Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1997 · The principle of the Ātma and divinity
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
The principle of the Ātma and divinity
17 July 1997, Youth conference, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
His poems 277
Also in his talks
(5)
25 February 1982
Prema and Śānti
6 March 1989
God is the embodiment of Prema
28 July 1992
To love God for God's own sake: that alone is true Bhakti
2 September 1992
Teaching equal-mindedness is the chief aim of Divinity
23 November 1996
We Must Make Human Life a Life Full of Prema
ప్రేమస్వరూపులారా!
మానవునికి
గర్వముండినంతకాలము
ఎవరూ
అతనిని
ప్రేమించరు.
కడకు
భార్యాబిడ్డలు
కూడా
ప్రేమించరు.
ఈ
ప్రేమ
దూరము
కావటానికి
మూలకారణము
అహంకారము.
కనుక,
ఇతరులు
ప్రేమించాలని
ఆశించే
మానవుడు
మొదట
తన
గర్వమును
నిర్మూలనము
చేయాలి.
క్రోధముండినంతవరకు
ఆ
మానవునకు
దుఃఖము
తప్పునది
కాదు.
ఏనాడు
మానవుడు
తన
క్రోధమును
నిర్మూలనము
గావించుకొనునో
ఆనాడే
అతనికి
సుఖము.
ఆశలుండినంత
కాలము
అతను
దరిద్రుడుగానే
రూపొందుతాడు.
ఆశలు
ఏనాడు
తాను
తగ్గించుకొనునో
అప్పుడే
అతనికి
సర్వసంపదలు
చేకూరుతాయి.
మానవుడు
సుఖముగా
జీవించవలెనన్న
లోభత్వమును
నిర్మూలము
గావించాలి.
అప్పుడే
మానవుడు
సుఖజీవనము
అనుభవిస్తాడు.
మానవుడు
కర్మక్షేత్రయాత్రికుడు
ప్రేమస్వరూపులారా!
ఒక
పదార్థము
మరొక
పదార్థముతో
చేర్చవలెనన్న
ఒక
వ్యక్తి
మరొక
వ్యక్తితో
చేరవలెనన్న
ప్రేమయే
ప్రధానము.
ప్రపంచమంతయూ
ప్రేమ
పైనే
ఆధారపడి
ఉన్నది.
ప్రేమ
లేని
జగత్తు
లేదు.
ఈ
ప్రేమ
భగవత్స్వరూపము.
అట్టి
ప్రేమ
స్వరూపుడైన
పరమాత్ముడు
సర్వుల
హృదయమందు
ప్రేమ
స్వరూపుడుగానే
ఉంటున్నాడు.
దీనిని
పురస్కరించుకొనియే
‘లోకాస్సమస్తా
సుఖినో
భవంతు’.
అందరూ
సుఖముగా
ఉండాలనే
ప్రార్థన
చేస్తూ
వచ్చారు.
ప్రాచీన
కాలమందు
మహర్షులు
లోకక్షేమ
నిమిత్తమై
అనేక
త్యాగములు
గావిస్తూ
వచ్చారు.
లోకశాంతి
నిమిత్తమై
తమ
సర్వస్వమును
త్యాగము
చేస్తూ
వచ్చారు.
అట్టి
త్యాగమునకు
గురికావటం
చేత
వారి
కీర్తి
జగద్వ్యాప్తి
పొందినది.
ఆనాటి
మహర్షుల
తత్త్వము,
యువకుల
యొక్క
తత్త్వము
త్యాగము,
యోగము.
కానీ,
నేటి
జీవితము
భోగము,
రోగము.
ఈ
రెండింటితో
తృప్తి
పడటం
కాదు.
కేవలం
పిచ్చి
పిచ్చి
భావములు
చేరుతుంటాయి.
కనుక,
భోగ
భావముల
చేత
కూడిన
రోగులుగా
తయారౌతున్నారు.
మానవుడు
కర్మక్షేత్ర
యాత్రికుడు.
ఈ
క్షేత్రమును
దర్శించుటకు
వెళ్లినప్పుడు
కొన్ని
ఖర్చుల
నిమిత్తము
ధనము
తీసుకు
వెడతాడు
మానవుడు.
కానీ,
క్షేత్రము
చేరిన
తరువాత
ధనమును
కాపాడుకొనే
నిమిత్తమై
అనేకవిధములుగా
విచారము
చేస్తుంటాడు.
కడపటికి
తనకు
ఒక
నమ్మకమైన
మిత్రుడు
చిక్కినప్పుడు
అతనికి
ఈ
ధనమునిచ్చి
హాయిగా
క్షేత్రమును
దర్శిస్తుంటాడు.
ప్రతి
మానవుడు
జన్మతో
ప్రేమ
అనే
ధనమును
తీసుకొని
వస్తున్నాడు.
ఈ
ప్రేమ
జన్మించిన
తరువాత
లభ్యమయ్యేది
కాదు.
జననముతోబాటు
ప్రేమ
కూడా
జన్మిస్తుంది.
కానీ,
ఈ
కర్మక్షేత్రమనే
దేహమునందు
ఈ
ప్రేమ
అనే
ధనమును
కాపాడుకోటం
చాలా
కష్టముగా
ఉంటుంది.
కనుక,
ప్రతి
మానవుడు
ప్రధానమైన,
నమ్మకమైన
మిత్రుని
వెతకాలి.
ఆ
మిత్రుడే
దేవుడు.
అట్టి
నిజమైన
మిత్రుని
సంపాదించుకొని
తన
ప్రేమ
ధనమును
ఆ
మిత్రుని
చేతికందించినప్పుడు
శాంతిగా,
సుఖముగా
జీవించుటకు
వీలవుతుంది.
లోకములో
హృదయమునకు
మించిన
బోధకుడు
లేడు.
హృదయమే
బోధకుడు.
కాలమే
టీచరు.
ప్రపంచమే
ఒక
పెద్ద
గ్రంథము.
భగవంతుడే
గొప్ప
మిత్రుడు.
ఈ
నాల్గింటిని
విశ్వసించి
మానవుడు
ఈ
కర్మక్షేత్రములో
అన్నివిధముల
జీవించుటకు
ప్రయత్నించాలి.
ప్రతి
మానవ
జీవిత
వృక్షమందు
ఆవిర్భవించే
ఫలము
ప్రేమ.
అయితే
ఆ
ప్రేమ
ఫలము
భుజించవలెనన్న
దీనికి
కొన్ని
అభ్యంతరములు
వస్తున్నాయి.
భుజించుటకు
పూర్వము
ఫలమునకు
పైనున్న
తోలును
తీసివెయ్యాలి.
ప్రతి
ఫలమునకు
పైన
చర్మము
కప్పి
ఉంటుంది.
ఆ
తోలును
తీసివేసినప్పుడే
ఆ
ఫలములోని
మధుర
రసము
మనము
గ్రోలవచ్చు.
ఈ
ప్రేమ
ఫలమునకు
అహంకారమనే
చర్మము
కప్పబడి
ఉంది.
ఆ
అహంకారమనే
చర్మము
తీసివేసి,
నేను
నాది
అనే
అభిమానమమకారములనే
విత్తనములు
తీసివేసినప్పుడే
మధురమైన
రసము
గ్రోలుటకు
వీలవుతుంది.
రసస్వరూపుడే
భగవంతుడు.
స్వార్థప్రేమ,
అన్యోన్యప్రేమ,
పరార్థప్రేమ
ప్రేమరూపంబు
బ్రహ్మంబు
ప్రేమమయము
ప్రేమ
ప్రేమతొ
సంధింప
నీమమగును
కాన
ప్రేమను
గట్టిగా
కల్గియున్న
అద్వితీయమునొందగ
అర్హుడగును.
ఏకత్వము
పొందుటకు
ఈ
పవిత్రమైన
ప్రేమతత్త్వమే
రాజమార్గము.
మానవ
జీవితము
వ్యక్తి
అనే
గ్రామము
నుండి
సమష్టి
అనే
పట్టణము
చేరటానికే
ప్రయాణము.
2
▾
Meaning
Keep
Also in his talks
(5)
24 November 1990
Share in Bhagavan's love
22 September 1996
Though Forms and Names Differ, the Principle of Brahman Is One!
14 January 1998
Satya is heaven
11 October 1998
Human Life Is the Fruit of Our Resolves
5 April 2000
The Body Is the Temple, the Jīva Is God
అంతేకాదు.
‘సం’
అనే
పదమునుండి
‘సోహం’
అనే
గ్రామమునకు
చేరటమే
ఈ
మానవ
జీవితము.
తాము
చేసే
సమస్త
కర్మలు
భగవత్ప్రీత్యార్థమనే
భావమే
ఇతని
లక్ష్యము.
కానీ,
ఈనాటి
మానవుడు
ప్రయాణం
ఎక్కడికి
చేస్తున్నాడు?
‘నేను’
అనే
స్థానమునుండి
తిరిగి
‘నేను’
అనే
స్థానమునకు
చేరుతున్నాడు.
ఈ
స్వార్థమే
ఈ
మానవత్వమును
యింత
బలహీనత
గావిస్తున్నది.
కనుక,
ఈ
స్వార్థమును
మనము
నిర్మూలము
చేయాలి.
స్వార్థమును
మనము
ఏనాడు
నిర్మూలము
చేస్తామో
ఆనాడే
మన
ప్రయాణము
సక్రమంగా
జరుగుతుంది.
ఈ
ప్రేమను
మూడు
విధములైన
మార్గములలో
మనం
దర్శిస్తున్నాము.
స్వార్థప్రేమ,
అన్యోన్యప్రేమ,
పరార్థప్రేమ
అని
మూడు
విధములు.
నేను
నిరంతరమూ
సుఖమును
అనుభవించాలి.
సర్వసౌఖ్యములు
నేను
పొందాలి,
మిగిలిన
వారి
సంగతి
నాకు
అక్కరలేదు.
వారేమైపోయినా
నేను
క్షేమంగా
ఉండాలి
అని
ఆశించటము
స్వార్థము
యొక్క
తత్త్వము.
అన్యోన్య
ప్రేమ
అనేది
తాను,
తనకు
సంబంధించిన
బంధువులు,
మిత్రులు
అందరూ
క్షేమంగా
ఉండాలి.
కానీ,
పరార్థప్రేమ
అట్టిది
కాదు.
అందరూ
సుక్షేమంగా
ఉండాలి.
దీనికి
మూడు
రకములైన
ఉపమానములు.
స్వార్థప్రేమ
అనేది
ఒక
గదిలో
వేసిన
బల్బు
వంటిది.
బల్బునుండి
వచ్చే
వెలుతురు
ఆ
రూముకు
మాత్రమే
పరిమితమై
ఉంటుంది.
కనుక,
స్వార్థమైనది.
తన
హృదయమునకు
సంబంధించిన
తత్త్వము
మాత్రమే
ప్రకాశమును,
ప్రభావమును
చేకూరుస్తుంది.
ఇది
ప్రేమ
అని
అనిపించుకోదు.
ఇంక
అన్యోన్యప్రేమ.
ఇది
చంద్రుని
వెన్నెల
వంటిది.
అన్నివైపులా
ప్రకాశమునందిస్తుందిగానీ
అంత
స్పష్టముగా
ఉండదు.
మసకగా
ఉంటుంది.
కొంత
సందేహాస్పదము
కలిగిస్తుంది.
ఆ
వెన్నెలలో
త్రాడును
చూచి
పామని
భ్రమించటము,
మొద్దు
చెట్టును
చూచి
మనిషియని
భ్రమించటము.
ఇలాంటి
కొన్ని
భ్రమలతో
కూడి
ఉంటుంది
ఈ
ప్రేమ.
అనగా
మంచివారిని
చూచి
చెడ్డవారిగా
భావించటము,
మంచిని
చూచి
చెడ్డగా
తలచటము,
పవిత్రమును
చూచి
అపవిత్రముగా
భావించటము
ఇవన్నీ
జరుగుతుంటాయి.
వెన్నెలలో
లైటున్నదిగాని
అంత
ప్రకాశము
లేదు.
పరార్థప్రేమ
అనేది
సూర్యప్రకాశము
వంటిది.
సర్వత్ర
సుక్షేమంగా
అనుభవింపచేసి,
సుస్పష్టముగా
గోచరము
గావిస్తుంది.
కనుక,
ఈనాడు
మనము
అన్యోన్యప్రేమ
కంటే
పరార్థప్రేమను
పొందటమే
పవిత్రమైన
దివ్య
జీవితము
పొందుటకు
మార్గము.
నిర్మల
నిశ్చల
నిస్వార్థమైన
దైవత్వముపై
సందేహములు
కలిగిస్తుంది
ఈ
అన్యోన్యప్రేమ.
అది
కేవలము
వెన్నెలగా
ఉంటుంది.
సందిగ్ధావస్థలో
నున్న
మానవత్వమే
యిలాంటి
సందేహములకు
అవకాశము
నందిస్తుంది.
బాహ్య
చేష్టలు
చూచి
భ్రమిస్తుంది.
చెడ్డవారి
మాటలు
అతి
తీయగా
ఉంటాయి.
వారిని
విశ్వసిస్తారు.
మంచి
మాటలు
కొంచెం
కఠినముగా
ఉంటాయి.
కానీ,
అవి
మధురమైన
తత్త్వమునే
అందిస్తాయి.
వర్షము
కురిసే
సమయంలో
వడగళ్ళు
కూడా
పడతాయి.
అయితే
ఈ
మంచుగడ్డలు
దెబ్బలనందిస్తాయి.
వర్షబిందువులు
మనకు
యేమాత్రమూ
ప్రమాదము
కల్గించవు.
మంచుగడ్డలో
నున్నది
కూడా
నీటితత్త్వమే.
భగవంతుని
ప్రేమ
అప్పుడప్పుడు
మంచుగడ్డవలె
కొంచెము
బాధకలిగిస్తుంది.
అదికూడా
ప్రేమ
రసమైన
జలమే.
ప్రతి
మానవుడు
భగవత్తత్త్వమును
పరిపూర్ణముగా
విశ్వసించి
తద్వారా
జీవించుటకు
ప్రయత్నించాలి.
ప్రేమయే
దైవము,
దైవమే
ప్రేమ.
ప్రేమలోనే
మనము
జీవించుటకు
ప్రయత్నించాలి.
వ్యావహారిక
పారమార్థిక
ప్రేమల
తేడా
అయితే
సామాన్య
మానవులు
పరులయందున్న
చిన్న
దోషములనైనా
పెద్ద
దోషములుగా
భావిస్తారు.
తనయందున్న
గొప్ప
తప్పును
కూడా
చిన్నదిగా
విశ్వసిస్తాడు.
అదియే
పెద్ద
ద్రోహము.
తనలోని
చిన్న
తప్పునైనా
పెద్దదిగా
భావించుకోవాలి.
పరులయందున్న
పెద్ద
తప్పునైనా
చిన్నదిగా
విశ్వసించాలి.
అప్పుడే
మనము
తప్పులు
చేయకుండా
ఉండుటకు
వీలవుతుంది.
తనలోని
చిన్న
తప్పునైనా
పెద్దదిగా
భావించినప్పుడు
యింక
పెద్ద
తప్పు
చేయటానికి
పాల్పడడు.
ఇలాంటి
చిన్నచిన్న
విషయములలోనే
దివ్యత్వమును
గుర్తించుటకు
ప్రయత్నించాలి.
కానీ,
మనలోనున్న
చిన్న
దోషములను
పెద్దవిగా
భావించి
వాటిని
అణగద్రొక్కుటకు
తగిన
కృషి
చేయాలి.
మానవుని
ప్రేమ
వ్యావహారికమైన
ప్రేమ.
పారమార్థిక
సంబంధమైనది
దివ్యమైన
ప్రేమ.
ఈ
రెండింటికీ
చాలా
వ్యత్యాసము
ఉంటున్నది.
పరమాత్మ
ప్రేమ
నిస్వార్థము.
ఎట్టి
స్వార్థము
పరమాత్ముని
యందు
కనిపించదు.
అందువలననే
పరమాత్మ
ప్రేమ
పరిశుద్ధమైనదిగా
ఉంటుంది.
దీనిని
పురస్కరించుకొనియే
మహర్షులు
చెప్పారు
నిర్గుణం
నిరంజనం
సనాతనం
నికేతనం
నిత్యశుద్ధ
బుద్ధముక్త
నిర్మల
స్వరూపిణం.
ఇలాంటి
ప్రేమతత్త్వం
మనం
అనుభవించాలి.
ఈ
సంకుచిత
హృదయములకు
ఇది
సరియైనదిగా
కనిపించదు.
కారణం
ఏమిటి?
వారి
ప్రేమ
స్వార్థముతో
కూడినది.
భగవత్ప్రేమ
నిస్వార్థముతో
కూడినది.
భగవత్ప్రేమ
నిస్వార్థముతో
చేరినది.
ఒక
చిన్న
ఉదాహరణము.
ఈనాటి
యువకులు
వారి
ప్రేమను
ప్రప్రథమములో
గొప్పదిగా
భావించి
విశాలముగా
నిరూపిస్తుంటారు.
విద్యను
పూర్తిగా
గరపిన
తరువాత
గురుకులము
వదలి
గృహములకు
వెడతారు.
3
▾
Meaning
Keep
వీరికి
వివాహము
జరుగుతుంది.
వివాహము
జరిగిన
కొన్ని
దినములు
యితని
ప్రేమ
మితిమీరిన
ప్రేమగా
కనిపిస్తుంది.
అప్పుడు
వైఫ్
లైఫ్‌గా
భావిస్తాడు.
ఇరువురూ
చేరి
బీచ్‌లో
walk
కి
వెడతారు.
భార్యపైనున్న
లౌకికమైన,
భౌతికమైన,
అస్థిరమైన
ప్రేమ
ద్వారా
తన
కంటికి
ముల్లు
కనిపించింది.
తక్షణమే
భార్య
చేయి
పట్టి
‘ముల్లు,
ముల్లు’
అని
వెనక్కి
లాగుతాడు.
ఆ
ముల్లుపై
తన
భార్య
పాదము
పడి,
పాదమునకు
యేమి
ప్రమాదము
జరుగుతుందోనని
ప్రేమ
చేత
ఈవిధమైన
నటన
చేస్తాడు.
ఇంక
మూడు
నెలలు
గడచిన
తరువాత
తిరిగి
మరొక
మార్గములో
నడుస్తున్నప్పుడు
భర్త
యింకొక
ముల్లును
చూస్తాడు.
అప్పుడు
భర్త
చెబుతాడు
భార్యకు,
‘thorn
is
there,
be
careful'
అని.
మొదటి
మూడు
నెలల
ప్రేమ
తగ్గిపోయింది.
ఇంక
ఆరునెలలకు
ఒక
తోటలో
ప్రవేశిస్తారు.
అక్కడ
భర్త
ఒక
ముల్లు
చూస్తాడు.
‘కండ్లు
కనిపించటంలే!
ముండ్లున్నాయి,
వెనుకకు
రా!’
అంటాడు.
చూచారా!
మూడు
నెలలకు,
ఆరు
నెలలకు
ప్రాకృతమైన
ప్రేమ
సన్నగిల్లుతూ
వస్తుంది.
దానిని
ప్రేమ
అని
చెప్పలేరు.
ప్రేమ
అని
పేరు
పెట్టారేగానీ
యిది
ప్రేమ
కాదు.
ఇది
కేవలం
attachment
యొక్క
reaction.
కానీ,
స్వామి
ప్రేమ
అట్టిది
కాదు.
ఎప్పటికి,
తన
జీవిత
పర్యంతము
పవిత్రమైన,
నిష్కల్మషమైన
ప్రేమ,
నిస్వార్థ
ప్రేమ
నిరూపిస్తుంటారు.
కానీ,
ఇట్టి
పవిత్రమైన
ప్రేమ
అందరూ
అర్థము
చేసుకోలేరు.
అర్థము
చేసుకోకపోతే
పోనీ
పెడర్థం
తీసుకుంటారు.
దీని
వలనే
మానవుని
జీవితము
అనేక
కష్టములకు,
నష్టములకు,
దుఃఖములకు
గురౌతున్నది.
తుచ్ఛమైన
కోరికల
చేత
భగవంతుని
ప్రార్థించి,
కొంత
నిరాశ
కలిగిన
తరువాత
భగవంతుని
ద్వేషిస్తారు.
‘లిబరేషన్’
అని
చాలామంది
కోరుతుంటారు.
ఏమిటీ
ఈ
‘లిబరేషన్’?
నాకు
అర్థము
కావటం
లేదు.
నేను
భగవంతుని
చూడాలి,
చూడాలి
అని
ఆశిస్తున్నాను.
భగవంతుని
చూడాలనుకునే
వాడు
భగవద్భావమును
నీ
హృదయములో
నింపుకోవాలి
కదా!
కానీ,
అట్టి
విశ్వాసమే
లోపల
లేక
భగవంతుని
చూడాలంటే
ఏరీతిగా
నీకు
కనిపిస్తాడు?
నీవే
భగవంతుడై
ఉన్నావు.
అలాంటి
తత్త్వములో
నిన్ను
నీవు
మరచిపోతున్నావు.
భగవంతుని
చూడాలంటే
ఏరీతిగా
చూడగలవు?
చిన్న
ఉదాహరణము.
భగవంతునిపై
పూర్ణవిశ్వాసము
లేకుండా
ఎంత
సమీపములో
ఉండినా
భగవత్తత్వము
మనకు
అర్థము
కాదు.
తామర
పుష్పము
ఉంటున్నది.
తామరపుష్పముపై
కప్ప
ఉంటున్నది.
కప్పకు
నివాసముగా
యేర్పడుతున్నది
తామరపుష్పము
కానీ,
ఆ
మధురమైన
రసముయొక్క
రుచిని
కనుక్కున్న
తుమ్మెదలు
ఎక్కడనుంచో
ఏ
దేశములనుంచో
పరుగెత్తి
వస్తుంటాయి.
మనము
దగ్గరుండి
కూడా
దూరందూరముగా
అయిపోతున్నాము.
వారు
దూరముగా
ఉండినా
దగ్గరవారై
పోతున్నారు.
ప్రేమ
గుణము
ఎట్లా
ఉందంటే
దూరస్థుని
కూడా
సమీపస్థుని
గావిస్తుంది.
వియోగమును
కూడా
సంయోగము
గావింప
చేస్తుంది.
నరుని
కూడా
నారాయణునిగా
మారుస్తుంది.
ఇంత
సమీపములో
ఉండి
మానవుడు
ప్రేమ
తత్త్వమును
గుర్తించుటకు
ప్రయత్నించక
విస్మరిస్తున్నాడు.
ప్రాకృతిక
ప్రేమ
దుఃఖకరం
ప్రేమస్వరూపులారా!
ప్రతి
వ్యక్తియందు
ఉండినది
ప్రేమయే.
కానీ,
స్వార్థమైన
మార్గములో
ప్రవేశపెట్టటం
చేత
యిది
కేవలము
అనుబంధముగా
మారిపోతున్నది.
అనుబంధముగా
ఉండినంతవరకు
అనుభూతికి
రాదు.
ఇది
కేవలము
దైవ
ప్రేమ
అనే
భావము
మనకు
కలగాలి.
లౌకికమైన,
ప్రాకృతమైన,
భౌతికమైన
ప్రేమ
తత్త్వము
లోపల
అనేక
మార్పులు
కలుగుతూ
ఉంటాయి.
ఇది
యేవిధంగా
జరుగుతుంది?
మానవుడు
రెండింటి
యేకత్వము
గుర్తించుటకు
ప్రయత్నించాలి.
ఈనాటి
యువకులు
ఈ
ప్రేమతత్త్వము
చక్కగా
గుర్తించటము
లేదు.
ఈ
ప్రేమతత్త్వము
చక్కగా
గుర్తించుట
అత్యవసరము.
అనేక
విదేశములనుండి
వచ్చేవారుగానీ,
లేక
స్వదేశీయులుగానీ
మిత్రత్వమనేది
గొప్పగా
అభివృద్ధి
చేసుకుంటున్నారు.
యువకుల
యందును,
యువతుల
యందును
ఈ
friendship
పూర్తిగా
విశ్వసిస్తున్నాడు.
ఈ
friendship
చాలా
ప్రమాద
స్థితికి
తెస్తున్నది.
He
is
my
boy
friend,
she
is
my
girl
friend
అంటారు.
ఈ
friendship
పూర్తి
marriage
చేసుకుంటే
మంచిది.
కాని,
ఈ
friendship
చేయకండి.
ఈనాడు
ఒక
ఫ్రెండ్,
రేపు
మరొక
ఫ్రెండ్.
ఇంకొక
నెలకు
యింకొక
ఫ్రెండ్.
ఈవిధంగా
ఫ్రెండ్స్‌ని
మారుస్తుంటే
నీకున్నది
ఒకే
హార్టు
కానీ
యిన్ని
ఛైర్సు
లేవు.
మన
హృదయము
single
chair,
not
musical
chair.
ఈనాడు
జీవితమంతా
musical
chairs
గా
తయారౌతున్నది.
తద్వారా
అనేక
అశాంతులకు
గురౌతున్నారు.
ఒక
చిన్న
ఉదాహరణము.
పది
సంవత్సరములకు
పూర్వము
ఈ
ప్రదేశములో
పెద్ద
వృక్షముండేది.
ఒక
పదిహేడు
సంవత్సరముల
పిల్లవాడు
అమెరికా
నుండి
వచ్చాడు.
ఆ
చెట్టు
క్రింద
కూర్చొని
ఒకే
విచారంగా
వున్నాడు.
భజన
అయింది.
హారతి
అయింది.
అందరూ
వెళ్లిపోయారు.
నేను
బయటకు
వచ్చాను.
అది
నాకు
అలవాటు.
ఆ
ఒక్క
పిల్లవాడు
కూర్చొని
చాలా
విచారంగా
ఉంటున్నాడు.
నేను
అడిగాను,
‘ఎక్కడ
నుండి
వచ్చావు?’
‘నేను
అమెరికా
నుండి
వచ్చాను’.
‘ఎందుకు
నీవింత
విచారముగా
కనిపిస్తున్నావు?’
గట్టిగా
ఏడ్చాడు.
నా
పాదములు
గట్టిగా
పట్టుకున్నాడు.
4
▾
Meaning
Keep
నాకు
తెలుసును,
కానీ,
అతనినుంచి
చెప్పించాలని
‘నీ
స్థితి
యేమిటి?’
అని
అడిగాను.
పదిహేడు
సంవత్సరముల
బాలుడు.
ఈ
పిల్లవానికి
యింత
విచారము,
యింత
దుఃఖము
రావటానికి
కారణం
యేమిటి?
దుఃఖము
అంటే
యేమిటో
నాకు
తెలియదు.
కానీ,
అడిగాను,
‘ఎందుకు
దుఃఖపడుతున్నావు?’
అని.
ఆ
పిల్లవాడు
చెబుతున్నాడు,
‘స్వామీ!
నా
రెండవ
భార్య
నన్ను
వదలిపెట్టి
పోయింది.
అంతేకాదు.
ఆమెకు
ఒక
బిడ్డ
ఉన్నది.
ఆ
బిడ్డ
అంటే
నాకు
చాలా
attachment.
ఆ
బిడ్డనుకూడా
తీసుకుపోయింది.
పదిహేడు
సంవత్సరములకు
రెండవభార్య.
ఇంక
యిరవై
సంవత్సరములైతే
నాల్గవ
భార్య
వస్తుంది.
వారు
మోసుకొని
పోతారు,
వీడు
చస్తే.
ఈవిధంగా
ఉంటున్నది
జగత్తులో
జీవితము.
ఆత్మతత్త్వ
విచారణ
ఈనాటి
మానవుడు
మానవత్వము
అంటే
ఏమిటో
అర్థము
చేసుకోటం
లేదు.
మానవుడంటే
విలువైనవాడు.
గౌరవనీయుడు.
ఈ
పవిత్రత
‘విర్’
అనే
లేటిన్
పదమునుండి
వచ్చింది.
‘విర్’
అనగా
పవిత్రత.
మానవుడు
పవిత్రమైన
వాడు,
నమ్మకమైనవాడు
అని
ఉపనిషత్తులు
బోధించాయి.
ఇటువంటి
నమ్మకమైన
మానవుడు,
విలువైన
మానవుడు
యింత
శక్తిహీనుడై
పోవుటకు
కారణము
ఏమిటి?
తన
తత్త్వము
తాను
గుర్తించుకోలేకపోవటమే
కారణం.
నేనెవరు?
మానవుడను.
మానవత్వము
ఎంత
పవిత్రమైనది.
ఎంత
దివ్యమైనది.
ఎంత
భవ్యమైనది.
ఎంత
నవ్యమైనది!
కనుకనే,
మా..నవ
అన్నారు.
మా..కాదు,
నవ..కొత్త.
కొత్తవాడు
కాదు.
నేను
పురాతనుడను.
నేను
సనాతనుడను.
దేహము
మారుతున్నది
గానీ
నేను
మారటం
లేదు.
అంత
దివ్యమైన
మానవత్వమును
యింత
నీచముగా
మనము
భావిస్తున్నాము.
యువతీయువకులారా!
మానవుని
ఆహారవిహారముల
చేత
అనేకవిధములైన
అపోహలు
కలుగుతుంటాయి.
thoughts
కి
మనము
యేమాత్రమూ
అవకాశము
యివ్వకూడదు.
ఏ
thoughts
వచ్చినా
is
it
good
or
bad?
is
it
right
or
wrong?
అని
కొంత
వరకు
విచారించు.
అందుకోసమే
మానవునికి
ఐదు
విధములైన
జ్ఞానములుంటున్నాయి.
ఒకటి
bookish
knowledge,
రెండవది
superficial
knowledge,
మూడవది
discrimination
knowledge
నాల్గవది
general
knowledge
ఐదవదే
practical
knowledge.
ఈ
practical
knowledge
లేకుండా
ఈ
bookish
knowledge,
superficial
knowledge
పెట్టుకొని
మనము
కేవలము
జీవితమును
వ్యర్థము
గావించుకొంటున్నాము.
మనము
చదివే
చదువులకు,
నడచే
నడతలకు
యేమాత్రమూ
సంబంధము
లేకుండా
ఉంటున్నది.
మానవుడనగా
ఎవరు?
thoughts,
words,
deeds
మూడూ
కలవాలి.
అప్పుడే
మానవత్వము
దివ్యత్వముగా
మారిపోతుంది.
అన్నింటికి
దైవవిశ్వాసము
మనం
పెంచుకోవాలి.
ఆ
విశ్వాసములో
యిట్టి
డౌట్సుకి
యేమాత్రము
అవకాశము
ఉండదు.
ఒక
వేళ
నీ
నుంచి
డౌట్సు
వస్తే
అది
నీయొక్క
ఇమేజినేషన్,
సైకలాజికల్.
అంతేగానీ
దైవముయొక్క
తత్త్వము
కాదు.
నీవు
భావించే
భావములన్నీ
నీ
ప్రతిబింబములే
గానీ
దివ్యత్వముయొక్క
ప్రతిబింబము
కాదు.
ప్రతి
దాని
యందు
నీ
reflection,
నీ
reaction
నీ
resound.
దివ్యత్వమునకు
ఆ
reflection
లేదు.
ఆ
reaction
లేదు.
resound
లేదు.
only
one
sound.
అదే
TRUTH.
సత్యమైన
దివ్యత్వమునకు
ఏ
మార్పు
ఉండదు.
అట్టి
సత్యస్వరూపుడైన
దైవత్వమును
విశ్వసించాలి.
ఈనాడు
లోకములో
దైవమంటే
ఎవరూ
అర్థము
చేసుకోలేక
పోతున్నారు.
నీతి,
నిజాయతీ
అంటే
ఏమిటో
అర్థము
చేసుకోలేక
పోతున్నారు.
ఏనాడు
నీతి
నిజాయతీలను
విశ్వసించి
సరైన
ధర్మ
మార్గమును
అనుసరిస్తారో
ఆనాడే
దేశము
బాగుపడుతుంది.
ఈనాటి
మానవుని
యావజ్జీవితము
ధనము,
ధనము.
ధనమునకు
దాసుడౌతున్నాడు
గానీ
గుణమునకు
దాసుడు
కావటం
లేదు.
దైవమును
విస్మరిస్తాడు
గానీ
ధనమును
విస్మరించడు.
ధనమే
కావాలి.
ధనము
యేమి
చేస్తుంది?
ఇదంతా
తాత్కాలిక
జీవితమునకు
సదుపాయములు
కలిగించ
వచ్చు.
మానవత్వములో
చాలా
విచిత్రమైన
చిత్రము
మీకు
చూపించాలి.
మనము
పడక
గదికి
సీలింగ్
ఫ్యాన్
వేసుకున్నాం.
air
condition
పెట్టుకున్నాము.
డన్లప్
బెడ్
వేసుకున్నాము.
పండుకున్నావు.
కానీ
నిద్ర
రావటం
లేదు.
దేనికోసం
ఈ
air
condition
పెట్టుకున్నావు?
సుఖ
నిద్ర
కోసం
పెట్టుకున్నావు.
ఎందుకోసం
సీలింగ్
ఫ్యాన్
వేసుకున్నావు?
ప్రశాంతమైన
నిద్ర
రావాలని
వేసుకున్నావు.
డన్లప్
బెడ్
ఎందుకు
వేసుకున్నావు?
నిద్ర
కోసమే
వేసుకున్నావు.
కానీ
నిద్ర
రావటం
లేదు.
ఇవన్నీ
ఉండి
ప్రయోజనం
ఏమిటి?
పరమాత్మ
ప్రేమ
త్రికోణాత్మకం
అదేవిధంగా
ప్రతి
మానవునికి
దేహము,
మనస్సు,
బుద్ధి,
చిత్తము,
అహంకారము
ఈ
ఐదు
శాంతి
అనే
సుఖనిద్ర
పొందే
నిమిత్తం
వచ్చాయి.
శాంతి
అందించినప్పుడు
దేహము
ఎందుకు?
మనస్సు
ఎందుకు?
బుద్ధి
ఎందుకు?
ఇవన్నీ
చేరి
నీకు
శాంతి
నందించాలి.
కానీ
అశాంతినందిస్తున్నాయి.
అశాంతి
నిమిత్తమై
ఏర్పడినవి
కావు
యివి.
ఈ
ఇంద్రియములు
శాంతి
నిమిత్తమై
ఏర్పడినవి.
ప్రతి
వ్యక్తి
ఈ
సత్యమును
గుర్తించాలి.
ఏనాడు
ఇవి
సరైన
మార్గములో
ప్రవేశిస్తాయి?
నిర్మలమైన,
నిస్వార్థమైన
ప్రేమను
పంచుకున్నప్పుడే
శాంతినందిస్తాయి.
5
▾
Meaning
Keep
Also in his talks
(20)
23 November 1978
Faith Is the Foundation of the Spiritual Path
8 November 1986
Through the Name we can attain the Named!
30 September 1987
Understand the Sai principle well
5 March 1992
‘Adhyātmavidyā vidyānāṁ’
14 January 1995
Prema is like a compass
24 June 1996
A Life without Character Is a Lifeless Life
21 April 1998
The body itself is foremost for the practice of Dharma
14 August 1998
Prema Alone Is the Path, Prema Alone the Goal
30 September 1998
God's Prema Is Eternal, Everlasting
19 November 1998
Women Alone Are the Root Cause of Bhārata's Greatness
2 April 2003
Leave the delusion of the body; think of God
18 May 2003
Prema is the very essence of the Paramātma
21 October 2003
I have come only to reveal your true nature
22 November 2004
Only When Oneness Is Experienced Does Human Birth Find Its Fulfilment
14 January 2005
When the heart is filled with Prema, life is filled with Ānanda
23 June 2005
Recognise the fundamental principle
14 April 2006
Fix your mind on Divinity; place your trust in Oneness
21 May 2006
Service to society is itself the right sādhana
11 August 2006
Divinity is attained only through Prema for God
28 July 2007
Every human being is God
కనుక,
ప్రేమ
యిచ్చుకునేదేగానీ
పుచ్చుకునేది
కాదు.
ప్రాపంచిక
సంబంధమైన
ప్రేమకు,
దివ్యమైన
ప్రేమకు
ఉండిన
వ్యత్యాసమిదియే.
ప్రాకృతమైన
ప్రేమ
పుచ్చుకుంటుందిగానీ
యిచ్చుకోదు.
పరమాత్మ
ప్రేమ
యిచ్చుకుంటుందిగానీ
పుచ్చుకోదు.
ఎప్పుడు
యిచ్చుకోటమే.
ఇదే
పరమాత్మ
ప్రేమకున్న
ప్రధాన
గుణము.
రెండవది,
పరమాత్మ
ప్రేమకు
ఎట్టి
భయము
లేదు.
ప్రాకృతమైన
ప్రేమకు
ఎవరేమి
చెబుతారో,
ఎవరేమనుకుంటారోననే
భయముంటుంది.
కానీ,
పరమాత్మ
ప్రేమకు
స్వార్థము
లేదు.
అందువలనే
భయము
లేదు.
ఇంక
మూడవది.
ప్రేమకు
ప్రేమయే
గమ్యము.
ప్రేమ
ప్రేమయేగాని
పదార్థము
కాదు.
అందువల్లనే
ప్రేమ
త్రికోణములతో
కూడినదన్నారు.
ఒకటి
ప్రేమ
యిచ్చుకోటం,
రెండవది
నిర్భయం,
మూడవది
ప్రేమకు
ప్రేమయే
ఫలము.
ఇదే
దివ్యమైన
ప్రేమ.
ఈనాటి
మానవులు
భగవంతుని
అనేకవిధములుగా
ప్రార్థిస్తున్నారు.
ఏమని
ప్రార్థిస్తున్నారు?
ధనము
కావాలని
ప్రార్థిస్తున్నారు.
పెండ్లి
కావాలని
ప్రార్థిస్తున్నారు.
పిల్లలు
కావాలని
ప్రార్థిస్తున్నారు.
గృహములు
కావాలని
ప్రార్థిస్తున్నారు.
అధికారము
కావాలని
ప్రార్థిస్తున్నారు.
భౌతికమైనవి
ప్రార్థిస్తున్నారు.
వీటికి
కాదు
మనము
భగవంతుని
ప్రార్థించవలసినది.
ఏది
నీ
దగ్గర
లేదో
దానికి
నీవు
భగవంతుని
ప్రార్థించు.
నీ
దగ్గర
లేనిది,
తన
దగ్గర
ఉన్న
దానిని
నీవు
ప్రార్థించాలి.
నీ
దగ్గర
ప్రేమ
లేదు.
ఆ
ప్రేమ
భగవంతుని
దగ్గర
ఉన్నది.
ఆ
ప్రేమకు
ప్రార్థించు.
నీలో
శాంతి
లేదు.
ఆ
శాంతి
భగవంతుని
దగ్గరుంటున్నది.
దానికి
నీవు
ప్రార్థించు.
నీ
దగ్గర
ఆనందము
లేదు.
ఆ
ఆనందము
భగవంతుని
దగ్గరే
ఉంటుంది.
పంచవిశంతి
భగవల్లక్షణములు
ఎందుకనగా,
భగవంతుడు
నిత్యానందం
పరమ
సుఖదం
కేవలం
జ్ఞానమూర్తిం
ద్వందాతీతం
గగన
సదృశం
తత్వమస్యాది
లక్ష్యం
ఏకం
నిత్యం
విమలమచలం
సర్వధీసాక్షిభూతం
భావాతీతం
త్రిగుణ
రహితం.....
నీకు
ప్రేమ
కావాలంటే
భగవంతుని
దగ్గర
శాశ్వతమైన
ప్రేమ
ఉంటున్నది.
నీ
దగ్గర
శాంతి
లేదు.
భగవంతుడు
శాంత
స్వరూపుడు.
అతని
దగ్గర
శాంతి
కోరు.
నీ
దగ్గర
ఆనందము
లేదు.
కానీ,
సంతోషముంది.
సంతోషమునకు
ఆనందమునకు
ఉన్న
వ్యత్యాసము
గుర్తించాలి.
సంతోషము
హెడ్‌కి
సంబంధించినది.
ఆనందము
హార్ట్‌కి
సంబంధించినది.
ఆనందము
హృదయమునకు
సంబంధించినది.
ఆనందమును
భగవంతుని
దగ్గర
ఆశించు.
మనము
భగవంతుని
మన
దగ్గర
లేని
వాటికి
ప్రార్థించాలి.
డబ్బు
నీ
దగ్గర
ఉంటున్నది.
లోకములో
ఉంటున్నది.
ఎందుకు
భగవంతుని
ఆశించటము?
నీ
దగ్గర
ఆహారవిహారాదులు
దండిగా
ఉన్నాయి.
భగవంతుని
ఎందుకు
ప్రార్థించటము?
నీ
దగ్గర
రెండు
పెన్నులుంటే
మరొక
పెన్ను
దేనికి?
ఎందుకు
కోరటం?
నీ
దగ్గరున్నది
ఉపయోగించుకో.
నీ
దగ్గర
లేకపోతే
యితరులను
అడగాలి
పెన్ను.
నీవు
భగవంతుని
అడగవలసినవి
లౌకికమైనవి
కాదు.
‘భగవంతుడా!
నాకు
ప్రశాంతి
ప్రసాదించు.
ఓ
భగవంతుడా!
నాకు
ఆనందము
ప్రసాదించు.
ఓ
భగవంతుడా!
నాకు
నిర్మలమైన
ప్రేమ
ప్రసాదించు’.
వీటికి
భగవంతుని
ప్రార్థించు.
కానీ,
ఈనాటి
ప్రార్థనలకు
హద్దు
పద్దు
ఏమీ
లేదు.
ఇష్టము
వచ్చినట్లు
భగవంతుని
ప్రార్థిస్తున్నారు.
అన్నీ
భగవంతుడు
అందిస్తాడా?
ఎప్పటికీ
అందించడు.
నీకు
నీ
క్షేమము
తెలియకపోయినా
నీ
క్షేమము
గుర్తించి
అందించకుండా
ఉంటాడు.
అదంతా
నీ
మంచి
కోసమే.
ఏది
చెప్పినా,
ఏది
చేసినా
నీ
మంచి
కోసమే.
ఈ
సత్యమును
మానవుడు
గుర్తించుకోలేకపోతున్నాడు.
భగవంతుడు
సర్వసాక్షి.
అన్నివిధముల
నీ
క్షేమమునే
గుర్తిస్తాడు.
సర్వము
భగవంతునికి
అర్పితము
చేయి.
భగవంతుడు
అందించినదాన్ని
అందుకో.
ఆనంద
జీవితము
గడుపుకో.
నిండిన
ప్రేమతో
భగవత్ప్రార్థన
ఈనాడు
యువకులు,
యువతులు
ఆదర్శవంతమైన
జీవులుగా
తయారుకావాలి.
ఆదర్శపౌరులుగా
తయారుకావాలి.
చిల్లర
మార్గములో
ప్రవేశించకుండా
దివ్యమైన
భగవత్తత్వములో
నీవు
ప్రవేశించు.
భగవంతుడు
సర్వులయందు
ఉన్నాడు.
అన్ని
శిరస్సులు
దైవస్వరూపాలే.
ఇలాంటి
ఆనందస్వరూపులైన
మీరు
మిమ్మల్ని
మర్చిపోయి
దైవత్వము
ఎక్కడని
ప్రాకులాడుతున్నారు.
నిన్ను
నీవు
గుర్తించుకో.
నీ
సత్యాన్ని
నీవు
గుర్తించుకో.
నీ
ఆనందము
నీవు
అనుభవించుకో.
ఇతరులకు
అపకారము
చేయకుండా
ఉపకారము
చేయి.
అదియే
మానవునియొక్క
ప్రధానమైన
సేవ.
ఏ
వ్యక్తి
ఎవరిని
బాధించినా
భగవంతుని
బాధించినట్టే
అవుతుంది.
సెయింట్
జాన్
ఉండేవాడు.
అతడు
అంతా
భగవంతుని
తత్త్వమే
అని
విశ్వసించాడు.
అందరూ
సోదరులనే
భావించాడు.
ఒక
సోదరుని
ఒకనాడు
చాలా
కఠినముగా
శిక్షించాడు.
ఆనాటి
రాత్రి
జీసస్
స్వప్నములో
వచ్చాడు.
‘పిచ్చివాడా!
పరాయివాడని
భావించి
నిన్ను
నీవు
బాధపెడుతున్నావు.
సర్వుల
హృదయమందున్నది
భగవంతుడే.
ఏ
హృదయమును
బాధపెట్టినా
భగవంతుని
బాధపెట్టినట్లే.
6
▾
Meaning
Keep
ఏ
దేహమును
శిక్షించినా
భగవంతుని
శిక్షించినట్లే’.
ఆ
ఏకత్వ
భావము
మనము
అభివృద్ధి
పరచుకోటానికి
మొట్టమొదట
ప్రేమతో
భగవంతుని
ప్రార్థించాలి.
ఈనాడు
భజనలు,
ధ్యానములు,
జపములు...ఇలాంటి
సత్కార్యములు
ఆచరిస్తున్నారు.
ఇవన్నీ
మీ
మనస్సును
పవిత్రము
గావించుకొనే
పవిత్ర
కర్మలే.
మనస్సు
పవిత్రమైనప్పుడు
సర్వము
పవిత్రమైపోతుంది.
మొట్టమొదట
చిత్తశుద్ధిని
గావించుకోవాలి.
సత్కర్మలన్నీ
చిత్తశుద్ధి
నిమిత్తమే
ఏర్పడినవి.
ప్రతి
మానవుడు
పవిత్రమైన
ప్రేమను
అభివృద్ధిపరచుకోవాలి.
ప్రేమకు
మించిన
ప్రాణము
మరొటి
లేదు.
ప్రాణమే
ప్రేమ.
ప్రేమయే
ప్రాణము.
పచ్చని
మొక్కను
మనం
నాటాము.
ఆ
మొక్క
దినదినాభివృద్ధి
పొందుతున్నది.
పచ్చని
ఆకుల
చేత
కళకళలాడుతున్నది
ఆ
వృక్షము.
కొన్ని
దినములైన
తర్వాత
ఆకులు
వాడిపోయాయి.
కొమ్మలంతా
ఎండిపోయాయి.
చెట్టంతా
ఎండిపోయింది.
చూచారు.
ఎంతో
శ్రమతో
పెంచిన
మొక్క,
ఎంతో
ప్రేమతో
పెంచిన
ఈ
చెట్టుకి
ఈ
గతి
పట్టిందని
నిర్దాక్షిణ్యముగా
దానిని
పెరికి
పారవేశారు.
ఎంతవరకు
నీవు
దానిని
ప్రేమించావు?
అది
పచ్చగా
ఉండినంతవరకు,
ప్రాణం
ఉండినంతవరకు
దానిని
ప్రేమించావు.
అందులో
పచ్చదనమనే
ప్రేమ
పోయేటప్పటికి
దానిని
నిర్దాక్షిణ్యంగా
తీసి
పారవేశావు.
కాబట్టి,
ఆ
ప్రేమ
ఏమిటి?
ఈ
ప్రాణము
ఏమిటి?
పచ్చదనమనే
ప్రాణము
ఈ
చెట్టులో
లేకపోవటం
చేత
నిర్దాక్షిణ్యంగా
నరికివేశావు.
సమాజ
సంక్షేమం
ప్రధానం
యువతీయువకులారా!
నిప్పులోపల
దహనశక్తి
ఎంత
ప్రధానమో,
ఐస్‌లో
చల్లదనము
ఎంత
ప్రధానమో
మానవునియందు
ప్రేమ
అంత
ప్రధానము.
అగ్నిలో
దహనశక్తి
లేకపోతే
అది
బొగ్గవుతుందిగాని
అగ్ని
కాదు.
అదేవిధముగా
చల్లదనము
లేకపోతే
మంచుగడ్డ
కాదు.
అదేవిధముగా
మానవునియందు
ప్రేమయే
లేకపోతే
నిర్జీవ
దేహమేగాని
మానవత్వము
కానేరదు.
కాబట్టి,
మానవునకు
ప్రేమయే
ప్రాణము.
ఈ
ప్రేమ
తత్వము
మనము
చక్కగా
గుర్తించాలి.
ప్రేమ
లేని
మానవుడు
ప్రాణము
లేని
జీవుడే.
అయితే
ప్రేమను
అనేక
మార్గములలో
ప్రవేశపెడుతున్నాము.
కానీ,
ప్రేమ
ఒక్కటే!
తల్లిదండ్రుల
ప్రేమ,
భార్యాబిడ్డల
ప్రేమ,
మిత్రుల
ప్రేమ...
ఇవన్నీ
వుంటున్నాయి.
ఈ
ప్రేమతో
దైవప్రేమ
ఒకటి
చేరినట్టుంది.
కాదుకాదు.
అన్ని
ప్రేమల
తత్త్వము
ఏకత్వము
పొందినప్పుడే
నిజమైన
ఏకాత్మభావము.
ఈ
భౌతికమైన
ప్రేమలలో
అంతోయింతో
స్వార్థముంటున్నాది.
కానీ,
భగవత్ప్రేమ
స్వార్థరహితమైన
ప్రేమ.
ఒక్కొక్కటి
ఒక
దారము
వంటిది.
అన్నీ
చాలా
బలహీనమైనవే.
భార్యాపిల్లలుండినంతవరకు
ప్రేమిస్తావు.
తరువాత
ఎవరికెవరు
సంబంధము?
కాదుకాదు.
దైవ
ప్రేమ
శాశ్వతమైనది.
నిత్యమైనది.
నిర్మలమైనది.
నిస్వార్థమైనది.
కనుకనే,
దీనిని
పొందాలంటే
ఈ
భౌతికమైన
గుణములు
విసర్జించాలి.
what
is
the
way
to
immortality?
removal
of
immorality
is
the
only
way
to
immortality.
మనలోనున్న
కామ,
క్రోధ,
లోభ,
మద,
మాత్సర్యములన్నీ
మనము
నిర్మూలనము
చేసినప్పుడే
పవిత్రమైన
గమ్యము
చేరుతుంది.
ఇవన్నీ
బలహీనతలే.
నిజమైన
బలము
దైవబలమే.
లౌకిక
బలములన్నీ
దుర్బలములే.
మధ్యలో
వచ్చినాయి,
మధ్యలో
పోతున్నాయి.
నీవు
దీన్ని
శాశ్వతంగా
భావించకూడదు.
నీ
కర్తవ్యము
నీవు
నిర్వర్తించు.
ప్రాకృతమైన
జగత్తునందు
మనము
యేవిధంగా
ప్రవర్తించాలి?
ఏవిధంగా
సమాజమునకు
శాంతిభద్రతలనందించాలి?
మనము
సమాజముయొక్క
సంక్షేమము
ఏవిధంగా
కాపాడాలి
అనే
విషయము
యువతీయువకులు
చక్కగా
గుర్తించాలి.
భావి
ప్రపంచమునకు
మీరే
ఆధారము.
భావి
ప్రపంచముయొక్క
మంచిచెడ్డలు
మీ
తల
వ్రాతలపై
ఆధారపడి
ఉంటాయి.
కనుక,
మీరు
మంచివారైనప్పుడే
ప్రపంచము
మంచిదౌతుంది.
వ్యక్తి
మంచివాడైనప్పుడే
సమాజము
మంచిదౌతుంది.
ప్రేమస్వరూపులారా!
ఏ
గుణములు
మీరు
సాధించకపోయినా
ఈ
నిర్మల
ప్రేమను
సాధించండి.
భగవత్ప్రేమకు
మీరు
పాత్రులుకండి.
సర్వమూ
మీకు
లభిస్తాయి.
మీరు
పాత్రధారులు.
భగవంతుడు
సూత్రధారి.
సూత్రధారి
తత్త్వము
పాత్రలను
సరైన
రీతిగా
నడిపించటమే.
మీరు
సరైన
పాత్రధారులుగా
వుంటుండాలి.
ఆవిధమైన
మార్గము
మీరనుసరించుటకు
ఈనాడు
ఈవిధమైన
youth
conference
ప్రారంభించాము.
ప్రపంచములో
ఎక్కడ
చూచినా
అశాంతి,
ఎక్కడ
చూచినా
దుర్భావములచేత
కుమిలిపోతున్నాది.
ఎక్కడకు
పోయినా
భయభ్రాంతులు
మనలను
వదలటం
లేదు.
శాంతి
ఎక్కడా
కనిపించటం
లేదు.
బయట
అంతా
pieces.
peace
is
in
you.
you
are
the
embodiment
of
peace.
you
are
the
embodiment
of
truth.
you
are
the
embodiment
of
love.
you
are
the
embodiment
of
god.
ఈ
సత్యము
మీరు
గుర్తించాలి.
నేనే
దైవమని,
నేనే
దైవమని
గుండె
పట్టుకొని
భావించు.
తప్పక
నీవు
దైవమైపోతావు.
అప్పుడే
నీ
భావము
మార్పు
చెందుతుంది.
నీవు
దైవముగా
భావించు.
కేవలం
మానవునిగా
భావించకు.
అప్పుడే
నీవు
దైవస్వరూపుడుగా
మారిపోతావు.
7
▾
Meaning
Keep
ధనం
కాదు
దేవుడే
ఆపద్బాంధవుడు
ప్రేమస్వరూపులారా!
ఈనాడు
ప్రేమ
తత్త్వమును
గుర్తించుటకు
ప్రయత్నించండి.
రేపటి
దినము
ప్రేమతో
కూడిన
సత్యమును
గుర్తించుటకు
పూనుకోవచ్చు.
ఈనాటి
యువతీయువకులు
ప్రేమ
అంటే
ఏమిటి,
దైవమంటే
ఏమిటి
అని
చక్కగా
గుర్తించినప్పుడే
మీ
జీవితమంతా
రాజమార్గములో
ప్రయాణమౌతుంది.
ఏమిటి
ఈ
నీటిబుడగవంటి
దేహమునకు,
పిచ్చికోతి
వంటి
మనస్సుకు
యేమి
సంబంధముంటున్నది?
ఏదో
మన
భ్రాంతిచేత
యిన్ని
అవస్థలకు
గురైపోతున్నాము.
ఈనాటి
మానవుని
మనస్సు
ధనముపైనే
concentration
చేస్తున్నది.
ఏమి
చేసినా
ధనము.
ఎక్కడికి
పోయినా
ధనము.
ఎక్కడ
చూచినా
ధనము.
ఈనాటి
యువతీయువకులంతా
విదేశములకు
బయలుదేరిపోతున్నారు.
ఎందుకోసం
పోతున్నారు?
ధనము
కోసము
పోతున్నారు.
ధనము
యిక్కడుండి
సంపాయించుకోకూడదా!
ధనము
కావలసినదే.
అవసరమే.
ఎంతవరకు
కావాలి?
మీరు
బ్రతకటానికి
ధనము
కావాలి.
ఈ
దేశములో
నీవు
బ్రతకటానికి
వీలు
లేదా?
నారు
పెట్టిన
వాడు
నీరు
పోయడా?
మితిమీరిన
ధనము
సంపాయించటము
వలన
దుఃఖము.
రెండు
చేతులిచ్చాడు.
ఒక
కడుపు
యిచ్చాడు.
రెండు
చేతులతో
నీవు
పని
చేస్తే
కడుపు
నిండదా!
ఇదే
నీవు
చేయవలసిన
తపస్సు.
hands
in
the
society,
head
in
the
forest.
అంతేగానీ
శాంతి
శాంతి
అంటే
ఎక్కడ
చిక్కుతుంది?
దండిగా
ధనము
సంపాయించుకొని
i
am
enjoying.
enjoy
అంటే
ఏమిటి?
అన్ని
సుఖములు
పొందటమా?
అది
కాదు.
ఈ
పదమునకు
సరైన
అర్థము
తీసుకోవాలంటే
end
joy
-->
enjoy.
కథ
చెప్పాడు
సాయినాథ్.
రామ,
కృష్ణ,
గోవింద,
మాధవ
పేర్లు
పెట్టుకుంటాడు
నలుగురు
కుమారులకు.
అందరికీ
ఎక్కడ
దూరమైపోతానేమోనని
అందరికీ
షాపులు
కట్టించాడు.
కానీ,
కట్టకడపటికి
ఏమైపోయింది?
రాముడు
వచ్చాడా,
కృష్ణుడు
వచ్చాడా,
మాధవుడు
వచ్చాడా,
గోవిందుడు
వచ్చాడా?
ఎవరూ
పోలేదు.
కట్టకడపటికి
తానే
పోయాడు.
తాను
సంపాయించిన
ధనముగానీ,
తాను
సంపాదించిన
గృహముగానీ
ఏదీ
తన
వెంట
రాలేదు.
బంధువులందరు
వాకిటిదాకను
వల్లకాటికిని
వత్తురుగా
బంధమణచి
నిను
బాయని
ఆప
ద్బంధువు
భగవన్నామమెరా!
అదొక్కటే
మన
వెంటజంటగా
యింట
ఉండేది.
ఐకమత్యం,
పవిత్రత,
దివ్యత్వం
నీవు
భగవద్భావము
అభివృద్ధి
పరచుకో.
ఈనాటి
యువకులు
దేశమును
ఎంతైనా
ఉద్ధారము
చేయవచ్చు.
ఈనాడు
ఆవరించిన
అశాంతిని
దూరము
గావించి
శాంతిభద్రతలు
నెలకొల్పవచ్చు.
అన్యాయ,
అక్రమ,
అనాచారములతో
కూడిన
జగత్తునంతా
ఈ
యువతీయువకులు
అభివృద్ధిగావించాలి.
అశాంతిని
దూరము
చేయటానికి,
నాశనము
చేయటానికి
యువతయే
తగిన
సమర్థులు.
మీ
జీవితమును
చక్కని
మార్గములో
ప్రవేశపెట్టండి.
పవిత్రమైన
భావములతో
మీరు
మీ
హృదయములు
నింపుకోండి.
తల్లిదండ్రులను
గౌరవించండి.
దైవమును
ప్రేమించండి.
ఈ
మూడూ
తప్పక
చేయవలసినవి.
కానీ,
ఈనాటి
మార్గములో
ఈ
సమావేశము
ఎందుకు
గావించాలి?
ఇప్పుడు
ఏమైపోయింది?
తల్లిదండ్రులను
బిడ్డలు
గౌరవించటం
లేదు.
బిడ్డల
భవిష్యత్తు
తల్లిదండ్రులు
గుర్తించటం
లేదు.
మిత్రులకు
మిత్రులకు
మధ్య
విరోధములు
ప్రారంభమౌతున్నాయి.
బంధువుల
సంబంధములు
దూరమైపోతున్నాయి.
ఇలాంటి
పరిస్థితిలో
ఏకత్వము
గావించుటకు
ఒకవిధమైన
ప్రేమ
తత్త్వము
బోధించాలి.
ఇట్టి
వియోగములతో
కూడిన
దేహమును
సంయోగము
చేయాలి.
ఈ
ఐకమత్యమును
సంపాయించాలి.
యూనిటీ
సంపాదించుటకు
పిల్లల
హృదయాలు
ప్యూరిటీగా
ఉండాలి.
ఈ
ప్యూరిటీ
ఉండాలంటే
డివినిటీ
అందులో
ప్రవేశించాలి.
యూనిటీ,
ప్యూరిటీ,
డివినిటీ
ఈ
మూడింటి
సంబంధము
మీరు
చక్కగా
గుర్తించాలి.
కనుక
డివినిటీ
చాలా
ముఖ్యము.
చెప్పేది
డివైన్
కాని,
చేసేది
డీప్
వైన్.
అది
కాదు.
మనం
డివైన్లోనే
పోవాలి.
మనం
నోటితో
చెబుతున్నాం,
‘రామా,
కృష్ణా,
గోవిందా’
అని.
ఈ
పేర్లనుకూడా
మనం
అవమానము
చేసినట్లు
అంటున్నాం.
‘రామా,
కృష్ణా’
అని
అనుకున్నప్పుడు
మన
హృదయం
ఎంత
పవిత్రంగా
ఉండాలి!
నోటితో
చెప్పేది
ఒకటి,
హృదయముతో
చేసేది
ఒకటి.
ఇలాంటి
వ్యక్తులే
దురాత్ములు.
ఆధ్యాత్మికములో
‘మనస్యేకం,
వచస్యేకం,
కర్మణ్యేకం
మహాత్మనాం’
అన్నారు.
నీవు
చెప్పిన
దానికి
చేసేదానికి
విరుద్ధమైనప్పుడు
నీవు
మానవుడు
కాదు.
రాక్షసుడు.
నీవు
మానవుడుగా
తయారుకావాలి.
మానవత్వము
పెంచుకోవాలి.
మానవత్వమంటే
ఏమిటి?
అవే
సత్యధర్మ
శాంతిప్రేమలే.
ఇట్టి
మానవతా
విలువలకు
మూలాధారమైన
మానవునియందే
మానవుని
విలువలు
లేకపోతే
ఎట్లా?
సమస్త
విలువలకు
మూలకారకుడు
మానవుడే.
8
▾
Meaning
Keep
అట్టి
మానవునియందే
మానవతా
విలువలు
లేకపోతే
యింక
మానవుడు
ఎట్లా
అవుతాడు?
ఆకారము
మానవాకారము.
కానీ,
ఇందులో
మానవతా
గుణములు
లేకపోతే
ప్రయోజనం
ఏమిటి?
మానవుడు
మొట్టమొదట
సత్యాన్ని,
ధర్మాన్ని
ఆచరించాలి.
ఒకవేళ
సత్యము
పలుకుటకు
అభ్యంతరమైతే
సత్యమూ
చెప్పవద్దు,
అసత్యమూ
చెప్పవద్దు.
ఆవిధమైన
జీవితమును
ఈ
జగత్తులో
మనము
అనుభవించాలి.
ఈనాడు
జగత్తుకు
అనేక
ఆపత్తులు
సంభవిస్తున్నాయి.
ఈ
జగత్తునంతా
దూరముగావించి,
వీటితో
పోరాడి
శాంతిభద్రతలు
నెలకొల్పుటకు
యువత
కంకణము
కట్టుకోవాలి.
ఈనాడు
యువతీయువకులు
కంకణం
కట్టుకోకపోతే
దేశం
పాడైపోతుంది.
ఒక్కరైనా
మంచివారుగా
తయారైతే
ఎంతైనా
అభివృద్ధి
చేసుకోవచ్చు.
వేలాదిమంది
వచ్చారు.
ఇందులో
ఏ
కొద్దిమందైనా
మంచివారుగా
తయారైతే
మంచి
క్రియలు
ఎన్నైనా
చేయవచ్చును.
దేశమును
బాగుచేయాలంటే
వేలాదిమంది
కానక్కరలేదు.
thousands
of
soldiers
ఉంటారు,
కాని
commander-in-chief
ఒక్కడే
ఉంటాడు.
ఒక్కడు
సద్గుణవంతుడైతే
చాలు.
ఎంతైనా
అభివృద్ధి
పరచవచ్చు.
వివేకానంద
చెప్పాడు,
‘పదిమంది
మంచివారు
చిక్కుతే
చాలు,
ప్రపంచాన్ని
బాగుచేస్తాను’
అని.
వివేకానంద
పదిమంది
అన్నాడు.
నాకు
పదిమంది
వద్దు.
ఒక్క
మంచివాడు
చిక్కుతే
చాలు.
ఏకం
సత్.
ఓం
ఇత్యేకాక్షరం
బ్రహ్మ.
ఒక్కటి
చాలు
జగత్తు
మారవచ్చు.
ఒకటి
పెట్టి
ఎన్ని
సున్నలు
పెట్టినా
విలువ
పెరుగుతుంది.
I
is
here.
world
is
zero.
ఒకటి
ప్రక్కన
సున్న
పెడితే
పది
అవుతుంది.
life
is
zero,
sun
is
zero,
moon
is
zero,
earth
is
zero,
sky
is
zero
అంతా
జీరోలు
పెట్టినప్పుడు
ఎంతైనా
విలువ
ఎక్కిపోతుంది.
ఎందుకు?
హీరో
పక్కపోవటం
వలన
జీరోకు
విలువ
ఎక్కువైంది.
హీరోను
తీసివేయి
అంతా
జీరో
అయిపోయింది.
కాబట్టి
ఆ
hero
is
god.
అట్టి
భగవంతుని
విశ్వసించండి.
ఆ
భగవంతుని
ఆశ్రయించండి.
భగవంతుని
శరణు
వేడండి.
అదే
నిజమైన
సాధన.
ఊరకే
చెప్పటము,
చేయకుండా
పోతే
ప్రయోజనం
లేదు.
నిన్ను
నీవు
వంచించుకున్నవాడైపోతావు.
కనుక,
చెప్పిన
దానిని
చేయటానికి
ప్రయత్నించండి.
వీధి
వీధియందు
భగవన్నామాన్ని
మీరు
ప్రారంభించండి.
పల్లె
పల్లెయందు
భగవన్నామాన్ని
ప్రారంభము
చేయండి.
అప్పుడు
దేశమంతా
భగవన్నామ
స్మరణ
చేత
పవిత్రమైన
వాతావరణము
ఏర్పడిపోతుంది.
భగవన్నామము
చేత
దేశమును
పవిత్రముగావించి
దివ్యమైన
దేశముగా
రూపొందింప
చేయాలని
నేను
ఆశిస్తున్నాను.
Previous
←
Love for God, fear of sin, morality in society
Next
Satya is the very form of God
→