Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1980 · Be human
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Be human
7 February 1980, Anantapur
1
▾
Meaning
Keep
His poems 361
Also in his talks
(12)
30 July 1987
To nurture sacred feelings in the heart is education
6 March 1989
God is the embodiment of Prema
8 October 1989
Be Pure in Thought, Word and Deed
22 May 1990
Mastery of the Senses
20 May 1991
The End Of Education Is Character
26 June 1996
Forbearance Is a Safe Armour for Man
20 October 1996
When the Heart Is Turned to Prema, the World Turns to Brahman
25 April 1998
Every Person Longs for Śānti
26 September 1998
God Is the Very Foundation of the World
22 November 2001
True education brings the wealth of character
19 January 2002
Hospitals must not become business centres
28 October 2003
Loving the Ātma principle is spirituality itself
సకల
విద్యలు
నేర్చి
సభ
జయించగవచ్చు
శూరుడై
రణమున
పోరవచ్చు
రాజరాజై
పుట్టియు
రాజ్యమేలగవచ్చు
హేమభూదానముల్
యీయవచ్చు
గగనంపు
చుక్కలు
గణియింపగావచ్చు
జీవరాసుల
పేర్లు
చెప్పవచ్చు
అష్టాంగవిద్యలనన్ని
నేర్వగవచ్చు
చంద్రమండలయాత్ర
సలుపవచ్చు
కాని
దేహేంద్రియాదుల
కట్టిపెట్టి
మనసు
నిల్పియు
నంతర్ముఖము
చేసి
అనవరత
నిశ్చలంబైన
ఆత్ములగుచు
నిలువగాలేరు
మానవుల్
నియతితోడ.
ప్రేమస్వరూపిణులారా!
విద్యార్థినులారా!
మన
దేహము,
మన
ఇంద్రియములు,
మన
మనస్సు,
మన
బుద్ధి
ఈ
నాలుగును
సమ్మిళితమైనటువంటి
స్వరూపాన్ని
మానవులమని
భావిస్తున్నాము.
కాదు
కాదు.
మనస్సు
మనము
ధరించిన
ఒక
ఉపాధి.
ఇంద్రియములు
మనము
ధరించిన
ఒక
ఉపాధి.
ఈ
దేహము
ఒక
ఉపాధి.
బుద్ధి
మనము
ధరించిన
ఒక
ఉపాధి.
మనము
ధరించిన
ఉపాధి
మనము
అని
చెప్పుటలో
అర్థములేదు.
మనము
వేరు,
మనము
ధరించిన
దుస్తులు
వేరు
అయినట్లుగా
ఈ
ఉపాధులు
వేరు,
మనం
వేరు.
ఏనాడు
ఈ
విభాగయోగమును
మనము
గుర్తించి,
అర్థము
చేసుకొని
వర్తించటానికి
ప్రయత్నింతుమో
ఆనాడే
మన
తత్త్వము,
మనయొక్క
గమ్యము
మనం
అర్థముచేసుకోటానికి
వీలవుతుంది.
దేహము
-
ఏమిటి
ఈ
దేహము?
ఇది
కేవలము
చైతన్యముతో
కూడినదా,
లేక
జడమైనదా
అనే
విషయాన్ని
మనము
విచారించినప్పుడు,
జడమైన
దేహమే
అయితే
పెరుగుట,
క్షీణించుట,
వర్తించుట,
నాశనమగుట
జరుగుచున్నదే!
ఈ
జడపదార్థమందు
ఈ
షడ్వికారములు
ఎట్లు
కలుగుచున్నవని
మనము
విచారణచేస్తే,
నిత్యమూ
మనము
హాస్టలు
ఊడుస్తున్నాము.
ఊడ్చి
దినము
కొంత
చెత్తను
తీసుకొనిపోయి
ఒక
గుంతలో
వేస్తున్నాం.
ఒక
నెల
అయ్యేటప్పటికి
ఆ
గుంతలోని
చెత్త
పెద్ద
కుప్పమాదిరి
పెరిగిపోతుంది.
ఈ
దిబ్బను
మనం
జడమంటున్నామా?
చైతన్యమంటున్నామా?
కేవలం
జడమే!
చెత్త
అధికం
కావటంచేత,
నిత్యమూ
ప్రోగుచేయటంచేత
ఈ
దిబ్బ
యేరీతిగా
పెరిగిందో
అదేవిధముగా
నిత్యమూ
ఈ
దేహము
అనేదానిలో
తిండితీర్థాదులనే
చెత్తను
వేయటంచేత
ఈ
దేహమనే
దిబ్బకూడను
పెరుగుతున్నది.
ఈ
తిండితీర్థాదులనే
చెత్తను
ఈ
దేహమనే
దిబ్బకు
చేర్చకుండిన
ఈ
దేహముకూడను
క్షీణిస్తుంది.
ఏతావాతా
ఈ
దేహముకూడను
కేవలము
జడమేగాని
చైతన్యం
కాదు.
‘దహ్యతీతి
దేహః’
అన్నారు.
దహింపబడేది
దేహము.
ఎప్పుడు
దహింపబడుతుంది?
మరణించిన
తరువాత
దహింపబడుతుందని
మనము
భావిస్తున్నాము.
కాదు
కాదు.
నిత్య
జీవితమందు
తెల్లవారినది
మొదలు
రాత్రి
పరుండునంత
వరకు
చింతలచేత
ఈ
దేహాన్ని
దహింపజేస్తున్నాం.
ఈ
చింత
కేవలం
మన
జీవితంతో
కూడినటువంటి
ఉపాధిని
దహింపజేస్తున్నది.
చితి
మరణించిన
తరువాత
కండలు,
మాంసము,
ఎముకలు,
చర్మము
ఇత్యాదిస్వరూపాన్ని
దహింపజేస్తున్నాది.
కనుక,
మన
దేహము
దహింపబడేటువంటిది.
కనుక,
జడమేగాని
చైతన్యము
కాదు.
దీనికి
మరొక
పేరు
శరీరము
అని
చెబుతున్నారు.
‘శీర్యతే
యితి
శరీరః’
అన్నారు.
క్షీణించిపోయేది
శరీరము.
ఇది
ఎప్పుడు
కూడను
జీర్ణించిపోయేటువంటిది
కనుక
శరీరము.
పుట్టినప్పుడు
మాంసపు
ముద్దవలె
పుడుతుంది.
బాల్యంలో
అతి
కోమలంగా
కనిపిస్తుంది.
యౌవనంలో
ఆకర్షణీయంగా
వుంటుంది.
వృద్ధాప్యంలో
వికారం
చెందుతుంది.
ఇది
నిరంతరం
జీర్ణించేటువంటి
స్వరూపాన్ని
ధరించింది.
కనుకనే,
దీనికి
శరీరము
అని
పేరు.
దీనిని
మరికొంతమంది
‘దేహో
దేవాలయప్రోక్తో
జీవో
దేవస్సనాతనః’
అని
దీనినొక
క్షేత్రముగా
భావిస్తూ
వచ్చారు.
మనం
దేనిని
క్షేత్రం
అంటున్నాము?
దివ్యమైన,
పవిత్రమైన
స్థానమునకు
క్షేత్రం
అని
చెబుతున్నాం.
అయితే
ఈ
దేహమనే
క్షేత్రమునకు
ఏరీతిగా
అన్వయిస్తుంది?
పవిత్రమైన
ఆత్మనివాసం
కనుకనే
‘నా
దేహము
నీ
నిలయము,
నా
జీవనము
నీకు
ఆరాధనము’
అని
యిప్పుడు
పాట
పాడారు.
‘నీ
నిలయము’
అనుకున్నప్పుడు
నిలయము
తనది
కాదుగాని,
ఆ
నిలయములో
తాను
నివసించేవాడు
అని
మనకు
స్పష్టమవుతుంది.
అయితే
ఈ
దేహము
దేవుని
నిలయం
అయినప్పుడు
ఈ
నిలయాన్ని
మనం
ఎంత
పవిత్రంగా
ఉపయోగపెట్టుకోవాలి!
ఎంత
దివ్యమైన
మార్గంలో
దీనిని
అనుభవింపజేసుకోవాలి?
కనుకనే,
ఇది
దైవముయొక్క
నిలయము.
దైవముయొక్క
మందిరము.
ఇది
పవిత్రమైన
క్షేత్రము.
కనుకనే,
ఈ
దేహమును
దివ్యమైన
మార్గమునందు,
భవ్యమైన
మార్గమునందు,
పవిత్రమైన
మార్గమునందు
ప్రవేశపెట్టి
సరియైన
మార్గమునందు
అనుభవించటానికి
ప్రయత్నం
చేసుకోవాలి.
2
▾
Meaning
Keep
His poems 68
Also in his talks
(16)
19 February 1987
When the jīva is joined with God, he becomes the very form of akṣara
20 March 1988
Bhārat is the home of Satya and Dharma
24 June 1989
Foster Prema and Share It
17 February 1990
Prema itself is God
21 May 1990
The Moving Temple
14 August 1990
Role of the Avatars
12 February 1991
Goodness is the principle of God
29 May 1991
Prasnopanishad - Answers To The Sixth Student
29 August 1992
Life is fulfilled only when one born saying ‘Koham’ attains the experience of ‘Soham’
22 June 1996
Service to Society Is the Mark of True Humanness
11 July 1996
Lack of Values is the Cause of Violence in the World
22 April 1998
The Puṣṭi, Samiṣṭi and Pravāha Jīvas
11 May 1998
Recognise the Oneness in Samaṣṭi and in Vyaṣṭi
14 August 1998
Prema Alone Is the Path, Prema Alone the Goal
8 October 1998
Good Resolves Are Themselves the Human Values
1 January 2000
Virtue is the adornment of man
ఇంక
ఈ
దేహాన్ని
మనం
ఏవిధంగా
పరిశుద్ధం
చేస్తున్నాము?
జలముతో,
సబ్బుతో,
సుగంధములతో
అనేకవిధములైన
పరిశుద్ధ
ద్రవ్యములతో
ఈ
శరీరాన్ని
మనం
పరిశుద్ధం
చేసుకుంటున్నాం.
శరీరం
పరిశుద్ధం
అయినంత
మాత్రమున
మనకు
లభించే
ఫలితం
ఏమిటి?
కొంత
ఆరోగ్యమును
కాపాడుకోవచ్చు,
రోగనివారణ
చేసుకోవచ్చు.
అంతేగాని
మానసిక
రోగం
నివారణ
చేసుకోటానికి
వీలుకాదు.
దేహము
అనేకవిధములైన
సుగంధములచేత
నింపబడి,
కప్పబడి,
దీని
ఫలితంచేత
అందరికీ
కూడను
సుగంధాన్ని
అందించే
దివ్యరూపకంగా
మనం
తయారు
చేసుకున్నప్పటికీ
మనకు
మానసికంగా
బుద్ధి,
వాక్కు
పవిత్రం
గావించుకొనకుండిన
కేవలం
దేహపరిశుద్ధం
మాత్రమే
మనకు
పరిపూర్ణ
మానవత్వం
అందించజాలదు.
జలముచేత
దేహమును,
సత్యముచేత
వాక్కును,
విద్యాతపస్సులచేత
మనస్సును,
జ్ఞానముచేత
బుద్ధిని
పరిశుద్ధం
చేసుకోవాలి.
ఎట్లా
చేసుకోవాలి?
సత్యమనే
జలంచేత
వాక్కును
బాగుగా
పరిశుద్ధం
చేసుకోవాలి.
విద్యాతపస్సులచేత
మనస్సును
పరిశుద్ధం
చేసుకోవాలి.
విద్య
అనగా
ఏమిటి?
కేవలం
గ్రంధపరిచయమా?
వ్రాయటం,
చదవటం
విద్యా?
కాదుకాదు.
విద్య
ప్రకాశాన్ని
అందించేది.
వెలుగును
అందించేది.
విద్య
దేదీప్యమానమైన
జ్యోతివంటిది.
అజ్ఞానఅహంకారముల
దూరంగావించేటువంటిది.
వినయవిధేయతలను
అందించేటువంటిది.
కనుకనే,
అలాంటి
విద్యను
మనం
అభివృద్ధిగావించుకొని
తద్వారా
మన
మనస్సును
పరిశుద్ధం
చేసుకోటానికి
ప్రయత్నంచేయాలి.
మనస్సును
పరిశుద్ధం
చేయటానికి
తపస్సు.
తపస్సు
అనగా
ఏమిటి?
తల
క్రిందపెట్టి,
కాళ్ళు
పైకిపెట్టి
తపస్సు
చేయటమా?
కాదుకాదు.
కందమూలాదులు
భుజించి
కాయమును
శుష్కింపజేయటమా?
కాదుకాదు.
తపస్సనగా
ఏమిటంటే
మనస్సు,
వాక్కు,
కాయము
ఈ
మూడింటి
ఏకత్వాన్ని
మనం
చేకూర్చుకోవాలి.
అప్పుడే
దీనిని
విద్యాతపస్సు
అనుకోవచ్చు.
తపస్సనగా
మనస్సునందు
తలచేటువంటిది,
మాటలో
చెప్పేటువంటిది,
క్రియలో
ఆచరించేటువంటిది,
మూడింటియొక్క
ఏకత్వాన్ని
మనము
అనుభవించాలి.
ఇదే
నిజమైన
తపస్సు.
తపస్సనగా
మనం
ఇల్లువాకిలి
వదలి,
బాధ్యతలను
తిరస్కరించి
అరణ్యానికి
వెళ్ళి
ఏదో
భగవంతుని
ధ్యానించటం
కాదు.
దేవుడనగ
వేరు
దేశమందున
లేడు
దేవుడనగ
తనదు
దేహమందె
పాపమనగ
వేరు
పరదేశమున
లేదు
తానుచేయు
పనులదగిలియుండు.
పాపముగాని,
పుణ్యముగాని,
దైవముగాని,
దయ్యముగాని
మనయొక్క
హృదయమునందే
వుంటుంటాది.
దైవము
చేరెనా,
దయ్యం
వుండదు.
‘ధర్మమెచటనుండు,
అచ్చట
దైవముండు.
ధర్మమెచటుండదో
అచ్చట
దయ్యముండు’.
దయ్యమునకు,
దైవమునకు
కేవలం
ఒకే
స్థానం.
ఇది
కేవలము
మ్యూజికల్
ఛైర్
వంటిది.
ఒకరు
అందులో
ప్రవేశిస్తే
మరొకరు
వచ్చి
అందులో
కూర్చోటానికి
వీలుకాదు.
కనుక,
మనం
దైవానికి
హృదయమనే
ఛైర్
నిరంతరమూ
అట్టిపెట్టి
వుండాలి.
కాన,
ఇది
దైవమందిరం
అనుకోటంలో
మన
హృదయమును
పరిశుద్ధం
గావించుకోటానికి
మనకు
ఈ
జ్ఞానం,
ఈ
విద్య,
ఈ
తపస్సు,
ఈ
సత్యము
ఎంతైనా
సహాయకారులుగా
వుంటాయి.
కాన,
జడమైన
దేహాన్ని
చైతన్యవంతమైన
దైవత్వానికి
నిలయంగా
ఏర్పరచుకొనే
నిమిత్తమై
మనమీ
విద్యలు
నేర్చాలి.
భౌతిక
విద్యలు
అవసరమే.
నిత్యజీవితమందు
ఏదో
ఒక
రకమైన
స్వాతంత్ర్యజీవనము
అనుభవించుకోటానికి
మనకీ
విద్యలు
అవసరమే.
కాని,
ఈ
జీవనోపాధికి
సంబంధించిన
విద్యలుకూడను
జీవితపరమావధిగా
మనం
భావించుకోటానికి
ప్రయత్నం
చేయటమే
తపస్సు.
జీవనోపాధి,
జీవితపరమావధి
ఈ
రెండింటియొక్క
ఏకత్వాన్ని
మనం
అనుభవించటానికి
తగిన
ప్రయత్నం
చేయటమే
సరియైన
విద్య.
కనుక,
దేహమనే
దానిని
మనం
ఈనాడు
పోషించుకుంటున్నాం.
అభివృద్ధి
గావించుకుంటున్నాం.
అలంకారములు
చేయించుకుంటున్నాము.
అన్నివిధాలా
ఆకర్షణీయంగా
వుంటున్నాం.
కాని,
దేని
నిమిత్తం?
లోపల
ఇంటిలో
ప్రవేశించినటువంటి
దేవుని
నిమిత్తమై
జడమైనటువంటి
దేహమును
చైతన్యరూపకంగా
తీర్చిదిద్దుకుంటున్నాం.
ఇంక
ఇంద్రియములు.
మొదటి
ఉపాధి
దేహము,
రెండవ
ఉపాధి
ఇంద్రియములు.
మీకు
తెలుసు.
ఈ
ఇంద్రియము
ఎలాంటిది?
శబ్ద,
స్పర్శ,
రూప,
రస,
గంధ.
ఈ
పంచేంద్రియములయొక్క
తత్త్వాన్ని
మనం
చక్కగా
పసికట్టాలి.
ఏవిధంగా?
ఏ
ఇంద్రియములు
దైవము
ఏ
కార్యము
నిమిత్తమై
మనకు
అందించాడో
ఆ
కార్యము
మాత్రమే
ఆ
ఇంద్రియముల
ద్వారా
మనం
ఆచరించాలి.
భిన్న
కార్యములు
మనం
ఈ
ఇంద్రియముల
ద్వారా
ప్రవేశపెట్టితిమా
భిన్న
ఫలితములకు,
భిన్న
భావములకు,
భిన్న
దుఃఖములకు
గురికావలసివస్తుంది.
ఎట్ల?
కన్ను
చూడగలుగుతున్నాది.
ఈ
చూచేటువంటి
దానికి
మాట్లాడే
శక్తి
లేదు.
నాలుక
మాట్లాడుతుంది.
కాని,
దానికి
చూచే
శక్తి
లేదు.
ఒక్కొక్క
ఇంద్రియమును
ఒక్కొక్క
కార్యము
నిమిత్తమై
దైవము
నిర్ణయించాడు.
ఏవిధంగా
నిర్ణయించాడు?
ఒక
పరిమితిలో
నిర్ణయించాడు.
అని
మనం
నిశ్చయం
చేసుకోవాలి.
ఈ
పరిమితికే
మనం
కొన్నివిధములైన
క్రమశిక్షణను
అవలంభింపజేసుకోవాలి.
3
▾
Meaning
Keep
ఏమిటి
దీని
పరిమితి?
మాటాడే
నాలుక
మాటాడగలదు.
కాని,
ఎట్టి
మాటలు?
మంచి
మాటలా,
చెడ్డ
మాటలా?
లేక
ఇతరులను
నిందించే
మాటలా?
ఇతరులను
ఆనందపెట్టే
మాటలా?
లేక
పశువా
అనిపించే
మాటలా?
పశుపతి
అనిపించే
మాటలా?
దానిని
మనం
నిర్ణయం
చేసుకోవాలి.
ఇక్కడ
మన
పరిమితి
నిర్ణయంగావించుకోవాలి.
దీనినే
ఉపనిషత్తులందు
‘మాత్రః’
అని
చెప్పారు.
అనగా
పరిమితి
అని
అర్థం.
ముక్కుతో
మంచి
వాసన
చూచుకోటానికే
అందించాడు
కాని
భగవంతుడు,
యిష్టంవచ్చినట్లంతా
నశ్యం
పీల్చుకోటానికి
అందించలేదు.
సుగంధాన్ని
అందుకునే
నిమిత్తమై
అందించినటువంటి
ఈ
నాశికమును
మనం
విరుద్ధమైన
మార్గాన్ని
అవలంబింపజేసినప్పుడు
మన
ఆరోగ్యం
క్షీణిస్తున్నాది.
ఈ
ముక్కుకూడా
అపవిత్రమైపోతున్నాది.
కారణమేమిటి?
భగవత్
నిర్ణయానికి
విరుద్ధంగా
పోతుండాది.
ఇక
కన్ను.
చూడవలసినటువంటిది
కన్ను.
కాని,
దేనిని
చూడటము?
విరుద్ధమైన
వికారాలు
చూడటమా?
అసభ్యమైన
దృశ్యాలు
చూడటమా?
కాదుకాదు.
ఈ
నిమిత్తమై
భగవంతుడు
మనకు
కన్నులను
ప్రసాదించలేదు.
దృశ్యసంబంధమైన
సౌందర్యాన్ని,
దైవానందముతో
తూగి,
మైమరచి,
తన్మయులై
ఆనందంగా
ఉన్మత్తులైన
వ్యక్తులను,
ఈ
దివ్యమైన
భావాలుచూచే
నిమిత్తమై
కన్నులు
మనకు
మనకు
అనుగ్రహించాడు.
అలాటి
కన్నులచేత
పాపపు
పనులు,
పాపపు
కార్యములు,
పాపపు
దృశ్యములు
చూడటానికి
ప్రయత్నించిన
మన
కన్నులకు
నిర్ణయించిన
దానికి
విరుద్ధంగా
నడచిన
వారమౌతాము.
అప్పుడు
కన్నులు
అపవిత్రమైపోతాయి.
అదేవిధముగా
చెవులు,
చర్మము,
నోరు
యివన్నీ
కూడను
విరుద్ధమైన
మార్గములో
ప్రవేశపెట్టినప్పుడు
అపవిత్రమైపోతాయి.
నాలుక.
ఇది
నాలుగు
రకములైన
పాపములు
సంపాదించి
పెడుతున్నాది
మనకు.
ఏమిటా
నాలుగు
పాపములు?
మీకు
అనేక
పర్యాయములు
చెప్పాను.
అసత్యమాడటం
మొదటి
పాపము.
ఇది
ధర్మవిరుద్ధము.
ఒకరిపైన
చాడీలు
చెప్పటం
రెండవ
పాపము.
అతి
భాష
మాటాడటం,
మూడవ
పాపం.
పరదూషణ
చేయటం
నాల్గవ
పాపం.
పరులను
దూషించటము
పాపం,
కనుక,
పరులను
దూషించకూడదు.
దేనికోసం
దూషించకూడదు?
పరమాత్మ
సర్వులయందూ
వుంటున్నాడు.
‘మమైవాంశో
జీవలోకే
జీవభూతస్సనాతనః’
అని
భగవద్గీత
చెప్పింది.
అన్ని
జీవులూ
నా
అంశమే.
అన్ని
జీవులయందు
వున్నటువంటిది
నా
అంశమే.
ఏ
అంశము?
సనాతనమైన
నా
అంశము.
కనుక,
అందరును
భగవత్స్వరూపులుగా
మనం
భావించినప్పుడు
పరులను
దూషించటంచేత
పరమాత్మను
దూషించినవారమౌతాము.
కనుక,
ఇది
పాపము.
పరులను
దూషించకూడదు.
ఇంక,
చాడీలు.
వీరిపైన
వారు,
వారిపైన
వీరు
ఈవిధంగా
ఒకరిపైన
ఒకరు
చాడీలు
చెప్పుకోకూడదు.
ఇదికూడను
ఒక
పాపం.
ఇదికూడను
నాలుకకు
నియమించినటువంటి
నిర్ణయము
కాదు.
ఇది
విరుద్ధమైనది.
ఇక
అసత్యమాడటం.
అసత్యం
మరింత
పాపం.
సత్యస్వరూపుడు
భగవంతుడని
అంటున్నాం.
కాని,
అసత్యాన్ని
భగవంతునిగా
ఆరాధిస్తున్నాము.
కనుక,
అసత్యము
దయ్యముతో
సమానమైనది.
పెనుభూతంతో
సమానమైనది.
పిశాచముతో
సమానమైనది.
మహా
పీడాకరమైనటువంటిది.
ఇంక
మనం
చేయు
అతిభాష.
చాలామందికి
సహజంగా
వుంటుంటాది.
అతిభాష
మంచిది
కాదు.
అతిభాష
మతిహాని.
మీకు
అనేక
పర్యాయములు
చెప్పాను.
అధికంగా
మాట్లాడటంచేత
జ్ఞాపకశక్తి
నశించిపోతుంది.
పనిచేసేటువంటి
శక్తి
మనలో
క్షీణించిపోతుంది.
ఉత్సాహం
క్షీణించిపోతుంది.
ఇవి
రెండూ
మీకు
తెలియకుండా
పోవచ్చు.
మూడవది
మాత్రం
అందరికీ
తెలుసు.
ఎవరైనా
అతిగా
మాటాడేవారు
మన
దగ్గరకు
వచ్చేటప్పటికి,
‘వచ్చిందిరా
వాగుడుకాయ’
అని
తప్పించుకోటానికి
ప్రయత్నము
చేస్తుంటాము.
దేనివల్ల?
ఆమె
మాటలు
నయాపైసా
యిచ్చి
మనం
కరిపించుకుంటే
నాలుగువేలు
యిచ్చినా
వదిలించుకోటానికి
వీలుకాదు.
ఏదో
అనవసరమైనదంతా,
లోకాభిరామాయణమంతా
తెచ్చి
మన
దగ్గర
చెబుతుంటారు.
ఆ
అమ్మాయి
యిట్లా,
ఈ
అమ్మాయి
అట్లా
అని.
అయినా,
ఎందుకు
యివన్నీ
మనకు?
మన
మంచిని
మనం
తెలుసుకొని,
మన
చెడ్డను
మనం
తీసివేసుకొని,
మన
పవిత్రతను
మనం
అభివృద్ధిచేసుకోటానికి
వచ్చినటువంటి
మనం
ఇతరుల
విషమంతా
తలలో
ఎందుకు
చేర్చుకోటం!
కనుక,
ఇతరుల
మాటలను
మనం
వినకూడదు.
చాడీలు
చెప్పటంగాని,
అతిభాషతో
వాగటంగాని
ఈ
రెండూ
సన్నిహిత
సంబంధాన్ని
చేకూర్చుకుంటాయి.
అతిభాష,
చాడీలు
చెప్పటం
ఈ
రెండూ
కవలలు.
అతిభాష
మాట్లాడేవారికి
చాడీలు
తప్పకుండా
ప్రవేశిస్తాయి.
చాడీలు
చెప్పేటువంటివారికి
అతిభాష
అందులో
స్నేహమైపోతుంది.
ఈ
అతిభాష
లేకపోతే
చాడీలు
చెప్పటానికి
వీలుకాదు.
చాడీలు
చెప్పేవారికి
ఈ
అతిభాష
లేకపోతే
ఈ
చాడీల
బలం
వుండదు.
అందునిమిత్తమై
ఈ
రెండింటినీ
వారు
బాగా
కరిపించుకుంటారు.
కనుక,
ఈ
అతిభాష
తగదు.
కనుకనే,
మన
నోరు
పవిత్రమైనదిగా
వుండాలి.
‘జిహ్వే
రసజ్ఞే
మధుర
ప్రియేత్వం
సత్యం
హితం
త్వాం’
మనం
సత్యం
చెప్పినా
కూడను
ఉద్రేకంగాగానీ,
నిరుత్సాహపరిచేటువంటిదిగాని,
బాధలుపెట్టే
దానినిగాని
చెప్పకూడదు.
‘సత్యం
బ్రూయాత్,
ప్రియం
బ్రూయాత్’.
సత్యం
చెప్పాలి,
ప్రియంగా
వుంటుండాలి.
‘నబ్రూయాత్
సత్యమప్రియం’.
సత్యము
అప్రియమని
మనం
అసత్యం
చెప్పటానికి
ప్రయత్నించకూడదు.
అందువల్లనే,
భగవద్గీతలో
‘అనుద్వేగకరం
వాక్యం,
సత్యం
ప్రీతిహితం
భవేత్’
అన్నారు.
హితంగా
వుంటుండాలి.
ప్రీతిగా
వుంటుండాలి.
సత్యంగా
వుంటుండాలి.
ఈవిధమైన
వాక్కులచేత
మనం
నాలుకను
పవిత్రం
చేసుకోవాలి.
కనుకనే,
ఈ
కరణములకంతా
కూడను
మాత్రః
అని
పేరు
పెట్టారు.
మాత్ర
అనగా
కొలత
అని
అర్థము.
కొలత
అంటే
తెలుసుకదా!
ఆమె
చాలా
బాగా
ఉంటుండాది.
4
▾
Meaning
Keep
కాని,
కొంచెం
పొట్టిగా
వుంటున్నాది,
అంటే
ఆమెయొక్క
రూపాన్ని
ఏది
కొలత
వేసింది?
కన్ను
కొలత
వేసింది.
కనుక,
కన్ను
ఒక
కొలబద్ద.
ఈనాడు
మా
వార్డెన్గారు
పప్పు
చేశారు.
పప్పులో
కొంచెం
ఉప్పు
తక్కువయింది
అన్నారు.
ఈ
పప్పులో
ఉప్పు
తక్కువైందనే
కొలత
వేసింది
నాలుక.
అదేవిధముగా
ప్రతిదానికి
కూడను
ఒక్కొక్క
ఇంద్రియము
కొలత
వేస్తున్నాది.
ఇది
మంచి,
ఇది
చెడ్డ.
మనం
ఏదైనా
మంచిపాటలు
వింటే,
‘ఆహా!
ఎంత
శ్రావ్యముగా
వుంటున్నాయి’
అంటున్నాము.
ఏదైనా
అపస్వరంగా
వుంటే,
‘అబ్బ,
వినటానికి
యింపుగా
లేదు’
అంటున్నారు.
దీనిని
కొలత
యేది
వేసింది?
దీనిని
మన
కర్ణములే
కొలత
వేసినాయి.
ఈవిధంగానే
మన
ఇంద్రియములన్నీ
ఒక్కొక్క
దానిని
కొలతవేసి
నిర్ణయము
చేస్తున్నాయి.
మన
ఇంద్రియములు
కొలత
వేసేటువంటివి
కనుక,
మనం
చక్కగా
కొలత
వేసి
వానిని
పరిమితిలో
ఉపయోగపెట్టుకోటం
ఇంద్రియాలయొక్క
సార్థకం.
ఇదే
మనం
ఈనాడు
జాగ్రత్తపడవలసినది.
ఉపయోగపెట్టుకోవలసినది.
ఇంద్రియములు
పెడమార్గం
పట్టటం
చేతనే
మానవత్వం,
బుద్ధి
మరుగు
పడిపోతుండాది.
మన
ఇంద్రియములు
ఉద్రేకమయ్యేకొద్దీ
వాటిని
మనం
అనుసరించకూడదు.
‘సకల
విద్యలు
నేర్చి
సభ
జయించగవచ్చు’.
ఆహా!
గొప్పగా
ఉపన్యాసం
యిచ్చాడురా
అని
ఒక్కొక్కరు
పేరు
తెచ్చుకోవచ్చు.
‘రాజరాజై
రాజ్యమేలగ
వచ్చు,
హేమగోదానముల్
చేయవచ్చు’.
కాసంత
బంగారం
దానం
చేయవచ్చు.
గోదానం
చేయవచ్చు.
భూదానం
చేయవచ్చు.
సర్వదానములు
చేయవచ్చు.
కర్ణుడు
తన
కుండలాలే
తీసియిచ్చాడు.
కానీ,
ఏమి
ప్రయోజనం?
చర్మాన్నికూడా
కోసి
యిచ్చేశాడు.
కాని,
ఏమి
ప్రయోజనం?
‘ఎక్కడ
వుంటున్నాది
దీని
కీలకం?
ఎక్కడ
వున్నాది
దీని
గమ్యం?
ఎక్కడ
వుంటున్నాది
దీని
మూలాధారం?’
అని
విచారించుకుంటే
హృదయమునందే
వుంటున్నాది
మూలాధారం.
ఈ
కరణముల
వలనే
మనస్సుకు
కూడను
‘అంతఃకరణ’
అని
పేరు
పెట్టారు.
కరణములు
అంటే
ఇంద్రియములు.
మనస్సుకే
అంతఃకరణ
అని
పేరు.
ఈ
మనస్సు
ఎట్లాంటిది?
ఇది
ఒక
ఉపాధి.
ఈ
మనస్సు
ఏరీతిగా
వుంటుందంటే,
‘మనన’
నిరంతరమూ
మననము
చేసేటువంటిది.
‘మననాత్
ఇతి
మనః’
అన్నారు
భగవద్గీతలో.
నిరంతరమూ
సంకల్పవికల్పాలతో
అభివృద్ధిగావించుకొనేదే
మనస్సు.
ఎవ్వరితోనైనా
మీరు
మాట్లాడకుండా
వుండవచ్చు.
కాని,
మీ
సంకల్పాలు
మాత్రం
యిష్టంవచ్చినట్లు
మాట్లాడుతుంటాయి.
రాత్రి
నిద్ర
వచ్చేంతవరకు
మీరు
మాట్లాడుతూనే
వుంటారు.
ఏవిధంగా?
ఒక
విద్యార్థిని
యింకొక
విద్యార్థినితో
కాదు.
మీతో
మీరే
మాట్లాడుకుంటున్నారు.
అదే
సంకల్పము.
ఈ
సంకల్పాలు
ఒక్కొక్క
పర్యాయం
వీని
వేగం
అధికం
కావటంచేత
ఒక్కొక్క
తూరి
అస్తవ్యస్తమై
పోతుంటాది.
దారి
తప్పిపోతుంటాది.
దీనివల్లనే
అనేకమంది
ఈనాడు
విద్యాబోధకులు,
విద్యాధికారులు,
విద్యార్థులుకూడను
కొంత
పిచ్చివారుగా
తయారైపోతున్నారు.
ఏమి
చెయ్యాలి,
ఏమి
చెయ్యకూడదు,
ఏది
చూడాలి,
ఏది
చూడకూడదు,
ఏది
మంచిది,
ఏది
చెడ్డది
అని
నిర్ణయించుకునే
శక్తిసామర్థ్యములు
వారిలో
తగ్గిపోతుంటాయి.
కారణమేమిటి?
వారిలో
ఈ
సంకల్పములయొక్క
వేగం
తీవ్రమైపోవటంచేతనే
మనయొక్క
పరిస్థితి
ఈవిధమైన
దుస్థితికి
దిగజారిపోతున్నాది.
కాన,
సంకల్పాలకు
మనం
ఏమాత్రంకూడను
వేగాన్ని
అందించకూడదు.
పరమ
శాంతముతో
...
ఏవిధంగా
వుండాలి?
అన్నిటికీ
మనం,
ఎవరు
యేమన్నప్పటికీ,
దూషించినప్పటికీ,
ఎవరు
ఏవిధముగా
భావించినప్పటికీ
మనం
సహనభావం
కలిగి
వుండాలి.
తపస్సులు
మూడు
రకములుగా
వుంటున్నాయి.
మనస్సు
యొక్క
తపస్సు
ఒకటి.
వాక్తపస్సు
ఒకటి.
దేహతపస్సు
ఒకటి.
ఈ
దేహతపస్సులోనే
ఐదువిధములైన
తపస్సులున్నాయి.
గురువులను,
దైవమును,
పెద్దలను
ఆరాధించి,
వారిని
ఆశ్రయించి,
వారిని
ప్రసన్నుల
గావించుకొని,
వారియొక్క
బోధలను
శ్రవణంచేసి,
వారియొక్క
ఆజ్ఞను
శిరసావహించి
కొన్నివిధములైన
ఆచరణలు
చేయటంచేత
వారి
అనుగ్రహానికి
పాత్రులైపోతున్నాము.
వారియొక్క
ఆశీర్వాదాలను
అందుకోగలుగుతున్నాం.
ఇది
ఈ
దేహంతో
చేసేటువంటి
మొదటి
తపస్సు.
పెద్దలను
దర్శించటము,
పెద్దలయొక్క
బోధలను
వినటము,
విన్నటువంటి
దానిని
ఆచరణలో
పెట్టటము
ఇలాంటివంతా
దేహంతో
చేసేటువంటి
ఒక
తపస్సు.
రెండవ
తపస్సు
ఏమంటే
అంతర్బహిర్శౌచము.
దేహాన్ని
ఏవిధంగా
మనం
స్నానంచేసి
పవిత్రంగా,
శుభ్రంగా
చేసుకుంటున్నామో
ఆవిధంగానే
మనము
మన
పరిసర
ప్రాంతములుకూడా
పరిశుద్ధం
చేసుకోవాలి.
మన
దేహము,
మన
భావములు,
మన
పరిసరప్రాంతం
యివన్నీకూడా
పరిశుద్ధంగావించుకోవాలి.
మూడవది
బ్రహ్మచర్యం.
బ్రహ్మచర్యమనగా
పెండ్లిచేసుకోకుండా
వుండటం
మాత్రమే
బ్రహ్మచర్యంకాదు.
పవిత్రమైన
భావంచేత,
నిర్మలమైన
చిత్తంచేత,
నిస్వార్థమైన
కపటంలేని
హృదయంచేత,
దివ్యమైన
దైవప్రేమచేత
మన
కాలాన్ని
గడపటమే
బ్రహ్మచర్యము.
హనుమంతుడు
మీకు
తెలుసు.
అతడు
నిత్యబ్రహ్మచారి
అంటున్నాం.
కాని,
అతనికి
పెండ్లి
అయింది.
శ్రీవత్సల
పెండ్లిచేసుకుంది.
అయినప్పటికీ
అతడు
బ్రహ్మచారి
అనటంలో
కారణమేమంటే
నిరంతరం
బ్రహ్మములో
చరించేటువంటివాడు.
కనుక,
బ్రహ్మచారి
అన్నారు
నిరంతరం
కూడను,
‘రామ
రామ
రామ
రామ’
రోమరోమంలోనూ
రామనామమును
స్మరిస్తూ
వుండటంచేత
నిరంతరం
బ్రహ్మమునందే
చరిస్తున్నాడు.
కనుక,
అతడు
బ్రహ్మచారి.
మన
చింతన,
మన
భావము,
మన
సంకల్పము,
మనయొక్క
పనులు,
మనయొక్క
సర్వమూ
బ్రహ్మమునందే
చరించాలి.
దానిని
బ్రహ్మచర్యం
అన్నారు.
ఏదిచేసినా,
ఏది
చూచినా,
ఏది
చెప్పినా
దైవంగానే
భావించుకోవాలి.
ఈ
దేహంతో
కొన్నిరకములైన
నిబంధనలు
పాటించుకోటమే
కాదు.
అదికూడా
అవసరమే.
5
▾
Meaning
Keep
Also in his talks
(9)
10 February 1980
Education in the Sai era
26 June 1996
Forbearance Is a Safe Armour for Man
5 July 1996
For Every Kind of Sādhana, Prema Is Life Itself
19 August 1996
The Mind Itself Is the Root Cause of Bondage and Mokṣa
16 July 1997
Love for God, fear of sin, morality in society
5 April 1998
Who can recognise the principle of Śrī Rāma
4 September 1998
Remembering the Name of God Removes All Sorrow
6 May 2001
The sweetness of a mother's Prema is beyond words
22 August 2001
Vināyaka is the embodiment of all the gods
వాటితోబాటు
మనస్సుయొక్క
భావాన్నికూడను
కొంతవరకు
దానికి
తగినట్లుగా
మార్చుకోటానికి,
మలచుకోటానికి
ప్రయత్నించాలి.
ఇంక
ఐదవది
అహింస.
అహింస
అనగా
ఏమిటి?
కేవలం
ఒక
జీవిని
హింసించటం
కాదు.
ఒక
ప్రాణిని
హింసించకుండా
వుండటం
కాదు.
ఒక
ప్రాణిని
శారీరకంగా
హింసించకుండా
వుండటం
మాత్రమే
కాదు.
మాటలచేత
కూడను
యితరులను
బాధపెట్టకూడదు.
కనుసైగలచేత
కూడను
యితరులను
బాధపెట్టకూడదు.
లేక
పనులచేత
బాధపెట్టకూడదు.
ఇంకేవిధంగాను
యితరులను
బాధపెట్టకుండా
చూచుకోటం
అహింస.
సహనమే
అహింస
అన్నారు.
అన్నింటిని
మనం
ఓర్చుకొనిపోతే
యింతకంటే
గొప్ప
అహింస
యేమాత్రము
వుండదు.
ఎవ్వరినీ
యేవిధంగాను
బాధపెట్టటానికి
వీలుండదు.
కనుక,
మనం
అహింసకుండే
దివ్యశక్తిని
అభివృద్ధిచేసుకోవాలి.
ఈ
సహనశక్తి
వుండినప్పుడే
మనం
ఎంతైనా
జీవితాన్ని
రాణింపచేసుకోవచ్చు.
అంతేకాదు.
క్షమకూడా
వుంటుండాలి.
క్షమ
సత్యము,
క్షమ
ధర్మము
క్షమ
వేదము,
క్షమ
అహింస,
క్షమ
యజ్ఞము
క్షమ
సంతోషము,
క్షమ
దయ
క్షమ
సర్వస్వము
సర్వలోకంబులకున్.
ఈ
క్షమ
ఎంత
పవిత్రమైనదో
యోచన
చేసుకోవాలి.
ఈ
క్షమను
అభివృద్ధిచేసుకున్నప్పుడు
విద్యయందు
వినయవిధేయతలుకూడా
అభివృద్ధిపొందుతాయి.
తద్వారా
మన
జీవితం
శోభాయమానంగా
వుంటుంది.
జీవితంలో
వివిధ
పరిధులమధ్య
సామరస్యము,
సమన్వయము
వుండినప్పుడే
జీవితం
శోభిస్తుంది.
నిత్యజీవితంలో
నిత్యసత్యములుగా
ప్రకాశించే
ప్రాచీన
సాంప్రదాయములను,
సంస్కృతిని
నేటి
కాలానుగుణంగా
సమన్వయంచేసుకోటానికి
తగిన
ప్రయత్నంచేయటమే
చదువుయొక్క
లక్ష్యం.
కనుక,
మనం
చదువుతున్నామని,
పెద్దపెద్ద
డిగ్రీలు
తీసుకుంటున్నామని
ఇంతమాత్రముతోనే
తృప్తిపడకూడదు.
ఆ
డిగ్రీలతోబాటు
మన
మానవత్వాన్నికూడా
అభివృద్ధిగావించుకోటానికి
తగిన
ప్రయత్నం
చేయాలి.
ఈ
మానవత్వాన్ని
ఎంత
అభివృద్ధిచేసుకుంటామో
దేశంకూడను,
విశ్వంకూడను,
సమాజంకూడను
అంత
అభివృద్ధి
అయిపోతుంది.
ఈనాడు
కావలసినవన్నీ
అభివృద్ధిచేసుకుంటున్నాము.
ఒక్కొక్క
డిపార్ట్మెంటులోపల
ఒక్కొక్క
నూతనమైన
పద్ధతిని
అభివృద్ధిచేస్తున్నాం.
కాని,
మన
మానవత్వాన్ని
మాత్రం
మనం
తెలుసుకుంటున్నామా?
తెలుసుకోటం
లేదు.
ఆస్తిపాస్తులు
పెంచుకుంటున్నాం.
దేహాన్ని
పెంచుకుంటున్నాం.
బంధుబలగాన్ని
పెంచుకుంటున్నాం.
సంపదను
పెంచుకుంటున్నాము.
సంతానాన్ని
పెంచుకుంటున్నాం.
కాని,
మానవత్వాన్ని
పెంచుకోటానికి
ప్రయత్నం
ఎక్కడకూడను
చేయటంలేదు.
మానవత్వం
ఎక్కడ
పెరుగుతుందంటే
ఒక
దివ్యమైనటువంటి
మార్గమందే,
ఆధ్యాత్మికమార్గమందే
పెరుగుతుంది.
ఆత్మతత్త్వమందే
పెరుగుతుంది.
ఇది
మరొచోట
పెరిగేటువంటిది
కాదు.
విత్తనం
మట్టిలో
పెట్టి,
నీరు
పోస్తే
పెరుగుతుందిగాని,
ఒక
టిన్నులో
పెట్టి
నీరుపోస్తే
కుళ్ళిపోతుంది.
అదేవిధంగా
మనం
ఈ
పవిత్రమైన
మానవత్వమునకు
ఒక
విశాలమైన
దృక్పథంలో
పెంచుకుంటూ
రావాలి.
ఇదే
పవిత్రమైన
విద్య.
పవిత్రమైన
తపస్సు.
పవిత్రమైన
దివ్యత్వం.
ఈ
దివ్యత్వాన్ని
విద్యార్థినులు
దినదినాభివృద్ధిచేసుకుంటూ
తద్వారా
ఈ
విద్యతోబాటు
వివేకాన్ని,
వివేకంతోబాటు
అనుభవాన్ని,
ఈ
అనుభవం,
వివేకం
ఈ
రెండిటి
ద్వారా
ఏర్పడినటువంటి
దివ్యమైన
భావాన్ని
సమాజమునందుంచి
లోకకల్యాణమునకై
దీనిని
వినియోగపరచి
మీరు
సార్థకమొంది,
దేశాన్ని,
దివ్యమైన
సమాజాన్ని
మనం
తిరిగి
పునరుద్ధరింపజేయటానికి
తగిన
ప్రయత్నంచేయాలని
నేను
ఆశిస్తూ
ఆశీర్వదిస్తూ
నా
దీర్ఘప్రసంగాన్ని
విరమిస్తున్నాను.
Previous
←
Aim of Life
Next
Kingdom of Mother Sai
→