Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1998 · Knowing Oneself Is What Matters
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Knowing Oneself Is What Matters
28 April 1998, Kodaikanal
1
▾
Meaning
Keep
His poems 537
Also in his talks
(2)
1 January 2000
Virtue is the adornment of man
21 August 2002
'I' Itself Is Divinity
మంచి
కాలము
పదవులు
మంచి
బ్రతుకు
కోరుచుందురు
మనుజులు
కోరబోరు
మంచి
బుద్ధులు
జ్ఞానంబు
మంచి
నడత
ఇంతకన్నను
వేరెద్ది
ఎరుక
పరతు.
ప్రేమస్వరూపులారా!
ఈనాటి
మానవుడు
ప్రపంచమునందంతయూ,
అనేక
విధములైనట్టి
ఒక
స్వరూపము
చూస్తున్నాడు.
అనేక
విధమైనట్టి
ఒక
పదార్థమును
చూస్తున్నాడు.
అనేక
విధమైనట్టి
పరిస్థితులను
గుర్తిస్తున్నాడు.
ఇంక
పరిశోధనలయందు
ఏ
విధమైనట్టి
తక్కువలేదు.
అన్నింటిలోను
పరిశోధన
సలుపుతున్నాడు.
పరిశోధన
లేనటువంటి
పదార్థము
యీ
జగత్తునందు
కాన
రాదు.
కాని
అన్నింటినీ
చూడగలిగిన
వ్యక్తి,
అన్నింటినీ
పరిశోధించినట్టి
వ్యక్తి,
అన్నింటినీ
పరిశీలించినట్టి
వ్యక్తి,
తానెవరో
తాను
గుర్తించడానికి
ప్రయత్నించడంలేదు.
ఒకానొక
సమయమున
బ్రిటిష్
ప్రెసిడెంట్
అయినటువంటి
చర్చిల్
అన్నింటినీ
పరిశోధన
జరిపి
ఒక్క
విషయాన్ని
మాత్రము
జగత్తుకు
చాటుతూ
వచ్చాడు.
Man
has
conquered
all,
but
he
has
not
conquered
himself.
ఈనాటి
మానవుడు
అన్నింటినీ
చూడగలుగుతున్నాడు,
తానెవరో
తాను
తెలుసుకోవడానికి
తగినటువంటి
ప్రయత్నము
చేయడంలేదు.
తానెవరో
తనకు
తెలియకుండిన,
అన్నింటినీ
పరిశీలన
చేసి
ప్రయోజనమేమిటి?
యావత్
ప్రపంచమును
కూడ
గుర్తించి
ప్రయోజనమేమిటి?
ఒక
వ్యక్తి
ఒక
రూములో
ఏదో
ఒక
పదార్థమును
వెదుకుతూ
ఉన్నాడు.
కాని
ఆ
రూములో
ఉన్నటువంటి
సమస్త
పదార్థములు
తాను
చూడగల్గుతున్నాడు.
కాని
ఒక్క
దానిని
మాత్రము
తాను
చూడలేక
పోతున్నాడు.
ఏమి
అది?
ఎవరు
ఏ
పదార్థమును
వెదుకుతున్నాడో
ఆ
వ్యక్తిని
మాత్రము
చూడలేక
పోతున్నాడు.
కనుక
తనను
తాను
చూడక,
ఎన్ని
పదార్థములను
చూచి
నప్పటికిని
వచ్చిన
లాభమేమిటి?
2
▾
Meaning
Keep
ఫలితమేమిటి?
సద్గుణాలను
నింపుకోవాలి-దుర్గుణాలను
పారద్రోలాలి
ఈనాటి
ప్రపంచమునందు
మానవుడు
పవిత్రమైన
జీవితాన్ని
ధరించి,
పవిత్రమైనట్టి
మానవత్వాన్ని
వహించి,
తన
పవిత్రమైన
హృదయాలను
తాను
పోషించుకొనక,
యీ
హృదయమునందు
ఏది
నివసిస్తుందనేటువంటి
విషయాలు
గుర్తించక,
తాను
ప్రాకృతమైన,
భౌతికమైన
జీవితములో
తన
సత్యాన్ని
గుర్తించుకోలేక
పోతున్నాడు.
సాధు
జంతువులుగా
గోవులువంటివి
నివసించేటువంటి
గృహములందు
తిరిగి
తోడేళ్ళు
ప్రవేశిస్తే,
ఆ
పశువులేమయిపోతాయి!
కనుక
మానవ
హృదయమునందు
పవిత్రమైనట్టి,
సాత్వికమైనట్టియైన
సత్యము,
ధర్మము,
శాంతి,
ప్రేమ,
సహనము,
సానుభూతి
యీలాంటి
గోవులు
నివసించేటువంటి
ప్రదేశములోపల
పులులవంటి
కోపములు,
తోడేళ్ళవంటి
ద్వేషములు
యిందులో
ప్రవేశిస్తే
యీ
సాత్వికమైనట్టి
పశువుల
గతి
ఏమౌతాయి?
కనుక
యీనాటి
మానవుడు
యీ
దుర్గుణములను,
దుశ్చింతనలను,
లోపల
ప్రవేశించుకొని,
తన
సాత్వికమైన
భావములను
కోల్పోతున్నాడు.
మానవుడు
తన
సాత్వికమైన
గుణములను
పోషించుకోకుండా,
కాపాడుకోకుండా
యీ
దుర్మార్గమైనట్టి
భావములను
లోపల
ప్రవేశింప
చేయకూడదు.
ఈనాటి
మానవునియందు
అసూయ,
అహంకార,
ద్వేషములు
అమితముగా
నిల్చిపోయినాయి.
ఇట్టి
హృదయమునకు
పవిత్రమైనట్టి
గుణములు
ఏ
రీతిగా
వుండగలవు?
ఒకడు
గృహమును
నిర్మించుకున్నాడు.
ఆ
గృహమునకు
సింహద్వారము
కూడ
పెట్టుకున్నాడు.
ఈ
సింహద్వారము
ఏ
నిమిత్తమై
నిర్మించాడు.
తాను,
తనకిష్టమైనవారు,
తన
బంధువులు,
తన
కుటుంబీకులు
అందులో
ప్రవేశించడానికి
యీ
గేటు
నిర్మించుకున్నాడు.
కాని
బజారున
పోయేటువంటి
కుక్కలు,
నక్కలు,
కోతులు
యివి
నడచడానికి
వీలు
కాదు.
కాని
అదే
విధముగా
‘దేహో
దేవాలయః
ప్రోక్తో
జీవో
దేవ
స్సనాతనః
’.
దేహము
అనేటువంటి
గృహమునందు
అనేక
విధమైనట్టి
ద్వారములు
నిర్మించుకున్నాడు.
కాని
ఈ
యీ
గేట్లు
నిర్మించుకున్నప్పుడు
బజారులో
పోయేటంటి
వాటినన్నింటినీ
లోపల
ప్రవేశపెట్టడు.
అయితే
యీనాటి
మానవుడు
కొన్ని
విధమైనట్టి
అనవసరమైన
వాటినన్నింటినీ
లోపల
ప్రవేశపెట్టుకుంటున్నాడు.
ఈ
ద్వేషము,
అసూయ,
అహంకారము
లోపల
ప్రవేశిస్తే,
అందులోన
జీవించేటువంటి
సద్గుణములు,
సదాచారములకు
ఏ
గతి
పడుతుంది?
3
▾
Meaning
Keep
మూడు
విధముల
ప్రేమ
మానవుడే
మూడు
విధమైనట్టి
సాధనతో
జీవితాన్ని
గడుపుతున్నాడు.
స్వార్థ
ప్రేమ
ఒకటి.
సమిష్టి
ప్రేమ
ఒకటి,
పరమార్థంపైన
ప్రేమ
ఒకటి.
ఈ
మూడింటి
యొక్క
గుణములచేతనే
భగవంతుని
ప్రేమిస్తున్నాడు.
స్వార్థ
ప్రేమనగా
ఏమిటి?
తనయొక్క
సుఖము,
తనయొక్క
ఆనందము,
తన
యొక్క
‘కంఫర్ట్’
తను
మాత్రమే
చూచుకుంటున్నాడు.
కాని
అన్యోన్య
ప్రేమ
అనేటటువంటిది
తాను,
తనవారు,
తన
బంధువులు
అందరు
కూడను
క్షేమంగా
ఉండాలని
ఆశిస్తున్నాడు.
పరార్థప్రేమ
అనగా
లోకా
సమస్తా
సుఖినో
భవంతు
సర్వులు
క్షేమముగా
ఉండాలనేటువంటి
విశాలమైనట్టి
భావముతో
భగవంతుని
ప్రేమిస్తున్నాడు.
ఈ
స్వార్థ
ప్రేమనేటటువంటిది
ఒక
రూములో
నిర్మించుకున్న
‘లైటు’
వంటిది.
కాని
ఆ
రూములో
నిర్మించుకున్నట్టి
లైటు
ఆ
రూముకి
మాత్రమే
ప్రకాశము
నందించ
గలదు.
మరొక
గదికి
మరొక
గదికి
ఏ
మాత్రము
ప్రకాశమునందించదు.
అన్యోన్య
ప్రేమనేటటువంటిది
చంద్రుని
కాంతి
వంటిది.
ఈ
చంద్రుని
కాంతి
అన్ని
వైపులా
కనిపిస్తుంది.
కాని
స్పష్టముగా
కనిపించదు.
కొన్ని
విధమైనట్టి
అంధకారమునకు
అవకాశమిస్తుంది.
త్రాడును
చూచి
పామని
భావిస్తుంది.
ఒక
మొద్దును
చూచి
మనిషని
భావిస్తుంది.
లైటు
ఉంది
కాని,
ప్రకాశవంతమైన
లైటు
కాదు.
ఇదియే
అన్యోన్య
ప్రేమ.
పరార్థ
ప్రేమనేటటువంటిది
సూర్యుని
కాంతి.
ఇది
అన్ని
వైపుల
అన్ని
ప్రాంతములయందు,
అన్ని
విధములైనట్టి
స్వరూపాన్ని
సుస్పష్టముగా
గోచరము
గావిస్తుంది.
ఇట్టి
పరార్థ
ప్రేమను
మనము
పొందినప్పుడే
యీ
స్వార్థ,
అన్యోన్య
ప్రేమలచేత
మనము
బాధ
పడనక్కరలేదు.
కాని
దురదృష్టవశాత్తు,
యీనాటి
ప్రేమ,
స్వార్థ
ప్రేమగా
రూపొందుతూ
వచ్చింది.
తాను
తప్ప,
తన
సుఖము
తప్ప,
తనయొక్క
క్షేమము
తప్ప
యితరుల
యొక్క
క్షేమాన్ని
ఏమాత్రము
ఆశించటము
లేదు.
ఇట్టి
ప్రేమచేతనే,
మానవుడు
అనేక
విధములైనట్టి
కష్టములకు,
నష్టములకు
గురి
అవుతున్నాడు.
ఇంక
అన్యోన్య
ప్రేమలో
ఉన్నటువంటి
ఆనందమేమిటి?
తాను,
తన
కుటుంబము,
తన
బంధువులను
మాత్రమే
పరిమితి
కావించుకుంటున్నాడు.
4
▾
Meaning
Keep
ఎవరు
బంధువులు?
ఎవరు
తనవారు?
అని
విచారణ
చేస్తే,
అందరూ
తనవారే.
కనుక
అందరియందు
కూడను
ఏకాత్మతత్త్వము
ఉంటుండాది.
కనుక
యీ
ఆత్మ
తత్త్వాన్ని
మనము
గుర్తించుకుంటే,
అందరు
మన
బంధువులే.
కాని
‘ఆత్మిక్
ప్రిన్సిపుల్స్’
మనము
ఏమాత్రము
గుర్తించుకొనక,
కేవలము
తాను,
తనవారు
అనే
ఒక
దేహాభిమానమునకు
లోబడి
పోతున్నారు.
అంతా
దైవనిర్ణయం
ప్రకారమే
జరుగుతుంది
దీనికో
చిన్న
ఉదాహరణముంటుండాది.
సర్వము
భగవంతుని
యొక్క
ప్రేరణ
చేతనే,
భగవంతుని
యొక్క
ఆజ్ఞచేతనే,
భగవంతుని
యొక్క
సంకల్పము
చేతనే
జరుగుతున్నాది.
ఒక
పెద్ద
వ్యక్తి
తన
బిడ్డలను
తీసుకుని
రైలులో
ప్రయాణమై
పోతున్నాడు.
కాని
పిల్లలకు
చెప్పాడు.
మీ
టిక్కెట్లు
అంతా
కూడను
నేను
తీసుకున్నాను.
నా
దగ్గర
ఉంచుకున్నాను.
మీరు
ఎక్కడ
ఏ
స్టేషను
వస్తే
అక్కడ
దిగకూడదు.
నేను
దిగిన
చోటున
మాత్రమే
మీరు
దిగండి.
దీనిని
జాగ్రత్తగా
గమనించండి.
అని
చెప్పి
రైలులో
ప్రయాణమై
పోతున్నాడు.
కాని
యీ
పిల్లలంతా
స్టేషను
వచ్చిన
దగ్గరంతా
చూస్తున్నారు.
అందు
కనిపించేవంటి
ఫలములు,
పదార్థములు
చూస్తున్నారు.
అందులో
దిగితే
అన్నియును
తీసుకోవచ్చుకదా!
భుజించవచ్చుకదా!
అని
ఆశిస్తున్నారు.
కాని
తండ్రి
చెప్పినవంటి
ఆజ్ఞలను
పాటిస్తూ,
ఎవరూ
దిగలేదు.
ఎంత
సేపయినప్పటికిని,
తండ్రి
దిగలేదు.
పిల్లలు
విసుగు
పొందారు.
కాని
కొన్ని
స్టేషన్లు
దిగడానికి
ప్రయత్నం
చేశారు.
అందులో
పెద్దవాడైన
వ్యక్తి
చెప్పాడు.
నాన్న
ఆజ్ఞ
ప్రకారము
అతను
దిగిపోకుండా
మనము
దిగడానికి
వీలు
కాదన్నాడు.
టిక్కట్టు
నాన్న
దగ్గర
ఉన్నాది.
మన
దగ్గర
టిక్కెట్టు
లేకుండా
దిగినట్లయితే.
చాల
కష్టమునకు
గురి
అవుతాము.
కనుక
మనము
దిగకూడదని
నివారించాడు.
అనగా
ఏమిటి
దీనిలోని
అర్థము?
భగవంతుడే
తండ్రి.
ప్రతి
మానవుడు
అతని
బిడ్డలే.
జీవితమనేటి
రైలులో
ప్రయాణమవుతున్నాడు.
భగవంతుడు
చెప్పాడు.
తండ్రి
ఎవరూ
మీ
యిష్టమొచ్చిన
దగ్గర
మీరు
దిగకూడదు.
నా
ఆజ్ఞ
ప్రకారమే
నేను
దిగిన
తర్వాత
మాత్రమే
మీరు
దిగాలి
అని
శాసించాడు.
కాని
యీ
శాసనము
ఎవరు
కూడను
శిరసావహించడము
లేదు.
ఎవరి
యిష్టానుసారము
వారు
ప్రవర్తిస్తున్నారు.
కాని
టికెట్
తన
దగ్గర
ఉంచుకున్నాడు.
కనుకనే
మనకు
అనేక
కష్టములు
కలుగుచున్నాయి.
5
▾
Meaning
Keep
His poems 363
Also in his talks
(3)
25 May 1991
Kenopanishad
23 August 1996
Only He Who Bows to God's Command Can Experience Divinity in Full
15 January 2007
Only a life that brings joy to many is a true life
కొన్ని
రకమైనట్టి
ఒక
ట్రెయిన్
ట్రావల్స్
అంతా
ఉంటుంటాయి.
ఈ
గూడ్స్
పెట్టెలంతా
కూడను
అనేకంగా
వస్తుంటాయి.
ఒక్కొక్క
గూడ్స్
పెట్టెకూడను
రిటర్న్
ఆన్
డేట్
కూడా
వేసియుంటారు.
కాని
ఆ
కాలము
వచ్చేటప్పటికి
ఆ
దినము
వచ్చినప్పటికిని,
ఆ
డేట్
వచ్చేటప్పటికి
గూడ్స్
పెట్టెలంతా
వెనుకకు
తిరుగుతుంటాయి.
మన
జీవితాలు
కూడను
గూడ్స్
పెట్టెల
వంటివే.
దీనిపై
రిటర్న్
అనేటంటిది
వ్రాసారు.
కాని
వ్రాసినట్టి
రిటర్న్
డేట్
ఎవరికి
తెలుస్తుంది?
స్టేషన్
మాష్టర్‌కి
మాత్రమే
తెలుస్తుంది.
ఆ
స్టేషన్
మాష్టరే
గాడ్.
కనుక
ఆ
రిటర్న్
డేట్
అనేది
అతనికి
మాత్రమే
తెలుస్తుంది
కాని
ఎవరికీ
తెలియదు.
అతను
మాత్రమే
రిటర్న్
చేస్తున్నారు.
కాని
దానికి
మనము
విచారణ
చేస్తున్నాము.
దేనికోసము?
అజ్ఞానం
చేత,
ఈ
అధికారి
ఎవరు
అనే
సత్యాన్ని
గుర్తించలేకపోవడంచేత.
కనుకనే
దైవమే
దీనికన్నిటికిని
గొప్ప.
దైవమే
దీని
అన్నింటికి
పెద్ద
అనేటంటి
సత్యాన్ని
మనము
గుర్తించుకోలేక
పోతున్నాము.
ప్రతి
వ్యక్తికి
కూడను
అతని
ఆజ్ఞ
ప్రకారమే
జరుగుతుంది.
కాని
మానవుడు
యీ
సత్యాన్ని
గుర్తించుకోలేక
దేహాభిమానం
ఉన్నటువంటి
మానవుడు
నేను
చేశాను.
నేను
చూసినాను.
నేను
అనుభవిస్తున్నాననేటంటి
అహంకారమునకు
స్థానమిచ్చి
తాను
అనేక
రకములైనట్టి
అవస్థలకు
గురి
అవుతున్నాడు.
కనుక
మనము
యీనాడు
గుర్తించవలసినది
ఒక్కటి.
ఏమి
జరిగినా,
ఏమి
చూచినా,
దేనిని
అనుభవించినా
యీ
జరిగినవన్ని
కూడను
భగవంతునియొక్క
నిర్ణయాలు
అనేటంటి
సత్యాన్ని
మనము
గుర్తించాలి.
ప్రతి
ఒక్కటి
కూడను
భగవంతుని
ఆజ్ఞ
లేకుండా
జరగడానికి
వీలుకాదు.
కాని
అందరూ
యీ
సత్యాన్ని
నమ్మటము
లేదు.
కాని
నమ్మనివారి
గతి
అంతే
నమ్మినవారి
గతి
ఎంతో
హాయిగా
అనిపిస్తుంది.
ఈ
జగత్తునందు
ఏ
చిన్న
విషయము
కూడను
దైవము
యొక్క
ఆజ్ఞ
లేకుండా
జరుగదు.
కదలదు
నీదు
సంకల్పము
లేనిది
గడ్డిపోచయును
అదియునిదియు
ననగనేల
పిపీలికాది
బ్రహ్మ
పర్యంతము
నీవె
అది
ఎరుంగరు
మది
గలంగరు
భువిని
కొందరు
వివేకమున
వర్తించెదమని
కడు
విఱ్ఱవీగెదరుగాని
చివరికేవేళ
ఏమి
సంభవించునో
తెలియజాలరు
ఎంతవారైనా.
6
▾
Meaning
Keep
కనుక
ప్రతి
ఒక్కరికి
కూడా
భగవంతుని
ఆర్డర్
ప్రకారమే
జరుగుతుంది.
దీనిని
విశ్వసించినట్టి
వారే
ధన్యులు.
దీని
ననుసరించినట్టి
వారే
పుణ్యులు.
దీనిని
విస్మరించినట్టి
వారే
పాపులు.
దీనిని
విసర్జించినట్టి
వారే
దుఃఖితులు.
సుఖము,
సుఖము
మన
యొక్క
ప్రవర్తనపైనే
ఆధారపడి
యున్నది
కాని
భగవంతునియొక్క
సంకల్పముపైన
కాదు.
కనుకనే
మన
ప్రవర్తనలు,
మన
నడతలు
సక్రమమైనట్టివిగా
మనము
తీర్చు
దిద్దుకోవాలి.
దుర్మార్గమైనట్టి
భావాలు
మన
హృదయములో
ప్రవేశపెట్టకూడదు.
కారణమేమనగా,
ఆ
దుర్మార్గమైనట్టి
భావాలతో
జీవిస్తున్నటువంటి
సద్భావములు,
సచ్చింతనలు,
సదాలోచనలు,
సత్చర్యలు
యివన్నీ
కూడను
మరణించడానికి
అవకాశముంది.
ఈ
దుష్ట
గుణములన్నియు
కూడను
కేవలము
క్రూరమృగములవంటివి.
ఇట్టి
క్రూరమృగముల
చేత
ఈ
సాత్వికమైన
ఆవు
చిక్కితే
ఏ
గతి
పడతాది?
కనుక
యిట్టి
దుర్మార్గమైన
భావములు,
వచ్చినప్పటికిని
మనలో
ప్రవేశ
పెట్టకుండా
చూచుకోవాలి,
వచ్చినప్పుడు
యీ
దుర్మార్గమైన
భావాలను
ముందు
తరిమి
వేయాలి.
కాలమును
వ్యర్థము
చేయకూడదు.
ఆలస్యము
చేయకూడదు.
‘ఆలస్యం
అమృతం
విషం’
అన్నారు.
కనుక
ఆలస్యమనేది
పనికి
రాదు.
ఎప్పుడు
దుష్ట
భావముల
సంకల్పము
మనలో
ప్రారంభమైందో
తక్షణమే
దానిని
యిది
సరియైనట్టిది
కాదు.
ఇది
లోపల
ప్రవేశిస్తే,
నా
సద్భావములు,
సద్గుణములు,
సచ్చింతనలు
భస్మమై
పోతాయి
అని
గ్రహించాలి.
కనుక,
నీ
హృదయమున
ప్రవేశపెట్టవలసినవి
సద్భావములు,
సచ్చింతనలు,
సదాలోచనలు,
సత్కర్మలు.
సాధకుడు
జాగ్రత్తగా
ఉండాలి
సత్
అనగా
ఏమిటి?
సత్
అనగా
త్రికాలా
బాధ్యం
సత్.
మూడు
కాలముల
యందును
మార్పు
చెందనట్టిదే
సత్.
ఇట్టి
భావములు
మనలో
ప్రవేశపెట్టాలి.
ఇదియే
నిజమైన
సాధన.
సాధనలు
మాత్రము
చేస్తూ
హృదయములోపల
యీ
క్రూరమృగములను
ప్రవేశపెడ్తుంటే,
ఈ
సాధన
చేసి
ప్రయోజనమేమిటి?
చేసిన
సాధనలన్నీ
కూడను
ఒక్కొక్కటిగా
కాదు,
అన్నీ
కూడను
ఒక్కటై
నిర్మూలమైపోతాయి.
7
▾
Meaning
Keep
ఒక
చిన్న
ఉదాహరణము.
ఒక
దారమును
మనము
చెండు
కడుతున్నాము.
కాని
ఒక్కొక్క
తీరు
ఒక్కొక్క
రకముగా
ఉంటుంది.
కాని
యీ
బంతిని
చాల
గట్టిగా
పట్టుకోవాలి.
ఈ
విధముగా
పట్టుకున్న
దారము
చుడుతూ
ఉంటే,
క్రమక్రమేణా
ఆ
దారము
చెండు
పెద్దదవుతుంది.
మనమేమయినా
అలక్ష్యము
చేసి
ఆ
దారము
చెండు
చెయ్యినుంచి
వదలిపోతే
ఇందులోనున్నటి
వంటి
రౌండులు
తగ్గిపోతాయి.
చుట్టేది
ఒక్కటే,
ఒక్కటే
చుట్టేది.
కాని
మన
చేయి
జారిపోతే
వ్యర్థమైపోతాయి.
కనుక
మనము
చేసేటువంటి
సాధనలు
తక్కువ.
కాని
దానిని
మనము
అలక్ష్యము
చేసామంటే,
అనేక
జన్మల
యొక్క
యీ
స్పిరిట్యువల్
బ్యాక్‌గ్రౌండ్
అంతా
కూడను
కోల్పోతాము.
కనుక
ఏమి
చేసినప్పటికిని
‘సుఖదుఃఖే
సమేకృత్వా
లాభాలాభౌ
జయాజయౌ’
ఈ
రెండు
కూడను
సమత్వముగా
భావించుకుని
మనము
జీవించడానికి
ప్రయత్నించాలి.
అప్పుడే
మనకు
సరియైనట్టి
ఫలితము
కూడ
దక్కుతుంది.
హేమ
తారకవిద్య
-
బ్రహ్మ
విద్య
ప్రేమస్వరూపులారా!
మానవుడు
నిజంగా
ధ్యానం
చేయవలసినట్టివి
ప్రేమ
స్వరూపమైనట్టి
దైవభక్తి,
త్యాగమైనట్టి
రాజశక్తి.
ఈ
రెండింటివలన
దేశము
ఉద్ధారమవుతుంది.
ఈనాడు
త్యాగమైనట్టి
రాజకీయము
కనిపించుట
లేదు.
ప్రేమమయమైనట్టి
భక్తి
ఎక్కడా
కనిపించుట
లేదు.
‘ఇహమున
సుఖింప
హేమతారక
విద్య,
పరమున
సుఖింప
బ్రహ్మ
విద్య’.
కనుక
ప్రేమమైనట్టి
సాధన
చాల
ప్రధానమైనట్టిది.
హృదయములకు
అవి
చాల
ఉత్తేజము
చేసేటువంటివి.
కాని
త్యాగమైనట్టి
రాజకీయము
జగత్తుకోసము.
జగత్తును
బాగు
చేయాలంటే
త్యాగమయమైన
జీవితములో
యీ
జగత్తున
ప్రవేశించాలి.
జీవితాన్ని
ధన్యము
కావించాలంటే
ప్రేమమయమైన
జీవితాన్ని
మనము
సాధనచేయాలి.
త్యాగము
నిజమైన
యోగము.
యీ
యోగముననుభవించినప్పుడే
ప్రేమమయమైన
జీవితము
మనకు
ప్రాప్తిస్తుంది.
‘యోగః
చిత్త
వృత్తి
నిరోధకః’.
యోగః
కర్మసు
కౌశలం.
కనుక
యీనాటి
మానవుడు
తనను
తాను
ముందు
గుర్తించి,
ఇతరులను
గుర్తించడానికి
ప్రయత్నించాలి
తనను
తాను
తెలుసుకొనక
దైవాన్ని
వెతికితే
దైవము
ఏ
విధముగా
లభ్యమవుతాడు?
8
▾
Meaning
Keep
His poems 257
Also in his talks
(1)
19 March 1988
No Learning Greater than Prema
ఒకానొక
సమయంలో
అనిబిసెంట్
కూడ
చెప్పింది.
ఏమిటి?
ఒక
సాధకుడు
దైవాన్ని
వెదుకుతున్నాడు.
దైవాన్ని
వెదుకుతున్నాడు
అని
అనుకుంటున్నాడు.
కాదు
కాదు.
సాధకుడు
దైవాన్ని
వెదకడం
లేదు.
ఎందుకనగా
ఎక్కడ
చూచినా
దైవమే.
సర్వమూ
దైవమయముగా
ఉన్నాది.
ఇంక
వెదికేదెక్కడ?
కాని
దైవము
సరియైనట్టి
వాణ్ణి
వెదుకుతున్నాడు
సరియైనట్టి
భక్తుణ్ణి.
కాబట్టి
ఆ
గుడ్
డివోటీ
అంటే
ఎవరు?
సద్భావములు
కలిగినట్టి
వాడే
సదాచార
సంపన్నుడే.
సచ్చింతన
అభివృద్ధి
పొందినట్టి
వాడే,
ఇలాంటి
గుణములు
కలిగినట్టివానినే
భగవంతుడు
వెదుకుతున్నాడు.
భక్తుడు,
భక్తుడు
అంటే
కేవలము
భజన
చేసేవంటి
వాడే
భక్తుడు
కాడు.
టేపు
రికార్డరు
కూడ
భజన
చేస్తుంది.
గ్రామఫోను
ప్లేటు
కూడ
భజన
చేస్తుండాది.
కానీ
యీ
రెండు
కూడను
లైఫ్
లెస్సే,
చైతన్యమయినంటివి
కావు.
కాని
చైతన్యమయినట్టి
మానవుడు
భజన
చేసినప్పుడు
హృదయ
పూర్వకంగా
భజన
చేయాలి.
ప్రతి
పదము
కూడను
హృదయము
నుండి
ఆవిర్భవించాలి.
ఆ
హృదయమునందే
ప్రేమమయమైన
ఒక
గీతముంది.
అదియే
ప్రేమనుండి
బయటపడుతున్నాది.
సర్వం
బ్రహ్మమయం
దివ్యాత్మస్వరూపులారా!
ఈ
ప్రేమకే
ఆత్మ
అని
పేరు.
ఈ
ప్రేమకే
బ్రహ్మ
అని
పేరు.
సర్వము
బ్రహ్మమయంగా
మారుతున్నాది.
బ్రహ్మను
వెదుకుచున్నారు
చాలామంది.
ఎక్కడున్నాడు
బ్రహ్మ?
తనయందే
ఉన్నాడు.
తనయందున్న
బ్రహ్మను
బయట
వెదికితే
ఏ
మూల
చిక్కుతాడు?
నీటియందె
పుట్టి
నీటనే
తేలుచు
నీటియందడంగు
నీటి
బుడగ
నరుడు
బుద్బుదంబు
నారాయణుడు
నీరు
ఉన్న
మాట
తెలుపుచున్న
మాట.
కనుకనే
మనము
మొట్టమొదట
నిన్న
పిల్లలకు
చెప్పాను.
గొప్పవాడు
కావాలి,
గొప్పవాడు
కావాలి
అనే
భావాన్ని
మనలో
పూర్తిగా
దూరము
చేసుకోవాలి.
మంచివాడు
కావాలని
విశ్వసించండి.
మీరు
మంచివారయినప్పుడే
మంచియొక్క
ఫలితము
మనకు
లభ్యమవుతుంది.
9
▾
Meaning
Keep
గొప్పవాడైతే,
గొప్పతనము
లోపల
మంచితనము
ఉండదు.
మంచితనాన్ని
పెంచుకుంటే
మంచితనములోపల
గొప్పతనముంది.
అయితే
ఎట్టివాడు
గొప్పవాడు?
ఎట్టివాడు
మంచివాడు?
దీనికొక
ఉదాహరణము.
ప్రతి
జీవియందు
కూడను
దైవత్వాన్ని
చూచేటంటివాడు
మంచివాడు.
దైవంలో
కూడను
మానవత్వాన్ని
చూచేవంటివాడు
గొప్పవాడు.
మానవాకారము
ధరించినట్టి
రాముని
చూచి
యితడు
మానవుడు,
మానవుడు,
మానవుడని
గుర్తిస్తూ
వచ్చాడు
రావణుడు
అనగా
దైవములో
కూడ
మానవుడు;
నారాయణునిలో
నరుని
చూస్తూ
వచ్చాడు
రావణుడు.
కాని
రాముడట్టివాడు
కాడు
సర్వ
జీవులయందు
నారాయణుని
చూస్తూ
వచ్చాడు.
అంతా
రియాక్షన్-రిప్లెక్షన్-రిసౌండే
సర్వజీవులు
కూడను
ఒక
మిర్రర్
వంటివారు.
ఒక
అద్దము
వంటివారు.
ఈ
అద్దమునే
ప్రకృతి
అని
పిలుస్తున్నారు.
అద్దములో
కనిపించే
ప్రతిబింబము
భగవంతుని
ఆకారమే
కాని
మరొకటి
కాదు.
కనుకనే
భగవంతుడు
ప్రకృతి
అనే
అద్దాన్ని
మానవునకు
అందించాడు.
ఈ
అద్దము
దేనికోసము
అందించాడు?
తన
మొహాన్ని
తాను
చూచుకొని,
అందులో
నున్నట్టి
దోషములను
తుడుచుకోమని
చెప్పి
యిచ్చాడు.
కాని
యీనాటి
మానవుడు
తన
ముఖాన్ని
తాను
చూచుకోవడం
లేదు,
అద్దములో.
ఈ
అద్దానంతా
కూడ
యింకొకరి
ముఖము
ముందు
పెడుతున్నాడు.
కాని
వారి
ముఖము
కనిపిస్తుంది
కాని
నీ
ముఖము
నీకు
కనిపించదే.
కనుక
అద్దము
Reaction,
Reflection,
Resound.
ఒకానొక
అమాయకుడు
కనుమలకు
గోవులను
తోలుకుపోయాడు.
కాని
ఒక
రెండు
కొండల
మధ్యలోపల
తను
గోవులను
మేపుకుంటున్నాడు.
ఒక
రాతి
బండపైన
కూర్చున్నాడు.
పిల్లన
గ్రోవి
ఊదుతున్నాడు.
ఈ
పిల్లన
గ్రోవి
ఊదడం
చేత,
ఎక్కడనుంచో
తిరిగి
ఇదే
పిల్లన
గ్రోవి
వినిపిస్తున్నాది.
ఏమిట్రా?
నేను
ఊదినటువంటి
పిల్లన
గ్రోవి
ఇంకొకడు
ఊదుతున్నాడు.
వాడెక్కడ
ఉన్నాడు?
అని
విచారణ
చేశాడు.
ఆ
పిల్లన
గ్రోవి
ప్రక్కన
పెట్టాడు.
ఎవడ్రా
నీవు?
అని
ప్రశ్నించాడు.
తిరిగి
ఎవడ్రా
నీవు
అనేటి
శబ్ధమొచ్చింది.
ఓ!
వాడు
నాతో
పోట్లాడుతున్నాడా?
తిరిగి
వాడ్ని
యిష్టమొచ్చినట్లుగా
తిట్టాడు.
తిరిగి
వాడు
కూడ
యిష్టమొచ్చినట్లుగా
తిట్టాడు.
10
▾
Meaning
Keep
విసిగి
పోయాడు.
గోవులను
తీసుకున్నాడు.
ఇంటికి
వచ్చాడు.
అమ్మ
దగ్గర
వచ్చి
ఏడ్చాడు.
అమ్మా!
ఎవడో
ఆ
కొండలోపల
యింకో
రాయడో,
మరో
జంతువో
మాట్లాడుతున్నాడు.
నేను
ఏ
మాట
మాట్లాడినప్పటికిని
తిరిగి
అదే
మాట
జవాబు
యిస్తున్నాడు.
నేనేవిధంగా
విమర్శిస్తే,
తిరిగి
అదే
విధంగా
విమర్శిస్తున్నాడు.
అతను
పెద్దవాడు
కాడు.
బహుశా
నా
వయస్సు
వాడే
అనుకుంటాను.
వాడు
నన్ను
విమర్శించడానికేమి
అధికారముంది!
మనం
పోయి
దండించాలి
అని
తల్లితో
చెప్పాడు.
రేపటి
దినం
నేను
నీవెంట
వస్తాను,
నాయనా!
ఆయనెవరో
నేను
పరీక్షిస్తానన్నది.
పిల్లవానితో
తల్లి
వెళ్ళింది
రెండవ
దినం.
మొట్టమొదట
పిల్లన
గ్రోవి
ఊదాడు.
తిరిగి
పిల్లన
గ్రోవి
రీసౌండ్
వచ్చింది.
చూడు!
వాడు
తిరిగి
నావలెనే
ఊదుతున్నాడు.
మళ్లీ
కేక
వేశాడు.
తిరిగి
మరో
కేక
వినిపించింది.
అప్పుడు
చూడమ్మా!
వీడు
నన్ను
యీ
విధంగా
అవమానం
చేస్తున్నాడు.
తల్లి
అంతా
గుర్తించింది.
ఇది
వేరు
కాదు
యీ
కొండలోపల
పలుకురాయి
ఉంటుది.
అంతే
తప్ప
మరో
వ్యక్తి
లేడిక్కడ
అని
తల్లి
చెప్పింది.
కొండంతా
కూడను
రాయిమయమే.
సముద్రమంతా
జలమయమే.
అడవంతా
కాష్ఠమయమే.
భూమంతా
బ్రహ్మమయమే.
దేహమంతా
మాంసమయమే.
ఈ
పంచ
భూతములయొక్క
తత్త్వాన్ని
చక్కగా
గుర్తించినప్పుడు,
మరో
వ్యక్తి
ఏమాత్రము
విమర్శించడు.
కనుక
ఎవరో
విమర్శిస్తున్నారంటే
యీ
ప్రకృతికి
Reaction,
Reflection,
Resound
శక్తి
ఉంటుంది.
కనుక
ప్రకృతి
యొక్క
ప్రభావమే
యీ
రెండింటికీ
మూలకారణము
కాని
మరొకటి
కాదు.
అలాంటి
ప్రకృతిని
వశం
చేసుకో,
ఈ
ప్రకృతికి
నీవు
వశం
కాకూడదు.
అప్పుడే
నీవు
జయం
కలవాడవవుతావు.
మన
దేహమే
ప్రకృతి.
దేహానికి
మనము
వశం
కాకూడదు.
ఈ
దేహాన్ని
మనము
స్వాధీనము
చేసుకోవాలి.
దేహాన్ని
మనము
కంట్రోలు
చేసుకున్నప్పుడు,
మనస్సు
కూడ
కంట్రోలు
అవుతుంది.
అప్పుడే
ఆత్మ
స్వరూపము
గోచరిస్తుంది.
రాక్షసత్వం-పశుత్వం-మానవత్వం-దైవత్వం
ఆత్మను,
మనసును
విస్మరించి
కేవలము
దేహాన్ని
మాత్రమే
దృష్టియందుంచు
కున్నప్పుడు
ఇది
కేవలము
రాక్షసత్వంగా
అయిపోతుంది.
ఆత్మను
విసర్జించి,
మనస్సు,
దేహాన్ని
మాత్రమే
ఉంచుకుంటే
ఇది
పశుత్వంగా
రూపొందుతుంది.
దేహము,
మనసు,
ఆత్మ
మూడింటిని
ఏకత్వంగా
ఉంచినప్పుడు
మానవత్వంగా
రూపొందుతుంది.
11
▾
Meaning
Keep
Also in his talks
(4)
23 November 1972
The birthday festival
20 May 1991
The End Of Education Is Character
28 July 1992
To love God for God's own sake: that alone is true Bhakti
19 July 1994
The duty of shaping tomorrow's citizens
దేహము,
మనస్సు
త్యజించినప్పుడు
అది
దైవత్వంగా
మారుతుంది.
దైవత్వం
కావడానికి
కేవలము
ఒక
ఆత్మతత్త్వమే
చాలు.
దేహము,
మనసులో
కూడినట్టి
ఆత్మను
విస్మరించినపుడు
కేవలము
పశుత్వంగా
మారుతుంది.
ఆత్మను,
దేహాన్ని
విస్మరించి
కేవలము
మనస్సుతో
ఉన్నప్పుడు
రాక్షసత్వంగా
రూపొందుతుంది.
కనుక
రాక్షసత్వం,
పశుత్వం,
మానవత్వం,
యీ
మూడు
కూడను
మానవుని
హృదయతత్త్వంలోనే
ఉంటున్నది.
కనుక
మొట్టమొదట
మనం
మానవునిగా
ఉండాలంటే
దేహము,
మనసు,
ఆత్మ
మూడింటియొక్క
ఏకత్వంతో
మనం
జీవించాలి.
క్రమక్రమేణా
మానసతత్త్వం,
ఆత్మతత్త్వం
ఉంచుకుని
దేహతత్త్వాన్ని
విసర్జించాలి.
ఆత్మ
తత్త్వమే
అప్పుడు
మననుంచి
పశుతత్త్వం
దూరమైపోతుంది.
ఈ
మనస్సును,
దేహాన్ని
రెండింటినీ
విసర్జించి
ఆత్మతత్త్వము
మాత్రమే
ఉంచుకోవాలి.
అప్పుడే
మనం
దివ్యత్వంగా
రూపొందుతాము.
కనుక
ప్రతి
ఒక్కటి
కూడను
దైవముయొక్క
నిర్ణయంలోపల
జరుగుతుంది.
కాని,
దీనికంటే
భిన్నంగా
జరగటంలేదు.
కనుక
ఏది
జరిగినప్పటికిని
ఇదంతా
దైవాజ్ఞనే,
దైవ
సంకల్పమే.
దైవ
నిర్ణయమే
అనేటటువంటి
దృఢసంకల్పముతో
మనం
ఉండినప్పుడు
సర్వమును
మనము
ఆనందించగలము.
Life
is
a
challenge,
meet
it
Life
is
a
game,
play
it
Life
is
a
dream,
realise
it
Life
is
a
love,
enjoy
it.
ఈ
విధముగా
జీవితమును
అనుభవిస్తూపోవాలి.
అన్ని
చాలెంజీలకు
మీట్
చేయాలి.
ఎలాంటి
కష్టము
వచ్చినప్పటికి,
దానికి
మనము
బెదరిపోకూడదు.
చెదరకూడదు,
ధైర్యంగా
దానిని
ఎదుర్కోవడానికి
పూనుకున్నప్పుడే
దీనిని
మనము
పూర్తి
దివ్యత్వాన్ని
పొందగలము.
అక్కడ
డౌట్సుకు
కూడను
అవకాశమివ్వకూడదు.
డౌటు
వచ్చెనా
మనము
కన్ప్యూజ్
అయిపోతాము.
ఈ
కన్ప్యూజన్
వచ్చెనా,
నీయొక్క
ప్యూజ్
పోతుంది.
కనుక
యీ
కన్ప్యూజన్కు
ఏమాత్రము
అవకాశమివ్వకూడదు.
ఎక్కడ
డౌటు
వస్తుంది?
సత్యాన్ని
గుర్తించుకోనప్పుడు
డౌటు
వస్తుంది.
12
▾
Meaning
Keep
Also in his talks
(22)
21 November 1988
Karma Is Done Only for Purity of Citta!
10 February 1990
Human values in business management
25 May 1990
Vagaries of the Mind
3 June 1990
Vedic Wisdom
20 May 1991
The End Of Education Is Character
25 May 1991
Kenopanishad
27 January 1992
Increase the thought of God! Reduce worldly desires!
20 November 1992
We must foster the feeling that every man is a servant
21 July 1994
Where there is right education
27 February 1995
Every atom is the form of God
1 January 1996
The individual's welfare lies within the welfare of society
17 February 1996
Equal-mindedness is the culture of Bhārata
1 January 1998
Happiness and sorrow cannot be parted
15 February 1998
Tārakaṁ and mārakaṁ
14 April 1998
God pervades all
17 April 1998
Desires are the root of unrest
11 May 1998
Recognise the Oneness in Samaṣṭi and in Vyaṣṭi
10 September 1998
By Sacrifice Some Have Attained Immortality
29 September 1998
The Heart Itself Is the Himācala, Īśvara Himself the Lord of the Heart
8 October 1998
Good Resolves Are Themselves the Human Values
12 October 1998
The True Place of God's Pādukās Is the Heart Itself
23 May 2005
The feeling of one Ātma is true realisation
సత్యాన్ని
గుర్తించుకుంటే
డౌట్సుకి
అవకాశము
లేదు.
ఫలాని
వారు
అనిల్‌కుమార్
అని
గుర్తించుకున్న
తర్వాత
ఇక
డౌట్‌కి
ఎందుకవకాశమొస్తుంది?
అనిల్కుమార్ని
గుర్తించుకోలేని
సమయములోనే
డౌట్స్.
ఇది
అనిల్కుమారా
లేకా
ఇంకో
ప్రొఫెసరా?
కనుక
ఈ
డౌట్స్కంతా
సరియైనట్టి
అర్థాన్ని
గుర్తించుకోలేకపోవడమే.
సమస్తము
ప్రేమయందే
ఇమిడి
ఉంది
ప్రేమస్వరూపులారా!
అన్ని
విధములైనట్టి
నియమములు,
అన్ని
విధములైన
సారములు,
అన్ని
విధములైనట్టి
తత్త్వములు
ఒక్క
ప్రేమతత్త్వము
నందు
మాత్రమే
ఉంటున్నది.
సర్వశాస్త్రముల
యొక్క
సారము,
సర్వమార్గముల
యొక్క
గమ్యము.
సర్వరసముల
యొక్క
రసము,
అదియే
ప్రేమరసము.
ఈ
ప్రేమరసాన్ని
మనము
పొందినామంటే
ప్రతి
అనుమానములకు,
సందేహాలకు
అవకాశం
ఉండదు.
కనుక
ప్రేమ
చేతిలో
మన
జీవితము
సార్థకము
గావించుకోవాలి.
ప్రేమ
చేతనే
మన
జీవితము
గమ్యానివరకు
ప్రయాణం
చేయాలి.
కనుక
మన
హృదయంలోపల
దుర్భావములు,
దుశ్చింతలు
సాధ్యమైనంతవరకు
మన
లోపల
ప్రవేశించకుండా
చూచుకోవాలి.
ఈ
దుర్భావములు,
దుశ్చింతలనేటివి
కేవలము
మృగము
లక్షణముతో
కూడినట్టివి.
కనుకనే
See
no
evil,
see
what
is
good,
Talk
no
evil,
talk
what
is
good
Hear
no
evil,
hear
what
is
good
Think
no
evil,
think
what
is
good
Do
no
evil,
do
what
is
good
This
is
the
way
to
GOD.
కనుక
యీ
పంచేంద్రియములు
కూడ
పవిత్రము
గావించుకునేటి
ప్రయత్నమే
నిజమైన
సాధన.
ఆ
నమ్మకాన్ని
మొట్టమొదట
బలపరచుకోవాలి.
నమ్మినట్టి
వారికేమాత్రము
నష్టము
లేదు.
నమ్మని
వారికే
యీ
కష్టములు,
దుఃఖములు,
విచారములు
నమ్మి
చెడినట్టి
వారు
యీ
లోకాన
లేరు,
లేరు.
నమ్మక
చెడినట్టి
వారు
ఉన్నారు
కాని
నమ్మి
చెడినట్టి
వారెక్కడా
లేరు.
13
▾
Meaning
Keep
కాన్ఫిడెన్సు
సరియైనట్టి
నమ్మకము
మానవుని
యందు
అభివృద్ధి
కావాలి.
ఏమి
జరిగినప్పటికిని
యిది
నా
మంచి
కోసమే
అనే
చింతనను
బలపరచుకోవాలి.
అప్పుడు
భయానికి
కూడను
అవకాశముండదు.
Previous
←
All Beings Are Parts of God
Next
God Alone Is the Ground of Ānanda
→