Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 2003 · The heart alone is Kṛṣṇa's birthplace
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
The heart alone is Kṛṣṇa's birthplace
19 August 2003, Kṛṣṇa Janmāṣṭamī, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
Also in his talks
(14)
22 February 1982
The Sādhana of Unity
28 January 1992
The Ātma dwelling in all beings is one!
3 March 1992
Singing the Name of God makes the five elements holy
18 February 1996
The Name is the great boat for life
15 July 1996
Dharma Is Our Real And Permanent Property
27 August 1996
When the Anātma Is Removed, the Ātma Is Seen Everywhere
6 September 1996
Religion Is What Shows Forth the Oneness in Manyness
3 October 1996
Man's Aim and Goal Is the Vision of His Own Svarūpa
10 October 2002
Earn divine Prema
15 April 2004
The principle of Prema is Divinity itself
13 May 2006
Humanness finds its fulfilment only when steadiness and oneness are both there
31 May 2008
Oneness is divinity
22 July 2008
Man finds Śānti only when he turns his mind towards God
23 November 2008
Foster the feeling of the one Ātma, and unity!
సర్వరూపధరం
శాంతం
సర్వనామధరం
శివం
సచ్చిదానందమద్వైతం
సత్యం
శివం
సుందరం
ప్రేమస్వరూపులారా!
కృష్ణజన్మాష్టమి
అనగా
కృష్ణుడు
పుట్టిన
దినము.
అయితే,
ఏది
నిజమైన
పుట్టినదినము?
ప్రతి
మానవునియొక్క
హృదయమే
కృష్ణుని
జన్మభూమి.
ఏనాడు
మన
హృదయము
హిమాచలమువలె
చల్లగా,
పవిత్రంగా,
ప్రశాంతంగా
రూపొందుతుందో
ఆనాడే
కృష్ణుని
నిజమైన
జన్మదినము.
అట్టి
హృదయమునందే
భగవంతుడు
ఆవిర్భవిస్తాడు.
కృష్ణుడు
అర్ధరాత్రి
సమయమందు,
అష్టమి
తిథియందు
అవతరించాడు.
అష్టమి
అమంగళకర
మైనదని
చాలామంది
భావిస్తారు.
కాని,
భగవంతుని
జన్మదినము
అమంగళకర
మెలా
అవుతుంది?
అమంగళమనేదే
లేదు.
అన్నీ
మంగళకరమైన
దినములే!
అన్నీ
శుభదినములే!
కృష్ణుడు
అర్ధరాత్రివేళ
చెఱసాలలో
జన్మించాడు.
ఆ
సమయంలో
కావలివారు
గాఢనిద్రలో
మునిగి
ఉన్నారు.
తల్లిదండ్రులైన
దేవకీ
వసుదేవులు
మాత్రమే
మెలుకువగా
ఉన్నారు.
వసుదేవుడు,
ఆ
శిశువును
క్రూరుడైన
కంసుని
బారినుండి
కాపాడే
నిమిత్తం
వ్రేపల్లెలో
ఉన్న
యశోద
ఇంటికి
తీసుకువెళ్ళడానికి
సిద్ధమయ్యాడు.
బిడ్డను
నెమ్మదిగా
ఒక
బట్టలో
చుట్టి,
బుట్టలో
పెట్టి
తలపైన
పెట్టుకొని
బయలుదేరాడు.
చెఱసాల
తలుపులు
వాటంతటవే
తెరుచుకున్నాయి.
బయట
కుంభవృష్టి
కురుస్తోంది.
తన
చిన్నిశిశువు
వర్షములో
తడిసిపోతాడని
వసుదేవుడు
ఆవేదన
చెందాడు.
వెంటనే,
కృష్ణుని
సంకల్పము
మేరకు
ఒక
పెద్ద
సర్పము
ప్రత్యక్షమై
చిన్నికృష్ణునిపై
చినుకులు
పడకుండా
తన
పడగ
కప్పింది.
వసుదేవుడు
యమునను
దాటి
యశోద
ఇంటికి
చేరుకున్నాడు.
ఆ
సమయంలో
యశోద
ప్రసవవేదన
పడుతోంది.
ఆమె
భర్త
నందుడు
హాయిగా
నిద్రిస్తున్నాడు.
2
▾
Meaning
Keep
Also in his talks
(29)
3 July 1986
The aham-principle arose from the Ātma-principle alone
10 October 1986
A people that has morality is the true people
3 September 1988
The body itself is a temple!
15 October 1988
All Things and All Beings in the World Are Forms of the Paramātma!
7 April 1989
All this is Vāsudeva
23 July 1989
All Religions Together Teach Only the Good
13 August 1989
Good Resolves Are Everlasting
12 September 1989
The Name of God Alone Is the Boat
28 October 1989
Prema Itself Is God
14 August 1990
Role of the Avatars
16 September 1990
Discipline is like our very life-breath
1 January 1992
Only when the differences of the upādhis are removed does the principle of the one Ātma become our own
28 February 1995
God, master of the three
20 August 1996
Every Man Must Cultivate the Vision of Prema
8 September 1996
The Unseen Divinity Is the Basis of the World Fashioned as the Seen
29 April 1998
God Alone Is the Ground of Ānanda
25 August 1998
The Whole World Is Filled with Viṣṇu
10 September 1998
By Sacrifice Some Have Attained Immortality
11 August 2000
Only When There Is Purity of Mind Is There Success
13 March 2002
The divine power of attraction
31 August 2002
God in Human Form
10 October 2002
Earn divine Prema
1 January 2003
Only service done with the feeling of the one Ātma is true service
16 March 2003
The principle of Prema: the divine power of attraction
15 April 2004
The principle of Prema is Divinity itself
18 April 2005
The wedding of Sītā and Rāma is the union of the Ātma and the Paramātma
21 July 2005
No power is greater than Bhakti for God
11 August 2006
Divinity is attained only through Prema for God
29 September 2006
The basis of human life: ‘Educare’
వసుదేవుడు
తాను
తీసికొని
వెళ్ళిన
మగ
శిశువును
నెమ్మదిగా
యశోదప్రక్కన
పరుండబెట్టి,
అప్పుడే
ఆమె
ప్రసవించిన
ఆడశిశువును
బుట్టలో
పెట్టుకొని
వెంటనే
చెఱసాలకు
తిరిగి
వచ్చాడు.
అయితే,
తానేమి
చేస్తున్నాడో
వసుదేవునికి
అర్థం
కాలేదు.
దైవాజ్ఞను
అనుసరించి
తన
బాధ్యతను
తాను
నిర్వర్తించాడేగాని,
“నేనేమి
చేస్తున్నాను?
ఎందుకు
వెళుతున్నాను?”
అన్న
ఆలోచన
అతని
మనస్సులో
కల్గలేదు.
భగవంతుని
చరిత్రను
ఎవ్వరూ
అర్థం
చేసుకోలేరు.
చిత్రంబులు
త్రైలోక్య
ప
విత్రంబులు
భవలతాలవిత్రంబులు
స
న్మిత్రంబులు
మునిజనవన
చైత్రంబులు
విష్ణుదేవు
చారిత్రంబుల్
వసుదేవుడు
చెఱసాలలోకి
ప్రవేశించి
తాను
తెచ్చిన
ఆడశిశువును
దేవకి
ప్రక్కన
పరుండబెట్టాడు.
చెఱసాల
తలుపులు,
తాళాలు
వాటంతటవే
మూసుకున్నాయి.
తక్షణమే
బెల్లు
మ్రోగింది.
కావలివారికి
మెలుకువ
వచ్చింది.
దేవకీదేవి
ప్రసవించిన
వార్త
విని
కంసుడు
పెద్ద
ఆర్భాటంతో
చెఱసాలవద్దకు
వచ్చాడు.
వసుదేవుడు
అందించిన
శిశువును
తన
అలవాటు
ప్రకారం
ఎడమ
చేతితో
పైకెగురవేసి
ఖండించడానికి
కత్తినెత్తాడు.
ఆ
మాయాకన్య
ఆకాశంలోనే
నిలచి,
‘కంసా!
నిన్ను
చంపువాడు
వ్రేపల్లెలో
పెరుగుతున్నాడు,’
అని
హెచ్చరించి
అంతర్థానమైనది.
ఈ
విచిత్ర
సంఘటన
చూసి
దేవకీదేవి
ఆశ్చర్యచకితురాలైంది.
కృష్ణుడు
కంసుని
బారినుండి
ప్రజలను
తప్పకుండా
రక్షించగలడని
ఆమెకు
విశ్వాసము
కలిగింది.
‘వినాశకాలే
విపరీత
బుద్ధిః’
కృష్ణుడు
యశోద
ఇంట్లో
శుక్లపక్షచంద్రుని
వలె
దినదినప్రవర్ధమానుడగుచూ,
అనేకరకములైన
లీలలు
చూపుతూ
వచ్చాడు.
తనను
చంపగలట్టివాడు
దేవకి
అష్టమగర్భమున
పుట్టి
వ్రేపల్లెలో
పెరుగుతున్నాడని
విని
కంసుడు
భయపడ్డాడు.
దేవకీ
సుతుని
గుర్తింపలేక
వ్రేపల్లెలో
పుట్టిన
పసిబిడ్డలందరినీ
చంపమని
తన
బంటులకు
ఆర్డరు
వేశాడు.
3
▾
Meaning
Keep
మొట్టమొదట
మగబిడ్డలను
చంపమన్నాడు.
తరువాత,
ఆడబిడ్డలవలనకూడా
తనకు
ఆపద
కలుగవచ్చునన్న
భయముచేత
వారిని
కూడా
చంపిస్తూ
వచ్చాడు.
కాని,
కృష్ణునికి
హాని
కలిగించగలవారెవరు?
అతని
దివ్యశక్తిని
అరికట్టగలవారెవరు?
కృష్ణుని
దివ్యకీర్తి
దినదినానికీ
పెరిగిపోతూ
వచ్చింది.
కృష్ణుని
అంతమొందించే
నిమిత్తం
కంసుడు
మాయా
రూపులైన
రాక్షసులను
వ్రేపల్లెకు
పంపించసాగాడు.
కాని,
వారందరూ
కృష్ణుని
చేతిలో
హతులయ్యారు.
కృష్ణుని
దివ్యశక్తిని
ఎవ్వరూ
అర్థం
చేసుకోలేకపోయారు.
‘వినాశకాలే
విపరీత
బుద్ధిః’,
అన్నట్లు
కంసునికి
విపరీతబుద్ధులు
పుట్టాయి.
ఎలాగైనా
కృష్ణుని
మధురానగరానికి
రప్పించి
హతమార్చాలని
కుట్ర
పన్నాడు.
ఒక
యజ్ఞం
తలపెట్టి,
దానిని
చూసే
నిమిత్తం
కృష్ణ
బలరాములిరువురినీ
మధురకు
పిలుచుకొనిరమ్మని
చెప్పి
వారికి
అత్యంత
ప్రీతిపాత్రుడైన
అక్రూరుని
వ్రేపల్లెకు
పంపించాడు.
కృష్ణుడు
కుబ్జను
అనుగ్రహించుట
అక్రూరునివెంట
కృష్ణబలరాములు
మధురా
నగరమును
చేరుకున్నారు.
వారి
దివ్యసుందర
రూపాలను
చూసి
అక్కడి
ప్రజలు
ముగ్ధులైనారు.
“కృష్ణా!
మమ్మల్ని
కంసుని
బారినుండి
కాపాడు,”
అని
ప్రార్థించారు.
కృష్ణబలరాములు
కంసుని
వద్దకు
వెళ్ళే
ముందు
చాకలివద్దనుండి
కంసుని
దుస్తులు
తీసికొని
ధరించారు.
కుబ్జ
అనే
పేరుగల
దాసి
కంసునికొరకు
అనేక
సుగంధద్రవ్యాలను
తీసికొని
వెళుతూ
ఎదురైంది.
ఆమె
కృష్ణుని
చూస్తూనే
పట్టలేని
ఆనందంతో
అతనిపై
పన్నీరు
చల్లింది.
అతని
శరీరానికి
గంధము
పూసింది.
కృష్ణుడు
దేవుడని
ఆమెకు
తెలుసు.
“కృష్ణా!
ఈనాడు
నా
భాగ్యం
పండింది.
ఇది
ఎన్ని
జన్మలలో
చేసిన
పుణ్యమోగాని,
ఈరోజు
నీకు
ఈవిధంగా
సేవచేసే
అదృష్టం
నాకు
లభించింది,”
అని
పొంగిపోయింది.
కృష్ణుడు
ప్రసన్నుడై
ఆమె
రెండు
పాదాలను
తన
పాదంతో
త్రొక్కిపట్టుకొని,
చెక్కుల
క్రింద
చేయిపెట్టి
పైకి
లాగాడు.
ఆమె
కుబ్జత్వం
పోయి
అందమైన
స్త్రీగా
రూపొందింది.
ఈవిధంగా
కృష్ణుడనేక
అద్భుతలీలలను
ప్రదర్శిస్తూ,
ఎందరికో
శాపవిమోచనం
గావిస్తూ
వచ్చాడు.
కంససంహారం
కంసుడు,
కృష్ణబలరాములు
తన
దుస్తులను
ధరించి
తిరుగుతున్న
సంగతి
విని
ఉగ్రుడయ్యాడు.
ఇంతలో
కుబ్జ
అతనివద్దకు
వెళ్ళి,
“ప్రభూ,
కృష్ణుని
మాయలను
ఎవ్వరూ
అర్థం
చేసుకోలేరు.
4
▾
Meaning
Keep
నీవు
కూడా
అతని
మాయలను
అర్థం
చేసుకోవడానికి
ప్రయత్నించకు.
నీవు
అతని
జోలికి
పోకుండా
నోరు
మూసుకొని
ఉంటే
మంచిది,”
అని
హితవు
చెప్పింది.
“ఈ
దాసికి
ఇంతటి
ధైర్యం
ఎక్కడి
నుండి
వచ్చింది?”
అని
కంసుడు
ఆశ్చర్యపోయాడు.
తనతో
ఈరీతిగా
మాట్లాడేటట్లు
కృష్ణుడే
ఆమెను
పురిగొల్పి
ఉండవచ్చునని
భావించాడు.
ఇంతలో
ఎవరో
రావడంతో
కంసుని
దృష్టి
అటువైపు
మళ్ళింది.
ఈలోపల
కుబ్జ
అక్కడినుండి
నెమ్మదిగా
తప్పించుకుంది.
కృష్ణబలరాములను
చంపవలసిందని
చెప్పి
కంసుడు
తన
బంటులను
పంపించాడు.
వాళ్ళు
కృష్ణుని
ధాటికి
తట్టుకోలేక
అతని
పాదాలపై
పడ్డారు.
పిమ్మట,
కృష్ణబలరాములు
సింహపు
పిల్లలమాదిరి
కంసుని
ఆస్థానంలోకి
ప్రవేశించారు.
అక్కడ
మల్లయుద్ధం
జరుగుతున్నది.
కంసుడు
వేదికపై
కూర్చొని
ఆ
పోటీని
తిలకిస్తున్నాడు.
కృష్ణబలరాములు
పక్షులవలె
ఎగిరి
కంసునిపైకి
దుమికారు.
అతనిని
మెడపట్టి
క్రిందికి
లాక్కొని
వచ్చి,
ముష్టిఘాతాలు
కురిపించి
అతనిని
పచ్చడి
చేసిపెట్టారు.
కృష్ణుడు
అతని
పొట్టపైన
కాలుపెట్టి
చీల్చివేశాడు.
ఈ
దృశ్యమును
చూసి
సభాసదులు
నిశ్చేష్టులయ్యారు.
మహాబలవంతుడైన
కంసుణ్ణి
చిన్నపిల్లవాడైన
కృష్ణుడు
ఏవిధంగా
చంపగల్గాడని
ఆశ్చర్యపోయారు.
అక్కడ
వ్రేపల్లెలో
ప్రజలంతా
కృష్ణబలరాముల
రాకకై
ఎదురు
చూస్తున్నారు.
కంసుడు
వారికేమైనా
హాని
తలపెట్టినాడేమోనని
గోపికలు
ఏడుస్తున్నారు;
కంసుణ్ణి
నోటికొచ్చినట్లు
దూషిస్తున్నారు.
యశోదానందులుకూడా
ఆందోళన
చెందుతున్నారు.
గోపిక
లందరూ,
‘కృష్ణా,
కృష్ణా’
అంటూ
కృష్ణనామాన్ని
స్మరిస్తూ
వచ్చారు.
తరువాత,
కంసుని
మరణవార్త
విని
వారు
ఆనందంతో
పండుగ
జరుపుకున్నారు.
కంసుడు
మరణించిన
తరువాత
అతని
భార్యలిరువురూ
వారి
పుట్టినింటికి
వెళ్ళిపోయారు.
వారు
జరాసంధుని
కుమార్తెలు.
కృష్ణుడు
కంసుని
సంహరించి
తన
బిడ్డలకు
అన్యాయం
చేశాడని
జరాసంధునికి
కోపం
వచ్చింది.
అతను,
అతని
బంధువులు
కృష్ణునిపై
ద్వేషము
పూనారు.
ఈ
సంగతి
విని
యశోదానందులు
ఆందోళన
చెందారు.
అయితే,
దేవకీదేవి
చాలా
ధైర్యవంతురాలు,
పరమ
భక్తురాలు.
కృష్ణునికి
ఎవ్వరూ
హాని
చేయలేరని
ఆమె
ధైర్యంగా
ఉన్నది.
5
▾
Meaning
Keep
రుక్మిణీ
కల్యాణం
కొంతకాలం
గడిచింది.
కృష్ణునికి
యుక్త
వయస్సు
రావడంతో
వివాహ
ప్రయత్నాలు
ప్రారంభమయ్యాయి.
విదర్భరాజ
పుత్రికయైన
రుక్మిణి
కృష్ణుని
ప్రేమించింది.
కాని,
ఆమె
సోదరుడైన
రుక్మి
ఆమెను
తన
మిత్రుడైన
శిశుపాలుని
కిచ్చి
వివాహము
చేయాలని
సంకల్పించుకున్నాడు.
అది
ఆమెకు
ఇష్టము
లేదు.
ఒక
పండితునిద్వారా
కృష్ణునికి
ఒక
జాబు
వ్రాసి
పంపింది.
“కృష్ణా!
నేనింక
తాళలేను,
ఈ
బాధలను
భరించలేను.
నా
తండ్రి
నా
ఇష్టానికి
వ్యతిరేకంగా
రేపటిదినము
శిశుపాలునితో
నా
వివాహం
జరుపనున్నాడు.
ఈ
ముహూర్తములోపల
నీవు
వచ్చి
నన్ను
తీసికొనిపోకుండినయెడల
నా
ప్రాణం
నిలువదు,”
అని
వ్రాసింది.
రుక్మి
వేసిన
ప్లాను
కృష్ణునికి
తెలుసు.
రుక్మిణిని
అక్కడినుండి
తప్పించి
తీసికొనిరావడానికి
తాను
‘మాస్టర్
ప్లాను’
వేసుకున్నాడు.
రుక్మిణి,
వారి
కుటుంబ
సంప్రదాయము
ననుసరించి
వివాహానికి
పూర్వం
గౌరీదేవికి
పూజచేసే
నిమిత్తం
గుడికి
వెళుతున్నది.
కృష్ణుడు
వస్తాడో
రాడో
అని
మనసులో
ఆందోళనచెందుతూ
నెమ్మదిగా
అడుగులు
వేస్తున్నది.
ఆమె
గుడివద్దకు
చేరుకునేసరికి
ద్వారముదగ్గరే
కాచుకొని
ఉన్న
కృష్ణుడు
రెప్పపాటులో
ఆమెను
రథమునెక్కించుకొని
తీసికొనిపోసాగినాడు.
రుక్మి
కృష్ణుని
అడ్డగించాడు.
వారి
మధ్య
భీకరయుద్ధం
జరిగింది.
కృష్ణుడాతనిని
ఓడించి,
రుక్మిణిని
క్షేమంగా
తన
పట్టణానికి
గొనిపోయి
వివాహమాడినాడు.
ఆనాటినుండి
శిశుపాలునికి
కృష్ణునిపై
విపరీతమైన
ద్వేషము
ఏర్పడింది.
రుక్మికికూడా
చాలా
కోపం
వచ్చింది.
కాని,
కృష్ణుని
ఏమీ
చేయలేక
ఊరకున్నారు.
కృష్ణజన్మాష్టమి
మంగళకరమైన
దినమే!
కృష్ణుడు
తన
జీవితములో
అనేక
కష్టాలను,
కలహాలను
ఎదుర్కోవలసి
వచ్చింది.
తాను
పుట్టినది
మొదలుకొని
అంత్యమువరకు
అనేక
యుద్ధాలు
జరుగుతూ
వచ్చాయి.
పుట్టుకతోనే
కృష్ణునికి
కష్టాలు
ప్రారంభమైనాయి.
కృష్ణుడు
పుట్టినప్పుడు
కంసుడు
వ్రేపల్లెవాసులనుకూడా
పలు
హింసలకు
గురిచేశాడు.
శిశుపాల,
దంతవక్త్రాదులు
కృష్ణునిపై
ద్వేషము
పూని
అతనికి
అనేక
ఆటంకములు
కలిగించారు.
అంతేకాదు,
కృష్ణుని
వివాహముకూడా
యుద్ధానికి
దారితీసింది.
6
▾
Meaning
Keep
His poems 420
Also in his talks
(3)
22 May 1990
Mastery of the Senses
9 September 1992
Recognising the principle of the Ātma is itself spirituality
22 February 2001
God's grace comes only through the right use of the senses
కనుకనే,
కృష్ణుని
పుట్టినరోజైన
అష్టమి,
కష్టాలను
తెచ్చిపెట్టే
దినంగా
పరిగణింపబడుతున్నది.
అష్టమిరోజున
రోహిణీ
నక్షత్రంలో
జన్మించినవారు
కష్టాలను
అనుభవించవలసివస్తుందని
పెద్దలు
చెబుతుంటారు.
అయితే,
అలాంటి
వారు
దేశమును
ఉద్ధరించగలరనే
అభిప్రాయముకూడా
ఉన్నది.
కృష్ణుడు
దుష్టశిక్షణ
మరియు
శిష్టరక్షణ
చేసి
ఇలలో
ధర్మసంస్థాపన
మొనరించాడు.
కాబట్టి,
కృష్ణుని
జన్మదినం
చాలా
ఉత్తమమైన
దినమే!
ఇది
గొప్ప
పర్వదినమేగాని,
అపవిత్రమైన
దినము
కాదు.
శిశుపాల
వధ
ధర్మరాజు
రాజసూయ
యాగం
చేసినప్పుడు
నిండుసభలో
కృష్ణునికి
అగ్రతాంబూలము
నొసగి
సత్కారము
చేశాడు.
అది
చూసి
శిశుపాలుడు
ఓర్వలేకపోయాడు.
వెంటనే
తాను
లేచి
నిలబడి,
“ధర్మరాజా!
ఈ
మహాసభలో
అనేకమంది
పెద్దలు
ఆశీనులై
ఉన్నారు.
వారినందరినీ
వదలిపెట్టి
నీవు
ఈ
గొల్లవానికి
అగ్రతాంబూలము
నివ్వడం
సమంజసం
కాదు,”
అంటూ
చాలా
తీవ్రంగా
విమర్శించాడు.
“స్నానంబుచేయు
ఆ
జవరాండ్ర
చీరలు
కాజేసినందుకా
పూజ
నీకు?
గొల్ల
పూబోండ్లతో
జల్లులాడిననాడు
హర్షించినందుకా
అర్ఘ్యమిడుట?
చాలునిక
కట్టిపెట్టు
పంచాంగమింక
పొగడుకొనకు,
చాలించు,
మూయినోరు”
అంటూ
కృష్ణుణ్ణి
నోటికొచ్చినట్లు
దూషించాడు.
కృష్ణునికి
కోపం
వచ్చింది.
తనకు
ధర్మరాజు
అగ్రతాంబూలము
పెట్టి
అందించిన
తట్టను
శిశుపాలునిపైకి
విసిరాడు.
అది
వెళ్ళి
శిశుపాలుని
తలను
ఎగురగొట్టింది.
చాలామంది,
కృష్ణుడు
తన
సుదర్శనచక్రమును
ప్రయోగించి
శిశుపాలుని
సంహరించాడనుకుంటారు.
కాని,
తాను
చక్రమును
ప్రయోగించలేదు.
కృష్ణుడు
ఏది
తీసుకుంటే
అది
చక్రమే!
తట్టను
తీసికొని
విసిరాడు.
ఆ
తట్టయే
చక్రమై
శిశుపాలుని
శిరస్సును
ఖండించింది.
7
▾
Meaning
Keep
కృష్ణుడు
దేహమును
విడిచిపెట్టుట
కృష్ణుని
తీసుకురావడానికై
వెళ్ళిన
అర్జునుడు
ఎన్ని
దినములైనా
తిరిగి
రాకపోయేసరికి
తల్లి
కుంతీదేవి
చాలా
ఆందోళన
చెందుతూ
వచ్చింది.
ఆమె
మహావృద్ధురాలు;
కన్నులు
కనిపించవు,
దేహపటుత్వం
పూర్తిగా
క్షీణించి
పోయింది.
అర్జునుడు
తిరిగి
వస్తూనే,
“నాయనా!
కృష్ణుడు
ఎక్కడున్నాడు?
ఎలా
ఉన్నాడు?”
అని
ప్రశ్నల
వర్షం
కురిపించింది.
అప్పటికే
కృష్ణుడు
దేహాన్ని
విడిచిపెట్టాడు.
పట్టరాని
దుఃఖంతో
అర్జునుడు,
“అమ్మా,
ఏమని
చెప్పను?
మన
బంధువు,
సఖుడు,
గురువు,
దైవము
అయిన
కృష్ణుడు
ఇక
లేడు,”
అన్నాడు.
ఆ
మాట
విన్న
తక్షణమే
కుంతి
ప్రాణం
విడిచింది.
ఆమె
మహాభక్తురాలు;
కృష్ణుని
తన
ప్రాణ
సమానంగా
చూసుకున్నది.
కృష్ణుడు
దేహమును
విడిచిపెట్టిన
తరువాత
యాదవులు
తమలో
తాము
పోట్లాడుకుని
మరణించారు.
ఒక
ఋషి
ఇచ్చిన
శాపము
దీనికంతటికీ
కారణమైనది.
ధర్మరాజు
రాజ్యమును
చాలించి,
అభిమన్యుని
కుమారుడైన
పరీక్షిత్తుకు
పట్టం
కట్టి,
సోదరులతోకూడి
హిమాచలమునకు
బయలుదేరాలని
నిర్ణయించుకున్నాడు.
ఒకవైపున
కుమారునికి
పట్టాభిషేకము,
ఇంకొకవైపున
తల్లికి
అంత్యక్రియలు!
ఇలాంటి
సన్నివేశము
ఒక్క
భారతములో
తప్ప
మరెక్కడా
కనిపించదు.
ధర్మజుడు
తల్లి
తలను
తొడపైన
పెట్టుకొని
భీమునితో,
“నాయనా,
కుమారుని
పట్టాభిషేకానికి
తగిన
ఏర్పాట్లు
గావించు,”
అని
చెప్పాడు.
తల్లి
అంత్యక్రియలకు
కావలసినవి
సిద్ధం
చేయవలసిందిగా
అర్జునునికి
చెప్పాడు.
నకుల
సహదేవులతో,
“మనం
హిమాలయాలకు
వెళ్ళడానికి
తగిన
ఏర్పాట్లు
చేయండి,”
అని
చెప్పాడు.
తల్లికి
అంత్యక్రియలు,
పరీక్షిత్తుకు
పట్టాభిషేకము,
పాండవులు
హిమాలయాలకు
పోవడం...
మూడూ
ఒకేరోజున
జరిగాయి.
పరమాత్మునిపై
అచంచల
మైన
భక్తి,
విశ్వాసాలు
గలవారు
తప్ప
మరొకరు
ఆవిధంగా
చేయలేరు.
స్వామి
బాల్యవృత్తాంతము
ఈ
దేహం
బాల్యదశలో
ఉండగా
గ్రామంలో
పరిస్థితి
చాలా
అల్లకల్లోలంగా
ఉండినది.
కలరా,
ప్లేగులాంటి
అంటువ్యాధులు
ప్రబలంగా
ఉండడంచేత
ప్రజలు
భయభ్రాంతులతో
రోజులు
గడుపుతూ
వచ్చారు.
8
▾
Meaning
Keep
ఒకరింటికి
ఒకరు
పోకూడదు,
ఒకరింటి
నీరు
ఒకరు
తీసుకోకూడదు.
గ్రామంలో
పరిస్థితి
ఈవిధంగా
ఉండినది.
గృహం
అమ్మాయి
(మాతృమూర్తి
ఈశ్వరమ్మ)
కూడా
ఎవరింటికీ
వెళ్ళేది
కాదు.
కొండమరాజు
చాలా
నియమనిష్ఠలు
గల
వ్యక్తి.
ఆయన
కూడా
ఇతరుల
ఇళ్ళలో
నీరు
సహితం
తీసుకునేవాడు
కాదు.
ఆయన
నన్ను
తనవద్దనే
పెట్టుకున్నాడు.
పిల్లలందరూ
వస్తే
నాకేదైనా
వ్యాధి
అంటుకుంటుందేమోననే
భయంతో
ఎవ్వరినీ
దగ్గరికి
రానిచ్చేవాడు
కాదు.
వెంకమ్మ,
పార్వతమ్మలనుకూడా
రానివ్వలేదు.
అయితే,
నేను
ఆయనకు
తెలియకుండా
బయటికి
వెళ్ళేవాడిని.
ఈవిషయం
తెలిస్తే
ఆయన,
“సత్యా!
బయటికి
పోకూడదమ్మా,”
అని
మంచిమాటలతో
చెప్పేవాడు.
మేము
ఉండినది
బోయవాళ్ళ
వీధి.
కొంతమంది
బోయవాళ్ళను
నాకు
‘బాడీగార్డ్స్’గా
పెట్టాడు.
“ఎక్కడైనా
మా
పిల్లవాడు
కనిపిస్తే
ఇంటికి
తీసుకురండి,”
అని
వారితో
చెప్పేవాడు.
ఈరీతిగా,
నేను
బయట
తిరుగకుండా
కట్టుదిట్టం
చేశాడు.
కాని,
ఈ
కట్టుదిట్టాలకు
నేను
లొంగుతానా?
ఎవ్వరికీ
కనబడకుండా
బయటికి
వెళ్ళేవాడిని.
ఒక్కొక్క
దినము
పదిమంది
ఇళ్ళకు
వెళ్ళేవాడిని.
ఎవరు
పిలిస్తే
వారింటికి
పోయి
భోజనం
చేసేవాడిని.
కరణం
సుబ్బమ్మ,
“సత్యా,
ఇలా
రా,”
అని
పిలిచి
తినుబండారాలను
పొట్లం
కట్టి
కిటికీలోనుండి
అందించేది.
ఆమె
చాలా
భక్తితో
స్వామికి
సేవ
చేసింది.
సుబ్బమ్మ
కరణం
భార్య.
గ్రామంలోని
మరొక
ప్రముఖ
వ్యక్తి
భార్యకు
సుబ్బమ్మ
అంటే
గిట్టేది
కాదు.
నేను
సుబ్బమ్మ
ఇంటికి
పోతున్నానని,
తన
ఇంటికి
రావడం
లేదని
ఆమెకు
కోపం
వచ్చింది.
“ఈ
పిల్లవానిని
ఎట్లైనా
చంపాలి,”
అనుకుంది.
ఒకరోజు
నాతో,
“బాబూ,
నీవు
ఈనాడు
మా
ఇంటికి
టిఫినుకు
రావాలి.
ఎవ్వరికీ
చెప్పవద్దు.
నీవు
మాత్రమే
రావాలి.
మంచి
వడలు
చేసి
పెడతాను,”
అన్నది.
ఆమె
ఇంటికి
వెళ్ళాను.
విషం
కలిపిన
వడలు
తెచ్చి
పెట్టింది.
అవి
విషపూరితమైనవని
నాకు
తెలుసు.
అయినప్పటికీ
తినేశాను.
తినేటప్పటికి
ఒళ్ళంతా
నీలంగా
మారిపోయింది.
కొందరు
పరుగెత్తుకొని
వెళ్ళి
కరణం
సుబ్బమ్మకు,
ఈశ్వరమ్మకు
చెప్పారు.
వెంటనే
ఊరివారందరూ
ఆమె
ఇంటిపై
పడ్డారు.
కొండమరాజుకు
కూడా
చాలా
కోపం
వచ్చింది.
బోయవాళ్ళను
పిలిచి,
“మీరంతా
పోయి
ఆమెకు
బుద్ధి
చెప్పండి,”
అన్నాడు.
నేను
నెమ్మదిగా
ఆయన
దగ్గరకు
పోయి,
“తాతా,
పెద్దవారైన
మీరు
ఈవిధంగా
చేయకూడదు.
9
▾
Meaning
Keep
పరులను
హింసించడం
మంచిది
కాదు.
ఆమెకు
ఎవరైనా
హాని
తలపెడితే
నేను
ఇల్లు
వదలిపెట్టి
ఇకపైన
ఆమె
ఇంట్లోనే
ఉంటాను,”
అని
చెప్పాను.
నేను
ఈమాదిరి
హెచ్చరించేసరికి
కరణం
సుబ్బమ్మకు,
కొండమరాజుకు
కోపం
చల్లారిపోయింది.
ఎవరేమి
పెట్టినా
నేను
భుజించేవాడిని.
ఏమాత్రం
భయం
లేకుండా
నేను
సంచరిస్తూ
వచ్చాను.
మీకు
తెలుసు
-
ప్రస్తుతం
కల్యాణమండపం
(పాతమందిరం)
ఉన్నచోట
పూర్వం
ఒక
వెదురు
కొట్టం
ఉండేది.
నేను
అందులో
ఉండేవాడిని.
ఒకనాటి
రాత్రి
కొంతమంది
దుండగులు
దానికి
అగ్గిపెట్టారు.
కొట్టం
కాలిపోతుంటే
ఉన్నట్లుండి
వర్షం
కురిసి
మంటలను
ఆర్పివేసింది.
వర్షం
ఆ
ఇంటిపై
మాత్రమే
కురిసింది;
ఇంకెక్కడా
కురవలేదు.
అప్పుడు
అందరూ
స్వామి
దివ్యతత్త్వాన్ని
గ్రహించారు.
ఆనాటినుండి
పుట్టపర్తి
ప్రజలేగాక,
కమ్మవారిపల్లె,
జానకంపల్లె
మొదలైన
చుట్టుప్రక్కల
గ్రామాలనుండి
కూడా
ప్రజలు
భక్తితో
స్వామిని
దర్శించుకోవడానికి
రావడం
ప్రారంభించారు.
అన్ని
గ్రామాల్లోను
భజన
ప్రారంభించారు.
“భక్తులే
నా
సర్వస్వం”
మొన్న
నేను
బెంగుళూరులో
ఉండగా
తుంటి
ఎముక
విరిగినప్పుడు
స్వామి
త్వరగా
కోలుకోవాలని
పుట్టపర్తితోసహా
అన్ని
గ్రామాలవారూ
భజనలు
మొదలుపెట్టారు;
అనేక
పల్లెల్లో
సత్యనారాయణ
వ్రతాలు
చేశారు.
ఏ
పల్లెలో
చూసినా
భజనలు,
భజనలు!
ఈవిధంగా,
స్వామి
పేరు
తలవనివారు
లేరు.
స్వామియొక్క
దివ్యతత్త్వము
విశ్వమంతా
వ్యాప్తిచెందింది.
నేను
వైట్ఫీల్డునుండి
పుట్టపర్తికి
వస్తుంటే
అన్ని
గ్రామాలవారూ
కారును
నిలిపి
హారతులిస్తారు.
చిక్బళ్ళాపూర్లో
రోడ్డంతా
జనంతో
నిండిపోతుంది.
రోడ్డు
పొడవునా
భజనలే!
రోడ్డు
పొడవునా
హారతులే!
“సత్యసాయిబాబాకీ
జై”
అని
నినాదాలు
చేస్తుంటారు.
కప్పలబండ,
మామిళ్ళపల్లి
మొదలైన
అన్ని
పల్లెల్లోనూ
ఎక్కడ
చూసినా
జయ
జయధ్వానాలే!
నేను
పుట్టపర్తి
చేరుకునేంతవరకు
భక్తులు
అన్నిచోట్ల
హారతు
లిస్తూనే
ఉంటారు.
నేను
కనీసం
ఒక
సంవత్సరమైనా
‘రెస్టు’
తీసుకోవాలని
డాక్టర్లు
చెప్పారు.
“సంవత్సరం
అక్కర్లేదు.
10
▾
Meaning
Keep
భక్తుల
ప్రార్థనవలన
నాకు
త్వరలోనే
నయమవుతుంది,”
అని
చెప్పాను.
నాకు
ఏ
ఔషధాలూ
వద్దు;
భక్తుల
ప్రేమయే
నా
ఔషధమని
చెప్పాను.
భక్తుల
ప్రేమతత్త్వం
నాకెంతో
ఆనందాన్ని
ఇచ్చింది.
నన్ను
హాస్పిటల్కి
తీసుకువెళ్ళినప్పుడు
అక్కడ
అందరూ
ఏడుస్తున్నారు;
కాని,
నేను
మాత్రం
నవ్వుతూనే
ఉన్నాను.
డాక్టర్లకు
చాలా
ఆశ్చర్యం
కలిగింది.
సాధారణముగా
ఎవరికైనా
తుంటిఎముక
విరిగినట్లయితే
‘కరెంటు
షాక్’
కొట్టినంత
బాధ
ఉంటుంది.
ఇంకొకరైతే
ఇలాంటి
నొప్పికి
ఎంత
బాధపడతారో!
కాని,
నాకు
ఏమాత్రం
బాధ
అనిపించలేదు.
ఇక్కడికి
వచ్చిన
తరువాత
కూడా
ఎలాంటి
బాధలూ
లేకుండా
ఆనందంగా
ఉన్నాను.
చక్కగా
నడుచుకుంటూ
వెళుతున్నాను.
డాక్టర్లు
సంవత్సరమంతా
రెస్టుగా
ఉండాలన్నారు.
కాని,
భక్తుల
ప్రార్థనలవలన
అత్యంత
త్వరగా
నాకు
నయమైపోయింది.
నా
సర్వస్వము
నా
భక్తులే!
వాళ్ళ
ప్రోపర్టీ
నేనొక్కడినే!
కనుక,
నేను
దేనికీ
భయపడను.
ఇటువంటి
పరిస్థితిలో
కూడా
నేను
దేశమునంతా
చుట్టిరాగలను.
ఇకపైన
అంతా
చుట్టివస్తాను.
కాబట్టి,
ఎవ్వరూ
బాధపడకండి;
ఆనందంగా
ఉండండి;
సుఖంగా
ఉండండి.
నేను
ఆరోగ్యంగానే
ఉన్నాను,
ఆనందంగానే
ఉన్నాను.
Previous
←
I am not the body; I am the indweller
Next
I am not the body; I am the embodiment of Prema
→