Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1998 · Sarvaṃ Khalvidaṃ Brahma
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Sarvaṃ Khalvidaṃ Brahma
23 November 1998, Birthday, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
Also in his talks
(15)
15 June 1973
The Bond of Prakṛti and the Paramātma
15 March 1978
The whole duty is yours
23 November 1986
Inquiry into Ātma-jñāna itself is Sanātana Dharma
2 January 1987
Sanātana Dharma is the essence of all the wisdom of the Vedas
7 April 1989
All this is Vāsudeva
17 October 1990
The strength of the Ātma alone is true strength
23 November 1990
Restore the glory of Bharat
22 November 1996
Along with Study, Saṁskāra Too Is Very Necessary
10 September 2000
God is within you
19 January 2001
Doctors must serve the poor in a spirit of sacrifice
22 November 2003
True Prema stands only when selfishness is given up
10 August 2006
Offering oneself is the true yajña
13 April 2008
The Name of Rāma is best; the thought of Rāma is enough
12 September 2008
Complete sacrifice alone is the stairway to immortality
22 November 2008
The duty of guarding the wealth of Dharma of Mother Bhārata is yours!
ఖండఖండాంతర
ఖ్యాతి
నార్జించిన
మహనీయులను
గన్న
మాతృభూమి
పాశ్చాత్య
వీరుల
పారద్రోలించియు
స్వాతంత్ర్యమును
గన్న
సమరభూమి
పాండిత్యమున
చాల
ప్రఖ్యాతి
గాంచియు
ప్రతిభ
చూపించిన
భరతభూమి
సంగీత
సాహిత్య
శాస్త్రీయ
విద్యల
ధీశక్తి
చూపిన
దివ్యభూమి
చిత్రకళలతోడ
చిత్రమై
యున్నట్టి
భరత
భూమియందు
జననమొంది
భరత
భూమి
దివ్యభాగ్యంబు
కాపాడ
బాధ్యతంతయు
మీదె
భక్తులారా
భానుతేజము
కంటె
భాసిల్లుచుండును
మంచు
తెలుపు
కంటె
మించియుండు
ఆకాశము
కన్న
అతి
సూక్ష్మమైయుండు
సర్వజీవులయందు
పర్వియుండు
పరమాత్మ
లేనిది
పరమాణువును
లేదు
అంతట
నిండి
తానంటకుండు
బ్రహ్మలో
మీరు
మీలోన
బ్రహ్మయుండు
మీకు
బ్రహ్మకు
భేదంబు
లేకయుండు
ఇంతకన్న
వేరెద్ది
ఎరుక
పరతు
2
▾
Meaning
Keep
ప్రేమస్వరూపులారా!
భారతదేశము
ఆధ్యాత్మిక
తత్వమునకు,
దానధర్మములకు
పుట్టినిల్లు.
అహింసకు,
శాంతికి
మెట్టినిల్లు.
భారతీయులకుండిన
సత్యవ్రతము
మరియే
దేశీయులకు
లేదని
చెప్పవచ్చును.
పవిత్ర
సప్తఋషులు
జన్మించిన
భూమి,
ఆది
కవి
వాల్మీకి
పుట్టిన
భూమి
ఈ
భరతభూమి.
అనేక
సంవత్సరములు
ధర్మ
పరిపాలన
చేసి
రాముడేలిన
రాజ్యభూమి.
కృష్ణుడు
బోధించిన
గీతాభూమి.
ఆత్మకు
పరమాత్మకు
ఉన్న
జీవితత్త్వాన్ని
గుర్తించిన
భూమి
ఈ
భారతభూమి.
వ్యక్తి
సమిష్టి
యొక్క
ఏకత్వమును
ధరించినది
ఈ
భారతభూమి.
ఇట్టి
పవిత్రమైన,
త్యాగమైన,
ధర్మమైన
శాంతివంతమైన
భూమి
మరొకటి
కానరాదు.
భారతభూమి
యందలి
గాలియందు
సత్యమున్నది,
ధూళియందు
కరుణ
యున్నది,
నేలయందు
కరుణ
ఉంటున్నది.
భరతభూమిలో
ప్రవహించు
గంగయందు
ప్రేమ
యున్నది.
ప్రతి
మానవుని
హృదయము
క్షమా
హృదయమే.
ఇట్టి
పవిత్రమైన
దివ్యమైన,
నవ్యమైన
గుణములు
ఒక్క
భారతదేశమందు
మాత్రమే
కనిపించుచున్నవి.
ప్రపంచములో
ఎక్కడ
చూచినా
ఆకర్షణ
శక్తి
అమితంగా
ఉన్నది
భగవంతుడు
సర్వత్రా
వుండిన
సర్వశక్తిమయుడు.
‘సర్వం
ఖల్విదం
బ్రహ్మ’
అన్నారు.
అదేవిధంగా,
ఈనాటి
విద్యావిధానము
చక్కగా
గుర్తించు
కున్నపుడు
ఆధ్యాత్మికమునకు,
విజ్ఞానమునకు
ఎట్టి
భేదము
కన్పించటం
లేదు.
ప్రపంచమంతయు
విద్యుత్మయమై,
లేజర్మయమై,
రేడియోమయమై,
కాంతిమయమై,
ఉష్ణమయమై,
శక్తిమయమై
ఉన్నది.
కనుక,
భగవత్స్వరూపము
సర్వత్రా
వ్యాపించినదనుటలో
ఎట్టి
సందేహము
లేదు.
ప్రతి
మానవుడు
త్రాగునీటి
యందు,
తిను
తిండియందు,
విను
విషయములందు
దివ్యత్వము
వ్యాపించి
యున్నది.
ప్రపంచములో
అయస్కాంతము
లేని
స్థానము
ఎక్కడా
కనిపించదు.
అయస్కాంతమనగా
ఏమిటి.
కేవలము
ఒక
లోహము
మరొక
లోహమును
ఆకర్షించటమని
అనుకుంటారు.
కాదు,
కాదు.
తల్లి,
బిడ్డకు
అయస్కాంతము;
బిడ్డ,
తల్లికి
అయస్కాంతము;
భార్యకు
భర్త
అయస్కాంతము;
భర్తకు,
భార్య
అయస్కాంతము;
పశువుకు,
గడ్డి
అయస్కాంతము;
తుమ్మెదకు,
పూలు
అయస్కాంతము.
ఈవిధంగా
విచారణచేస్తూ
పోతే
సర్వము
అయస్కాంతమయమై
యుంటున్నది.
3
▾
Meaning
Keep
కనుక,
ప్రతిమానవుని
యందు
అయస్కాంతము
అనేక
రూపములు
ధరించి
ఉంటుంది.
దీనినే
వేదాంతమందు
‘రమయతీతి
యితి
రామః’
రమింపజేసేది
రామతత్త్వము
అన్నారు.
కనుక,
ప్రపంచములో
ఎక్కడ
చూచినా
ఆకర్షణ
శక్తి
అమితంగా
ఉన్నది.
అయితే,
మనకు
కనిపించే
వస్తువులకు,
కనిపించని
వస్తువులకు
మధ్యనున్న
దివ్యమైన
శక్తియే
ఈ
అయస్కాంతము.
దీనినే
దైవాకర్షణ
శక్తి
అని
వేదాంతులు
చెబుతూ
వచ్చారు.
కాని
సైన్సు
వారు
అతీతమైన
శక్తి
కనుక
సైకోటానిక్,
బైయోకాస్మిక్
అన్నారు.
ఇలాంటి
పవిత్రమైన
దివ్యశక్తికి
అనేక
నామములు
పెట్టుకొని
వారు
అనుభవిస్తున్నారు.
అనేక
రూపములు
ధరించి
వేదాంతులు
అనుభవిస్తున్నారు.
అంతర్ముఖమైన
దివ్యత్వము
నకు,
బహిర్ముఖమైన
ప్రకృతి
తత్త్వమునకు
రెండింటికీ
మధ్య
నున్నదే
దైవత్వము
అని
భావిస్తూ
వచ్చారు
వేదాంతులు.
సైంటిస్టులు
‘సూపర్
పవర్’
అన్నారు.
పేర్లు
వ్యత్యాసము
కానీ
దివ్యశక్తి
ఒక్కటే.
దేహములోని
ప్రతి
అణువు,
ప్రతి
కణము
దివ్యత్వముతో
కూడినదే
ఈ
సృష్టి
కల్పితమైన
జగత్తునందు
అనేక
చిత్ర
విచిత్రములతో
కూడిన
వస్తువులుంటున్నాయి.
ఒక్క
మానవదేహమునందే
గమనించని
శక్తులు
ఎన్నియో
ఉంటున్నాయి.
వీటినే
అతీతశక్తులు,
అజ్ఞాతశక్తులు
అన్నారు.
కానీ,
దీనిని
అందరు
అర్థం
చేసుకోలేరు.
మానవునకు
అతీతమైన
శక్తులు
లేవని
అనేకమంది
భావిస్తుంటారు.
చాల
తప్పు.
ప్రతి
పదార్థమందు
ఈ
విధమైన
అయస్కాంతము
ఉంటున్నది.
ప్రతి
ప్రాణియందు
ఈ
దివ్యమైన
శక్తి
ఉంటున్నది.
కనుక,
‘దివ్యాత్మ
స్వరూపులారా’
అని
నేను
సంబోధిస్తాను.
దేహమునందుండిన
ప్రతి
అణువు,
ప్రతి
కణము
దివ్యత్వముతో
కూడినదే.
ఏ
డాక్టర్సు
దీనిని
సరైన
పరిశోధన,
పరిశీలన
చేయలేకపోతున్నారు.
ఒక్క
చిన్న
విషయం.
నాలుకలో
40
వేల
టేస్టు
బడ్స్
ఉంటున్నాయి.
ఒక్క
నాలుకయందే
40
వేల
రుచిని
తెలుసుకొనే
బడ్స్
ఉన్నాయంటె
ఎంత
విచిత్రమైనది.
ఒక
నాలుకయందే
25
వేల
ఉష్ణము
జనింప
చేసేవి
ఉంటున్నాయి.
మన
కన్నులుంటున్నాయి.
చూచుటకు
ఒక
ఇంచి
ప్రమాణమే
ఉంటున్నది.
కానీ
ఈ
కంటియందు
13
కోట్ల
కాంతికిరణాలు
ఉంటున్నాయి.
ఒక
చిన్న
కంటియందు
13
కోట్ల
కాంతి
కిరణాలు
ఉన్నాయంటే
ఎవరైనా
నమ్మగలరా?
ఇది
ఎవరు
సృష్టిచేసినది?
4
▾
Meaning
Keep
కేవలం
అతీతమైన
దివ్యత్వముతో
కూడినదే.
కనుక,
ఈ
వస్తువుల
యొక్క
భావము
విచారణ
చేస్తూ
పోయినప్పుడు
సర్వత్రా
నిండినది
దివ్యత్వమే.
ఇలాంటి
దివ్యత్వము
లేదని
బోధించటము
ఎంతటి
వెఱ్ఱితనము.
వారు
చూడకపోయినా
ఆ
శక్తులు
మాత్రం
ఎక్కడాపోవు.
కానీ,
ఈ
సత్యాన్ని
గుర్తించుకోలేని
వ్యక్తులు
లేదు,
లేదు
అంటారు.
తనయందే
ఉండిన
దివ్యత్వాన్ని
మానవుడు
తాను
గుర్తించుకోలేక
పోవటం
వెఱ్ఱితనము
కాక
మరేమిటి?
తెలియనప్పుడు
తెలీదు
అని
చెప్పటం
చాలా
ఉత్తమం.
తెలియని
విషయం
లోపల
తెలిసినట్లు
భావించి
ముందుకు
రావటం
వెఱ్ఱితనము.
చక్కగా
చరిత్రను
విచారించి
చూచినప్పుడు
ప్రతిది
భగవతత్త్వమే.
ప్రతి
అణువు
భగవతత్త్వమే.
‘నో’,
‘ఎస్’
లు
నీ
నోటికి
గాని,
సాయికి
సర్వము
‘ఎస్’,
‘ఎస్’,
‘ఎస్’
శరీరములో
ప్రతికణము
భగవతత్త్వమే.
దేహములో
కోట్ల
సెల్సు
ఉంటున్నాయి.
ప్రతి
సెల్యందు
నీ
రూపముంటున్నది.
ఒక్కొక్క
సెల్
యందు
నీ
రూపము
పూర్ణంగా
ఉన్నది.
ఇలాంటి
పరిస్థితిలోపల
దైవత్వము
లేదు,
లేదు
అని
చెప్పటానికి
ఎవరికి
అధికారమున్నది?
తెలియని
మూర్ఖులు
చెప్పవచ్చునే
గానీ,
చక్కగా
విచారణ
చేసిన
విజ్ఞాని
ఎవ్వడూ
చెప్పలేడు.
కానీ,
‘ముండే
ముండే
మతిర్భిన్నః’
-
తలలు
వేరు,
తలంపులు
వేరు.
కనుక,
ఒక్కొక్క
తలయందు
ఒక్కొక్క
విశ్వాసము
ఉంటున్నది.
‘నో’
అనువానికి
‘నో’
అనురా,
‘ఎస్’
అనువానికి
‘ఎస్’
అనురా.
నో,
ఎస్
లు
నీ
నోటికే
కానీ,
సాయికి
సర్వము
‘ఎస్,
ఎస్,
ఎస్’.
ఇది
కేవలము
నీ
నాలుకకు
మాత్రమే
సంబంధించినది.
కానీ,
హృదయానికి
సంబంధించినది
కాదు.
ఈ
హృదయ
పవిత్రతను
చక్కగా
విచారించి
చూచినప్పుడు
ఎక్కడ
చూచినా
దైవత్వమే.
దేహములో
ఏ
భాగమందు
వెతికినా
దైవత్వమే.
కానీ,
వాటి
రూపకంగా
లేనప్పుడు
లేదని
భావిస్తున్నాము.
చూడండి;
ఈ
వాతావరణము
నందు
ఢిల్లీలో
ఎక్కడో
రేడియోలో
మాట్లాడే
విషయాలు
సర్వత్రా
వ్యాపించి
యున్నాయి.
కానీ
కనిపించుచున్నాయా?
లేదు,
రేడియోలో
డిల్లీ
స్టేషను
చక్కగా
అడ్జెస్టుచేసి
పెట్టు.
తక్షణమే
ఇక్కడ
నీకు
వినిపిస్తుంది.
కనుక,
ప్రతి
మానవుని
దేహము
ఒక
విధమైన
కంప్యూటరే.
ఈ
దేహమనే
కంప్యూటరులో
మానవుడు
అనేక
విషయములంతా
దాచుకున్నాడు.
మానవుని
దేహమంతా
ఒక
రేడియోనే.
అనేక
విద్యుత్
తరంగములంతా
శూన్యమునుండి
తీసుకొని
హృదయములో
దాచుకున్నాడు.
5
▾
Meaning
Keep
His poems 515
Also in his talks
(18)
8 March 1986
This world itself is the form of God
26 February 1987
There is no sādhana greater than remembering the Name
25 December 1992
The divinity all religions teach is one!
23 November 1997
The God who fills everything is ‘I’
14 April 1998
God pervades all
18 April 1998
The universe is the form of Viṣṇu
25 September 1998
Man's True Kin
19 October 1998
Dīpāvali: Its Inner Meaning
1 January 2000
Virtue is the adornment of man
14 January 2000
Bhakti and Śaraṇāgati
4 March 2000
The Ātma: The Five Kośas
20 November 2001
Spiritual education is essential alongside worldly education
23 November 2001
Self-confidence is the very stairway to Ānanda
24 July 2002
The Paramāṇu Itself Is the Paramātma
19 February 2004
Unity is Jñāna, multiplicity is ignorance
25 December 2004
Pray for the Sake of God's Prema
3 September 2005
Give up attachment to the body and believe in oneness
25 December 2008
The Ātma alone is true; all the rest is a scene in a dream!
మన
మైండ్
టెలివిజనే.
అనేక
రకములైన
రూపనామములు,
భూత
భవిష్యత్తులు
తనయొక్క
దృష్టియందుంచుకున్నాడు.
కనుక
ప్రతి
మానవుని
దేహము
ఒక
విద్యుత్
జనరేటరే.
ప్రతి
వస్తువు,
అది
వస్తువుగా
కనిపించటం
లేదు.
కొన్ని
సంవత్సరములకు
అది
క్రమక్రమేణా
శక్తిగా
మారిపోయి
“సర్వతః
పాణిపాదం
తత్సర్వతోక్షి
శిరోముఖం
సర్వతః
శృతిమల్లోకే
సర్వమావృత్య
తిష్ఠతి”
అన్నట్లు
సర్వం
శక్తిమయం
అవుతుంది.
ఒకే
అయస్కాంతశక్తిని
అనేక
రూపనామములుగా
మార్చవచ్చును;
కానీ,
నాశనము
చేయడానికి
వీలు
లేదు
అన్ని
వస్తువులు,
అన్ని
పదార్థములు,
అన్ని
ప్రదేశములు
శక్తిమయమై
ఉంటున్నాయి.
సైంటిస్టు
న్యూటన్
చెబుతూ
వచ్చాడు,
“శక్తికి
పుట్టుకలేదు.
దీనికి
నాశనము
లేదు.
దీనిని
ఎవరు
పుట్టించుటకు
వీలు
కాదు.
దీన్ని
ఎవరు
నాశనము
చేయుటకు
వీలుకాదు”
అని,
అయితే,
“ఒక
దానినుంచి
ఒకటి
మార్పు
చేయవచ్చును”
అన్నారు.
ఎట్లా
మార్పు
చేయవచ్చు?
అయస్కాంతము
నుండి
విద్యుత్‌శక్తిగా
మార్చవచ్చును.
విద్యుత్‌శక్తి
నుండి
అణుశక్తిగా
మార్చవచ్చును.
అణుశక్తినుండి
కాంతిశక్తిగా
మార్చవచ్చు.
కాంతి
శక్తినుండి
ఉష్ణశక్తిగా
మార్చవచ్చు.
ఈవిధముగా
ఒకే
అయస్కాంత
శక్తిని
అనేక
రూపనామములుగా
మార్చవచ్చునే
గానీ
దీనిని
నాశనము
చేయటానికి
వీలుకాదు.
దీనిని
వేదాంతులు
అనేక
విధములుగా
బోధిస్తూ
వచ్చారు.
చావు
పుట్టుక
లేనట్టి
శాశ్వతుండు
ఆది
మధ్యాంతరహితుడనాది
వాడు
తాను
చావక
పుట్టక
చంపబడక
ఆత్మరూపుడై
అంతట
వెలసియుండు
దీనినే
ఆనాటి
న్యూటను
చెప్పాడు,
కానీ,
ఈనాటి
చిల్లర
చిల్లర
సైంటిస్టులు
సరియైన
రీతిలో
అర్థము
చేసుకోటం
లేదు.
వీరు
ప్రపంచములో
నున్న
పవిత్రమైన
శక్తి
సామర్థ్యములు
ఎంతవరకు
కనుక్కున్నారు?
ఇది
ఒక
కర్చీఫ్.
దీనిలో
ఈనాటి
సైంటిస్టు
కనుక్కొన్నది
ఇంత
మాత్రమే.
6
▾
Meaning
Keep
ఇదంతా
ఒక
‘అవేర్నెస్’
అని
చెప్పటానికి
వీలుకాదు.
నేను
తెలుసుకున్నాను
అని
చెప్పటానికి
వీలుకాదు.
‘అవేర్నెస్’
అంటే
పూర్ణమైన
స్వరూపమును
తెలుసుకొనుటయే
పరిపూర్ణ
స్వరూపము.
దీనిని
చూచినప్పుడు
కర్ఛీఫ్
అని
చెప్పవచ్చు.
కాని
దీనిని
మరొక
విధంగా
చూచినప్పుడు
“పీస్
ఆఫ్
క్లాత్”
అని,
దూది
అని
కూడా
చెప్పవచ్చును.
తెలుసుకున్నది
చాలా
స్వల్పమే,
అల్పమే.
కానీ
అంతా
తెలుసుకున్నట్లుగా
వాగుతుంటారు.
Hero
becomes
zero,
If
he
forgets
God
:
దైవత్వము
సర్వత్రా
యున్నదనే
తత్త్వాన్ని
ఏ
మానవుడు
తెలుసుకొనునో
అదే
పూర్ణమైన
తత్త్వము.
వాజ్‌పేయి
కూడా
చెప్పాడు
మోక్షప్రాప్తి
కోసం
ప్రయత్నం
చేస్తుంటారని,
ఏమిటి
ఈ
మోక్షమంటే?
మోహక్షయమే
మోక్షం.
అనగా
ఏమిటి?
వాయువు,
వాయువులో
చేరినప్పుడు
లీనమైపోతుంది.
నీరు
నీరులో
చేరినప్పుడు
ఏకమైపోతుంది.
అగ్ని
అగ్నిలో
చేరినపుడు
ఏకమైపోతుంది.
అదే
విధముగా,
భగవంతుడు
జ్యోతిస్వరూపుడు.
నీవు
జ్యోతిగా
మారు,
అప్పుడు
నీవు
దాంతో
ఏకమైపోతావు.
భగవంతుడు
అరూపుడు.
కనుక
రూపతత్త్వముపైన
భ్రాంతితో
ఉండకు.
అప్పుడు
నీవు
ఆత్మలో
ఏకమైపోతావు.
కానీ,
24
గంటలు
దేహాభిమానము
కల్గిన
మానవునకు
ఆత్మతత్త్వం
ఎట్లా
అర్ధమవుతుంది?
కనుక,
ఆత్మ
తత్వముపైనే
నీ
మనస్సును
కేంద్రీకృతము
చేయాలి.
అప్పుడే
ఆత్మ,
ఆత్మతో
ఏకమైపోతుంది.
ఈ
ఏకత్వాన్నే
సాయుజ్యము
అన్నారు.
ఇదే
నిజమైన
‘ఏకాత్మ
సర్వభూతాంతరాత్మ’
అంటే.
ఉన్నది
ఒక్కటే.
కానీ
అనేకమంది
అనేక
రూపనామములుగా
భావిస్తుంటారు.
వివిధరూపములు
కానే
కాదు.
ఈ
ప్రపంచమంతయు
ఒక్కటే
ఒక్క
స్వరూపము.
మిలియన్సు
అని
ఒకటి
ప్రక్కన
సున్నలు
పెట్టుకొని
పెద్ద
సంఖ్యగా
చెబుతారు.
కాదు,
కాదు.
దానికి
మూలం
ఒక్కటే.
1+1+1+1....
ఈ
విధంగా
పోయినప్పుడు
మిలియన్లు
అయి
పోతున్నాయి.
కాని,
ఉన్నది
ఒక్కటే.
ఒకటి
ప్రక్కన
అనేక
సున్నాలు
పెట్టినప్పుడు
అనేక
మిలియన్సుగా
మారిపోతున్నది.
జీరో
ఏమిటి?
World
is
zero,
Life
is
zero,
Sun
is
zero,
Moon
is
zero,
Sky
is
zero.
Everything
is
zero
ఒక్కతూరి
కనిపిస్తుంది,
రెండవసారి
కనిపించదు.
కానీ
1
ఈజ్
hero.
అతడే
భగవంతుడు.
ఆ
hero
ప్రక్కన
జీరోలు
పెడితే
మిలియన్సుగా
మారిపోతుంది.
Hero
becomes
zero,
if
he
forgets
God.
7
▾
Meaning
Keep
కనుక
1
అనే
ప్రాణ
సమానమైన
భగవంతుని
మర్చిపోతున్నారు.
కనుకనే
జీవితమందు
జీరోలుగా
రూపొందుతున్నారు.
నీ
దేహాభిమానమును
సర్వాభిమానంగా
మార్చుకున్నప్పుడు
దైవమూ,
నీవు
ఒక్కటై
పోతావు
ప్రేమస్వరూపులారా!
దైవత్వము
బయట
ప్రదేశములో
ఎక్కడా
లేదు.
నీవే
దైవము.
నీవే
బ్రహ్మవు.
నీవే
మోక్షము,
నీవే
సర్వస్వము.
ఆ
సత్యాన్ని
నీవు
చక్కగా
విచారణచేసి
గుర్తించుకో.
ఏమిటి
ఎంక్వైరీ
చేస్తున్నారు
ఈనాడు?
ఏమీ
ఎంక్వైరీ
చేయటం
లేదు.
లక్షల
కొద్దీ
పరిశోధనలు
జరుగుతున్నాయి.
పరిశీలన
మాత్రం
శూన్యం.
పరిశోధనలకు
కోట్లు
ఖర్చు
చేస్తున్నారు.
పరిశీలనలు
నయాపైసాతో
కూడినవి.
పరిశోధనలకే
జీవితమంతా
వ్యర్థము
గావించు
కుంటున్నాం.
జీవితమంతా
చదవటం
కోసమే
వినియోగిస్తే
ఇంక
చదివినది
వినియోగించుకునేది
ఎప్పుడు?
కనుక,
పరిశోధన
చేసిన
దానిని
పరిశీలనలో
జీవితాన్ని
అంకితం
గావించాలి.
ఏ
వ్యక్తియందు
అయినను,
దేహమునందు
మార్పులున్నవి
గానీ
ఆత్మయందు
లేదు.
ఈ
టంబ్లరులో
వాటర్
ఉన్నది.
దీనిని
తెలుగువాడు
‘నీరు’
అన్నారు.
మా
వాజ్‌పేయి
రెండు
తెలుగు
పదాలు
చెప్పాడు,
‘సోదర
సోదరీమణులారా”
అని.
ఎంతో
ఆనందం
వేసింది.
‘నీరు’
అంటారు
తెలుగువారు.
హిందీవారు
‘పానీ’
అంటారు.
ఇంగ్లీషువారు
‘వాటర్’
అంటారు.
తమిళం
వారు
‘తన్నీ’
అంటారు.
సంస్కృతము
వారు
‘వారి’
అంటారు.
ఈ
పేర్లు
మార్పువచ్చినవే
గానీ,
వాటర్‌లో
మార్పులేదు.
అదేవిధముగా
దైవత్వములో
అనేక
రూపములు
మార్పు
చెందుతున్నాయి,
అనేక
నామములు
మార్పుచెందుతున్నాయి.
కానీ
ఆత్మతత్త్వము
ఒక్కటే.
అందరియందున్నది
అదొక్కటే.
అదియే
conscience.
అది
consciousness
నుండి
వచ్చినది.
దీన్ని
ఏ
సైంటిస్టుగానీ,
ఏ
వాది
గానీ,
నాస్తికుడు
గానీ,
అందరు
అంగీకరించక
తప్పదు.
నాస్తిక,
ఆస్తిక,
నాస్తిక
-
ఆస్తిక
అన్ని
రకములవారు
ఒప్పుకొనక
తప్పదు.
భోగి,
యోగి,
అనురాగి,
బైరాగి,
అందరియందు
ఏకత్వమే
ఉంటున్నది.
కానీ
మానవుడు
తన
దేహముపై
concentrate
చేయటం
వలన
తన
రూపమును
మాత్రమే
గుర్తించుకుంటూ
పోతున్నాడు.
8
▾
Meaning
Keep
దేహములన్నియు
కలర్
బెలూన్సు.
సైజు
కొద్దీ
ఉంటున్నాయి.
బెలూన్స్
సైజులు
వేరు,
రంగులు
వేరు,
కానీ
ఊదిన
గాలి
ఒక్కటే.
ఒక్కో
బెలూన్నందు
చేరిన
గాలి,
బెలూన్
రూపాన్ని
పొంది
పోతున్నది.
బెలూన్‌లో
లేని
గాలి
సర్వత్రా
వ్యాపించినదిగా
ఉన్నది.
సర్వత్రా
వ్యాపించిన
గాలి
consciousness;
ఈ
బెలూన్‌లో
ఉన్నదే
conscience.
ఈ
conscience,
consciousness
గా
మారాలంటే
ఏమి
చేయాలి?
ఈ
బెలూన్లోని
గాలిని
అధికంగా
ఊదుతే
ఫట్
అని
పగిలిపోతున్నది.
సర్వత్రా
ఉన్న
గాలిలో
ఏకమైపోతుంది.
నీ
దేహాభిమానమనే
ప్రేమను
సర్వాభిమానంగా
మార్చుకో.
అప్పుడు
దైవము,
నీవూ
రెండు
ఒక్కటైపోతావు.
కేవలం
క్వాంటిటీ
డిఫరెన్సు
కానీ
క్వాలిటీ
ఒక్కటే.
సముద్రమును
చూస్తే
పెద్దదిగా
కనిపిస్తున్నది.
కానీ
ఒక
చిన్న
టంబ్లరులో
సముద్రం
నీరు
తీసుకువస్తే
తక్కువగా
కనిపిస్తున్నది.
క్వాంటిటీ
డిఫరెన్సుగానీ
ఆ
సముద్రములోని
టేస్టు,
గ్లాసు
నీరులోని
టేస్టు
ఒకటే.
ఈ
టేస్టు
యొక్క
ఏకత్వాన్ని
తెలుసు
కోకుండా
మానవుడు
జీవితాన్ని
వేస్టు
చేస్తున్నాడు.
కనుక
మానవత్వములో
దైవత్వము
ఒక
ఆకర్షణ
శక్తియే.
ఒక
చిన్న
ఉదాహరణ.
ఇన్ని
వేలమంది
ఇక్కడకు
వచ్చారు.
వీరిని
ఎవరు
ఆహ్వానించారు?
ఎవరు
invitation
పంపారు?
Invitations
మేము
కొట్టటము
లేదెప్పుడు.
ఇదంతా
ఎక్కడినుండి
వచ్చినది?
ఈ
దేహముపైన
ఆ
దేహమునకున్న
ప్రేమ,
ఆకర్షణే
అనురాగమునకు
మూల
కారణము.
మిమ్మల్ని
ఫోర్సుతో
తీసుకురాలేదు.
మీకందరికి
తెలుసు,
ఈ
పొలిటికల్
మీటింగులకు
లారీలను
పంపి
వారందరిని
తీసుకువస్తుంటారు.
కానీ,
మేము
ఎవరూ
రావద్దు,
రావద్దు
అని
చెప్పినా
వస్తుంటారు.
ఇదంతా
ప్రేమయొక్క
ఆకర్షణే.
అదే
డివినిటీ.
అదే
డివైన్
మ్యాగ్నెట్.
అదే
నిజమైన
అయస్కాంతము.
ఒక
చిన్న
ఉదాహరణ.
పవిత్రమైన
రామాయణ
చరిత్రయందు
ఈ
పవిత్రమైన
దృశ్యాన్ని
మీరు
కనిపెట్టవచ్చును.
సీత
బాల్యమునందు
శివధనుస్సు
ఎత్తిందని
జనక
మహారాజు
గుర్తించి,
ఈ
శివధనుస్సును
ఎత్తినవానికి
నా
బిడ్డనిచ్చి
వివాహము
చేస్తానని
ప్రామిస్
చేశాడు.
సీత
ఎవరు?
బాలికయైన
ఈమెకు
ఇంత
శక్తి
ఎక్కడనుండి
వచ్చింది?
ఆమె
భూజాత,
భూమియొక్క
బిడ్డ.
కనుక,
ఆమెకు
ఆ
ఆకర్షణ
శక్తి
ఉన్నది.
భూమంతా
ఆకర్షణశక్తియే.
భూమంతా
అయస్కాంతమే.
ఎక్కడ
చూచినా
అయస్కాంతమే.
9
▾
Meaning
Keep
త్రాగే
నీరు
లోపల,
తినే
తిండి
లోపల
పీల్చే
గాలి
అంతా
అయస్కాంతమే.
కనుక
ఆమె
సులభంగా
ఎత్తింది.
దానిని
ఎవరు
వంచారు?
రాముడే
వంచాడు.
రాముడు
ఎవరు?
డివైన్
మ్యాగ్నెట్.
ఆ
డివైన్
మ్యాగ్నెట్
కాబట్టే
దానిని
సులభంగా
వంచాడు.
ఈ
డివైన్
మ్యాగ్నెట్
అందరి
యందు
ఉంటున్నది
కానీ
ఆ
మ్యాగ్నెట్
ఎక్కడ
ఎవరియందు
అధికంగా
ఉంటున్నదో
దానిని
అనేక
రకములుగా
ఆకర్షిస్తున్నది.
దీనిని
ఏవిధముగా
అభివృద్ధి
చేసుకోవాలి.
ప్రేమచేతనే
దీనిని
అభివృద్ధి
చేసుకోవాలి.
I
and
you
are
one,
I
and
you
are
one
అని
పెట్టుకుంటే
I
and
you
are
not
only
one,
but
I
and
you
are
we
అయిపోతుంది.
మనము
ఏకత్వములో
పోవాలి.
దివ్యత్వములో
ప్రయాణం
చేయాలి.
ఐకమత్యంలో
ఆనందాన్ని
అనుభవించాలి.
ప్రేమ
తత్త్వముతో
జీవితాన్ని
గడపాలి.
కనుక
నీ
యందున్న
శక్తి
సామర్థ్యములు
ఏ
వ్యక్తియందు
కనిపించవు.
దైవము
నీ
యందే
ఉంటున్నాడు.
నీవే
దైవము.
ఈ
తత్త్వాన్ని
మొట్టమొదట
మీరు
గుర్తించాలి.
దీన్ని
గుర్తించినప్పుడు
ఏవిధమైన
సందేహములకు
అవకాశము
ఉండదు.
ప్రేమ
అనే
కలర్
గ్లాసెస్
వేసుకుంటే
అంతా
ప్రేమమయంగానే
కనపడుతుంది
అనేకమంది
అనేక
విధములుగా
దూషణ
భూషణ
తిరస్కారములు
చేస్తుంటారు.
కానీ,
దీనికి
కారణం
ఏమిటి?
ఇది
వారి
దుర్బుద్ధి
యొక్క
లక్షణము.
ఇలాంటి
వారే
ఇతరులను
దూషిస్తూ
ఉంటారు.
ఎవరు
దూషిస్తారు?
మంచివాడు
ఎవరిని
దూషించడు.
చెడ్డవాడే
ఇతరులను
దూషిస్తాడు.
తనయందు
అనేక
దోషములుండబట్టే,
ఇతరుల
దోషములు
వెతుకుతూ
ఉంటారు.
తనలో
మంచి
భావములే
ఉంటే
ఇతరులలో
దోషములే
మాత్రం
కనిపించవు.
రెడ్
కలర్
గ్లాసెస్
వేసుకుంటే
అంతా
రెడ్గానే
కనబడుతుంది.
బ్లూ
కలర్
గ్లాసెస్
వేసుకుంటే
అంతా
బ్లూగానే
కనబడుతుంది.
కనుక,
ప్రేమ
కలర్
గ్లాసెస్
వేసుకుంటే
అంతా
ప్రేమమయంగానే
కనబడుతుంది.
ద్వేషమయమైన
గ్లాసెస్
వేసుకుంటే
కేవలం
తన
యొక్క
దృష్టి
దోషమే.
ఎవరు
మనలను
దూషించినా
మనం
లెక్క
చేయకూడదు.
గట్టిగా
దూషిస్తే
గాలిలో
చేరిపోతుంది
ఆ
దూషణ;
తనలో
తాను
దూషించుకుంటే
తనకే
చేరిపోతుంది.
దేహాన్ని
దూషిస్తున్నారా?
దేహము
ఒక
జడము.
లేక
ఆత్మను
దూషిస్తున్నావా?
ఆ
ఆత్మ
నీయందు
కూడా
ఉంటున్నది.
కనుక
నిన్ను
నీవు
దూషించుకున్నవాడవే
అయిపోతావు.
10
▾
Meaning
Keep
ఈ
సత్యాన్ని
గుర్తించినవాడే
సత్యాన్వేషణ
సల్పేవాడు.
తన
దోషాలు
వందలకొద్దీ
ఉండినప్పటికి
తాను
గుర్తించటానికి
ప్రయత్నించడు.
ఇతరులలోని
అణుమాత్రం
తప్పును
కొండలవలె
పెంచుతారు.
ఇది
వారికొక
స్వభావముగా
అవుతుంది.
ప్రతి
విషయంనందు
తనలోని
దోషములే
ప్రతిబింబిస్తున్నాయి.
ఇవన్నీ
reflection,
reaction,
resound.
Reflection
of
the
innerbeing.
అన్నీ
ప్రతిబింబము,
ప్రతిచర్య,
ప్రతిధ్వనిగా
తిరిగి
వస్తున్నాయి.
అన్ని
తనలోనివే.
ఫలానివాడు
చెడ్డవాడు
అనుకుంటే
ఆ
చెడ్డతనం
నీయందు
ఉంటున్నది.
కనుక
నీలోని
ఆ
చెడ్డతనం
దూరం
చేసుకో;
అంతేకానీ,
అతనియందు
ప్రవేశపెట్టవద్దు.
అప్పుడే
నీ
మనస్సు
పరిశుద్ధమవుతుంది.
కనుక
మనస్సు
యందు
పవిత్రమైన
భావాలు
పెంచుకుంటూ
రావాలి.
ప్రతి
మానవుడు
దివ్యాత్మ
స్వరూపుడే
ప్రతిమానవుడు
దివ్యాత్మ
స్వరూపుడే.
కాంతి
శక్తి,
రేడియో
శక్తి,
తరంగ
శక్తి,
ఉష్ణశక్తి,
విద్యుత్‌శక్తి,
అయస్కాంత
శక్తి,
ఈ
విధమైన
శక్తులు
ఎన్నియో
ఉంటున్నాయి
మానవునియందు.
మీకు
ఒక
చిన్న
ఉదాహరణ
చెబుతున్నాను.
నా
హెయిర్
బ్రష్
గురించి.
పూర్వము
నేను
ఈస్ట్
ఆఫ్రికా
పోయినప్పుడు
డాక్టరు
పటేల్
చాలా
గొప్ప
భక్తుడు,
ఆయన
ఈ
బ్రష్
ఇచ్చాడు.
ఎందుకంటే,
ఆఫ్రికన్స్‌కు
ఈవిధమైన
హేర్స్
ఉంటుంది.
మన
భారతదేశంలోని
బ్రష్
దీనిలో
పెడితే
పళ్ళు
విరిగిపోతాయి.
ఈ
బ్రష్‌కు
ఐరన్
రోల్స్
ఉంటాయి.
ఈ
వెంట్రుకలందు
ఎంత
శక్తి
ఉన్నదీ
మీకు
ఈనాడు
వెల్లడి
చేస్తున్నాను.
బ్రష్
ఊరికే
చేతిలో
పట్టుకుంటే
చాలు.
ఈ
వెంట్రుకలన్నీ
దానికి
కరచుకుంటాయి.
మా
పిల్లలు
చూచారు.
ఎందుకా
విధంగా
వస్తున్నాయి
వెంట్రుకలంతా
దీనికి?
అనగా
స్వామి
దేహమంతా
ఒక
డివైన్
ఎనర్జీగానే
ఉంటున్నది.
ఇదియే
అయస్కాంత
శక్తి.
ఈ
అయస్కాంత
శక్తి
నఖశిఖ
పర్యంతం
ఏకంగా
ఉంటుంది.
ఆ
దివ్యశక్తియే
ఇంతమంది
ఆకర్షణకు
మూలాధారం
అయింది.
ఇది
దివ్యశక్తికి
సంబంధించిన
దివ్యప్రేమ.
నా
ప్రేమయే
నాయొక్క
పెద్ద
ప్రాపర్టీ.
అందువల్లనే
నేను
అప్పుడప్పుడు
చెబుతుంటాను
Love
is
form,
Truth
is
My
breath;
Bliss
is
My
food,
My
life
is
My
message;
Expansion
is
My
life;
No
reason
for
love,
no
season
for
love;
no
birth,
no
death.
ఆ
శక్తికి
birth
లేదు.
death
లేదు.
11
▾
Meaning
Keep
ఈ
దేహానికంతా
రావచ్చును,
పోవచ్చును.
కానీ
ఆత్మ
తత్త్వానికి
జనన
మరణములు
లేవు.
దానికి
ఒక
reason
లేదు,
season
లేదు.
కనుక
ఈనాటి
మానవత్వములోని
పవిత్రతను
చక్కగా
విచారించి
చూచినప్పుడు
దైవత్వము
ఒక్క
క్షణములో
అర్థమైపోతుంది.
మీరు
కూడా
అంతే.
మీ
హృదయాన్ని
పవిత్రము
గావించుకోండి.
దివ్యమైన
ప్రేమను
పెంచుకోండి.
ఒక్క
క్షణములో
నీలో
కూడా
కాంతి
కూడా
ఆవిర్భవిస్తుంది.
నీ
reflection,
reaction
దివ్యమైన
రూపాన్ని
ధరిస్తుంది.
భగవత్ప్రేమ
ఇచ్చుకునేదే
గానీ
పుచ్చుకునేది
కాదు
ఒకరు
పొగిడారని
నేను
పొంగిపోను.
ఒకడు
తెగిడారని
కృంగను.
పొంగి,
కృంగని
ఏకత్వమే
నాయందున్నది.
దూషణ,
భూషణ
తిరస్కారములకు
ఏమాత్రం
మార్పు
చెందను.
దానికి
ఆనందమే,
దీనికి
ఆనందమే.
రెండూ
నీ
మాటలే
కానీ,
నాకు
సంబంధించినవి
కాదు.
నాయందున్నది
ప్రేమయే.
ఈ
ప్రేమ
ఇచ్చుకోటమే
గానీ
పుచ్చుకోవటమనేది
లేదు.
ఈ
ప్రపంచములోని
ప్రేమకు
దివ్యమైన
ప్రేమకు
వ్యత్యాసమును
గుర్తించాలి.
ప్రాకృత
ప్రేమ
పుచ్చుకొనేదే
గానీ
యిచ్చుకొనేది
కాదు.
కానీ,
భగవత్ప్రేమ
యిచ్చుకొనేదే
గానీ
పుచ్చుకొనేది
కాదు.
Gives,
gives...
అదియే
నా
ప్రేమతత్త్వం.
కనుక,
ఇంత
విశాలమైన
ప్రేమతత్త్వంగా
పెరిగిపోతున్నది.
‘అణోరణీయాన్
మహతోమహీయాన్’.
ఒక
చిన్న
విత్తనం
నీవు
భూమిలో
నాటితే,
అది
ఒక
మొక్కగా
బయలుదేరుతుంది.
అయితే
ఈ
కొమ్మలు,
రెమ్మలు,
ఆకులు,
పూలు
అన్నీ
ఈ
బీజములోనివే.
అన్ని
రూపనామములు
ఆ
బీజమునందే
ఉంటున్నాయి.
కాబట్టి,
Love
is
God,
Live
in
love.
మీరు
కూడా
ఈ
ప్రేమను
పెంచుకోండి.
ఎవరిని
చూచినా,
అందరిని
ప్రేమించండి.
ప్రాకృతమైన
ప్రేమకాదు,
దివ్యమైన
హృదయ
ప్రేమ.
అప్పుడే
మీలోనుండి
కూడా
ఈ
దివ్యత్వము
వెలువడుతుంది,
ఆవిర్భవిస్తుంది.
ఇది
ప్రత్యక్షమవుతుంది.
దానినే
self-realisation
అన్నారు.
ఈ
self
realisation
ఏవిధంగా
వస్తుంది?
మొట్టమొదట
self
confidence
పెంచుకోవాలి.
Self
confidence
is
foundation;
self
satisfaction
is
wall;
self
sacrifice
is
roof;
self
realisation
is
life.
అన్నీ
self
లోనే
ఉంటున్నాయి.
Self
అంటే
ఆత్మతత్త్వము.
12
▾
Meaning
Keep
కనుక,
ఈ
ఆత్మ
భావముచేత
ఆధ్యాత్మిక
తత్త్వములో
మనం
ప్రవేశించాలి.
ఆత్మతత్త్వమునకున్న
శక్తి
మరెక్కడా
కానరాదు.
ఆటంబాంబు,
అణుశక్తిబాంబు
ఎన్నో
ఉంటున్నాయి.
అన్నింటి
కంటె
గొప్పశక్తి
ఒక్క
ప్రేమశక్తియే.
ఎంతమంది
ద్వేషులనైనా
ప్రేమ
మార్చివేస్తుంది.
ప్రేమకు
అందరూ
వశమైపోతారు.
అట్టి
ప్రేమతత్త్వాన్ని
అందరు
పెంచుకోవాలి.
అప్పుడే
భారతదేశములోగానీ,
మరొకదేశము
గాని
ఒకరికొకరికి
ద్వేషాలుండవు.
మన
చవాన్
చెప్పాడు
ఎక్కడ
చూసినా
వైలెన్స్
వైలెన్స్
అని.
ఈ
వైలెన్స్
ఎక్కడ
నుండి
వస్తున్నది?
దీనికి
మానవుడే
మూలకారణం.
మానవుని
యందున్న
దుర్బుద్ధియే
ఈ
వైలెన్స్‌కు
మూలకారణం.
మానవుని
యందు
పూర్తి
ప్రేమను
పెంచుకుంటే
వైలెన్స్కి
అవకాశమే
ఉండదు.
అందుకోసమే
పిల్లలకు
చెబుతాను.
Start
the
day
with
love,
fill
the
day
with
love,
spend
the
day
with
love
and
end
the
day
with
love.
This
is
the
way
to
God
అని.
ఈ
ప్రేమను
నీవు
పెంచుకుంటూ
పో.
అంతేగానీ
ఉన్న
ప్రేమను
నీవు
పాడుచేసుకోవద్దు.
ఉన్నదంతా
ఒకే
శక్తి;
అదియే
సృష్టి,
స్థితి,
లయములు
మూడింటిని
జరిపిస్తున్నది
ఈ
ప్రాకృత
విద్యలచేత,
ప్రాకృత
వాంఛలచేత
ప్రాకృత
బంధనచేత
ప్రేమను
పాడు
చేసుకుంటున్నారు.
ఈ
సృష్టి
స్థితి
లయములకు
భగవంతుడే
మూల
కారణము.
అయితే
ఒకే
శక్తి
అనేక
రూపనామములను
ధరిస్తున్నది.
చూడండి
ఒకే
చీఫ్మినిష్టరు
ఆంధ్రప్రదేశ్‌కు.
కానీ,
C.M.
ఒక్కడే
అయినా
ఒక్కొక్క
డిపార్టుమెంటుకు
ఒకరిని
అధిపతిగా
నియమిస్తుంటారు.
ఆ
డిపార్టుమెంటు
బాధ్యత
ఆ
మినిష్టరు
చూచుకుంటాడు.
అన్నింటియొక్క
ఏకత్వాన్ని
C.M.
చూసుకుంటాడు.
విద్యను
చూసుకుంటే
ఎడ్యుకేషన్
మినిష్టరు
అంటారు.
హెల్త్‌ను
చూసుకుంటే
హెల్త్
మినిష్టరు
అంటారు.
కానీ,
సి.ఎం.
ను
హెల్త్,
ఎడ్యుకేషన్
అని
పేరు
పెట్టరు.
ఛీఫ్
మినిష్టరు
అంటారు.
అదేవిధంగా,
ఈ
ప్రపంచమంతయు
మూడు
విధములైన
కర్మలచేత
ఆధారపడి
నడుస్తున్నది.
ఏ
సైంటిస్టు
అయినా,
ఏ
ఇంజనీరు
అయినా,
ఏ
ఆస్తికుడైనా,
ఏ
నాస్తికుడైనా,
ఆస్తిక
నాస్తికుడైనా
కానీ
అందరు
దీనికి
అంగీకరించక
తప్పదు.
మూడు
కర్మలచేత
జగత్తు
నడుస్తున్నది.
ఒకటి
సృష్టి
ఆవిర్భావమవుతుంది.
ఆవిర్భావమైన
సృష్టి
పరిపాలింపబడుతుంది.
పరిపాలన
జరిగిన
దానిని
తిరిగి
నాశనము
చేస్తాడు.
13
▾
Meaning
Keep
దేహమే
మనకు
ప్రత్యక్ష
ప్రమాణము.
దేహము
పుట్టినప్పుడు
చంటి
బిడ్డగా
ఉంటుంది.
ఇది
child;
after
10
years
boy;
after
30
years
man;
after
70
years
grand-father.
Child,
boy,
man,
grandfather,
ఇలా
ఒక్కడే.
నలుగురు
కాదే.
అదేవిధంగా
ఉన్నదంతా
ఒకే
శక్తి.
ఈ
శక్తియే
సృష్టి
స్థితి
లయములు
మూడింటిని
జరిపిస్తున్నది.
దానినే
సృష్టికి
బ్రహ్మ
అని,
పరిపాలనకు
విష్ణువని,
నాశనమునకు
శివుడని
డిపార్టుమెంట్సు
పెట్టారు.
అయితే
ఎందుకోసం
కావాలి
ఇవి?
ఈ
సృష్టి
పరిపాలనంతా
చక్కగా
జరగాలి.
దానికోసమే
ఈవిధమైన
పేర్లు
పెట్టారు.
అన్నింటిని
ఏకత్వముగా
చేర్చినప్పుడు
GOD
అన్నారు.
కాబట్టి
సృష్టి,
స్థితి,
లయములకు
అధిపతి
God.
God
spelling
GOD.
G-Generator,
బ్రహ్మ.
O-Organiser,
విష్ణువు.
D-Destructor,
శివుడు.
ఈ
మూడింటి
తత్త్వమే
బ్రహ్మ
విష్ణు
మహేశ్వర
తత్త్వము.
ఈ
మూడు
చేరినదే
గాడ్.
దీన్ని
ఎవరు
కాదని
చెప్పగలరు?
ఏ
మూర్ఖుడు
కాదని
చెప్పలేడు.
కాదని
చెప్పే
వ్యక్తే
రేపు
అవునని
చెప్పవచ్చు.
కాబట్టి
ప్రతి
ఒక్కటి
రీజన్‌కి
తగినట్లు
నడుస్తున్నది
కానీ
రీజన్‌కి
విరుద్ధంగా
నడవటం
లేదు.
ప్రతి
వ్యక్తి
సృష్టియొక్క
క్రమాన్ని
అనుసరిస్తూ
పోతున్నాడు.
కనుక
దైవం
లేడని
చెప్పటానికి
ఎవరికి
అధికారం
లేదు.
లేదంటే
నీకు
లేడు
గానీ
నాకు
లేడా?
లేడు
అనుకొనేవాడికి
లేడు
గానీ,
ఉన్నాడు
అనుకొనేవాడికి
ఉన్నాడు
కదా!
There
is
no
God
అంటారు.
ముందుగా
There
is
అన్న
తరువాతనే
no
God
అంటున్నారు.
చక్కగా
విచారణ
చేయాలి.
God
is
no
where
అంటారు
కొందరు.
w
ను
no
కు
దగ్గరగా
జరపండి.
ఇప్పుడది
God
is
now
here
గా
మారింది.
Only
words
building.
నీవు
ప్రశ్న
వేసుకో.
అయ్యా
ఎవరికి
లేడు
దేవుడు?
నీకు
లేడు.
నీకు
లేకపోతే
నీవు
పో,
నాకున్నాడు.
నాకున్న
దేవుడు
లేడని
చెప్పటానికి
ఎవరు
నీవు?
నాకున్నాడు.
నీకు
లేడు.
నీకు
లేడని
చెప్పుకోవచ్చు
గానీ
నాకు
లేడని
చెప్పటానికి
నీవెవరు?
ఇంతటి
విశాల
బుద్ధి
లేకపోవటం
చేత
మానవుడు
సంకుచిత
భావములలో
బయలుదేరి
జీవితమంతా
వ్యర్థము
చేసుకుంటున్నాడు.
అసలు
కావలసినది
expansion
of
love.
కానీ
ఈనాడు
అంతా
contraction
of
love.
అంతా
సంకుచితమైన
ప్రేమతో
పోతున్నారు.
తాను,
తన
కుటుంబము.
విశ్వకుటుంబీకుడవు
నీవు.
ప్రపంచమంతా
ఒక
ఫ్యామిలీయే.
అన్ని
దేశములు,
అన్ని
రకములైన
రూములే.
14
▾
Meaning
Keep
ఆ
రూములలో
నివసించేవారు
నీ
సోదర
సోదరీమణులే.
ఈవిధమైన
సన్నిహిత
సంబంధ
బాంధవ్యము
పెంచుకున్నప్పుడు
ఎవరిపైనా
ద్వేషము
రాదు.
ప్రేమస్వరూపులారా!
ముఖ్యంగా
దైవత్వమును
ప్రతి
మానవుడు
అర్థము
చేసుకోవాలి.
దైవము
తప్ప
జగత్తులో
మరొకటి
లేనేలేదు.
ఏ
శక్తి
లేదు.
ఒకే
గాడ్.
అనేకమంది
పవర్,
మ్యాటర్
ఉంటున్నాయంటారు.
కానీ
మ్యాటర్
అనేదే
లేదు.
అంతా
ఎనర్జీ,
అంతా
శక్తియే.
ఆ
మ్యాటరు
కూడా
కొంతకాలమునకు
ఎనర్జీగా
మారిపోతుంది.
ఇది
క్లాత్.
క్లాత్కి
ముందుగా
ఏముంటున్నది.
త్రెడ్
ఉంటున్నది.
త్రెడ్స్
ముందుగా
ఏమున్నది.
కాటన్
ఉన్నది.
కాబట్టి
కాటన్,
త్రెడ్,
క్లాత్
మూడూ
ఒకటే.
రూపములూ,
నామములూ
వేరు
వేరైపోయాయి.
కానీ
మూలాధారము
ఒక్కటే
అదే
దైవత్వం.
దాన్ని
ఎవ్వరూ
కాదని
చెప్పటానికి
వీలులేదు.
కాదని
చెప్పితే
కాదని
పో,
కాని,
నా
దేవుడు
కాదనటానికి
నీకు
అధికారం
లేదు.
ఇంతటి
గాఢమైన
విశ్వాసం
ఈనాటి
మానవునియందు
అభివృద్ధి
కావాలి.
ఎవరో
ఒకరు
మంచిపని
చేస్తే,
‘చెడ్డ
చెడ్డ’
అని
దూషిస్తుంటారు.
నీకు
చెడ్డ
అనే
అధికారం
ఎక్కడుంది?
చేతనైతే,
నీవు
కూడా
మంచి
చేయి,
లేకపోతే
ఊరుకో.
అంతేకాని,
మంచి
చేసేవారిని
ఎందుకు
విమర్శిస్తావు?
ఆవిధమైనవిమర్శలకు
పోకూడదు.
అజ్ఞానము
లేకుండా
వర్తించినవాడే
మానవుడు
విద్యార్థులారా!
ఈనాటి
బాలబాలికలయందు
ఇలాంటి
పవిత్రమైన
విశాల
హృదయము
అభివృద్ది
కావాలి.
మీరంతా
భావిభారతోద్ధారకులు,
జగదోద్ధారకులు.
భవిష్యత్తులో
లీడర్లు,
ప్లీడర్లు
మీరే.
కనుక
మీరు
ఈవిధమైన
లీడర్షిప్
వహించాలి.
అప్పుడే
దేశము
బాగుపడుతుంది.
“లోకాస్సమస్తాః
సుఖినోభవంతు.”
లోకమంతా
క్షేమంగా
ఉంటుండాలి.
వాజ్‌పేయి
‘సర్వలోక
హితేరతః’,
అని
చెప్పాడు.
అందరూ
మంచిగా
ఉండాలి.
అదే
మనం
అందరం
ఆశించవలసింది.
అందరూ
క్షేమంగా
ఉండాలి.
అందరు
హ్యాపీగా
ఉండాలి.
అందరు
హ్యాపీగా
ఉండాలి.
అదే
నిజమైన
బర్త్‌డే.
నిజమైన
బర్త్‌డే
అంటే
ఏమిటి?
ఒకానొక
సమయంలో
చాలామంది
హ్యాపీ
బర్త్‌డే
అంటారు.
హ్యాపీలేని
వారికి
హ్యాపీ
బర్త్‌డే
అని
చెప్పవచ్చు.
ఎప్పుడూ
హ్యాపీగా
ఉండేవానికి
హ్యాపీ
బర్త్‌డే
ఎందుకు?
ప్రహ్లాదుకు
చెప్పాడు.
15
▾
Meaning
Keep
Also in his talks
(4)
6 May 1987
To seek out the road is the noble intellect
19 July 1997
Guard your character as dearly as life
19 November 2001
Only when parents are ideal do children become virtuous
18 June 2008
Divine Message
పుట్టిన
తక్షణం
కొడుకని
భ్రమించటం
చాలా
వెఱ్ఱితనం.
పుత్రోత్సాహము
తండ్రికి
పుత్రుడు
జన్మించినపుడే
పుట్టదు
జనులాపుత్రుని
కనుగొని
పొగడగ
పుత్రోత్సాహము
నాడు
పొందు.
పుట్టిన
తక్షణమే
చక్కెర
పంచుకోవడం
గొప్పతనం
కాదు.
ఆ
పుట్టిన
బిడ్డ
మంచి
పేరును
తేవాలి.
సమాజం
అతనిని
మెచ్చుకోవాలి.
సమాజము
యొక్క
గౌరవము
తాను
అందుకోవాలి.
అప్పుడే
పుత్రోత్సాహము
కలుగుతుంది.
లేకపోతే
కుక్కలకు
కూడా
ఎన్నో
బిడ్డలు
పుట్టుతున్నాయి.
అవి
ఏ
చక్కర
పంచుతున్నాయి?
లేదే!
కానీ
మనిషి,
మానవుడు?
మానవుడనగా
ఏమి?
దైవ
స్వరూపుడే.
అజ్ఞాన
రహితుడే.
మానవుడుగ
అనగా
మా-అజ్ఞానము,
న-లేకుండ,
వ-వర్తించడం.
అజ్ఞానం
లేకుండా
వర్తించినవాడే
నిజమైన
మానవుడు.
కాబట్టి
నీవు
ప్రజ్ఞాన
స్వరూపుడవు.
అజ్ఞానములో
ఎందుకు
ప్రవేశిస్తున్నావు?
పేరుకు
తగినట్లు
ప్రవర్తించాలి.
త్యాగరాజుని
పేరు
పెట్టితే
త్యాగం
అనుభవించాలి.
రాముడు
అనే
పేరు
పెట్టుకోవచ్చు,
కానీ
గుణములు
కూడా
ఆరీతిగా
ఉంచుకోవాలి.
ఈ
జగత్తులో
మూడు
రకములైన
శక్తులు
కనిపిస్తున్నాయి.
మీరు
చక్కగా
విచారించాలి.
మనం
తినే
తిండితో
దివ్యమైన
శక్తులు
ప్రవేశిస్తున్నాయి.
భారతీయులు
ఈ
తిండిని
భుజిస్తారు.
కనుక
భారతదేశమందే
ఈ
శక్తులంతా
అభివృద్ధి
అవుతున్నాయి.
చింతపండురసం,
నిమ్మరసం,
బత్తాయిరసం,
ఆపిల్
రసం,
ఉల్లిపాయ
రసం
ఉంటున్నాయి.
భారతీయులే
వీటిని
భుజిస్తారు.
అన్నింటిలో
అధికంగా
ఆమ్లము
ఉంటున్నది.
ఆకు
పదార్థాలు
భుజిస్తున్నారు
కూరగాయలు
భుజిస్తున్నారు.
వీటియందు
అనేక
లోహములుంటున్నాయి.
లోహము,
అయస్కాంతము,
ఆమ్లములు
చేరి
మానవుడై
పోతున్నాడు.
ఈవిధమైన
సత్యాన్ని
చక్కగా
గుర్తించుకోవాలి.
మానవుని
యందు
దివ్యమైన
శక్తులు
మూడు
ఉంటున్నాయి.
అయితే
ఇది
అధికంగా
పోకూడదు.
మానవుడు
నిత్యజీవితంలో
భుజించే
ఆహారంలో
ఎంతో
ఆమ్లముంటున్నది.
ఈ
రసము,
ఈ
శక్తి,
ఈవిధమైన
ఆకర్షణ
మూడింటి
ఏకత్వమే
మానవత్వము.
16
▾
Meaning
Keep
ప్రతి
విద్యార్ధి
తను
తినే
ఆహారము
సరైనదిగా
చూచుకోవాలి.
బత్తాయిరసము,
టమోటోరసము,
నిమ్మరసం,
ఆపిల్
రసము
చాలా
మంచిది.
ఈవిధంగా
మనలో
ఆమ్లము
అధికమైపోతుంది.
ఆకుకూరలు
చాలా
మంచివి.
ఏ
విటమిన్,
బి
విటమిన్,
సి
విటమిన్
అంటున్నారు.
విటమిన్స్
కాదు
ముఖ్యం.
దీనిలో
ఐరన్
ఉంటున్నది.
లోహపదార్ధములు
అధికంగా
ఉంటున్నాయి.
ఈ
ఐరన్
మన
బాడీకి
ఎంతైనా
శక్తినిస్తున్నది.
మన
దేహం
పుష్టిగా
ఉండాలి.
పుష్టిగా
ఉన్న
దేహంలో
ఎంతైనా
సంతుష్టి
పొందవచ్చు.
మీరు
త్యాగులై,
యోగులై,
ఆనందమయులై
దివ్యత్వమును
అనుభవించుటే
నాకు
ఆనందము
దైవత్వమును
ఎక్కడనో
వెతకనక్కర
లేదు.
దేహములోని
ప్రతి
ఇంచి,
ప్రతి
వెంట్రుక
దైవస్వరూపముగానే
ఉంటున్నది.
అందువలననే
ఆనాటి
హనుమంతుడు
రాముడిచ్చిన
ముత్యాలమాలను
ఒక్కొక్కటి
కొరకి
పారవేశాడు.
‘అయ్యో!
కోతి
బుద్ధి
పోలేదే’
అనుకుంది
సీత.
‘నాయనా!
విలువైన
ముత్యములు
ఎందుకు
పారవేస్తున్నావు?’
అని
అడిగింది.
‘తల్లీ!
ముత్యము
యొక్క
విలువ
నీవు
చూస్తున్నావు.
నేను
ముత్యములోని
శబ్దమును
వింటున్నాను.
నా
రోమరోమము
రామనామమే.
ముత్యములో
నా
రామనామము
లేదే.
రామనామము
లేనిది
ఎంత
విలువైనదైనా
నాకు
అక్కరలేద’న్నాడు,
హనుమంతుడు.
ప్రతి
అణువునందు
ప్రతి
వెంట్రుకనందు
ఆ
విలువైనది
ఉంటున్నది
భారతీయులందు.
దీన్ని
ఆధారం
చేసుకొని
అనేకమంది
భారతదేశంలో
పుట్టాలని,
చావాలని
కోరుకుంటారు.
ఇంత
పవిత్రమైన
త్యాగభూమి,
యోగభూమి,
పుణ్యభూమి,
భారతభూమి.
ఇటువంటి
పుణ్యభూమి,
త్యాగభూమి,
యోగభూమి
అయిన
భారతభూమిలో
పుట్టిన
మీకు
ఎందుకీ
త్యాగము
రావటం
లేదు?
మీరు
భారతపుత్రులు.
మీరు
భారతీయులుగా
జీవించడానికి
ప్రయత్నించండి.
ఇతరులకు
ఆదర్శము
నిరూపించండి.
ఇతరులకు
ఆనందమునందించండి.
ఇదియే
ఈనాటి
ఆనందము.
ఈనాడు
మీరు
పంచుకోవలసిన
ఆనందము
ఈ
దేహమునకు
పుట్టిన
దినమే
గానీ
నాకు
పుట్టిన
దినము
లేదు.
మీరందరూ
రావటం
చేత,
ఆశించడం
చేత
Birthday
మాదిరి
భావిస్తున్నాను.
నాకు
ఈ
Birthday
కాదు
ముఖ్యం.
17
▾
Meaning
Keep
మీరందరూ
ఆనందముగా
ఉన్న
దినమే
నా
Birthday.
ఇట్టి
ఆనందాన్ని
నేను
ఆశిస్తున్నాను.
ఇట్టి
ప్రేమతత్త్వాన్ని,
త్యాగతత్త్వాన్ని
నేను
ఆశిస్తున్నాను.
నాకు
ఏమీ
అక్కరలేదు.
మీరు
త్యాగులై,
మీరు
ఆనందమయులై,
యోగులై,
తగిన
దివ్యత్వమును
అనుభవించినపుడు
అదే
నా
ఆనందము.
మీరందరు
శాంతి
భద్రతలతో
జీవితాన్ని
ఆదర్శంగా
చూపించాలని
నేను
ఆశిస్తున్నాను.
ఈవిధమైన
దివ్యమైన
పవిత్రమైన
దినమునందు
మీరందరూ
ఉత్తమభావాలు
హృదయములో
నిలుపుకోవాలి.
దైవనామాన్ని
ఒక్కసారి
స్మరించండి.
Previous
←
The Education of Bhārata Is What Develops the Divine Human Principle
Next
The Man Who Has Shed Ahaṅkāra and Mamakāra Is Full of Ānanda
→