Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 2008 · Complete sacrifice alone is the stairway to immortality
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Complete sacrifice alone is the stairway to immortality
12 September 2008, Onam, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
His poems 33
Also in his talks
(15)
15 June 1973
The Bond of Prakṛti and the Paramātma
15 March 1978
The whole duty is yours
23 November 1986
Inquiry into Ātma-jñāna itself is Sanātana Dharma
2 January 1987
Sanātana Dharma is the essence of all the wisdom of the Vedas
7 April 1989
All this is Vāsudeva
17 October 1990
The strength of the Ātma alone is true strength
23 November 1990
Restore the glory of Bharat
22 November 1996
Along with Study, Saṁskāra Too Is Very Necessary
23 November 1998
Sarvaṁ Khalvidaṁ Brahma
10 September 2000
God is within you
19 January 2001
Doctors must serve the poor in a spirit of sacrifice
22 November 2003
True Prema stands only when selfishness is given up
10 August 2006
Offering oneself is the true yajña
13 April 2008
The Name of Rāma is best; the thought of Rāma is enough
22 November 2008
The duty of guarding the wealth of Dharma of Mother Bhārata is yours!
ఖండఖండాంతర
ఖ్యాతి
నార్జించిన
మహనీయులను
గన్న
మాతృభూమి
పాశ్చాత్య
వీరుల
పారద్రోలించియు
స్వాతంత్ర్యమును
గన్న
సమర
భూమి
పాండిత్యమున
చాల
ప్రఖ్యాతి
గాంచియు
ప్రతిభ
చూపించిన
భరతభూమి
సంగీత
సాహిత్య
శాస్త్రీయ
విద్యల
ధీశక్తి
చూపిన
దివ్యభూమి
చిత్రకళలతోడ
చిత్రమైయున్నట్టి
భరతభూమియందు
జననమొంది
భరతమాత
ధర్మభాగ్యంబు
కాపాడ
బాధ్యతంతయు
మీదె
బాలబాలికలార!
ప్రేమస్వరూపులారా!
భరతదేశము
సామాన్యమైనటువంటిది
కాదు.
‘భారత’
అనగా
ఏమిటి?
భగవత్
రతి
కలిగినటువంటివారు
భారతీయులు.
కనుకనే,
దీనికి
భారతదేశము
అని
పేరు
వచ్చింది.
ఇట్టి
పుణ్యభూమియందు
పుట్టి,
పెరిగి
అనేక
విద్యలను
నేర్చి,
అనేక
అవరోధములను
సాహసముతో
అధిగమించి
ఆదర్శములను
చూపించినటువంటి
మహావీరులు,
ధీరులు,
గంభీరులు
భారతీయులు.
ఇట్టి
పవిత్రమైన
భారతదేశమునందు
ఈనాడు
ఎన్నియో
కష్టములు
కలుగుచున్నవి.
కాని,
వీటికి
మనము
భయపడనక్కర్లేదు.
ఆత్మవిశ్వాసముతో
వీటిని
ఎదుర్కోవాలి.
2
▾
Meaning
Keep
ఆత్మవిశ్వాసము
లేనప్పుడు
మనం
ఎన్ని
చదువులు
చదివినప్పటికీ,
ఎన్ని
శాస్త్రములు
పఠించినప్పటికీ,
ఎన్ని
పరిశోధనలు
చేసినప్పటికీ
ప్రయోజనం
ఉండదు.
అంతేకాదు,
వాటివలన
టైమ్కూడను
వ్యర్థం
చేసినవారవుతారు.
భగవంతుణ్ని
తెలుసుకోవడానికి
ఇదికాదు
మార్గము.
ఇంద్రియాలను
నిగ్రహించుకొని
మనసునరికట్టి,
భగవద్విశ్వాసమును
పెంచుకున్నప్పుడే
భగవంతుణ్ని
తెలుసుకోవచ్చును.
ఆత్మవిశ్వాసమువల్లనే
మీరు
భగవంతుణ్ని
అంతో
ఇంతో
తెలుసుకోగలరుగాని,
ఆత్మవిశ్వాసము
లేకుండా
దేనినీ
సాధించలేరు.
కనుక,
మీరు
ఆత్మవిశ్వాసాన్ని
పెంచుకోండి.
ఆత్మవిశ్వాసము
ఉండినప్పుడే
మీరు
అన్నిటియందు
విజయం
సాధించగలరు.
ఈనాటి
మానవుడు
‘సైన్సు,
సైన్సు,
సైన్సు’
అని
ప్రాకులాడుతున్నాడుగాని,
సైన్సు
ఎంత
అభివృద్ధి
చెందినప్పటికినీ
భగవంతుణ్ని
ఏమాత్రమూ
తెలుసుకో
లేదు.
సైన్సు
కేవలం
మాయవిద్యలను
నేర్పేటటువంటిదే!
ఇది
అనిత్యమైన,
అసత్యమైన
విషయాలనే
బోధిస్తుందికాని,
నిత్యసత్యమైన
ఆత్మతత్త్వమును
ఏమాత్రమూ
బోధించలేదు.
ఆత్మతత్త్వమును
సైన్సు
తెలుసుకోవడానికి
వీలుకాదు.
ఇప్పటికీ
సైంటిస్టులు
ఇంకా
బుద్ధి
తెచ్చుకోకుండా
ప్రయత్నాలు
చేస్తున్నారు
గాని,
అది
అసాధ్యం.
కేవలం
భౌతికమైన,
లౌకికమైన
విషయాలలో
సైన్సును
నమ్మవచ్చు.
దీనివల్ల
ధనమును
సంపాదించుకోవచ్చుగాని,
గుణమును
సంపాదించుకోలేము.
సైంటిస్టులు
కోట్లకొలది
సంపాదిస్తున్నారు.
కాని,
ప్రయోజనమేమిటి?
Money
comes
and
goes,
but
morality
comes
and
grows.
ఆధ్యాత్మికంలోనే
నైతిక
విలువలను
సాధించడానికి
వీలవుతుంది.
ఎంతో
గొప్ప
సైంటిస్టులుగా
పేరు
పొందినవారుకూడను
కట్టకడపటికి
తమ
దేహములనే
తాము
స్వాధీనంలో
పెట్టుకోలేకపోయారు.
అంతగా
‘బ్రెయిన్’
చెడగొట్టుకునే
విధంగా
సైన్సును
ఎందుకు
నేర్చుకోవాలి!
దానికి
బదులు
బుద్ధిని
శుద్ధిపరచుకొని
దేశానికి,
సమాజానికి
తగినటువంటి
సేవలు
చేయాలి.
మీ
చదువును
సమాజముయొక్క
సంక్షేమముకొరకై
ఉపయోగించాలి.
అప్పుడే
మీరు
నీతి,
నిజాయతీలను
పెంచుకోగలరు;
కీర్తి,
గౌరవాలను
అందుకోగలరు.
నీతి,
నిజాయతీలను
పెంచుకున్నప్పుడే
మీరు
సత్యాన్ని
గుర్తించగలరు.
కనుక,
సత్యంకోసం
పాటుపడండి!
3
▾
Meaning
Keep
సమాజ
శ్రేయస్సుకు
ప్రేమమార్గమే
శరణ్యం
ప్రపంచమునకు
సత్యమే
తండ్రి,
ధర్మమే
తల్లి.
సత్య,
ధర్మములు
రెండూ
చేరినప్పుడే
శాంతి
అనే
బిడ్డ
పుడుతుంది.
శాంతి
వచ్చినప్పుడే
మనయందు
ప్రేమ
ఆవిర్భవిస్తుంది.
అప్పుడు
మనం
ఎవ్వరినీ
ద్వేషించము;
క్రోధమునకు,
అసూయకు
ఏమాత్రము
అవకాశము
ఇవ్వము.
ఈనాడు
ప్రేమ
అనేది
లేకపోవడంచేతనే
అక్కచెల్లెళ్ళు,
అన్నదమ్ములుకూడను
ఒకరినొకరు
ద్వేషించుకుంటున్నారు.
కనుక,
మనము
ముఖ్యంగా
ప్రేమను
పోషించుకోవాలి.
ప్రేమచేత
సాధించలేనిది
ఒక్కటీ
లేదు.
ప్రేమయే
దైవం.
ప్రేమలో
జీవించండి.
ప్రేమయే
మన
ప్రాణం.
సకల
జీవరాశులయందు
ప్రేమ
ఉన్నది.
చీమలో
కూడా
ప్రేమ
ఉంటుంది.
అది
అటూ
ఇటూ
సంచరిస్తూ
ఇతర
చీమలతో
స్నేహం
చేస్తూంటుంది.
క్రిమి,
కీటకాదులలో
కూడను
ప్రేమ
ఉన్నది.
కాని,
ఈనాటి
మానవునిలో
మాత్రం
ప్రేమ
క్షీణించిపోయింది.
అయితే,
మానవునిలో
ప్రేమ
లేకపోలేదు.
కాని,
ఆ
ప్రేమను
ధనముపైననూ,
తన
బంధుమిత్రులపైననూ
ప్రసరింపజేస్తున్నాడు.
ఈరీతిగా
సంకుచితమైనటువంటి
ప్రేమను
పెంచుకోవడంవలన
ఏమాత్రం
ప్రయోజనం
లేదు;
సమాజంపై
ప్రేమను
పెంచుకోవాలి.
సమాజంలో
మనం
సభ్యులము.
సమాజం
సుక్షేమంగా
ఉండినప్పుడే
మనం
సుఖంగా
జీవించగలము.
కనుక,
మనం
సమాజ
శ్రేయస్సును
భద్రం
చేసుకోవాలి.
దీనికి
ప్రేమమార్గమే
శరణ్యం.
ప్రేమను
వదలిపెట్టి
ఇంకేవిధమైన
మార్గమును
అనుసరించినప్పటికీ
దీనిని
సాధించలేము.
‘యథా
రాజా
తథా
ప్రజా’
బలి
చక్రవర్తి
చాలా
గొప్ప
త్యాగి;
ఎవరేది
అడిగినప్పటికీ
లేదనకుండా
అందించేటటువంటివాడు.
అట్టి
త్యాగశీలి
అయినటువంటి
బలిని
తమ
రాజుగా
పొందడం
కేరళవారి
అదృష్టం.
ఒక
పర్యాయం
బలి
ఒక
గొప్ప
యజ్ఞమును
ప్రారంభించి,
అనేక
దాన
ధర్మాలు
చేస్తూ
వచ్చాడు.
ఆ
యజ్ఞమునకు
అందరూ
గొప్పగొప్పవారు
వచ్చారు.
వామనమూర్తికూడను
వచ్చాడు.
అతను
గోచి
పెట్టుకొని
ఆ
యజ్ఞశాలకు
నడుచుకుంటూ
వస్తుంటే
అందరుకూడను
అతనిపైనే
తమ
దృష్టి
పెట్టారు.
“గొప్ప
పండితులు
రావలసిన
ఈ
యజ్ఞమునకు
చిన్నపిల్లవాడు
వస్తున్నాడే”
అని
కొందరు
తమాషాగా
మాట్లాడుకోసాగారు.
4
▾
Meaning
Keep
బలి
చక్రవర్తి
బిడ్డ
రత్నమాల,
“ఈ
పిల్లవాడు
ఎంత
అందంగా
ఉన్నాడు!
ఇతను
నాకు
పుత్రుడై
పుడితే
ఎంత
బాగుండును!”
అని
అనుకున్నది.
అక్కడ
చేరిన
పండితులందరూ
ఇతనియొక్క
మహా
తేజస్సును
చూసి
ముగ్ధులయ్యారు.
అక్కడ
చేరినవారందరినీ
వామనమూర్తి
ఒకతూరి
ప్రేమతో
చూశాడు.
అందరియందు
కూడను
అతనియెడల
భక్తిభావం
ఆవిర్భవించింది.
బలి
చక్రవర్తి
తనవద్దకు
దానధర్మాలు
అడగడానికి
వచ్చిన
అన్ని
వేలమందిలో
మొట్టమొదట
వామనుని
వద్దకు
వెళ్ళి
“స్వామీ,
మీరు
వచ్చిన
కారణమేమిటి?”
అని
అడిగాడు.
“నాకు
ధన,
ధాన్యములేమీ
అక్కర్లేదు
నాయనా!
మూడడుగుల
భూమి
నిస్తే
చాలు”
అన్నాడు,
వామనమూర్తి.
“చచ్చిన
శవానికికూడను
ఆరడుగులు
కావాలి
కదా!
మీరు
మూడడుగులే
అడుగుతున్నారే!
ఇంతేనా
మీరడిగేది!
ఇంకేమైనా
కావాలంటే
అడగండి”
అన్నాడు,
బలి.
“మూడడుగుల
నేల
ఇస్తే
చాలు,
నాకు
సమస్తం
ఇచ్చినట్లే”
అన్నాడు,
వామనుడు.
బలి
తప్పక
ఇస్తానని
వాగ్దానం
చేశాడు.
దీనిని
లౌకిక
దృష్టితోకాక
ఆధ్యాత్మిక
దృష్టితో
మీరు
అర్థం
చేసుకోవాలి.
అప్పుడు
వామనుడు
ఒక
అడుగుపెట్టాడు,
భూమి
అంతా
నిండిపోయింది;
రెండవ
అడుగు
పెట్టాడు,
ఆకాశమంతా
నిండిపోయింది.
“మూడవ
అడుగు
ఎక్కడ
ఇస్తావు?
అదికూడా
ఇస్తే
నేనిక
వెళ్ళిపోతాను”
అన్నాడు.
“స్వామీ!
ఇదిగో,
ఇక
మిగిలింది
నా
శిరస్సు
ఒక్కటే!”
అంటూ
బలి
తన
కిరీటం
తీసి
క్రిందపెట్టగా
అతని
తలపైన
వామనమూర్తి
తన
పాదం
పెట్టి
అతనిని
పాతాళ
లోకానికి
అణగద్రొక్కాడు.
బలి
గొప్ప
ధర్మాత్ముడేకాని,
అతనిలో
గర్వం
అధికంగా
ఉండేది.
దానిని
అణగద్రొక్కాడు,
వామనమూర్తి.
అప్పుడు
ప్రజలందరూ
“స్వామీ,
ఇలాంటి
చక్రవర్తి
మాకు
తిరిగి
లభించడు”
అని
దుఃఖిస్తుంటే
వామనమూర్తి,
“వర్షమునకు
ఒక
పర్యాయం
ఇదే
రోజున
బలి
చక్రవర్తి
వచ్చి
మిమ్మల్ని
చూస్తాడు,
మీరు
సిద్ధంగా
ఉండండి”
అని
చెప్పి
వారిని
సమాధానపరచాడు.
అదియే
ఈనాటి
ఓణం.
ఈనాడు
కేరళవారందరుకూడను
శిరఃస్నానము
చేసి,
పదిరకములైన
వంటలు
వండుతారు.
5
▾
Meaning
Keep
వాటిలో
అరటికాయల
పాయసం
గొప్ప
పేరు
పొందింది.
దానిని
వాళ్ళు
భగవంతునికి
నైవేద్యం
పెట్టి,
దీపాలు
వెలిగించి
ప్రార్థనలు
చేస్తుంటారు.
“మీరందరూ
పరిశుద్ధంగా,
పవిత్రంగా
ఉండి
దైవప్రార్థన
చేయండి.
ఈవిధంగా
వర్షమునకొక
పర్యాయం
తప్పక
వస్తాను”
అని
బలి
చక్రవర్తికూడా
ప్రజలకు
వాగ్దానం
చేశాడు.
ఈనాడు
తమను
చూసే
నిమిత్తం
బలి
చక్రవర్తి
తప్పక
వస్తాడనే
విశ్వాసంతో
కేరళ
ప్రజలు
ఈ
పర్వదినముకొరకై
ఎంతో
ఉత్సాహంతో
కాచుకొని
ఉంటారు.
‘యథా
రాజా
తథా
ప్రజా’.
బలి
చక్రవర్తి
ప్రజల
నెంతగానో
ప్రేమించాడు.
ప్రజలుకూడను
అతనిని
అంతగా
ప్రేమించారు.
బలి
చక్రవర్తికి,
ప్రజలకు
మధ్య
ఉన్నటువంటి
సన్నిహిత
సంబంధ
బాంధవ్యానికి
చిహ్నమే
ఈనాటి
ఓణం.
మూడడుగులయొక్క
అంతరార్థం
బలి
చక్రవర్తి
త్యాగంలో
నిజంగా
చక్రవర్తే.
‘బలి’
అంటే
దేనినో
బలి
ఇవ్వటం
కాదు;
తన
సర్వస్వమును
త్యాగం
చేసేటటువంటి
పవిత్ర
స్వభావమే!
“న
కర్మణా
న
ప్రజయా
ధనేన
త్యాగేనైకే
అమృతత్వమానశుః”
ఏమైనా
సరే,
బలి
చక్రవర్తి
ఇచ్చిన
మాట
తప్పడు.
వామనమూర్తికి
ఇచ్చిన
మాట
ప్రకారం
మూడడుగుల
నేల
ఇచ్చాడు.
ఆ
మాట
నిలబెట్టుకోవడానికి
తనను
తాను
ఇచ్చుకున్నాడు.
అంటే
భౌతిక,
మానసిక,
ఆధ్యాత్మిక
స్థాయిలలో
తనను
తాను
అర్పించుకున్నాడు.
అదే
తన
శిరస్సు
అర్పించడంలో
గల
అంతరార్థం.
బలి
శిరస్సుపైన
భగవంతుడు
తన
పాదం
పెట్టేటప్పటికి
అతనికి
మోక్షం
వచ్చింది.
భగవంతుడు
తాను
ఇచ్చిన
మాట
ప్రకారం
ప్రతి
సంవత్సరం
అతనిని
ప్రజలవద్దకు
పంపుతున్నాడు.
కనుకనే,
ఈనాటికికూడను
ప్రజలు
బలి
చక్రవర్తిని
మరువలేదు.
కేరళ
పుణ్యభూమి,
ధర్మభూమి,
త్యాగభూమి.
ధనధాన్యములకుగాని,
తిండితీర్థాదులకుగాని
దేనికీ
వారికి
కొరతలేదు.
అసలు
వర్షాలు
ప్రారంభం
కావడం
కేరళలోనే!
అక్కడినుండియే
అన్ని
ఇతర
రాష్ట్రాలకు
వస్తాయి.
కేరళలో
ఎందరో
గొప్ప
పండితులున్నారు.
దానధర్మములకు,
దైవభక్తికి
కేరళ
పుట్టినిల్లు.
కనుకనే,
కేరళను
అన్ని
ప్రాంతాలవారూ
చాలా
మెచ్చుకుంటారు.
6
▾
Meaning
Keep
ఇట్టి
పవిత్ర
ప్రదేశము
కనుకనే
వామనమూర్తి
అక్కడ
అవతరించి
కేరళకు
ఘనకీర్తిని
అందించాడు.
మూడడుగులు
మాత్రమే
ఉన్నటువంటి
వామనుడు
బలిని
కేవలం
మూడడుగులే
దానంగా
అడిగాడు.
“అణోరణీయాన్
మహతో
మహీయాన్”.
భగవంతుడు
అణువుకంటె
అతిసూక్ష్మరూపుడు,
ఘనముకంటె
అతిగణనీయుడు.
కనుకనే,
వామనుడు
ఒక
అడుగుతో
భూమిని,
రెండవ
అడుగుతో
ఆకాశమును
ఆక్రమించగలిగాడు.
బలికి
మోక్షమివ్వడానికి
భగవంతుడే
స్వయంగా
వచ్చాడు.
ఇంకెవ్వరికీ
ఇంతటి
భాగ్యాన్ని
అందించలేదు.
ఇది
బలి
చేసుకున్నటువంటి
పుణ్యం.
భగవంతుడు
అతనికిలాంటి
భాగ్యం
ప్రసాదించినందుకు
అందరూ
ఆనందించి
వామనావతారాన్ని
ఎంతో
గొప్పగా
వర్ణిస్తూ
వచ్చారు.
భగవంతుడు
మత్స్య,
కూర్మ,
వరాహ,
నారసింహ
అవతారముల
తరువాత
మానవాకారం
ధరించి
రావడం
అదే
మొదటిసారి.
వామనమూర్తి
బలికి
మోక్షమందించిన
దినమే
ఈ
ఓణం.
కనుకనే,
ఈ
పండుగను
కేరళ
ప్రజలు
ఎంతో
గొప్పగా
జరుపుకుంటారు.
తమ
పుట్టిన
దినమునుకూడను
వాళ్ళు
ఇంత
గొప్పగా
చేసుకోరు.
ఈరోజున
కేరళ
ప్రజలందరూ
ఒక్క
దైవత్వమునే
తమ
లక్ష్యంగా
పెట్టుకొని
ఉంటారు.
ఈవిధంగా,
దైవత్వమునకు
సమీపం
కావడం
ఎంతో
గొప్ప
అదృష్టం.
‘కమ్యూనిస్ట్’
కాదు,
‘కమ్-యు-నెక్స్ట్’!
కేరళ
ప్రజలు
ఇక్కడికి
వచ్చిన
ప్రతి
పర్యాయముకూడను
“స్వామీ,
కేరళకు
రావాలి,
కేరళకు
రావాలి”
అని
పిలుస్తూ
ఉన్నారు.
“వస్తాను,
వస్తాను,
వస్తాను”
అన్నాను.
ఎప్పుడుకూడను
నేను
రానని
చెప్పలేదు.
ఎవరు
అడిగినా
వస్తానంటాను.
కనుకనే,
ఒక
దినము
కేరళకు
వెళతాను.
కేరళయొక్క
మహత్తరమైనటువంటి
శక్తిసామర్థ్యములు
అక్కడివారికి
చూపుతాను.
కేరళకు
ఎంతో
గొప్ప
భాగ్యము
ఉంటుండాది.
వామనమూర్తి
కేరళలో
ప్రతిష్ఠితుడై
ఉన్నాడు.
ఆ
ప్రజల
హృదయాల్లో
భక్తిప్రపత్తులు
నాట్యమాడుతున్నాయి.
అక్కడ
ఎవ్వరూ
తమ
హృదయంలో
నామచింతన
లేకుండా
లేరు.
పైకి
చెప్పరుగాని,
లోపల
స్మరిస్తూ
ఉంటారు.
బయటినుండి
చూసేవారు
‘కేరళ
కమ్యూనిస్ట్
స్టేటు’
అంటారు.
కాని,
‘కమ్యూనిస్ట్’
కాదు,
‘కమ్-యు-నెక్స్ట్’!
ఆ
పదము
అంత
గొప్ప
అంతరార్థాన్ని
బోధిస్తుంది.
స్వామి
సన్నిధికి
చిన్నచిన్న
బాలవికాస్
పిల్లలు
వస్తున్నారు.
7
▾
Meaning
Keep
His poems 498
Also in his talks
(14)
22 June 1996
Service to Society Is the Mark of True Humanness
19 October 1996
When the Home Is Set Right, the World Is Set Right
19 April 1998
The holy power of woman is the very safeguard of Bhārata
19 November 1998
Women Alone Are the Root Cause of Bhārata's Greatness
3 December 1998
Man Alone Is Supremely Precious, Above All the Riches of the World
11 August 2000
Only When There Is Purity of Mind Is There Success
19 November 2001
Only when parents are ideal do children become virtuous
19 November 2002
Setting the Home in Order: The Housewife's First Duty
17 October 2003
Develop a feeling of brotherhood towards all
6 May 2006
If you love your parents, the whole world will love you
9 August 2006
The Ati Rudra, supremely powerful
1 October 2006
‘Dharma protects those who protect it’
27 March 2007
Your very heart is Rāma's temple
22 November 2008
The duty of guarding the wealth of Dharma of Mother Bhārata is yours!
వాళ్ళలో
కూడను
ఎంత
గొప్ప
భక్తి!
ఎంత
ఆనందము!
స్వామిని
చూస్తే
వాళ్ళు
ఎంతో
పొంగిపోతున్నారు.
They
are
full
of
love.
ఇటువంటి
నిర్మల
ప్రేమతో
నిండిన
హృదయాలు
ఏనాటికైనా
పరిపక్వమవుతాయి.
భారతదేశం
పతివ్రతలకు
పుట్టినిల్లు
ఈనాడు
కేరళ
బాలవికాస్
పిల్లలు
‘సావిత్రి’
అనే
నాటకాన్ని
ప్రదర్శిస్తారు.
సావిత్రి
సత్యవంతుని
భార్య,
గొప్ప
పతివ్రత.
మరణించిన
పతిని
తన
పాతివ్రత్య
మహిమచేత,
దృఢమైన
దీక్షచేత
బ్రతికించుకున్నది.
ఆమె
యమునివెంట
తిరిగింది;
క్షణమైనా
అతణ్ని
కూర్చోనీయకుండా
చేసింది.
“నా
భర్తను
నాకు
తిరిగి
ఇచ్చేసెయ్.
నాకింకేమీ
వద్దు”
అన్నది.
చిట్టచివరికి
యముడు
ఆమె
పతి
ప్రాణాన్ని
తిరిగి
ఇవ్వక
తప్పలేదు.
చూశారా!
స్త్రీలు
చాలా
గొప్ప
శక్తిమంతులు;
ఎట్టి
ఘనకార్యమునైనా
సాధించగలరు;
మరణించిన
పతినికూడా
బ్రతికించుకోగలరు.
ఏ
ఇతర
దేశమునందైనా,
ఏ
ప్రదేశమునందైనా
మరణించిన
పతిని
బ్రతికించుకొన్నటువంటి
సతి
మనకు
కనిపిస్తుందా?
లేదు.
ఒక్క
భారత
దేశమునందు
మాత్రమే
అటువంటి
మహా
సాధ్వీమణులు
పుట్టారు.
భారతదేశము
పతివ్రతల
యొక్క
జన్మభూమి.
గత
జీవుడగు
పతిన్
బ్రతికించుకొన్నట్టి
సావిత్రి
భారత
సతియె
కాదె
తన
సత్యమహిమచే
దావాగ్ని
చల్లార్చె
చంద్రమతి
పవిత్ర
పడతి
కాదె
కులసతీత్వమునకై
గుండాన
దూకిన
సీత
భారతధరాజాత
గాదె
కినిసి
దుర్మద
కిరాతుని
బూది
గావించె
దమయంతి
భారత
రమణి
కాదె
సప్తసాగర
పరివేష్టితోర్వితలము
భరతజాతి
పాతివ్రత్య
ప్రవిమలంబు
భావసంపదకిది
మహా
పంటభూమి
అఖిల
దేశాలకిది
ఉపాధ్యాయి
కాదె!
8
▾
Meaning
Keep
ఇట్టి
పతివ్రతలకు
పుట్టినిల్లు
ఈ
భరతభూమి.
విదేశీయులుకూడను
భారత
దేశముయొక్క
ఔన్నత్యాన్ని
ఎంతగానో
కొనియాడుతున్నారు.
కాని,
ఇప్పుడు
భారతీయులు
విదేశాలకు
వెళ్ళినప్పుడు,
“మీరెక్కడినుండి
వచ్చారండీ?”
అని
వాళ్ళని
అడిగితే,
“నేను
భారతదేశమునుండి
వచ్చానండీ”
అని
చెప్పకూడదూ?
అలా
చెప్పరు.
“నేను
ఢిల్లీనుండి
వచ్చాను”,
“నేను
కలకత్తానుండి
వచ్చాను”,
“నేను
బెంగళూరునుండి
వచ్చాను”
అని
చెబుతారు.
“నేను
అనంతపురం
జిల్లాలోనున్న
పుట్టపర్తినుండి
వచ్చాను”
అని
చెబుతారు.
పుట్టపర్తి
ఎక్కడుంది?
అనంతపురం
ఎక్కడుంది?
భారతదేశములో
ఉన్నటువంటివే
కదా
ఇవి!
ఢిల్లీ,
కలకత్తా,
బెంగళూరు
ఇవన్నీ
భారతదేశముయొక్క
అంతర్భాగములే
కదా!
కాబట్టి,
మనం
ఎక్కడికి
పోయినప్పటికీ
సగర్వంగా
‘మేము
భారతీయులమ’ని
చెప్పుకోవాలి.
భారతీయులనగా
గొప్ప
భాగ్యము
కలిగినటువంటివారు.
ఇట్టి
భాగ్యము
అందరికీ
లభించేటటువంటిది
కాదు.
ఇటువంటి
భాగ్యాన్ని
నిలుపుకున్నటువంటివారు
కేరళ
ప్రజలు.
కనుక,
వాళ్ళు
ఎంతో
అదృష్టవంతులు.
కేరళలో
ఉన్నటువంటి
పవిత్రత
భారతదేశములోని
ప్రతి
గ్రామమునకూ
వ్యాప్తి
కావాలి.
ఈనాడు
కేరళ
బాలవికాస్
పిల్లలు
ప్రదర్శించే
‘సావిత్రి’
నాటకాన్ని
చూసి
మీరు
నేర్చుకోవలసినవి
ఎన్నో
ఉన్నాయి.
మీకు
బాగా
తెలుసు
-
గడచిన
రెండు
దినములలో
కేరళవారు
ఇక్కడ
ఎంతో
మంచి
డ్రామాలు
వేశారు.
నిన్నటి
దినము
సీతారాముల
కళ్యాణం
ఎంతో
వైభవంగా
జరిపించారు.
దానికి
ముందు
దినము
కృష్ణునియొక్క
లీలలను
చాలా
గొప్పగా
ప్రదర్శించారు.
వాళ్ళ
పాటలూ,
మాటలూ,
ఆటలూ,
చర్యలుకూడా
చాలా
చిత్ర
విచిత్రంగా
ఉన్నాయి.
వాళ్ళ
డ్రస్సులుకూడా
చాలా
బాగున్నాయి.
కేరళలోని
సత్యసాయి
భక్తులైన
మహిళలు
చాలా
గొప్ప
సేవ
చేశారు.
వారియొక్క
ప్రోత్సాహంవల్లనే
ఈ
నాటకాలు
ఇంత
చక్కగా
ప్రదర్శింపబడినాయి.
ఈవిధంగానే
ప్రతి
విషయమునందుకూడను
కేరళ
స్త్రీలుగాని,
పురుషులు
గాని
ఏది
చేసినా
చాలా
ఘనంగా
చేస్తున్నారు.
9
▾
Meaning
Keep
దీనిని
కేరళ
ప్రజలు
బాగా
కాపాడుకోవాలని
నేను
ఆశిస్తూ
ఆశీర్వదిస్తున్నాను.
Previous
←
‘Education’ finds its fulfilment only when it is joined with ‘Educare’
Next
That great Viṣṇu Himself is this Viṣṇu on earth
→