Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 2003 · Develop a feeling of brotherhood towards all
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Develop a feeling of brotherhood towards all
17 October 2003, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
His poems 498
Also in his talks
(14)
22 June 1996
Service to Society Is the Mark of True Humanness
19 October 1996
When the Home Is Set Right, the World Is Set Right
19 April 1998
The holy power of woman is the very safeguard of Bhārata
19 November 1998
Women Alone Are the Root Cause of Bhārata's Greatness
3 December 1998
Man Alone Is Supremely Precious, Above All the Riches of the World
11 August 2000
Only When There Is Purity of Mind Is There Success
19 November 2001
Only when parents are ideal do children become virtuous
19 November 2002
Setting the Home in Order: The Housewife's First Duty
6 May 2006
If you love your parents, the whole world will love you
9 August 2006
The Ati Rudra, supremely powerful
1 October 2006
‘Dharma protects those who protect it’
27 March 2007
Your very heart is Rāma's temple
12 September 2008
Complete sacrifice alone is the stairway to immortality
22 November 2008
The duty of guarding the wealth of Dharma of Mother Bhārata is yours!
గత
జీవుడగు
పతిన్
బ్రతికించుకొన్నట్టి
సావిత్రి
భారత
సతియె
కాదె
తన
సత్యమహిమచే
దావాగ్ని
చల్లార్చె
చంద్రమతి
పవిత్ర
పడతి
కాదె
కులసతీత్వమునకై
గుండాన
దూకిన
సీత
భారత
ధరాజాత
గాదె
కినిసి
దుర్మద
కిరాతుని
బూది
గావించె
దమయంతి
భారత
రమణి
గాదె
సత్వసాగర
పరివేష్టితోర్వితలము
భరతజాతి
పాతివ్రత్య
ప్రవిమలంబు
భావసంపద
కిది
మహా
పంటభూమి
అఖిల
దేశాల
కిది
ఉపాధ్యాయి
కాదె
ప్రేమస్వరూపులైన
విద్యార్థులారా!
విద్యార్థినులారా!
మానవత్వమునందు
మహత్తరమైన
శక్తులు
అనంతమైనటువంటివిగా
ఉన్నాయి.
కాని,
మానవుడు
ఏమీ
తెలియని
అజ్ఞానివలె
జీవిస్తున్నాడు.
కొంతమంది
యందున్న
మహత్తరశక్తులు
బహిర్ముఖమౌతుంటాయి.
కాని,
కొందరి
యందు
అవి
అంతర్ముఖంగానే
నిలిచి
ఉంటాయి.
మానవత్వములో
ఉన్న
దివ్యత్వమును
గుర్తించుకోవడానికి
ప్రతి
వ్యక్తి
ప్రయత్నించాలి.
మానవత్వము
ఒక
పవిత్రమైన
ఆదర్శమును
అందించే
నిమిత్తం
ఏర్పడింది.
తనయందు
మహత్తరమైన
శక్తులు
ఉండినప్పటికీ
మానవుడు
ఏమీ
తెలియనివానివలె
గోచరిస్తూ
ఉంటాడు.
అట్టి
దివ్యశక్తులలో
ఒక
శక్తి
జానకిరామయ్య.
ఈ
దేహముకంటే
తాను
రెండున్నర
సంవత్సరములు
చిన్నవాడు.
వయస్సులో
చిన్నవాడైనప్పటికీ
రాజకీయ
రంగములో
మహా
ఆరితేరినవాడు.
ఉన్నది
ఉన్నట్లు
నిర్మొహమాటంగా
చెప్పే
స్వభావం
అతనిది.
“రామయ్యా!
అట్లా
దుడుకుతనంగా
మాట్లాడ
కూడదు.
ఎవరియందు
ఏవిధమైన
శక్తి
ఉన్నదో
నీకు
తెలియదు.
కనుక,
నీవు
నాలుకను
అదుపులో
ఉంచుకో,”
అని
నేను
మధ్యమధ్య
చెబుతూ
ఉండేవాడిని.
మాటలు
కఠినంగా
చెప్పేవాడేగాని,
అతని
హృదయము
మాత్రం
చాలా
చల్లనైనది.
లక్ష్మణుడు
యుద్ధములో
మూర్ఛిల్లినప్పుడు
రాముడు,
“సుగ్రీవా!
లోకములో
వెతికితే
నాకు
సీతవంటి
భార్యయైనా
దొరకవచ్చు.
కౌసల్యవంటి
మాతృదేవత
కూడా
లభించవచ్చు.
కాని,
ఎంత
వెతికినా
లక్ష్మణునివంటి
సోదరుడు
లభించడు,”
అని
చెప్పాడు.
ఈరీతిగా,
రాముడు
తన
సోదరుని
ప్రేమతత్త్వాన్ని
ఎంతో
వర్ణిస్తూ
వచ్చాడు.
ఇటువంటి
అన్నదమ్ములు,
అక్కచెల్లెండ్రు,
తల్లిదండ్రులు
అనేక
కుటుంబాలలో
ఉత్తమ
ఆదర్శాలను
నిరూపిస్తూ
వచ్చారు.
ఇట్టి
ఆదర్శవంతులైన
సోదరులు
ఈనాడు
లోకంలో
ఉన్నారా,
అని
మీరు
సందేహించ
నక్కర్లేదు.
ఎందరో
ఉన్నారు.
తాత్కాలికంగా
అభిప్రాయ
భేదములుండినప్పటికీ
ఒకరినొకరు
నిరంతరం
ప్రేమిస్తూనే
ఉంటారు.
ముఖ్యంగా
మానవుడు
చేయవలసింది
ఏమిటి?
సర్వమానవులయందున్న
ఆత్మతత్త్వాన్ని
చక్కగా
చవిచూడాలి.
ఆత్మయొక్క
మాధుర్యము
మరి
యెందునూ
కానరాదు.
ఆత్మతత్త్వము
ఆకారము
లేనటువంటిది.
ఆ
నిరాకారతత్త్వమునందే
నిండు
ప్రేమ
మిళితమై
ఉంటుంది.
అట్టి
ఆత్మతత్త్వాన్ని
ప్రతి
మానవుడూ
గుర్తించవలసిన
అవసరమున్నది.
మానవత్వములో
ఉన్న
దివ్యత్వాన్ని
గుర్తించినటువంటివాడే
నిజమైన
మానవుడు.
వ్యక్తిగతమైన
తత్త్వమును
నిరూపించడానికి
వీలౌతుందిగాని,
ఆత్మతత్త్వాన్ని
ఎవ్వరూ
నిరూపించలేరు.
ఆత్మతత్త్వాన్ని
గుర్తించడానికి
రామాయణంలో
అన్నదమ్ములే
ఆదర్శప్రాయులు.
ఒకనాడు
రామలక్ష్మణభరతశత్రుఘ్నులు
నల్గురూ
కలసి
బంతి
ఆట
ఆడుకుంటున్న
సమయంలో
భరతుడు
పరుగెత్తుకుంటూ
వచ్చి
కౌసల్య
ఒడిలో
కూర్చున్నాడు.
అతడు
చాలా
విచారంగా
ఉండడం
చూసి,
“భరతా!
ఎందుకింత
విచారంగా
ఉన్నావు?”
అని
ప్రశ్నించగా,
“అమ్మా!
ఆటలో
నన్ను
గెలిపించే
నిమిత్తం
రాముడు
ఉద్దేశపూర్వకంగా
ఓడిపోయాడు,”
అని
చెప్పాడు.
2
▾
Meaning
Keep
ఆ
అన్నదమ్ములు
నల్గురూ
అట్టి
అన్యోన్యతను,
ఆప్యాయతను,
ఆనందమును
అనుభవిస్తూ
వచ్చారు.
“అమ్మా!
రాముడు
మమ్మల్ని
ఎంతో
ఆప్యాయంగా
చూసుకుంటున్నాడు.
రాముని
వంటి
అన్న
మాకు
ఎక్కడా
లభించడు,”
అని
లక్ష్మణ,
భరత,
శత్రుఘ్నులు
తమ
తల్లులతో
చెప్తూ
ఉండేవారు.
వారు
నిరంతరం
రామునికి
సన్నిహితంగా
ఉండి,
రాముని
ఆప్యాయతను,
ఆనందమును
అందుకొని
అతనికి
సేవలు
చేయాలని
ఆశించేవారు.
అటువంటి
ఆదర్శప్రాయులైన
సోదరులు
ఈనాటికీ
ఉన్నారు.
కాని,
ఈనాడు
లోకము
వారికి
తగిన
ఉత్సాహ
ప్రోత్సాహములనందించడం
లేదు.
మన
సంస్థలు
సోదరత్వాన్ని
పెంపొందించాలి.
‘సోదరులు’
అనే
మాట
కేవలం
నోటికి
పరిమితం
కాకూడదు;
ప్రవర్తనలో
నిరూపించబడాలి.
ఆదర్శ
సోదర
ప్రేమను
ప్రపంచమునకు
వ్యాప్తిగావించినవాడు
రాముడు.
అరణ్యవాసము
చేస్తున్న
సమయంలో
లక్ష్మణుడు
ఒక్క
క్షణమైనా
కనిపించకపోతే
రాముడు
ఎంతో
ఆందోళన
చెందేవాడు.
సోదరులనగా
ఎవరు?
దేహములు
వేరైనా
ప్రాణము
ఒకటిగా
ఉండాలి.
ఇటువంటి
సోదరులు
భారత
దేశంలో
ఆనాడే
కాదు,
ఈనాడు
కూడా
ఉన్నారు.
కాని,
వారు
మార్గ
దర్శకులై
ఇతరులకు
తమ
ఉత్తమ
భావాలను
అందించలేకపోతున్నారు.
ప్రేమతత్త్వాన్ని
పరస్పరం
పంచుకున్నప్పుడే
మానవత్వములోని
దివ్యత్వము
చక్కగా
అర్థమౌతుంది.
ఈనాటి
విద్యార్థులు
కేవలం
ఉన్నతమైన
పదవులను
అందుకునే
నిమిత్తమై
చదువులు
చదువుతున్నారేగాని,
ఉన్నతమైన
ఆదర్శమును,
ప్రేమను
అందించుటకు
ఎవ్వరూ
ముందంజ
వేయుట
లేదు.
విద్యార్థులలో
ముఖ్యముగా
ఉండవలసిన
లక్షణమేమిటి?
“మనస్యేకం
వచస్యేకం
కర్మణ్యేకం
మహాత్మనాం.”
మనసు,
మాట,
క్రియలు
ఒక్కటిగా
ఉండాలి.
మాటలు
తీయగా
ఉండి
మనసు
చేదుగా
ఉంటే
ప్రయోజనం
లేదు.
మనసు,
మాట,
క్రియలు
అన్నీ
మాధుర్యంతో
నిండి
ఉండాలి.
ఇదే
మానవత్వానికి
నిజమైన
చిహ్నం.
ది
ప్రోపర్
స్టడీ
ఆఫ్
మేన్కైండ్
ఈజ్
మేన్..
కాని,
ఆ
మేన్కైండ్
ఇప్పుడు
కనిపించడం
లేదు.
మానవుడు
సాటి
మానవుని
గౌరవిస్తున్నాడేమోగాని,
ప్రేమతత్త్వాన్ని,
అన్యోన్యతను,
ఆనందాన్ని
పరస్పరం
పంచుకోవడం
లేదు.
మానవునిలో
ఉండవలసిన
విలువలు
ఎక్కడా
కనిపించడం
లేదు.
మేన్కైండ్
(మానవజాతి)
అని
చెప్పుకుంటారేగాని,
లోపల
ఉన్నది
వట్టి
మంకీమైండ్
(కోతిబుద్ధి).
ఇలాంటి
మానవునిలో
మానవత్వము
ఏరీతిగా
వికసిస్తుంది?
అందరూ
మన
సోదరీసోదరులేనని
భావించాలి.
అట్టి
ఏకత్వమును
గుర్తించినప్పుడే
మనం
నిజంగా
మానవులమని
చెప్పుకోవచ్చు.
ఈ
ఏకత్వము
ఏనాడు
లోపిస్తుందో
అప్పుడే
శతృత్వము
ఏర్పడుతుంది.
శత్రుత్వముతోపాటు
ద్వేషము
కూడా
ఆవిర్భవిస్తుంది.
ద్వేషమువలన
మానవునిలోని
ప్రేమ
తత్త్వము
నశించిపోతుంది.
కనుక,
మానవుడు
తనయందున్న
ప్రేమతత్త్వాన్ని
ప్రతి
వ్యక్తికి
పంచడానికి
ప్రయత్నించాలి.
అప్పుడే
బ్రదర్హుడ్
ఆఫ్
మేన్
(మానవ
సౌభ్రాతృత్వము)
విలసిల్లుతుంది.
కాని,
ఈనాడు
బ్రదర్హుడ్
ఆఫ్
మేన్,
ఫాదర్హుడ్
ఆఫ్
గాడ్
(మానవ
సౌభ్రాతృత్వము,
దైవపితృత్వము)
ఆచరణలో
ఎక్కడా
కనిపించడం
లేదు.
సౌభ్రాతృత్వమును
అలవర్చుకుని,
ఆచరణలో
పెట్టి,
ఆనందాన్ని
అనుభవించాలి.
ఈవిధమైన
ఏకత్వమును
మనం
ఏనాడు
సాధిస్తామో
ఆనాడే
మన
భారతదేశము
గొప్ప
ఆదర్శవంతమైన
దేశముగా
రూపొందుతుంది.
కేవలం
సోదరులలోనే
కాదు,
సతీపతులయందు
కూడా
అట్టి
ఏకత్వము
ఆవిర్భవించాలి.
ఈనాడు
చూడండి,
డా
॥
పిళ్ళై
తన
భార్యపైనున్న
ప్రేమచేత
ఆమె
జ్ఞాపకార్థం
ఇక్కడొక
వైద్యసంస్థను
ప్రారంభించాలని
ఆశిస్తున్నాడు.
ఈ
పిళ్ళై
నిన్ననో,
నేడో
వచ్చినటువంటివాడు
కాడు.
గత
ముప్ఫై
సంవత్సరములనుండి
తాను
స్వామిసన్నిధికి
వస్తూ
ఉన్నాడు.
ఆయన
భార్య
చాలా
ఉత్తమురాలు.
చిరునవ్వులు
చిందే
మోముతో
మృదుమధురంగా
సంభాషించేది.
ఇటువంటి
ఆదర్శప్రాయులైన
స్త్రీలు
భారత
దేశంలో
ఎందరో
ఉన్నారు.
వారివల్లనే
దేశము
నిత్యకళ్యాణం
పచ్చతోరణంగా
కళకళలాడుతూ
ఉన్నది.
ఈనాటి
విద్యావంతులు
విదేశాలలో
గొప్ప
ఆనందము
దొరుకుతుందని
భావించి
పవిత్రమైన
భారతదేశాన్ని
వదలిపెట్టి
విదేశాలకు
పోతున్నారు.
భారత
దేశంలో
లభించని
ఆనందము
మరి
యే
దేశంలోనూ
మనకి
లభించదు.
“ఎన్న
భారతే
తన్న
భారత.”
భారత
దేశంలో
లేనటువంటిది
మరి
యే
దేశంలోను
కానరాదు.
కనుకనే,
ఇన్ని
వేల
సంవత్సరములనుండి
భారతదేశము
అన్ని
దేశములతోనూ
కలసిమెలసి
కలతలు
లేకుండా
చెలిమితో
జీవిస్తూ
ఉన్నది.
3
▾
Meaning
Keep
Also in his talks
(16)
19 June 1973
Friendship: Its Real Principle
3 September 1988
The body itself is a temple!
17 October 1988
To Attain God, the Embodiment of Prema, We Must Make Prema Itself Our Support
28 June 1989
All the World Is Filled with Brahman
28 October 1989
Prema Itself Is God
20 October 1990
The day that wrought the great change
24 May 1991
Isaavaasya Upanishad - Renunciation And Pleasure
21 August 1996
The Five Elements Are the Very Forms of the Paramātma
21 October 1996
In God's Creation Everything Is Pure!
25 August 1997
Mamaivāṁśo jīvaloke...
17 April 1998
Desires are the root of unrest
21 April 1998
The body itself is foremost for the practice of Dharma
14 August 1998
Prema Alone Is the Path, Prema Alone the Goal
27 September 1998
Ānanda Alone Is Man's Own Home
1 January 2000
Virtue is the adornment of man
15 April 2004
The principle of Prema is Divinity itself
భారతీయులు
పర
దేశస్థులకు
కూడా
తమ
ప్రేమను
పంచుతూ
వచ్చారు.
అందరినీ
సోదర
సోదరీమణులుగా
భావించి
ప్రేమతో
చూసుకుంటూ
వచ్చారు.
మానవ
సౌభ్రాతృత్వము,
దైవపితృత్వము...
ఈ
రెండింటినీ
అనుభవించినటువంటివారు
భారతీయులు
మాత్రమే.
కనుకనే,
పరాయి
దేశస్థులు
భారతదేశముపై
ఎన్నిసార్లు
దండెత్తినప్పటికీ
భారతీయుల
ప్రేమ
ఏమాత్రం
చెక్కుచెదరలేదు,
కట్టుకదలలేదు.
మానవత్వమునకు
ప్రేమయే
ప్రధానమైన
చిహ్నము.
ప్రేమవల్లనే
మానవత్వమునకు
ఇంత
విలువ
ఏర్పడింది.
ప్రేమ
తత్త్వమును
చాటే
నిమిత్తమై
పరమాత్ముడుకూడా
ఈ
జగత్తులో
అవతరిస్తున్నాడు.
ఒక్క
ప్రేమను
మన
హృదయములో
పెట్టుకున్నామంటే
యావత్
జగత్తూ
మన
హస్తగతమైపోతుంది.
మీలో
ప్రేమ
ఉన్నది.
కాని,
దానిని
ప్రకటించవలసిన
విధానం
తెలియక
పొరపాటుపడుతున్నారు.
విద్యార్థులారా!
మీరు
ఎన్నో
గ్రంథాలు
చదువుతున్నారు.
ఎన్నో
చరిత్రలు
పఠిస్తున్నారు.
కాని,
శ్రీరాముని
చరిత్రను
ఏమాత్రము
పఠించారు?
రామలక్ష్మణ
భరతశత్రుఘ్నుల
ఆదర్శ
సోదరప్రేమను
మీరు
ఏమైనా
గుర్తించారా?
మొట్టమొదట
మీరు
అందరి
పట్ల
సోదరభావాన్ని
పెంచుకోండి.
మిమ్మల్ని
ద్వేషించే
వ్యక్తిని
సహితం
ప్రేమించండి.
అతడు
మీకు
కనిపించినప్పుడు,
‘సోదరా,
ఎలా
ఉన్నావు?’
అని
ప్రేమతో
పలుకరించండి.
‘సోదరా’
అని
మీరు
సంబోధించినప్పుడు
వాడిలోని
ద్వేషము
కరిగి
నీరై
ప్రవహిస్తుంది.
కనుక,
ప్రేమభావమును
ఆవిర్భవింపజేసుకోండి.
ప్రేమబలమును
పెంచుకోండి.
ప్రేమతో
సాధించలేనిది
ఈ
జగత్తులో
ఏదీ
లేదు.
ప్రేమను
అనుభవించడం
చేతకాక
మీరు
దానిని
మానవత్వానికి
విరుద్ధమైన
మార్గంలో
ప్రవేశపెట్టి
నిరర్థకం
గావిస్తున్నారు.
ప్రేమను
‘వేస్ట్’
చేయడం
మీకు
మంచి
‘టేస్ట్’గా
కనిపిస్తున్నది.
ప్రేమయే
ప్రధానమైన
శక్తి.
ప్రేమయే
ప్రధానమైన
మానవతా
విలువ.
ప్రేమను
హృదయంలో
నింపుకున్నప్పుడు
ప్రపంచంలో
అందరూ
మీకు
సోదరీసోదరులుగా
మారిపోతారు.
మీకు
విరుద్ధమైన
వ్యక్తులే
కానరారు.
కనుకనే,
గోపికలు
కృష్ణుని
ఈరీతిగా
ప్రార్థించారు.
“ప్రేమరహిత
మరుభూములలో
ప్రేమాంకురములు
పెంపొంద
ప్రేమావేశముతో
ప్రేమసుధావర్షము
వర్షింపగ
ప్రేమనదులు
ప్రవహింపగ
మురళీగానము
సేయగదె!
కృష్ణా!
గానము
సేయగదె!”
ప్రేమస్వరూపులారా!
మీరందరూ
ప్రేమమయులే!
మీ
ప్రేమను
ప్రవహింప
జేయండి.
ప్రేమయే
మీ
ప్రాణముగా
విశ్వసించండి.
ఇదియే
మీ
ప్రధాన
కర్తవ్యము.
మీరు
ఇంతమంది
వ్యక్తులు
ఇక్కడ
ఏవిధంగా
చేరారు?
మీ
అందరినీ
నా
ప్రేమ
ఆకర్షించింది.
అదే
దివ్యమైన
అయస్కాంత
శక్తి.
ఈ
‘మ్యాగ్నెటు’తో
చేరినప్పుడు
మీరు
కూడా
ప్రేమమయులుగా
మారిపోతారు.
రామాయణము
నందు
గాని,
మహాభారతమునందుగాని,
భగవద్గీతయందు
గాని,
ఖురానుయందు
గాని
ఎందుచూసినా
ప్రేమయే
ప్రధానముగా
కనిపిస్తుంది.
ప్రేమకన్న
వేరే
సంపాదించవలసిన
ఆస్తి
లేదు.
ప్రేమస్వరూపుడైన
భగవంతుణ్ణి
ప్రేమతోనే
వశము
చేసుకోవడానికి
వీలౌతుంది.
ప్రేమస్వరూపులైన
విద్యార్థులారా!
మీలో
చదువు
కన్న
ముఖ్యముగా
ప్రేమ
ఉండాలి.
లవ్
ఈజ్
లైఫ్
ఇంతేకాదు.
లవ్
ఈజ్
లైట్
కూడా.
ప్రేమ
జ్యోతియే
మీకు
దారి
చూపుతుంది.
అంధకార
బంధురమైన
ఈ
జీవితారణ్యములో
ప్రేమజ్యోతిని
హస్తములో
ఉంచుకొని
ప్రయాణము
చేయండి.
ఎంత
దూరము
ప్రయాణము
చేసినప్పటికీ
చీకటి
మీ
చెంతకు
రాదు.
లవ్
ఈజ్
గాడ్.
లివ్
ఇన్
లవ్.
ఇదియే
ఈనాడు
మీరు
నేర్చుకోవలసింది.
ప్రేమయే
పరమాత్మ
అని
మీరు
అంటున్నారు.
కాని,
ప్రేమతో
జీవించడం
లేదు.
మీ
అరికాలు
మొదలుకొని
తలవరకు
ఒక్క
ప్రేమయే
ప్రసరిస్తూ
ఉండాలి.
ఈరోజు
సి.
శ్రీనివాస్,
ప్రస్తుత
వైస్
ఛాన్స్లర్,
మాజీ
వైస్
ఛాన్స్లర్...
వీరందరూ
హృదయంలో
ప్రేమను
నింపుకొని
మాట్లాడినారు.
వీరు
మీ
హృదయములో
ప్రేమగంటలను
మ్రోగిస్తున్నారు.
కాని,
ఆ
దివ్యనాదమును
మీరు
ఏమాత్రము
చెవులకు
అందించడం
లేదు.
ప్రేమనాదమును
విన్నంతనే
మీరు
మైమరచిపోవాలి,
అందులో
లీనమైపోవాలి.
4
▾
Meaning
Keep
మీరెన్నో
చదువులు
చదువుతున్నారు.
ఎన్నో
దేశములు
ప్రయాణం
చేస్తున్నారు.
కాని,
ప్రేమ
విలువను
కించిత్తైనా
మీరు
గుర్తించడానికి
ప్రయత్నం
చేయడం
లేదు.
ప్రేమను
రుచి
చూసినప్పుడు
మీకు
జగత్తంతా
ఒకే
కుటుంబంగా
కనిపిస్తుంది.
ప్రేమనుండియే
సత్యధర్మములు
ఆవిర్భవిస్తాయి.
“సత్యం
వద,
ధర్మం
చర.”
దీనికి
ప్రేమయే
ఆధారం.
ప్రేమప్రవాహములో
మీరు
మునగండి.
ప్రేమలో
మీరు
తన్మయులు
కండి.
ప్రేమకంటె
మించిన
చదువు
మరొకటి
లేదు.
మీరు
ఎన్నో
గ్రంథాలు
చదువుతున్నారు.
కాని,
వాటినుండి
వచ్చిన
ఫలిత
మేమిటి?
చాలామంది
పిల్లలు
పుస్తకము
చేత్తో
పట్టుకుంటున్నారు
గాని,
మస్తకము
నిండా
మట్టి
ఉంటున్నది.
ఈ
మట్టిని
పెంచుకోవడంచేతనే
మానవులుగా
కాక
పిచ్చివారుగా
తయారౌతున్నారు.
మొట్టమొదట
మీ
మస్తకములో
ప్రేమను
నింపుకోండి.
ప్రేమను
భుజించండి.
కేవలం
భుజించినంత
మాత్రమున
ప్రయోజనం
లేదు.
దానిని
జీర్ణించుకోవాలి.
అప్పుడే
ప్రేమరసము
మీ
నరనరములలోను
ప్రయాణం
చేసి
మీకు
శక్తిని,
జ్ఞానమును
ప్రసాదిస్తుంది.
విద్యార్థులారా!
ఈనాడు
ఎడ్యుకేషన్
(విద్య)
అంటున్నారేగాని,
అది
కేవలం
ఏజిటేషన్
(ఆందోళన)కు
దారి
తీస్తున్నది.
ప్రేమను
భుజించి,
జీర్ణించుకోవాలి.
అదే
నిజమైన
విద్య.
మీరందరూ
ప్రేమమయులే!
ప్రేమస్వరూపులే!
మీయందలి
ప్రేమ
మీకు
కనిపించడం
లేదేమోగాని,
నాకు
మాత్రం
కనిపిస్తున్నది.
మీయందు
ప్రేమ
ఉట్టిపడుతున్నది.
ఆ
ప్రేమతత్త్వాన్ని
మీరు
గుర్తించి
వర్తించడం
లేదు.
మున్ముందు
రామతత్త్వము
చాలా
గొప్పగా
ప్రచారమౌతుంది.
రామాయణము
మీ
జీవితాలను
నింపుతుంది.
విద్యార్థులారా!
చాలాసేపు
మాట్లాడి
మిమ్మల్ని
ఇబ్బంది
కలిగించానేమో!
ఐతే,
ఇది
మీకు
ఇబ్బంది
కానే
కాదు.
ఇంతకంటె
మించిన
ప్రేమతత్త్వము
మీకు
మరి
యెక్కడా
లభించదు.
దినదినమునకూ
మీకు
ప్రేమను
అధికంగా
అందిస్తాను.
నాకు
అంతకంటె
వేరే
పని
యేమీ
లేదు.
మీలో
ప్రేమను
నింపడమే
నా
పని.
Previous
←
I am not the body; I am the embodiment of Prema
Next
Restore the ancient culture!
→