Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 2006 · Fix your mind on Divinity; place your trust in Oneness
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Fix your mind on Divinity; place your trust in Oneness
14 April 2006, New Year's day, Kodaikanal
1
▾
Meaning
Keep
Also in his talks
(27)
5 September 1987
Today satsaṅga is what man needs most urgently
5 October 1992
What man must seek is real, eternal happiness
23 November 1997
The God who fills everything is ‘I’
5 April 1998
Who can recognise the principle of Śrī Rāma
14 April 1998
God pervades all
26 September 1998
God Is the Very Foundation of the World
28 September 1998
The Five Elements Are the Very Forms of the Paramātma
11 October 1998
Human Life Is the Fruit of Our Resolves
21 November 1999
No sādhana greater than service
26 March 2001
The principle that is the root and base
23 November 2001
Self-confidence is the very stairway to Ānanda
25 December 2001
Though faiths differ, Mādhava is one
16 March 2003
The principle of Prema: the divine power of attraction
21 March 2004
I am you, you are I
11 April 2004
Truth itself is the form of God
15 April 2004
The principle of Prema is Divinity itself
17 October 2004
Develop the Feeling of the One Ātma
22 November 2004
Only When Oneness Is Experienced Does Human Birth Find Its Fulfilment
25 December 2004
Pray for the Sake of God's Prema
8 March 2005
Śivatva is the very consciousness in all beings
23 November 2005
All Are Embodiments of God
26 February 2006
All is full of Brahman
30 March 2006
See only good, do only good, be good
2 May 2006
The body itself is the temple; you yourself are God
11 August 2006
Divinity is attained only through Prema for God
13 April 2008
The Name of Rāma is best; the thought of Rāma is enough
24 May 2008
Remembering the Name is the way across
‘మమైవాంశో
జీవలోకే
జీవభూతస్సనాతనః’,
ఇది
భగవద్వాక్యము.
మీరందరుకూడను
భగవంతునియొక్క
అంశములే!
కనుక,
భగవంతుడు
వేరు,
మీరు
వేరు
అని
భావించకండి.
దైవము
మీలోనే
ఉన్నాడు.
మీరే
దైవం.
మీరు
మానవాకారమును
ధరించడంచేత
మానవులమని
భావిస్తున్నారు.
దేహమును
బట్టి
మీరు
భిన్నత్వమును
భావిస్తున్నారుగాని,
అందరిలో
ఉన్నది
ఒకే
ఆత్మయే.
అలంకారంకోసం
వేలాది
బల్బులు
పెట్టుకుంటాము.
రంగులు
వేరువేరుకాని,
అన్నింటిలో
ప్రసరించే
కరెంటు
ఒక్కటే.
ప్రతి
మానవుడు
ఒక
బల్బువంటివాడు.
చూపించునది,
పలికించునది,
నడిపించునది
అంతయు
ఆత్మ
అనే
కరెంటే.
కాని,
మానవుడు
భౌతికమును
మాత్రమే
చూస్తున్నాడు;
ఆధ్యాత్మికమును
ఏమాత్రము
విశ్వసించడం
లేదు.
ఆధ్యాత్మిక
దృష్టితో
విచారించిన
దైవము
‘ఇందు
గలడందు
లేడని
సందేహము
వలదు...’
అన్న
సత్యము
బోధపడుతుంది.
దైవము
సర్వత్రా
ఉన్నాడు.
భూమి
నుండి
ఆకాశమువరకు
ఉన్న
ప్రతి
పదార్థమూ
దైవ
స్వరూపమే.
ఈ
టంబ్లరు
భగవంతుడే!
ఈ
పుష్పము
భగవంతుడే!
ఈ
వస్త్రము
భగవంతుడే!
ఈ
మైకు
భగవంతుడే!
అంతా
భగవత్స్వరూపమే.
సర్వతః
పాణి
పాదం
తత్సర్వతోక్షి
శిరోముఖం
సర్వతః
శ్రుతిమల్లోకే
సర్వమావృత్య
తిష్ఠతి
అంతా
దైవత్వమే.
కాని,
వ్యక్తులయొక్క
భావములను
పురస్కరించుకొని
భేదములు
గోచరిస్తున్నాయి.
మార్పు
అనేది
జగత్తుయొక్క
తత్త్వమేగాని,
భగవంతునియొక్క
తత్త్వము
కాదు.
2
▾
Meaning
Keep
మానవుడనగా
పంచభూతములయొక్క
ఆకారమే.
పంచభూతములయొక్క
ప్రకాశముచేతనే
మానవుడు
జీవిస్తున్నాడు.
పంచభూతములు
ఎప్పుడు
చూసినా
ఉంటాయి.
అవి
ఉన్నంతవరకు
మాత్రమే
మానవత్వం
ఉంటుంది.
ఈ
జగత్తులో
పంచభూతములు
తప్ప
ఆరవ
భూతము
లేనే
లేదు.
ఎవరియందు
చూచి
నప్పటికీ
శబ్ద,
స్పర్శ,
రూప,
రస,
గంధములు
తప్ప
మరొకటి
లేదు.
వీటివల్లనే
మంచి
చెడ్డలు,
పాపపుణ్యములు
అనేవి
మనం
అనుభవిస్తున్నాము.
మంచి
చెడ్డలు
భగవంతుడిచ్చినవి
కావు.
ఎవరు
చేసుకున్నది
వారనుభవిస్తుంటారు.
‘భగవంతుడు
మాకు
కష్టము
లిచ్చాడు’,
అని
కొందరనుకుంటారు.
మరికొందరు
‘భగవంతుడు
మాకు
సుఖాన్నందించాడు’,
అని
ఆనందిస్తుంటారు.
కాని,
భగవంతుడు
సుఖాన్నీ,
ఆనందాన్నీ
అందించేవాడూ
కాదు;
దుఃఖాన్నీ,
కష్టాన్నీ
కలిగించేవాడూ
కాదు.
ఇవన్నీకూడను
మానవునియొక్క
భ్రమలే.
తనయందున్న
కోపతాపములు,
ఈర్ష్య,
అసూయ,
డంబములే
తనను
అనేకవిధములుగా
పీడిస్తున్నాయి.
క్రోధము
ఎక్కడినుండి
వస్తుండాది?
మన
ఆహారమునుండియే
వస్తుండాది.
కామ,
క్రోధ,
లోభ,
మోహ,
మద,
మాత్సర్యాదులు
బయటినుండి
ఏర్పడినటువంటివి
కావు.
అన్నీ
మననుండియే
వచ్చినవి.
ప్రాపంచిక
సంబంధాలు
కదలిపోయే
మేఘాలు
భగవంతునికి
ఒక
ప్రత్యేకమైన
రూపమున్నట్లుగా
మీరు
భావిస్తున్నారు.
కాని,
తనకు
రూపము
లేదు.
భగవంతుడు
పాజిటివ్.
మానవుడు
నెగెటివ్.
మనం
పాజిటివ్‌నే
విశ్వసించాలిగాని,
నెగెటివ్‌ను
విశ్వసించరాదు.
పాజిటివ్
శాశ్వతంగా
ఉంటుంది.
కాని,
నెగెటివ్
కొద్దిసేపు
ఉంటుంది,
తరువాత
పోతుంది.
ఉదాహరణకు,
ఒక
అబ్బాయి
ఒక
అమ్మాయిని
వివాహం
చేసుకుంటాడు.
అబ్బాయి
ఎక్కడ
పుట్టినవాడు?
అమ్మాయి
ఎక్కడ
పుట్టింది?
మధ్యలో
పెండ్లి
అవుతుంది.
పోనీ,
పెండ్లి
అయిన
తరువాత
ఇరువురూ
శాశ్వతంగా
ఉంటారా?
ఉండరు.
ఆమె
ఒకవైపున
పోతుంది;
ఇతను
మరొకవైపున
పోతాడు.
అన్నీ
కదలిపోయే
మేఘాలవలె
మధ్యలో
వస్తాయి,
పోతాయి.
మానవుడు
శాశ్వతంగా
ఉండాలంటే,
ఒకే
ఒక్క
మార్గమున్నది.
అదే
ఆత్మవిశ్వాసము.
కృష్ణ
పరమాత్మ
చెప్పాడు,
“మీరు
వస్తుంటారు,
పోతుంటారు.
కాని,
నేనెప్పటికీ
ఉంటాను
మీతో.”
దైవత్వము
ఎప్పటికీ
మార్పు
చెందనటువంటిది.
3
▾
Meaning
Keep
కాని,
మీరు
మార్పు
చెందనటువంటి
దైవత్వాన్ని
విస్మరించి
మార్పుచెందే
విషయాలను
ఆశిస్తున్నారు.
దేహము
ఈనాడు
మీకు
కనిపించవచ్చు,
రేపు
కనిపించకపోవచ్చు.
ఇది
వచ్చి
పోయేటటువంటిదే!
ఈ
ప్రపంచములో
శాశ్వతమైన
వస్తువు
ఏ
ఒక్కటీ
లేదు.
కాని,
మీరు
జీవించియున్న
కొద్దికాలంలోనే
అనేక
భ్రమలను
పెంచుకుంటున్నారు.
శాశ్వతమైనది
దైవత్వమొక్కటే!
క్రొత్త
సంవత్సరం
ఈరోజే
ప్రారంభమైందని
చెప్పడానికి
వీల్లేదు.
ప్రతి
క్షణమూ
నూతనమే!
గడచిపోయినది
తిరిగి
రాదు.
భవిష్యత్తు
అనేది
ఎవ్వరికీ
తెలియదు.
కాబట్టి,
వర్తమానమే
ప్రధానమైనది.
ఈనాడు
చైత్రమాసము
వచ్చింది.
వచ్చే
నెల
వైశాఖము.
ఇలాంటి
చైత్ర,
వైశాఖములు
ఎన్ని
వచ్చి
పోయినాయో!
ఇలాంటి
కదలిపోయేవాటికోసం
మనం
ఎందుకిన్ని
అవస్థలు
పడాలి?!
చెట్టులో
పుట్టిన
కాయ
కొంత
కాలానికి
పండుగా
మారి
రాలిపోతుంది;
ఆ
తరువాత
క్రుళ్ళిపోతుంది.
దేహముకూడను
అంతే!
బాల్యము,
కౌమారము,
యౌవనము,
వృద్ధాప్యము
....
ఈరీతిగా
ఎన్నో
మార్పులకు
గురియై
చివరికి
రాలిపోతుంది.
ఈ
జగత్తులో
శాశ్వతమైనటువంటిది
దైవత్వమొక్కటే.
దాని
నిమిత్తమే
నీవు
ప్రార్థించవలసింది.
అయితే,
ప్రార్థన
ఎవరికోసం?
నీకోసమేగాని,
దైవంకోసం
కాదు.
నిజానికి
నిన్ను
నీవే
ప్రార్థించుకుంటున్నావు.
‘నన్ను
ప్రార్థించండి,
సేవించండి,
పూజించండి’
అని
భగవంతుడు
ఎప్పుడూ
చెప్పడు.
ఇవన్నీ
కేవలం
మన
భ్రాంతులే.
దేహభ్రాంతివలన
నిన్ను
నీవొక
భక్తునిగా
భావిస్తున్నావు;
భగవంతుడు
నీకంటే
వేరుగా
ఉన్నాడని
భ్రమిస్తున్నావు.
భగవంతునికి,
భక్తునికి
భేదము
లేదు.
ఎందుచూసినా
ఉన్నది
భగవంతుడే!
ఏమి
చేసినా
అది
భగవంతునికే!
ఎక్కడికి
వెళ్ళినా
భగవంతుడే!
చివరికి,
ధూళికూడా
భగవంతుడే!
పంచేంద్రియములే
సుఖదుఃఖములకు
కారణం
గాలి
బలంగా
వీచినప్పుడు
ధూళి
పైకెగురుతుంది;
లేకపోతే
క్రింద
అణగి
ఉంటుంది.
అదేరీతిగా,
మనలో
ఉన్నటువంటి
భ్రాంతులు
ఒక్కొక్క
సమయంలో
అణగిఉంటాయి.
4
▾
Meaning
Keep
కోరికలనే
గాలి
వీచినప్పుడు
అవి
బహిర్గతమౌతాయి.
మానవుడు
ఒకతూరి
శాంతంగా
ఉంటాడు;
మరో
సందర్భంలో
ఉద్రేకంగా
కనిపిస్తాడు.
ఇవన్నీ
తన
ఆహార
విహారములచేతను,
సంబంధ
బాంధవ్యముల
చేతను
కలుగుతుంటాయేగాని
ఏదీ
భగవంతుడు
అందించడు.
పంచేంద్రియములే
మానవునియొక్క
ఉద్రేకమునకు,
సుఖదుఃఖములకు
కారణం.
నష్టం
వస్తే
ఏడుస్తాడు,
ఆదాయం
వస్తే
నవ్వుతాడు.
తన
ఏడ్పుకుగాని,
నవ్వుకుగాని
తానే
కారణం.
భర్తయైనా,
భార్యయైనా,
తల్లియైనా,
బిడ్డయైనా
ఈ
లోకంలో
ఎవరి
ప్రేమకూడను
శాశ్వతమైన
ప్రేమ
కాదు.
ఎవరికీ
ఎవరితోనూ
సంబంధం
లేదు.
ఉపాధిని
ధరించిన
కారణంగా
కొంతకాలం
సంబంధం
ఉండినట్లుగా
కనిపిస్తుంది
గాని,
ఉపాధిలో
మార్పుకలుగగానే
అన్నీ
మార్పుచెందుతాయి.
కనుక,
ప్రేమ
స్వరూపులారా!
జగత్తులో
శాశ్వతమైనది
దైవత్వం
ఒక్కటే.
దానికోసం
మీరు
ప్రయత్నించాలి.
మానవత్వమనేది
తన
తత్త్వాన్ని
తాను
గుర్తించుకునే
నిమిత్తం,
దైవత్వాన్ని
పొందే
నిమిత్తం
ఏర్పడినటువంటిది.
‘యద్భావం
తద్భవతి’
మనము
భగవంతుని
ఫోటో
పెట్టి
పూజిస్తుంటాం.
దానివలన
మనకు
ఏమైనా
ఆదాయం
వచ్చిందా,
చాలా
ఆనందిస్తాము.
కాని,
మన
అభీష్టానికి
ఏమైనా
విరుద్ధంగా
జరిగెనా,
ఆ
ఫోటోను
మార్చేసేస్తాం.
ఈవిధంగా
మన
అభీష్టాలను
నెరవేర్చుకోవడంకోసం
పూజలు
చేస్తున్నామేగాని,
నిజంగా
శాశ్వతమైన
పూజ
చేయడం
లేదు;
మనలో
శాశ్వతమైన
భక్తి
లేదు.
ఎట్టి
పరిస్థితియందైనా
దైవంపట్ల
మన
ప్రేమను,
భక్తిని
మార్చుకోకుండా
చూసుకోవాలి.
ప్రేమయే
పరమాత్మ
స్వరూపము.
అందుకోసమే,
Love
is
God,
live
in
love
అని
చెబుతుంటాను.
ప్రేమ
అనేది
మానవుని
నుండి
ఎప్పటికీ
పోదు.
ఒకడు
నీ
దృష్టిలో
దుర్మార్గుడు
కావచ్చు.
అతనికి
ఎవరిమీద
ప్రేమ
లేకపోయినప్పటికీ
తన
భార్యాబిడ్డలపై
ఉంటుంది
కదా!
అయితే,
మన
ప్రేమను
విశాలం
గావించుకుంటే,
అందరినీ
ప్రేమించగల్గుతాము.
ఒక
కుక్కనో,
పిల్లినో
మనము
ప్రేమతో
పెంచి
పోషిస్తే
అవికూడా
మనలను
ప్రేమిస్తాయి.
ప్రేమచేత
క్రూరమృగాలను
సహితం
మచ్చిక
చేసుకోవచ్చు.
హృదయంలో
ప్రేమను
నింపుకుంటే
జగత్తంతా
ప్రేమమయంగా
గోచరిస్తుంది.
‘యద్భావం
తద్భవతి’.
5
▾
Meaning
Keep
మన
భావాన్నిబట్టి
అన్నీ
జరుగుతుంటాయి.
ఎంత
సంపాదించినా
వట్టి
చేతులతో
పోక
తప్పదు
దేహాన్ని
కేవలం
ఒక
పనిముట్టుగా
భావించి,
మన
కర్తవ్య
కర్మలను
ఆచరించాలి.
అంతేగాని,
దేహము
శాశ్వతమని
భ్రమించి,
దీనికోసం
బాగా
డబ్బు
సంపాదించాలని
యోచించరాదు.
ఎంత
సంపాదించినప్పటికీ
చిట్టచివరికి
అంతా
వ్యర్థమే,
వ్యర్థమే,
వ్యర్థమే!
ఎంతమంది
కోటీశ్వరులు
పుట్టలేదు
ఈ
లోకంలో!
వాళ్ళంతా
నేడున్నారా?
ఒక్కరైనా
శాశ్వతంగా
ఉండడం
లేదు.
ఒకానొక
సమయంలో
అలెగ్జాండర్
అన్ని
దేశాలను
జయించి,
భారతదేశాన్నికూడా
జయించాలని
వచ్చాడు.
కాని,
ఇక్కడికి
వచ్చేటప్పటికి
అతనికి
గుండెపోటు
వచ్చింది.
ఇక
తనకు
అంత్యసమయం
ఆసన్నమైనదని
గ్రహించాడు.
తన
ప్రధానమంత్రిని,
ఇతర
అధికారులను
సమావేశపరచి
వారితో
చెప్పాడు,
“నేనిక
ఉండను.
మీరు
నా
మృత
దేహాన్ని
మన
దేశానికి
తీసుకువెళ్ళండి.
నా
చేతులు
పైకి
పెట్టి
వీధివీధిలోను
ఊరేగించండి.
‘అలెగ్జాండర్
ప్రపంచాన్నంతటినీ
జయించాడు.
కాని,
తాను
పోయేటప్పుడు
వట్టి
చేతులతోనే
వెళ్లాడు’,
అని
ప్రజలు
తెలుసుకోవాలి.”
అందరూ
అంతే!
ఎంత
సంపాదించినా
పోయేటప్పుడు
మాత్రం
వట్టి
చేతులతోనే
పోక
తప్పదు.
లౌకికంగా
సాధించినదంతా
కట్టకడపటికి
నిరర్థక
మైపోతుంది.
ఇటువంటివాటికోసం
ఎందుకు
చింత
చేయాలి?
మీరు
చేయవలసిన
పనులు
చేయండి.
ఉండవలసినరీతిగా
ఉండండి.
ఎప్పుడో
రాబోయే
విషయాలను
గురించి
అనవసరంగా
చింత
చేయకండి.
ప్రేమ,
సత్యము
ఈ
రెండు
మాత్రమే
శాశ్వతమైనవి.
‘సత్యాన్నాస్తి
పరోధర్మః’.
ఈ
దేహముతో
మనము
ఆచరించవలసిన
కర్తవ్యములు,
ధర్మములు
అనేకం
ఉంటున్నాయి.
మనం
ఆశించవలసింది
మాత్రం
ప్రేమ
ఒక్కటే.
ప్రేమ
ఎక్కడ
ఉంటుందో
అక్కడే
ఉంటుంది
ఆనందము;
అక్కడే
ఉంటుంది
నిజమైన
సంబంధము.
ప్రేమ
లేనిచోట
ఆనందము
లేదు,
ఎట్టి
సంబంధమూ
ఉండదు.
ఒక
వ్యక్తి
పంచభక్ష్యపరమాన్నములను
ఒక
తట్టలో
పెట్టుకొని
ఆనందంగా
భుజించాలని
కూర్చుంటాడు.
కాని,
బజారులో
తన
కుమారుడు
కారు
క్రిందపడి
మరణించాడని
తెలిసిన
తక్షణమే
ఆ
తట్టను
ప్రక్కకు
నెట్టేసి
బజారుకు
పరుగు
పెడతాడు.
అంతవరకు
అతనికి
భోజనంపైనున్న
ప్రేమ
ఎక్కడికి
పోయింది?
తాను
ఆశించినటువంటి
అన్నమును
ప్రక్కకు
నెట్టేయడమెందుకు?
6
▾
Meaning
Keep
అన్నంకంటే
అతనికి
కొడుకే
ప్రధానం.
ఈవిధంగా
మానవుడు
ఒకదానిని
మించి
మరొకదానిపై
ప్రేమను
పెంచుకుంటాడు.
జీవిత
ప్రయాణంలో
‘లగేజి’ని
తగ్గించుకోవాలి
నిజంగా
ఈ
లోకంలో
ఆశించతగినది
ఏ
ఒక్కటీ
లేదు.
Less
luggage,
more
comfort
makes
travel
a
pleasure.
‘లగేజి’
ఉన్నంతవరకు
మనకు
బాధలు
తప్పినవి
కావు.
ఏమిటీ
‘లగేజి’?
సంబంధ
బాంధవ్యములే!
ఈ
బంధనను
వదలుకున్నప్పుడే
అన్నివిధాలుగా
మనము
సుఖంగా
ఉంటాము.
దేనినీ
ఆశించకూడదు.
ఆశలను
పూర్తిగా
త్యజించడమే
వైరాగ్యము.
మీ
జీవిత
ప్రయాణం
ఆనందదాయకం
కావాలంటే
‘లగేజి’ని
తగ్గించుకోవాలి.
ఈ
సంబంధ
బాంధవ్యాలన్నీ
కదిలిపోయే
మేఘాలవంటివి.
అయితే,
ఆకాశముంటే
కదా
మేఘాలు
వచ్చేది!
దేహాభిమానమే
ఆకాశము.
దేహాభిమానము
ఉన్నంతవరకు
ఇవన్నీ
మనలను
భ్రమింపజేస్తుంటాయి.
ఎవరైనా
చనిపోతే,
‘అయ్యో,
పోయినాడే’,
అని
ఏడుస్తుంటారు.
ఎంత
కాలం
ఏడుస్తారు?
ఒకటి,
రెండు
దినాలు
ఏడుస్తారు;
ఆ
తర్వాత
మరచిపోతారు.
ఏదీ
శాశ్వతమైనది
లేదు.
అయితే,
మనము
ఆచరించవలసిన
కర్తవ్య
కర్మలను
ఆచరించాలి.
చలి
ఉన్నంతవరకు
మనము
శాలువ
కప్పుకుంటాము.
చలి
పోతూనే
దానిని
తీసివేస్తాము.
ఈ
దేహముకూడా
మనము
ధరించిన
వస్త్రమువంటిది.
ఇది
కేవలం
ఒక
పనిముట్టు.
ప్రపంచంతో
సంబంధ
బాంధవ్యములు
ఉన్నంతవరకు
దీనిని
మనము
పోషించుకుంటాము.
తదుపరి
దీనితో
మనకేమాత్రము
సంబంధముండదు.
దేహాభిమానం
ఉండవలసిందే!
కాని,
ఎంతవరకు?
మన
కర్తవ్య
కర్మలను
ఆచరించేంత
వరకే!
Duty
is
God.
కాబట్టి,
నీకిచ్చిన
‘డ్యూటీ’ని
నీవు
చేయి.
అంతేగాని,
దానికిపైన
అనేక
సంబంధ
బాంధవ్యములను
చుట్టుకోకూడదు,
కట్టుకోకూడదు.
ఈనాడు
మనము
మనకు
అవసరమైనదానికంటే
ఎక్కువ
ఆశిస్తున్నాము.
దురాశకు
పాల్పడుతున్నాము.
కాని,
మనం
ఎంత
‘లగేజి’ని
సంపాదించినప్పటికీ
ఏదో
ఒకనాడు
వీటినన్నింటినీ
వదలిపెట్టిపోక
తప్పదు.
7
▾
Meaning
Keep
Also in his talks
(20)
23 November 1978
Faith Is the Foundation of the Spiritual Path
8 November 1986
Through the Name we can attain the Named!
30 September 1987
Understand the Sai principle well
5 March 1992
‘Adhyātmavidyā vidyānāṁ’
14 January 1995
Prema is like a compass
24 June 1996
A Life without Character Is a Lifeless Life
17 July 1997
The principle of the Ātma and divinity
21 April 1998
The body itself is foremost for the practice of Dharma
14 August 1998
Prema Alone Is the Path, Prema Alone the Goal
30 September 1998
God's Prema Is Eternal, Everlasting
19 November 1998
Women Alone Are the Root Cause of Bhārata's Greatness
2 April 2003
Leave the delusion of the body; think of God
18 May 2003
Prema is the very essence of the Paramātma
21 October 2003
I have come only to reveal your true nature
22 November 2004
Only When Oneness Is Experienced Does Human Birth Find Its Fulfilment
14 January 2005
When the heart is filled with Prema, life is filled with Ānanda
23 June 2005
Recognise the fundamental principle
21 May 2006
Service to society is itself the right sādhana
11 August 2006
Divinity is attained only through Prema for God
28 July 2007
Every human being is God
మనల్ని
రక్షించేదీ,
పోషించేదీ
ప్రేమ
ఒక్కటే!
లోకములో
ఎన్నో
జరుగుతూ
ఉన్నాయి.
ఏమి
జరిగినప్పటికీ
భగవంతుడు
ఎప్పటికీ
సాక్షీభూతుడుగా
ఉంటాడు.
నీవు
ఏడుస్తుంటేకూడా
భగవంతుడు
నవ్వుతుంటాడు.
నీవు
నవ్వుతుంటేకూడా
భగవంతుడు
నవ్వుతూనే
ఉంటాడు.
భగవంతునికి
విచారము,
కష్టము,
దుఃఖము
అనేవి
ఉండవు.
భగవంతుడు
ఎవ్వరికీ
ఏ
కష్టమునూ,
ఏ
నష్టమునూ
కలిగించడు.
నిత్యానందం
పరమ
సుఖదం
కేవలం
జ్ఞానమూర్తిం
ద్వంద్వాతీతం
గగన
సదృశం
తత్త్వమస్యాది
లక్ష్యం
ఏకం
నిత్యం
విమలం
అచలం
సర్వధీ
సాక్షిభూతం
భావాతీతం
త్రిగుణ
రహితం......
భగవంతుడు
గుణాతీతుడు.
మీ
భ్రాంతులన్నీ
గుణముచేత
ఏర్పడినటువంటివి.
ప్రేమస్వరూపులారా!
మీరు
ఎన్నో
పూజలు,
వ్రతములు,
నోములు,
జపతపములు,
యజ్ఞ
యాగములు
చేస్తుంటారు.
కాని,
ఇవేవీ
మిమ్మల్ని
రక్షించవు,
పోషించవు.
మిమ్మల్ని
పోషించేదీ,
రక్షించేదీ
ఒక్కటే,
అదే
ప్రేమ,
ప్రేమ,
ప్రేమ!
ప్రేమ
ఒక్కటుంటే
మనము
ప్రపంచమంతటినీ
జయిస్తాము.
దైవము
మీకంటే
ప్రత్యేకంగా
ఉన్నాడనే
భావనతో
ప్రార్థన
చేయకండి;
మీలోనే
ఉన్నాడనే
దృఢమైన
విశ్వాసంతో
ప్రార్థించండి.
ఆత్మవిశ్వాసాన్ని
అభివృద్ధిపరచుకున్నప్పుడే
ఆత్మసంతృప్తి
చేకూరుతుంది.
ఆత్మసంతృప్తి
చేకూరినప్పుడే
స్వార్థాన్ని
త్యాగం
చేయడానికి
వీలవుతుంది.
ఆ
తర్వాతే
మానవునికి
ఆత్మసాక్షాత్కారం
కలుగుతుంది.
ఆత్మసాక్షాత్కారమంటే
ఏమిటి?
తనను
తాను
తెలుసుకోవడమే!
తానెవరనేది
తెలుసుకోకుండా
మానవుడు
‘నీవెవరు?
నీవెవరు?’
అంటూ
ఇతరులను
ప్రశ్నించుకుంటూపోతుంటే
ప్రయోజనం
ఏమిటి?
‘నేనెవరు?
నేనెవరు?’
అని
ప్రశ్నించుకోండి.
అది
చాలా
మంచిది.
‘నేను’
అంటే
దేహమా?
మనస్సా?
బుద్ధియా?
చిత్తమా?
కాదు,
కాదు.
‘ఇది
నా
దేహము’
అంటున్నారు.
కాబట్టి,
‘నేను’
వేరు,
దేహము
వేరు.
ఆ
‘నేను’
అన్నదే
ఆత్మ.
మీరందరూ
ఆత్మస్వరూపులే!
దైవస్వరూపులే!
కేవలం
గుర్తుకోసం
పేర్లు
పెట్టుకుంటున్నారేగాని,
అందరిలోను
ఉన్నది
ఒకే
ఆత్మయే.
8
▾
Meaning
Keep
అదొక్కటే
శాశ్వతం.
దేహము
నీటిబుడగవలె
క్షణ
భంగురమైనది.
మనస్సొక
పిచ్చికోతివలె
చంచలమైనది.
కాబట్టి,
మీరు
దేహమును,
మనస్సును
అనుసరించకండి.
అయితే,
దేహమున్నంతవరకు
మీ
బాధ్యతలను
మీరు
నిర్వర్తించాలి.
కాని,
మీ
మనస్సు
సరిగాలేకుండాపోతే
ఏదీ
మీకు
ఫలించదు.
కనుక,
మొట్టమొదట
మనస్సును
కంట్రోలు
చేసుకోవాలి.
మనస్సు
గలవాడే
మనిషి.
మీది
mankind
(మానవ
జాతి).
కాబట్టి,
మీరు
Kindness
(దయ)ను
అభివృద్ధి
పరచుకోవాలి.
అదే
నిజమైన
మానవత్వము.
మీ
మనస్సును
monkey-mind
గా
అంటే,
మర్కటంవలె
చంచలంగా
మార్చుకోకూడదు.
‘పరోపకారార్థ
మిదం
శరీరం’
మానవుడు
సత్యమైనదానిని
వదలిపెడుతున్నాడు,
అసత్యమైనదాని
ననుసరిస్తున్నాడు.
ఈ
కలియుగంలో
వ్యాపారధోరణి
మితిమీరిపోయింది.
ఎక్కడికి
పోయినా,
ఎవరిని
చూసినా
అంతా
వ్యాపారమే!
వ్యాపారమే!
డబ్బివ్వనిదే
ఇంత
ఉప్పు
కావాలన్నా
దొరకదు.
ఎప్పుడు
చూసినా
పుచ్చుకోవడమేనా!
ఇచ్చుకోవడం
కూడా
అలవాటు
చేసుకోవాలి.
మానవ
దేహము
వచ్చినది
ఎందుకోసం?
పరోపకారార్థమే!
‘పరోపకారః
పుణ్యాయ
పాపాయ
పరపీడనం’.
మనం
ఇతరులకు
సేవ
చేయాలేగాని,
ఇతరులు
మనకు
సేవ
చేయాలని
ఆశించకూడదు.
మన
శక్తి
ఉన్నంతవరకు
మనమే
ఇతరులకు
ఏదో
ఒక
సహాయం
చేయాలి.
‘దైవానికి
సేవ
చేస్తున్నాను’
అనే
పవిత్రమైన
భావంతో
చేయాలి.
ఏ
పని
చేసినను
నీ
స్వార్థంకోసం
నీవు
చేయకూడదు;
భగవత్ప్రీత్యర్థంగా
చేయాలి.
అప్పుడే
ఆ
పని
సార్థకమవుతుంది.
నీవు
ఈరోజు
ఇక్కడున్నావు.
కాని,
రేపు
ఎక్కడుంటావో!
ఎక్కడికి
పోతావో!
అంతా
అశాశ్వతమే!
ప్రేమ
ఒక్కటే
శాశ్వతమైన
దైవత్వం.
నీకు
ఏవైనా
ఆశలున్నప్పుడు
ఇతరులు
నిన్ను
ద్వేషించడానికి
అవకాశ
ముంది.
కాని,
నీలో
ప్రేమ
ఒక్కటి
ఉంటే
ఎవ్వరూ
నిన్ను
ద్వేషించరు.
నీవు
ఎవ్వరినీ
ద్వేషించకూడదు.
ఎవరిపైనా
అసూయపడకూడదు;
క్రోధము
చూప
కూడదు.
ఉపకారికి
ఉపకారము
చేయడం
గొప్పతనం
కాదు;
అపకారికికూడా
ఉపకారం
చేయాలి.
9
▾
Meaning
Keep
Also in his talks
(4)
15 September 1986
The inner meaning and greatness of the festival of Onam
26 August 1988
In hardships and in pains, strive to turn the mind another way!
21 August 2002
'I' Itself Is Divinity
16 August 2006
The one who dwells in the body is the God of gods
చింతలు
లేనివాడే
నిజమైన
భక్తుడు
ప్రేమస్వరూపులారా!
మీరెంతో
ప్రేమతో
ఇక్కడికి
వచ్చారు.
ఆ
ప్రేమను
మీ
హృదయంలో
పదిలపరచుకొని
దైవసాన్నిధ్యాన్ని
అనుభవించండి.
మీ
ఇంటనే,
వెంటనే,
జంటనే,
కంటనే
ఉండే
ప్రేమ
తత్త్వాన్ని
వదులుకోకండి.
భగవంతుడు
మీకంటే
వేరుగా
ఉన్నాడని
భావించకండి.
అనేకమంది
తట్టలో
పళ్ళు,
పూలు
పెట్టుకొని
గుడికి
వెళుతుంటారు.
బ్రహ్మాండమంతయు
ప్రబలుచుండెడి
తనకు
ఆలయంబు
నమర్చ
నలవియగున
బ్రహ్మాండమంతయు
బొజ్జలోనుండగ
భక్ష్యభోజ్యములు
తనకు
పెట్ట
తగున
సర్వ
జలంబుల
సంచరించెడి
తనకు
స్నానంబు
చేయింప
నలవియగున?
భగవంతునికి
పెట్టిన
నైవేద్యాన్ని
భక్తులు
తిరిగి
తామే
భుజిస్తారు.
అర్చనలు,
అభిషేకాలు
ఇవన్నీ
కేవలం
నీ
తృప్తికోసమై
నీవు
చేస్తున్నావుగాని,
భగవంతుడు
ఏదీ
ఆశించడు.
భగవంతునికికూడా
కొన్ని
కోరికలు
ఉంటాయని
కొందరనుకుంటారుగాని,
ఆయనకు
ఎట్టి
కోరికలూ
లేవు.
ఎందుకంటే,
ఆయనకు
ఏ
బంధనా
లేదు.
బంధన
లేనివానికి
భ్రమ
ఎలా
ఉంటుంది!
కోరికలెలా
ఉంటాయి!
ఆయన
ఏది
చేసినా
మీకోసమే!
ఏది
చెప్పినా
మీకోసమే!
ఏది
అనుభవించినా
మీకోసమే!
అదేవిధంగా,
మీరుకూడా
అందరికోసం
పాటుపడాలి.
‘లోకాస్సమస్తా
స్సుఖినో
భవంతు’
అని
ప్రార్థన
చేయాలి.
‘వాడు
నా
శత్రువు
కాబట్టి
చచ్చిపోవాలి’
అనుకోకూడదు.
ఎవరికీ
చెడు
జరగాలని
కోరుకోకూడదు.
అంతా
బాగుండాలని
ఆకాంక్షించాలి.
Love
ever,
hurt
never.
ఎవ్వరినీ
బాధించకూడదు.
ప్రేమ!
ప్రేమ!
ప్రేమ!
ప్రేమ
ఒక్కటి
ఉంటే
చాలు,
సర్వమునూ
సాధించవచ్చును.
ప్రేమను
పరమాత్మగా
భావించండి.
మీ
శత్రువును
సహితం
ప్రేమించండి.
ఎదురుగా
వచ్చినవాడు
మీకు
విరోధి
అయినా
ప్రేమతో
అతనికి
నమస్కారం
చేయండి.
ఆ
నమస్కారం
దైవానికే
చెందుతుంది.
అందరూ
దైవస్వరూపులే
అనే
సత్యాన్ని
గుర్తించి
ఎవ్వరినీ
ద్వేషించకుండా
ఉండాలి.
10
▾
Meaning
Keep
మీకు
జరగవలసినవి
జరుగుతుంటాయి.
దేనికీ
మీరు
విచారించకూడదు.
గతాన్నిగురించి
విచారించవద్దు.
భవిష్యత్తుగురించి
ఆందోళన
చెందవద్దు.
వర్తమానాన్ని
సద్వినియోగం
చేసుకొని
ఆనందాన్ని
అనుభవించండి.
ఎంత
చింతించినా
గడచిపోయిన
కాలం
తిరిగి
వస్తుందా?
పోయినవారు
తిరిగి
రాగలరా?
ముందు
ఏమి
జరుగనున్నదో
ఎవరికీ
తెలియదు.
దానిగూర్చి
ఎందుకు
మనం
చింతించాలి?
‘ఇప్పుడు
బాగున్నాము,
చాలు’
అని
ఆనందించండి.
ఆవిధమైన
సంతృప్తిని
మనము
అలవరచుకుంటే
ఏ
చింతలూ
మనలను
బాధించవు.
అసలు
చింతయొక్క
స్వరూపమేమిటి?
అది
కేవలం
మనోకల్పితమైన
భయమే.
కనుక,
చింతకు
అవకాశమే
ఇవ్వకూడదు.
నీకు
చింతలుండినంతవరకు
నీవు
భక్తుడవనిపించుకోలేవు.
చింతలు
లేనివాడే
నిజమైన
భక్తుడు.
ప్రతి
దానియందు
మనము
సంతృప్తిని
అనుభవించాలి.
సంతృప్తి
లేనప్పుడే
చింతలు
ప్రారంభమవుతాయి.
ఈ
చింతలు
ఏమి
చేస్తాయి?
మనిషిని
క్రుంగదీస్తాయి.
దేహంపై
మనసు
పెట్టకండి
ప్రేమస్వరూపులారా!
ఏనాడు
మీరు
ఆనందంగా
ఉంటారో
అదే
holy
day
(పవిత్ర
దినము).
ఆనందమే
పవిత్రతకు
చిహ్నం.
భగవత్తత్త్వములో
మీ
ప్రేమను
ఇముడ్చుకోండి.
ప్రేమలో
జీవించండి.
అప్పుడు
మీకు
నిత్యం
క్రొత్త
సంవత్సరాదిగానే
ఉంటుంది.
ఈరోజున
పాయసం
వండుకొని
భుజించినంత
మాత్రాన
ఇది
సంవత్సరాది
అవుతుందా?
కాదు,
కాదు.
అందరూ
ఆనందంగా
ఉన్న
దినమే
సంవత్సరాది.
కనుక,
మీరు
నిరంతరం
ఆనందంగా
ఉండాలి.
ఏమైనా
కష్టాలు
వస్తే,
బాధలు
కలిగితే
వాటికి
‘గెటౌట్’
అని
చెప్పాలి.
మీరు
దుఃఖ
స్వరూపులు
కాదు.
మీకు
చింతలు
లేవు,
ఏ
బాధలూ
లేవు.
‘నేను
మానవుడను.
కాబట్టి,
ఈ
కష్టము
నాది
కాదు,
ఈ
దుఃఖము
నాది
కాదు.
వీటితో
నాకు
సంబంధం
లేదు’
అనుకోవాలి.
మీకు
కడుపు
నొప్పో,
తల
నొప్పో
వచ్చిందనుకోండి.
‘ఈ
నొప్పి
దేహానిదేగాని,
నాది
కాదు’,
అనుకోవాలి.
ఇవి
దేహానికి
సహజం.
దేహతత్త్వాన్ని
లక్ష్యపెట్టకూడదు.
అయితే,
ఉన్నంతవరకు
పరాధీనం
కాకుండా
ఉండాలి.
ఆశలను
అరికట్టుకోవాలి.
వాటివల్లనే
కదా
ఈ
బాధలు.
మీరు
విపరీతంగా
దేహాభిమానమును
పెంచుకోవడంవలననే
కష్టాలకు
గురి
అవుతున్నారు.
11
▾
Meaning
Keep
దేహాభిమానము
ఎక్కువ
పెంచుకున్నవారికే
ఎక్కువగా
రోగాలు
వస్తాయి.
కాబట్టి,
దేహంపై
మనసు
పెట్టకండి.
మీ
నిజతత్త్వంపై
మనసు
నిల్పుకోండి.
ఒకరోజున
ఒక
విద్యార్థి
ఇనుప
కుర్చీ
వేసుకొని
తోరణం
కడుతున్నాడు.
నేనక్కడికి
వచ్చేసరికి
వాడు
భయపడిపోయాడు.
అక్కడినుండి
పడ్డాడు.
అతను,
ఆ
ఇనుప
స్టూలు
నా
మీద
పడేసరికి
నా
తుంటి
మూడు
ముక్కలైపోయింది.
డాక్టర్లు
మూడు
నెలలు
రెస్టుగా
ఉండాలని
చెప్పారు.
మూడు
నిమిషాలు
కూడా
నేను
రెస్టు
తీసుకోనని
చెప్పాను.
ఈ
దేహం
వచ్చింది
దేనికోసం?
పరులకు
ఉపకారం
చేసే
నిమిత్తం
దేహం
వచ్చింది.
ఆనాటినుండి
ఈనాటి
వరకు
ఒక
కట్టుకూడా
కట్టుకోలేదు.
విద్యార్థులంటే
నాకు
చాలా
ఇష్టం.
వాళ్లుకూడా
స్వామిని
ఎంతగానో
ప్రేమిస్తారు.
ఒక
పిల్లవాని
చేయి
పట్టుకుంటాను,
కొంచెం
నడుస్తాను.
మన
దేహం
బ్యాలెన్సుపై
ఆధార
పడినటువంటిది.
బ్యాలెన్సు
పోయినప్పుడు
కొన్ని
చిక్కులు
కలుగుతాయి.
కాని,
దీనిని
నేను
లెక్కచేయను.
వస్తుంది,
పోతుంది.
అదే
బాగైపోతుంది.
దేనికీ
విచారించకూడదు.
మన
కర్తవ్యాన్ని
మనం
నిర్వర్తిస్తే
అన్నీ
సక్రమంగా
జరిగిపోతాయి.
చింతించేకొలదీ
అనారోగ్యం
పెరిగిపోతుంది
ఊరికే
తింటూ
కూర్చుంటే
అజీర్ణం
అధికమౌతుంది.
కాబట్టి,
తిండికోసం
ప్రాకులాడకండి.
ఆరోగ్యాన్ని
జాగ్రత్తగా
చూసుకోండి.
ఆహార
విహారాదులలో
మీరు
పరిమితిని
పాటించినప్పుడే
అది
సాధ్యమవుతుంది.
మంచి
పేరు
సంపాదించుకోండి.
మంచి
అలవాట్లు,
మంచి
ఆరోగ్యం,
మంచి
నడత
-
ఇవి
ఉంటే
చాలు;
డాక్టర్లకోసం
మనం
అక్కడికీ
ఇక్కడికీ
తిరుగనక్కర్లేదు.
అసలు
డాక్టర్ల
దగ్గరకు
వెళ్ళే
పరిస్థితిని
మనం
ఎందుకు
కల్పించుకోవాలి?
ఈనాడొక
రోగానికి
మందు
తింటే
రేపు
మరో
రోగం
ప్రారంభమవుతుంది.
కొందరు
డాక్టర్లు
ధనార్జనే
ధ్యేయంగా
పెట్టుకుంటున్నారు.
ఏదో
ఒక
చిన్న
గడ్డ
వచ్చిందంటే,
అదేమిటో
చక్కగా
విచారించకుండా,
‘క్యాన్సర్’
అంటారు.
ఆ
మాట
విన్న
తరువాత
రోగికి
నిజంగానే
‘క్యాన్సర్’
వస్తుంది.
ఎందుకంటే,
అతను
దానిగురించే
చింతిస్తూ
ఉంటాడు.
చింతించేకొలదీ
అనారోగ్యం
ఇంకా
పెరిగిపోతుంది.
Hurry
(తొందరపాటు),
Worry
(చింత),
Curry
(క్రొవ్వు
పదార్థము)
-
ఈ
మూడూ
గుండెపోటుకు
దారితీస్తాయి.
12
▾
Meaning
Keep
కనుక,
వీటిని
మనము
అరికట్టుకోవాలి.
తెలివైన
పిల్లలుకూడా
కొంతమంది
పరీక్షలు
వచ్చాయంటే
బాగా
వ్రాయగలమో
లేదోనని
ఆందోళన
పడుతుంటారు.
తత్ఫలితంగా
పరీక్షా
హాలుకు
వెళ్లిన
తరువాత
తాము
చదివినవికూడా
సరిగా
వ్రాయలేరు.
ఊరికే
చింత
చేయడంవలన
ఇలాంటి
కష్టాలు
కలుగుతుంటాయి.
కనుక,
ఏ
ఒక్కదానికికూడను
చింత
చేయకూడదు.
మన
పని
మనం
సక్రమంగా
చేయాలి.
ఈవిధమైన
జీవితాన్ని
గడిపినప్పుడు
ఎవ్వరినీ
మనము
ప్రార్థించనక్కర్లేదు;
ఎవరి
దగ్గరికీ
పోనక్కర్లేదు.
నీ
హృదయాన్ని
నీవు
పవిత్రంగా
ఉంచుకో;
దృఢమైన
విశ్వాసంతో
నింపుకో.
నీ
ఆనందాన్ని
నీవు
ప్రపంచానికి
చెప్పుకోనక్కర్లేదు.
నీవు
విశ్వసించవలసినదానిని,
హృదయపూర్వకంగా
విశ్వసించు.
నీవు
ప్రేమించ
వలసినదానిని
హృదయపూర్వకంగా
ప్రేమించు.
నీవు
విశ్వసించవలసినది,
ప్రేమించవలసినది
ఒక్క
దైవాన్ని
మాత్రమే.
అట్టి
విశ్వాసము,
ప్రేమ
నీలో
ఉంటే
దేనినైనా
నీవు
సాధించవచ్చు.
ఒకవైపు
భగవంతుడు,
మరోవైపు
ప్రపంచము
-
రెండూ
కావాలంటే
కుదరదు.
‘జోడు
గుఱ్ఱాల
స్వారీ’
పనికిరాదు.
అది
ప్రమాదానికి
దారితీస్తుంది.
ఒక్క
దైవత్వంపై
మనసు
నిల్పాలి,
ఏకత్వంపై
నమ్మకం
పెట్టుకోవాలి.
ఈవిధంగా
ఉంటే
ఏదైనా
మనము
సాధించవచ్చును.
సుఖాన్ని
కోరేవారు,
ఆనందాన్ని
కోరేవారు
ఒక్క
భగవంతుణ్ణి
మాత్రమే
ఆశించాలి.
దుఃఖానికి
ఏమాత్రం
క్రుంగిపోకూడదు.
హృదయంలో
ప్రేమను
నింపుకొని
భగవంతుణ్ణి
ప్రార్థిస్తే
అన్నీ
సక్రమంగా
జరుగుతాయి.
ప్రేమస్వరూపులారా!
ఎట్టి
పరిస్థితిలోనూ
మీ
ప్రేమను
మార్చుకోకండి.
దైవాన్ని
పూజించడం
గొప్పతనం
కాదు.
దైవాన్ని
ప్రేమించండి.
Previous
←
Only a son worthy of his mother's love can win God's grace
Next
Only one who has mastered the mind is a true human being
→