం
కాదు.
‘ఈ
అబ్బాయిలో
మహత్తరమైన
శక్తి
ఉన్నది’
ఆరోజుల్లో
మేము
బుక్కపట్నం
స్కూలునుండి
తిరిగి
వచ్చిన
తరువాత
ఈశ్వరమ్మ
పిల్లలందరినీ
కూర్చోబెట్టుకొని,
‘నాయనలారా!
ఈపొద్దు
స్కూల్లో
ఏమి
జరిగింది?’
అని
అడిగేది.
ఒక
పిల్లవాడు,
‘అమ్మా!
ఈరోజు
ఒక
టీచరు
మన
రాజును
బెంచి
ఎక్కించాడు,’
అన్నాడు.
పిల్లలందరూ
ఆయనను
విమర్శిస్తుంటే,
‘బాబూ!
మీ
టీచరును
మీరట్లా
అనకూడదు.
మన
‘సత్యం’
ఏదో
తప్పు
చేసి
ఉంటేనే
ఆయన
అట్లా
చేసి
ఉంటాడు.
గురువు
తన
శిష్యులను
నిష్కారణంగా
శిక్షించడు,’
అన్నది.
‘సత్యా!
నీవేమి
తప్పు
చేశావు?’
అని
నన్నడిగింది.
అప్పుడు
నేను
జరిగింది
జరిగినట్లు
చెప్పాను.
‘నేను
చెప్పిన
నోట్సు
ఎవరు
వ్రాసుకున్నారో
వాళ్ళు
తెచ్చి
టేబుల్‌పై
పెట్టండి.
వ్రాసుకోనివారు
బెంచి
ఎక్కి
నిలబడండి,’
అని
ఆయన
ఆదేశించాడు.
నేను
వ్రాసుకోలేదు
కాబట్టి,
బెంచి
ఎక్కి
నిలబడ్డాను.
‘సార్!
నేను
నోట్సు
వ్రాసుకోలేదు
గాని,
మీరడిగే
ప్రశ్నలకు
జవాబివ్వగలను,’
అన్నాను.
‘ఓహో,
నీకింత
అహంకారమా!’
అని
నన్ను
మూడు
పిరియడ్లు
బెంచిమీద
అలాగే
నిలబడ
మన్నాడు.
ఇంతలో
మహబూబ్‌ఖాన్
అనే
టీచరు
అటువైపు
వచ్చాడు.
7
▾
Meaning
Keep
ఆయన
చాలా
ఉత్తమచిత్తుడు.
నేను
బెంచిమీద
నిలబడి
ఉండడాన్ని
చూసి,
‘ఈ
అబ్బాయిని
ఎందుకు
బెంచి
ఎక్కించావు?’
అని
ఆ
టీచర్ని
అడిగాడు.
‘నోట్సు
వ్రాసుకోలేదు,’
అన్నాడాయన.
‘నిజమే
కావచ్చుగాని,
నీవు
ఏ
ప్రశ్న
అడిగినా
అతను
జవాబివ్వ
గలడు.
కాబట్టి,
వెంటనే
అతనిని
బెంచి
మీదినుండి
దించు.
నీవు
చేసిన
పని
తప్పు,’
అన్నాడు
మహబూబ్‌ఖాన్.
కాని,
ఆ
టీచరు
అంగీకరించలేదు.
ఇంతలో
గంట
కొట్టారు.
ఆయన
ఇంకో
క్లాసుకి
వెళ్ళడానికి
కుర్చీనుండి
లేవబోయాడు.
కాని,
లేవలేకపోయాడు.
తన
పంచెకేదైనా
మేకు
తగులుకుందేమోనని
చూశాడు.
ఏమీ
లేదు.
తాను
కుర్చీకి
కరుచుకొనిపోవడంచేత
లేవడానికి
సాధ్యం
కావడం
లేదు.
అప్పుడు
మహబూబ్‌ఖాన్,
‘మనం
ఇతరులను
నిష్కారణంగా
శిక్షించ
కూడదు.
ఆ
అబ్బాయి
నీకు
సామాన్యమైన
బాలునిగా
కనిపిస్తున్నాడుగాని,
అతనిలో
మహత్తరమైన
శక్తి
ఉన్నది.
ఇకనైనా
అతనిని
కూర్చొమ్మని
చెప్పు,’
అన్నాడు.
అప్పుడా
టీచరు
నన్ను
చూసి,
‘సిట్
డౌన్’
అన్నాడు.
మరుక్షణమే
తాను
కుర్చీనుండి
లేవగల్గాడు.
ఈ
సంఘటన
గురించి
పిల్లలు
చెప్పగా
విని
ఈశ్వరమ్మ,
‘సత్యం!
నీవు
గురువును
ఆవిధంగా
శిక్షించవచ్చునా?’
అని
అడిగింది.
‘నేనేమీ
ఆయనను
శిక్షించలేదు.
తనను
తానే
శిక్షించుకున్నాడు,’
అని
చెప్పాను.
ఈశ్వరమ్మ
పిల్లలతో,
‘నాయనలారా!
మీరంతా
స్కూలుకి
వెళ్ళి
చదువు
నేర్చుకుంటున్నారు.
మీరు
చదివే
చదువును
సద్వినియోగపరచుకోవాలి.
మీరు
ఉత్తమ
విద్యావంతులుగా
తయారై
‘సాక్షర’
అనే
బిరుదును
సంపాదించుకోవాలి.
మీ
విద్యను
సద్వినియోగం
చేయకపోతే
‘సాక్షర’
అనేది
‘రాక్షస’
అయిపోతుంది,’
అని
చెప్పింది.
నాకొక
మాట
చెప్పింది,
‘నాయనా!
నీవు
ఎలాంటి
పరిస్థితి
యందైనా,
ఎలాంటి
వ్యక్తినైనా
ద్వేషించకు.
అందరినీ
ప్రేమించు.
అప్పుడే
నిన్ను
అందరూ
ప్రేమిస్తారు.’
ప్రేమ
అనేది
‘వన్
వే
ట్రాఫిక్’
కాదు.
మనం
ఇతరులను
ప్రేమించినప్పుడే
ఇతరులు
మనల్ని
ప్రేమిస్తారు.
నేను
అందరినీ
ప్రేమిస్తున్నాను.
కనుకనే,
అందరూ
నన్ను
ప్రేమిస్తున్నారు.
ప్రేమను
ఇవ్వాలి,
ప్రేమను
పుచ్చుకోవాలి.
ఈశ్వరమ్మ
తరచుగా
ఇట్టి
పవిత్రమైన
విషయాలను
బోధిస్తూ
ఉండేది.
8
▾
Meaning
Keep
పవిత్రమైన
బోధనలు
చేయడానికి
చదువులక్కర్లేదు.
ఈనాడు
ఎంతోమంది
గొప్ప
చదువులు
చదువుతున్నారు.
కాని,
ప్రయోజనమేమిటి?
ఆచరణలో
శూన్యం.
ఇన్ని
చదువులు
చదివినందుకు
ఒక్కటైనా
ఆచరణలో
పెట్టాలి.
మీరెంతో
భక్తిగా
పూజలు
చేస్తున్నారు,
భజనలు
చేస్తున్నారు.
ఆ
భజనలో
ఒక్క
పదమునైనా
అర్థము
చేసుకొని
ఆచరణలో
పెడితే
చాలు.
ఉదాహరణకు,
భగవంతుడు
ప్రేమస్వరూపుడని
కీర్తిస్తున్నారు.
ఆ
ప్రేమను
మీరు
కొంతైనా
ఆచరణలో
పెట్టి
అనుభవించండి.
నేను
ప్రశాంతి
నిలయంలో
ఈశ్వరమ్మకు
ఒక
చిన్న
రూమ్
ఇచ్చి
ఉంటిని.
భక్తులు
ఆమె
రూమ్‌కి
పోయేవారు.
ఆమె
వారిని
ప్రేమతో
పలుకరించేది.
వారికెన్నో
పవిత్రమైన
విషయాలను
బోధించేది.
అనేకమంది
ఆడవారు
ఆమెవద్దకి
వెళ్ళి,
‘అమ్మా!
మేమిక్కడికి
వచ్చి
చాలా
దినాలైంది.
మావద్ద
ఉన్న
డబ్బు
ఖర్చైపోతున్నది.
దయచేసి
మీరు
స్వామికి
చెప్పి
మాకు
ఇంటర్వ్యూ
ఇప్పించండి,’
అని
ప్రాధేయపడేవారు.
ఆమె
వారికి
ఒకే
ఒక
జవాబు
చెప్పేది,
‘అమ్మా!
స్వామి
చూడడానికి
చిన్నవారేగాని,
నేను
చెప్పినా,
మీరు
చెప్పినా,
ఇంకెవ్వరు
చెప్పినా
వినరు.
మీమీ
ప్రాప్తిని
బట్టి
మీకు
జరుగుతుంది.
మొట్టమొదట
మీరు
స్వామి
తత్త్వాన్ని
గుర్తించుకోండి.’
ఒకపర్యాయం
ఈశ్వరమ్మ
నాతో
మాట్లాడుతూ,
‘సత్యం!
నీవు
ఎంతో
గొప్ప
పేరుపొందినావు.
ఈనాడు
ప్రపంచమంతా
నీదగ్గరికి
వస్తున్నది.
నీ
సంకల్పముతో
ప్రపంచమంతటికీ
శాంతిని
ప్రసాదించవచ్చు
కదా,’
అన్నది.
అప్పుడు
నేను
చెప్పాను
-
‘ప్రపంచశాంతికి
నేను
సంకల్పించడం
కాదు.
ఎవరికి
వారే
శాంతిని
పొందాలి.
మానవుడే
శాంతిస్వరూపుడు,
సత్యస్వరూపుడు,
ప్రేమస్వరూపుడు.
కాబట్టి,
తన
సత్యాన్ని
తాను
ఆచరించాలి.
తన
శాంతిని
తాను
పొందాలి.
తన
ప్రేమను
తాను
అనుభవించాలి.
‘సత్యం
వద,
ధర్మం
చర’
ఈ
రెండింటినీ
ఆచరణలో
పెడితే
చాలు,
అన్నీ
మనకు
లభ్యమౌతాయి.’
దేశభవిష్యత్తు
తల్లులపైనే
ఆధారపడి
ఉంది
పిల్లలకు
ఇట్టి
సద్బోధలు
చేసి
వారిని
ఆదర్శప్రాయులుగా
తీర్చిదిద్దిన
తల్లులు
ఆనాటినుండి
ఈనాటివరకు
భారతదేశంలో
ఎందరో
ఉన్నారు.
9
▾
Meaning
Keep
దేశభవిష్యత్తు
తల్లులపైనే
ఆధారపడి
ఉన్నది.
కనుకనే,
దీనిని
‘మదర్లేండ్’
అన్నారు.
లేకపోతే
‘ఫాదర్లేండ్’
అనవచ్చు
కదా!
మొదలు
తల్లి,
తరువాతనే
తండ్రి.
మనం
ఎవరికైనా
ఇన్విటేషన్
పంపించేటప్పుడు
కవరుమీద,
‘శ్రీమతి
అండ్
శ్రీ’
అని
అడ్రసు
వ్రాస్తాము.
మగవాడు
ఎంత
గొప్ప
విద్యావంతుడైనా
ఫరవాలేదు.
అతడు
దేశానికి
ప్రెసిడెంటే
కావచ్చు.
అయినప్పటికీ
అతనికి
పంపే
కవరుమీద
‘శ్రీ
అండ్
శ్రీమతి’
అని
ఎవ్వరూ
వ్రాయరు.
‘శ్రీమతి
అండ్
శ్రీ’
అనే
వ్రాస్తారు.
ప్రాచీనకాలమునుండి
స్త్రీలకు
అంత
గొప్ప
విలువ
నిచ్చారు.
మీరు
ఎన్ని
విద్యలు
నేర్చినా,
ఎన్ని
సత్కర్మలు
ఆచరించినా
తల్లిని
సంతోషపెట్టకపోతే
అవన్నీ
వ్యర్థమైపోతాయి.
తల్లిని
సంతోషపెట్టి,
తల్లిప్రేమకు
పాత్రుడైనవాడే
నిజమైన
పుత్రుడు.
కనుక,
తల్లిని
గౌరవించండి.
తల్లిప్రేమను
అందుకోండి.
తల్లికి
మీ
జీవితాన్ని
అర్పితం
చేయండి.
‘మాతృదేవో
భవ,
పితృదేవో
భవ,
ఆచార్యదేవో
భవ,
అతిథిదేవో
భవ’
అని
వేదము
కూడా
మాతృదేవికే
ప్రథమస్థానము
నందించింది.
కుమారుడు
ఎంతటి
దుర్మార్గుడైనప్పటికీ
తల్లి
వానిని
ప్రేమిస్తుంది.
వ్యక్తిగతంగా
కొన్ని
భేదాభిప్రాయములు
ఏర్పడినప్పటికీ
కుమారునిపట్ల
ప్రేమ
తరిగిపోదు.
ప్రతి
వ్యక్తి
తన
తల్లిని
తప్పక
గౌరవించాలి.
తెల్లవారి
లేస్తూనే
ఆమె
పాదములు
పట్టి
నమస్కారము
చేయాలి.
అప్పుడే
తాను
అన్నివిధాలుగా
రక్షింపబడతాడు,
సమస్త
సిరిసంపదలను
అందుకోగల్గుతాడు.
ఈనాడు
మనం
‘ఈశ్వరమ్మ
డే’ని
జరుపుకుంటున్నాము.
ఈశ్వరమ్మకు
పిల్లలంటే
ఎనలేని
ప్రేమ.
ఒక
చిన్న
ఉదాహరణ
చెబుతున్నాను.
పూర్వం
సమ్మర్
క్లాసుల్లో
పాల్గొనడానికి
అన్ని
రాష్ట్రాలనుండి,
అన్ని
దేశాలనుండి
విద్యార్థులు
వచ్చేవారు.
గొప్ప
గుణవంతుడు,
విద్యావంతుడు,
త్యాగశీలియైన
గోకాక్
సమ్మర్
క్లాసులను
చక్కగా
జరుపుతూ
ఉండేవాడు.
ఆయన
చాలా
Strictగా
ఉండేవాడు.
ఒకనాడు
పిల్లలందరూ
భోజనం
చేస్తున్న
సమయంలో
ఒక
పిల్లవాడు
మధ్యలో
లేచిపోయాడు.
గోకాక్
కిటికీనుండి
చూసి
తక్షణమే
ఆ
పిల్లవానిని
పిలిచి
మందలించాడు.
‘నీ
తోటి
బాలురంతా
భోజనం
చేస్తున్న
సమయంలో
నీది
అయిపోయినా
నీవు
లేవకూడదు.
ఆ
పంక్తిలో
అందరిదీ
అయిపోయిన
తరువాతనే
నీవు
లేవాలి.
మిగతావారంతా
తింటూ
ఉండగా
నీవు
లేచిపోతే
వారిని
అగౌరవ
పరచినట్లవుతుంది,’
అని
చెప్పి
ఆనాడు
వానిని
క్లాసులనుండి
సస్పెండ్
చేశాడు.
10
▾
Meaning
Keep
వాడెంత
ఏడ్చినా
ఆయన
మనస్సు
కరుగలేదు.
వాడు
లోపలికి
వచ్చి
ఈశ్వరమ్మ
పాదాలపై
పడ్డాడు.
‘ఎందుకు
నాయనా
ఏడుస్తున్నావు?’
అని
అడిగింది.
‘అమ్మా!
గోకాక్గారు
నన్ను
క్లాసుల
నుండి
సస్పెండ్
చేశారు,’
అని
చెప్పాడు.
‘నీవు
ఏడ్వకు.
నేను
ఆయనతో
మాట్లాడతాను,’
అని
చెప్పి
ఆమె
గోకాక్
వచ్చేదారిలో
కూర్చుంది.
ఆయన
అటువైపు
వస్తూనే,
‘నమస్కారమండీ
గోకాక్,’
అన్నది.
‘నమస్కారం
ఈశ్వరమ్మగారూ!’
అన్నాడాయన.
అప్పుడామె
చెప్పింది
-
‘నేను
మీకు
నమస్కార
మని
చెప్పినప్పుడు
మీరు
కూడా
నాకు
నమస్కారమని
చెప్పారు
కదా!
అదేవిధంగా,
మీరు
ఇతరులను
శిక్షిస్తే
ఆ
శిక్ష
తిరిగి
మీకూ
వస్తుంది.
ఆ
పిల్లవాడు
తెలిసో,
తెలియకో
తప్పు
చేశాడు.
వాడిని
క్షమించండి.’
అప్పుడు
గోకాక్,
‘క్షమిస్తే
పిల్లలంతా
చెడిపోతారమ్మా!
అయినా
మీరడిగారు
కాబట్టి,
వానిని
క్షమించి
క్లాసులకు
అనుమతిస్తాను,’
అన్నాడు.
ఆవిధంగా,
ఈశ్వరమ్మ
అందరికీ
సహాయ
పడుతూ,
ఎంతో
పవిత్రమైన
కార్యాలు
చేస్తూ
వచ్చింది.
మనమీనాడు
ఏమి
చేస్తున్నామో
రేపు
మనకు
అదే
ఫలితము
లభిస్తుంది.
మనం
ఇతరుల
నుద్దేశించి
చెడ్డమాటలు
మాట్లాడితే
అవి
తిరిగి
మనకే
‘రీసౌండ్’గా
వస్తాయి.
మనం
ఎవరినైనా
హింసిస్తే
అది
తిరిగి
మనకే
‘రిఫ్లెక్షన్’గా
వస్తుంది.
కనుక,
ఎవరికీ
మనం
హాని
కలిగించకూడదు.
మంచిని
చూడాలి,
మంచిని
చెప్పాలి,
మంచిని
చేయాలి.
అప్పుడు
మనకంతా
మంచే
జరుగుతుంది.
ఈశ్వరమ్మ
చదువుకోలేదుగాని,
ఆమెకు
ఇలాంటి
విషయాలు
బాగా
తెలుసు.
ఆనాడు
ఆమె
గావించిన
హితబోధను
గోకాక్
తన
మనస్సులో
పదిలంగా
పెట్టుకున్నాడు.
తరువాత
ఆయన
పుట్టపర్తికి
వైస్
ఛాన్స్‌లర్‌గా
వచ్చినప్పుడు
ఆమెను
నిత్యం
తలుచుకునేవాడు
పాపం!
‘స్వామీ!
ఈశ్వరమ్మగారు
నిత్యం
స్వప్నంలో
వచ్చినట్లుగా
ఉంటున్నది.
ఆమె
చెప్పిన
మాటలను
నేను
తు.చ.
తప్పక
నడుచుకుంటున్నాను,’
అనేవాడు.
ఎవ్వరినీ
దూషించకూడదు,
హింసించకూడదు,
పరిహసించకూడదు.
అందరినీ
ప్రేమించాలి.
ఇవే
మాటలను
ఈశ్వరమ్మ
అందరికీ
చెబుతూ
ఉండేది.
ఎవరైనా
సరే,
పెద్దలు
చెప్పిన
విషయాలను
మనం
ఆచరణలో
పెట్టాలి.
11
▾
Meaning
Keep
రాముడిలా
చెప్పాడు,
కృష్ణుడిలా
చెప్పాడు,
అని
మీరంటూ
ఉంటారు.
కృష్ణుడు
చెప్పాడా,
రాముడు
చెప్పాడా
అనేది
ముఖ్యం
కాదు.
ఏమి
చెప్పారు,
ఎట్లా
చెప్పారు,
ఏ
సందర్భంలో
చెప్పారు,
ఎందుకు
చెప్పారు
అనే
విషయాలను
మాత్రం
మరచిపోకుండా
మనస్సులో
పెట్టుకోవాలి.
వారు
చెప్పిన
మాటలను
మీరు
తు.చ.
తప్పక
అనుసరిస్తే
మీకెంతో
ఉత్తమగతి
ప్రాప్తిస్తుంది.
తల్లి
చెప్పిన
మాటలను
చాలామంది
అలక్ష్యం
చేస్తుంటారు.
ఇది
చాలా
తప్పు.
తల్లులు
హృదయ
పూర్వకంగా
తమ
పిల్లల
బాగుకోరి
హితబోధలు
చేస్తుంటారు.
వాటిని
అర్థం
చేసుకోకుండా
అలక్ష్యం
చేస్తే
అధోగతి
తప్పదు.
విద్యార్థినీ
విద్యార్థులారా!
భవిష్యత్తులో
మీరు
కూడా
తల్లులు,
తండ్రులు
కాబోతున్నారు.
ఇప్పుడు
మీ
తల్లిదండ్రులను
మీరు
గౌరవించినప్పుడే
భవిష్యత్తులో
మీ
పిల్లలు
మిమ్మల్ని
గౌరవిస్తారు.
మీరు
ఏది
చేసినా
దాని
‘రియాక్షన్,
రీసౌండ్,
రిఫ్లెక్షన్’లు
మీకే
తిరిగి
వస్తాయి.
కనుక,
తల్లిదండ్రుల
ఆజ్ఞను
శిరసావహించండి.
మీకు
సమస్తవిద్యలూ
లభ్యమౌతాయి,
సర్వశక్తులూ
చేకూరుతాయి.
మీ
కర్తవ్యాన్ని
నిర్వర్తిస్తూ,
తల్లి
దండ్రుల
మాటలను
ప్రేమతో
అనుసరిస్తూ
మీ
జీవితాలను
ధన్యం
చేసుకొని
భవిష్యత్తులో
మీ
బిడ్డలకు
సరియైన
ఆదర్శం
అందిస్తారని
ఆశిస్తూ,
ఆశీర్వదిస్తూ
నా
ప్రసంగాన్ని
విరమిస్తున్నాను.
Previous
←
Ancient traditions are the steps to rising higher
Next
That is education which liberates
→