Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 2008 · Remembering the Name is the way across
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Remembering the Name is the way across
24 May 2008, Brindavan
1
▾
Meaning
Keep
Also in his talks
(27)
5 September 1987
Today satsaṅga is what man needs most urgently
5 October 1992
What man must seek is real, eternal happiness
23 November 1997
The God who fills everything is ‘I’
5 April 1998
Who can recognise the principle of Śrī Rāma
14 April 1998
God pervades all
26 September 1998
God Is the Very Foundation of the World
28 September 1998
The Five Elements Are the Very Forms of the Paramātma
11 October 1998
Human Life Is the Fruit of Our Resolves
21 November 1999
No sādhana greater than service
26 March 2001
The principle that is the root and base
23 November 2001
Self-confidence is the very stairway to Ānanda
25 December 2001
Though faiths differ, Mādhava is one
16 March 2003
The principle of Prema: the divine power of attraction
21 March 2004
I am you, you are I
11 April 2004
Truth itself is the form of God
15 April 2004
The principle of Prema is Divinity itself
17 October 2004
Develop the Feeling of the One Ātma
22 November 2004
Only When Oneness Is Experienced Does Human Birth Find Its Fulfilment
25 December 2004
Pray for the Sake of God's Prema
8 March 2005
Śivatva is the very consciousness in all beings
23 November 2005
All Are Embodiments of God
26 February 2006
All is full of Brahman
30 March 2006
See only good, do only good, be good
14 April 2006
Fix your mind on Divinity; place your trust in Oneness
2 May 2006
The body itself is the temple; you yourself are God
11 August 2006
Divinity is attained only through Prema for God
13 April 2008
The Name of Rāma is best; the thought of Rāma is enough
దివ్యాత్మస్వరూపులారా!
అనాదికాలమునుండి
మన
భారతదేశమునందు
ఎందరో
భగవంతుణ్ని
చేరే
నిమిత్తమై
యజ్ఞయాగాదులు,
జప,
తప,
ధ్యానములు
చేస్తూ
వచ్చారు.
యజ్ఞయాగాది
క్రతువులద్వారా,
జప,
తప,
ధ్యానములద్వారా
భగవంతుడు
లభించునని
వారి
నమ్మకం.
ఈనాడు
పామరులు
మొదలుకొని
పరమహంసల
వరకు
అందరూ
యజ్ఞయాగాదులతో
తృప్తిపడుతున్నారు.
కాని,
భగవంతుని
సంకల్పమును
ఎవ్వరూ
గుర్తించలేరు.
భగవంతుడు
‘ఇట్టివాడు,
అట్టివాడు’
అని
వర్ణించడానికి
ఎవ్వరికీ
సాధ్యం
కాదు.
భగవంతుడు
సర్వత్రా
ఉంటున్నాడు.
సర్వతః
పాణి
పాదం
తత్సర్వతోక్షి
శిరో
ముఖం
సర్వతః
శ్రుతిమల్లోకే
సర్వమావృత్య
తిష్ఠతి
అనేక
ముఖములు,
అనేక
చెవులు,
అనేక
చేతులు,
అనేక
కాళ్ళతో
భగవంతుడు
అంతటా
వ్యాపించి
ఉన్నాడు.
అన్నింటియందు
భగవంతుడే
ఉన్నాడు.
అట్టి
భగవంతుడు
యజ్ఞయాగములచేతనో,
లేక
జప,
తప,
ధ్యానములచేతనో
లభించేవాడు
కాదు.
“సర్వజీవ
నమస్కారం
కేశవం
ప్రతిగచ్ఛతి”,
ఎవరికి
మనం
నమస్కారం
చేసినప్పటికీ
అది
భగవంతునికే
చేరుతుంది.
కాని,
ఇట్టి
సూక్ష్మమైనటువంటి
మర్మాన్ని
మానవుడు
గుర్తించుకోలేకపోతున్నాడు.
మానవుని
బలహీనత
అంత
తీవ్రంగా
ఉన్నది.
కేవలం
ఐహిక
సుఖాలతో
తృప్తిపడుతూ
తాను
నైతిక,
ఆధ్యాత్మిక
విషయములపట్ల
ఏమాత్రము
శ్రద్ధ
వహించడం
లేదు.
ఇటువంటి
పరిస్థితిలో
తాను
దివ్యత్వాన్ని
ఏరీతిగా
సాధించగలడు?
భగవంతునికి
కేవలం
నైతికము,
ఆధ్యాత్మికము
ఈ
రెండే
చాలు.
కాని,
ఈనాడు
మానవుడు
నైతిక,
ఆధ్యాత్మికములను
వదలిపెట్టి
ధనంకోసం
అనేకరకములైన
అవస్థలు
పడుతున్నాడు.
ఇది
అన్నింటికంటే
గొప్ప
అజ్ఞానం.
ఈ
అజ్ఞానము
పోయేంతవరకు
భగవంతుడు
మనకు
అర్థం
కాడు.
2
▾
Meaning
Keep
‘నేను’
అనే
అహంకారము,
‘నాది’
అనే
మమకారము
ఉండినంతవరకు
మానవుని
హృదయానికి
భగవత్
తత్త్వము
చేరదు.
భగవంతుణ్ని
గుర్తించడానికి
ఏమి
చేయాలి?
పూర్వం
అనేకమంది
యజ్ఞయాగాది
క్రతువులుచేసి
భగవంతుణ్ని
ప్రత్యక్షం
గావించుకోవాలని
ప్రయత్నం
చేశారు.
కాని,
ఎవ్వరికీ
సాధ్యం
కాలేదు.
ఐతే,
భగవంతుణ్ని
ప్రత్యక్షం
గావించుకోవడం
ఎలా
సాధ్యమవుతుంది?
భగవంతుడు
నిత్యుడు,
నిరంజనుడు,
అనంతుడు,
అమృతస్వరూపుడు.
అట్టి
భగవంతుణ్ని
ఏరీతిగానూ
అర్థం
చేసుకోవడానికి
ఎవ్వరికీ
సాధ్యం
కాదు.
“భగవంతుడు
నాకు
ధ్యానంలో
కనిపించాడు,
యజ్ఞంలో
కనిపించాడు”
అని
కొందరు
భావిస్తారు.
ఇది
కేవలం
వారి
భ్రమనే.
ఏదో
దర్శనం
లభించినప్పటికీ
అదికూడా
అశాశ్వతమే.
భగవంతుడు
ఎక్కడ
ఉన్నాడు?
సర్వుల
హృదయంలో
తాను
ఆత్మస్వరూపుడై
ఉన్నాడు.
అట్టి
ఆత్మస్వరూపుణ్ని
ఆత్మచేతనే
కనుగొనాలి;
ఊరకే
అనేక
నామములు,
రూపములు
కల్పించడం
సరియైనది
కాదు.
రాళ్ళను
నీళ్ళపై
తేల్చిన
రామనామం
రాముడు
లంకను
చేరి,
రావణుని
హతమార్చి,
సీతను
గొనివచ్చే
నిమిత్తం
సముద్రంపై
వారధి
నిర్మించాలని
సంకల్పించుకున్నాడు.
హనుమంతుడు,
జాంబవంతుడు
మొదలైన
వానర
వీరులు,
“స్వామీ,
ఒక్క
నిమిషంలో
మేము
వారధి
నిర్మిస్తాం”,
అన్నారు.
వానరులు
వెళ్ళి
కొండలనుండి
పెద్దపెద్ద
బండరాళ్ళను
పెకలించుకొని
తెచ్చి
సముద్రంలో
వేశారు.
కాని,
అవన్నీ
మునిగిపోయాయి.
అప్పుడు
లక్ష్మణుడు
రామునితో,
“అన్నా!
ఈ
జగత్తులో
సృష్టింపబడిన
సమస్త
పదార్థములుకూడను
ఏదో
ఒకనాటికి
నాశనమయ్యేటటువంటివే;
నదులుకూడను
ఎండిపోయేటటువంటివే;
మానవ
శరీరముకూడను
రాలిపోయేటటువంటిదే.
పర్వతములుకూడను
మునిగిపోయేటటువంటివే;
మునిగిపోనటువంటిది
ఒక్కటే
ఉన్నది.
అదియే
నీ
నామము.
అది
సత్యమైనది,
నిత్యమైనది.
దానిని
ఆధారం
చేసుకొని
వారధిని
నిర్మిస్తే
అది
తప్పకుండా
నిలుస్తుంది”
అని
అన్నాడు.
రాముడు
లక్ష్మణుని
వీపు
తట్టి,
“లక్ష్మణా!
నీవు
సరియైన
ఉపాయం
చెప్పావు”
అని
అన్నాడు.
హనుమంతుడు,
“స్వామీ!
ఆ
పని
మేము
చేయగలము”
అని
అన్నాడు.
అప్పుడు
ఒక్కొక్క
వానరుడు
తెచ్చిన
రాయిమీద
‘రామ’
అని
రాసి
సముద్రంలో
వేశారు.
3
▾
Meaning
Keep
రామనామ
దివ్య
మహిమచేత
ఆ
రాళ్ళన్నీ
సముద్రంలో
మునిగిపోకుండా
పైకి
తేలినాయి
కాని,
అలల
తాకిడికి
ఒక్కొక్క
రాయి
ఒక్కొక్కవైపుకు
కొట్టుకొని
పోసాగింది.
అన్ని
రాళ్ళూ
ఒకదానితో
ఒకటి
చేరితేనే
కదా
వారధి
ఏర్పడేది!
అందుచేత
వానరులు
ఒకే
రాయిమీద
‘రామ’
అని
రాయకుండా
ఒకదానిపైన
‘రా’
అనీ,
మరొకదానిపైన
‘మ’
అనీ
రాసి
భక్తి
శ్రద్ధలతో
సముద్రంలో
వేశారు.
అప్పుడా
రాళ్ళన్నీ
ఎక్కడెక్కడో
కొట్టుకొనిపోకుండా
ఒకదానితో
ఒకటి
చేరి
వంతెనగా
ఏర్పడ్డాయి.
నిన్ను
మునిగిపోకుండా
కాపాడేది
నామమొక్కటే!
ఆ
రాళ్లు
నీటిపై
తేలడానికి
ఆధారమేమిటి?
రామనామమే!
‘రామ’
అనే
రెండక్షరములే
ఆ
రాళ్లను
నీటిపై
నిల్పినాయి.
ఆ
నామమయమైన
వంతెనను
ఆధారం
చేసుకొని
రాముడు
లంకకు
వెళ్లి
రావణుని
వధించాడు.
నామమే
సత్యము,
నామమే
నిత్యమని
అప్పుడావిధంగా
రాముడు
బోధించాడు.
రూపములన్నీ
వృద్ధాప్యము
పొంది
కట్టకడపటికి
నశిస్తుంటాయి.
రూపములు
ఏనాటికైననూ
ఎప్పటికైననూ
ఎక్కడైననూ
మునిగిపోవలసినవే!
ఎక్కడికి
పోయినప్పటికీ
నిన్ను
మునిగిపోకుండా
కాపాడేది
నామమొక్కటే!
అదియే
శాశ్వతము.
నామమును
ఎవ్వరూ
చెడపటానికిగాని,
నాశనం
చేయడానికిగాని,
నీనుండి
దూరం
చేయడానికిగాని
వీలుకాదు.
రామునికి
సహాయం
చేసిన
విభీషణుడుకూడా
చెప్పాడు,
‘రామా!
నీ
నామమే
సర్వమును
సాధించింది’
అని.
కనుక,
రామనామాన్ని
స్మరిస్తే
చాలు,
అన్నివిధాలుగా
మనకు
జయము
కలుగుతుంది.
రామనామము,
కృష్ణనామము,
శివ
నామము,
హరినామము,
హరనామము
-
ఇవన్నీ
రెండక్షరాల
నామములే.
వీటిని
ఆధారం
చేసుకుంటే
నీవు
ఎంతటి
ఘనకార్యమునైనా
సాధించగలవు.
కనుక,
నీవు
భగవన్నామమును
నిరంతరం
స్మరించాలి.
నామస్మరణకు
మాత్రమే
నేను
సులభంగా
చిక్కుతాను
మీరు
ఎన్ని
దానధర్మములు,
ఎన్ని
యజ్ఞయాగములు
చేసినప్పటికీ
ఇవన్నీ
కేవలం
తాత్కాలికమైన
మానసిక
తృప్తికోసం
చేస్తున్నారు.
భక్తి
నవ
విధములు.
4
▾
Meaning
Keep
From
the Śrīmad Bhāgavatam, 7.5.23
Also in his talks
(48)
2 October 1986
Restrain Manas, and you will have restrained the world!
6 October 1986
Serve the Lord of all in the form of society!
8 October 1986
Bhakti means perfect Prema fostered for God
23 November 1986
Inquiry into Ātma-jñāna itself is Sanātana Dharma
27 September 1987
Sādhanas without Prema are fruits without juice!
24 November 1987
We must become messengers of Śānti!
29 July 1988
Creation is nothing but the expression of Īśvara's will!
14 January 1989
The man of virtue alone is strong
23 March 1989
Do all actions only to please God
7 April 1989
All this is Vāsudeva
3 September 1989
Fill the Mind with Mādhava
12 September 1989
The Name of God Alone Is the Boat
4 October 1989
Grasp the Supreme Goal of Life
5 November 1989
Ānanda Is Within You Alone
25 May 1990
Vagaries of the Mind
3 June 1990
Vedic Wisdom
14 August 1990
Role of the Avatars
19 November 1990
Service as duty
28 July 1992
To love God for God's own sake: that alone is true Bhakti
22 July 1994
The fullness of Prema
28 February 1995
God, master of the three
15 January 1996
Only one who masters the mind can reach Mādhava
18 February 1996
The Name is the great boat for life
17 June 1996
He Who Reaches God's Presence Is Honoured Everywhere
29 June 1996
Karma, Bhakti and Jñāna: The Aim of All Three Is One
14 July 1996
Divine Proximity is the Real Wealth
27 August 1996
When the Anātma Is Removed, the Ātma Is Seen Everywhere
5 September 1996
Saccidānanda Is Man's Very Nature!
3 October 1996
Man's Aim and Goal Is the Vision of His Own Svarūpa
20 October 1996
When the Heart Is Turned to Prema, the World Turns to Brahman
19 July 1997
Guard your character as dearly as life
28 May 1998
Not the Man in Form: the Man of Conduct Is Needed
14 August 1998
Prema Alone Is the Path, Prema Alone the Goal
26 September 1998
God Is the Very Foundation of the World
11 October 1998
Human Life Is the Fruit of Our Resolves
24 November 1998
The Man Who Has Shed Ahaṅkāra and Mamakāra Is Full of Ānanda
22 February 2001
God's grace comes only through the right use of the senses
24 February 2002
God loves the inner feeling
23 November 2002
Satya Is the Paramātma Made Manifest
14 January 2003
To satisfy Swami, you must cultivate good qualities
16 March 2003
The principle of Prema: the divine power of attraction
5 October 2003
I am not the body; I am the embodiment of Prema
15 September 2004
Pour Out Your Life for the Prema of God
9 October 2005
The Ātma Is the One Bond Among All
11 October 2005
The Paramātma in All Is One
2 May 2006
The body itself is the temple; you yourself are God
13 May 2006
Humanness finds its fulfilment only when steadiness and oneness are both there
27 September 2006
Only one who has the vision of the Ātma is liberated
శ్రవణం
కీర్తనం
విష్ణోఃస్మరణం
పాదసేవనం
అర్చనం
వందనం
దాస్యం
సఖ్యమాత్మనివేదనం
శరణాగతి
అంటే
ఏమిటి?
కేవలం
మన
దేహాన్ని
దైవానికి
అర్పితం
చేయడం
కాదు.
నామాన్ని
స్మరిస్తూ
ఉండటమే
శరణాగతి
లక్షణం.
కనుక,
జనులు
దైవనామమును
స్మరించి
సార్థకతను
పొందాలనే
ఉద్దేశ్యంతో
గురునానక్
సామూహిక
నామసంకీర్తనను
ప్రారంభించాడు.
నామమే
ప్రధానమైన
శాస్త్రము.
మీరు
చూస్తుంటారు
-
పేపర్లలో
అనేక
అడ్వర్టైజ్మెంట్లు
వస్తుంటాయి.
అవన్నీ
ధనమును
ఆశించి
చేసే
పనులే!
ఆవిధంగా
ధనమును,
పేరు
ప్రతిష్ఠలను
ఆశించి
చేసే
పనులన్నీ
వ్యర్థమైనటువంటివే!
Money
comes
and
goes,
morality
comes
and
grows.
కనుక,
నైతిక
విలువలను
అభివృద్ధి
చేసుకోండి.
అప్పుడే
మీకు
చిత్తశుద్ధి
చేకూరుతుంది.
‘నేను
లక్షార్చన
చేశాను.
కోటి
అర్చన
చేశాను.
ఫలితం
ఇంకా
రాలేదే’
అని
కొందరు
కాచుకొని
ఉంటారు.
ఈ
ఫలితం
ఎన్నటికీ
వచ్చేది
కాదు.
నీకు
వచ్చేది
తాత్కాలికమైన
తృప్తిమాత్రమే.
ధనమున్నటువంటివారు
ఎంతో
డబ్బు
ఖర్చు
పెట్టి
ఎన్నో
రకములైన
యాగములు
చేస్తుంటారు.
కాని,
తమ
ఇంటి
ముందుకు
ఎవరైనా
భిక్షగాడు
వస్తే
వాడికి
పట్టెడన్నం
పెట్టడానికి
వారి
చెయ్యి
వెనక్కి
పోతుంది.
ఇది
సరియైనది
కాదు.
ధనమువల్ల
చిక్కేవాడు
కాదు
దేవుడు.
నీకు
ధనమిచ్చేది
దైవమే.
ఆ
ధనము
మళ్ళీ
తనకెందుకు?
ఆ
ధనమును
నీవు
ఐహిక,
ఆముష్మిక
జీవితాలకు
ఉపయోగించుకో;
బీదసాదలకు
తగిన
సహాయం
చేయి.
నేను
మీకు
చిక్కేది
మాత్రం
ఒక్క
నామమునకే!
కనుక,
నామమును
స్మరించి,
దైవాన్ని
స్వాధీనం
చేసుకోండి.
ఒక్క
నామస్మరణకు
మాత్రమే
భగవంతుడు
సులభంగా
చిక్కుతాడు.
భగవంతుడు
మీ
హృదయవాసి
భగవంతుడు
ఎక్కడున్నాడు?
మీ
హృదయంలోనే
ఉన్నాడు.
ఆనాడు
నిండు
సభలో
కౌరవులు
తనను
అవమానించటానికి
పూనుకున్నప్పుడు
ద్రౌపది,
“ఓ
ద్వారకావాసీ!
బృందావన
సంచారీ!
నన్ను
రక్షించవా?
ఈ
అవమానమునుంచి
నన్ను
కాపాడవా?”
అని
మొరపెట్టుకుంది.
కాని,
కృష్ణుడు
ప్రత్యక్షం
కాలేదు.
‘దయామయా!
కృపామయా!’
అని
కృష్ణుని
ఎంతగానో
వర్ణించింది.
అయినా
ఫలితం
లేకపోయింది.
కట్టకడపటికి
‘హృదయవాసీ’
అని
ప్రార్థించింది.
5
▾
Meaning
Keep
తక్షణమే
కృష్ణుడు
ప్రత్యక్షమై
ఆమె
మానమును
కాపాడినాడు.
ఎందుకంటే,
తాను
ఉండే
స్థానము
నీ
హృదయమే!
భగవంతుణ్ని
నీ
హృదయంలోనే
పెట్టుకొని
నీవు
బయట
ఉన్నాడనే
భావంతో
ఎంత
ప్రార్థన
చేసినా
ప్రయోజనం
ఉండదు.
నీవు
బాహ్యమైన
ధన,
కనక,
వస్తు,
వాహనాదులను
సాధిస్తున్నావుగాని,
నీలోనే
ఉన్న
దైవాన్ని
నీవు
సాధించలేకపోతున్నావు.
దైవాన్ని
నీయందే
వెతుకు.
నీ
దృష్టిని
అంతర్ముఖం
గావించుకో.
Look
inside,
don't
look
outside.
నీ
కన్నులు
మూసుకొని
నీలోనే
ఉన్న
దైవాన్ని
ప్రార్థించు.
అప్పుడు
దైవం
ప్రత్యక్షమై
నీకు
సర్వసేవలనూ
అందిస్తాడు.
నామముద్వారానే
దైవమును
ప్రత్యక్షం
గావించుకొనుటకు,
దైవానుగ్రహమును
పొందుటకు
వీలవుతుంది.
కనుక,
నామస్మరణను
అభివృద్ధి
పరచాలని
నగర
సంకీర్తననుకూడా
ప్రారంభించడం
జరిగింది.
ఈ
నగర
సంకీర్తనలోకూడా
మనము
భగవంతునిగురించి
ఊరకే
వర్ణనలు
చేయకూడదు.
లక్ష
వర్ణనలు
చేసినా
ప్రయోజనం
లేదు.
హృదయ
పూర్వకంగా
నామాన్ని
స్మరిస్తే
చాలు.
భగవంతుడు
ఆత్మస్వరూపుడై
నీలోనే
ఉన్నాడు.
ఆత్మకు
ఒక
రూపం
లేదు.
ఎవరైనా
అడిగితే,
‘నేను
కృష్ణుణ్ని’,
‘నేను
రాముణ్ని’,
‘నేను
సాయిబాబాను’
అని
చెప్పవచ్చు.
సాయిబాబా
అనేది
ఎవరి
పేరు?
ఈ
దేహానికి
పెట్టిన
పేరు.
అట్లే,
రాముడు,
కృష్ణుడు
అనే
పేర్లుకూడా
పెట్టినవేగాని,
పుట్టినవి
కావు.
పుట్టినది
దేహమేగాని,
ఆత్మ
కాదు.
పుట్టిన
దేహము
ఎప్పటికైనా
గిట్టేటటువంటిదే.
పుట్టనటువంటి
పేరు,
పెట్టనటువంటి
పేరు
ఒక్కటే.
‘అయ్యా!
నీవెవరు?’
అని
దేవుణ్ని
అడిగితే
‘అహం
బ్రహ్మాస్మి’
అని
అంటాడేగాని,
‘నేను
ఫలానా
రూపాన్ని’
అని
చెప్పడు.
‘అహం’కు
ఒక
ప్రత్యేకమైన
రూపం
లేదు.
ఆత్మకే
‘అహం’
అని
పేరు.
కనుక,
మనం
ఆత్మస్వరూపుణ్ని
పిలవాలిగాని,
కేవలం
రూపాన్ని
పిలిస్తే
ప్రయోజనం
లేదు.
ఒకే
ఆత్మకు
అనేక
పేర్లు
పెట్టి
మనం
సంతోషిస్తున్నాము.
మన
అల్పతృప్తికై
మనం
ఇంతగా
ప్రాకులాడుతున్నాము.
ఈ
తృప్తి
కేవలం
క్షణభంగురమే!
శాశ్వతమైనది,
సత్యమైనది,
నిత్యమైనది
ఆత్మ
ఒక్కటే.
అనేక
వేల
సంవత్సరముల
క్రిందట
‘రామా’
అనే
పేరు
వచ్చింది.
ఆ
పేరు
మాత్రమే
ఇప్పుడు
నిలిచి
ఉంది.
ఎవరికి
ఏ
కష్టము
వచ్చినా
‘అయ్యో,
రామా’
అని
అంటారు.
6
▾
Meaning
Keep
శాశ్వతమైనది
నామమొక్కటే.
కనుక,
నామమును
తలుచుకుంటూ
హృదయాన్ని
చేరుకొని,
దైవాన్ని
ప్రత్యక్షం
గావించుకొని
దైవంలో
చేరిపోవాలి.
అదే
మనము
చేరవలసిన
గమ్యం.
గంగ,
యమున,
సరస్వతులు
గొప్పగా
ప్రవహిస్తున్నాయి.
కాని,
కట్టకడపటికి
అవి
సముద్రంలో
చేరిపోతున్నాయి.
భూకంపములు
వచ్చినప్పుడు
కొన్ని
వేల
ఇళ్లు
కూలిపోతున్నాయి.
నదులు
పొంగినప్పుడు
అనేక
గ్రామాలు
కొట్టుకొనిపోతున్నాయి.
గ్రామాలతోపాటు
ప్రాణాలుకూడా
పోతున్నాయి.
కనుక,
ఈ
రూపములు
శాశ్వతమైనవి
కావు.
ఇవి
క్షీణించేటటువంటివి;
నాశనమయ్యేటటువంటివి.
కాని,
రూపము
లేకుండా
ఉండే
గంగ,
యమునలు
మనలోనే
ఉన్నాయి.
అవే
కుడి,
ఎడమ
శ్వాసలు.
“‘సోఽహం,
సోఽహం....”
ఈ
రెండూ
కూడేటటువంటిదే
సుషుమ్న
నాడి.
ఈ
సుషుమ్న
నాడి
నుంచి
మనము
హృదయానికి
చేరాలి.
బాహ్యదృష్టికి
దేవుడు
కనపడడు
మీకు
తెలుసు
-
దేవాలయానికి
వెళ్లినప్పుడు
అందరూ
కన్నులు
మూసుకొని
నమస్కారం
చేస్తారు.
నీవు
దేవాలయానికి
వెళ్ళింది
దేవుణ్ని
చూడటానికి
కదా!
మరి
అక్కడికి
వెళ్లిన
తర్వాత
ఎందుకు
కన్నులు
మూసుకొంటున్నావు?
దీని
అంతరార్థమేమనగా
బాహ్యదృష్టికి
దేవుడు
కనపడడు.
లోపల
‘రామా,
రామా,
రామా’
అనుకొంటూ
రాముని
విగ్రహం
ఎదుట
నిలబడి
కన్నులు
మూసుకొని
ప్రార్థిస్తున్నావు.
‘వేంకటేశ్వరా,
వేంకటేశ్వరా’
అంటూ
తిరుపతికి
పోతావు.
లోపలికి
వెళ్ళి
దేవుణ్ని
చూడడానికి
దక్షిణ
ఇస్తావు.
ఆ
దక్షిణ
ఇచ్చికూడను
కన్నులు
మూసుకొని
నమస్కరిస్తావు.
అనగా,
దైవానుగ్రహాన్ని
పొందాలంటే
అంతర్దృష్టిని
పెంచుకోవాలి.
అంతేకాదు,
భగవంతుడు
ప్రసాదించిన
ఈ
దేహములోని
సర్వేంద్రియాలను
పవిత్రం
గావించుకోవాలి.
“కన్నుల
నిచ్చినది
ఎందుకొ
తెలుసా?
అన్నీ
చూచేటందులకా?
కాదు,
కాదు.
కైలాసవాసుని
కన్నులారా
గాంచేటందుకురా!
నాలుక
నిచ్చినదెందుకొ
తెలుసా?
ఊరివారి
సుద్దులు
మాట్లాడేటందులకా?
కాదు,
కాదు.
భగవన్నామ
సంకీర్తన
చేసేటందుకురా!
కాళ్ళనిచ్చినది
ఎందుకొ
తెలుసా?
దేశాలన్నీ
తిరుగుటకా?
కాదు,
కాదు.
దైవమందిరము
చుట్టూ
తిరిగేటందుకురా!
7
▾
Meaning
Keep
చేతులనిచ్చినదెందుకొ
తెలుసా?
మూతికి
ముద్దందించుటకా?
కాదు,
కాదు.
సేవలు
చేసేటందుకురా!”
‘భజన
బినా
సుఖ
శాంతి
నహీ’
సేవ
అంటే
ఏమిటి?
ఎవరికి
సేవ
చేసినా
“నేను
రామునికే
చేస్తున్నాను,
కృష్ణునికే
చేస్తున్నాను,
నా
దైవానికే
నేను
చేస్తున్నాను”
అనే
భావాన్ని
అభివృద్ధి
పరచుకోవాలి.
‘సర్వకర్మ
భగవత్ప్రీత్యర్థం’,
ఏది
చేసినా
అంతా
దైవార్పితభావంతో
చేయాలి.
నీ
పనులు
నీవు
మానుకొమ్మని
చెప్పటం
లేదు.
నీ
పనులు
నీవు
చేసుకో.
కాని,
ఏ
పని
చేసినా
‘ఇది
దైవముయొక్క
పని’
అని
భావించు.
ఆ
భావాన్ని
నీవు
పెంచుకున్నప్పుడే
దైవము
నీకు
ప్రత్యక్షమవుతాడు.
భగవంతుని
నామాన్ని
మీరు
ఎంత
తలుచుకుంటే
అంత
ఆనందం
మీకు
లభిస్తుంది.
ఈవిధంగా
తలుచుకోవడానికే
భజనలు
ఏర్పాటు
చేశారు.
‘భజన
బినా
సుఖ
శాంతి
నహీ’.
నామమే
చాలు,
ఇంతకంటే
మరొకటి
అక్కర్లేదు.
భజనకి
నైవేద్యములు,
పుష్పములు
తేనక్కర్లేదు.
భగవంతునికి
పూలు
అక్కర్లేదు.
ఆ
పూలు
నీవు
ఈరోజు
వేస్తే
రేపటికి
వాడిపోతున్నాయి.
నైవేద్యం
పెడుతున్నావు.
ఏవిధంగా?
దేవునికి
చూపుతావు,
నీవు
భుజిస్తావు!
ఇంక,
నీవు
భగవంతునికి
ఏమి
ఇచ్చినట్లు?
నీ
ప్రేమను
అర్పించు.
అదే
భగవంతునికి
ఆహారము.
సత్యము,
ధర్మము,
శాంతి,
ప్రేమ,
అహింస...
ఈ
ఐదుకూడను
భగవంతుని
ప్రసాదములే.
సత్యమునకు
రూపం
లేదు.
‘సత్యం’
అనే
పేరును
ఈ
దేహానికి
పెట్టుకున్నారేగాని,
సత్యమునకు
ఒక
రూపం
లేదు.
సత్యము
శాశ్వతమైనది,
త్రికాలములందుకూడను
మార్పు
చెందనిది.
“సత్యాన్నాస్తి
పరో
ధర్మః”,
సత్యము
నుండియే
ధర్మము
ఆవిర్భవిస్తుంది.
సత్యమే
లేకపోతే
ధర్మమే
లేదు.
సత్యధర్మములు
రెండూ
చేరితే
శాంతి
ఏర్పడుతుంది.
“శాంతికోసం
ప్రయత్నం
చేస్తున్నాను,
ప్రార్థన
చేస్తున్నాను”,
అంటావు
నీవు.
శాంతి
ఎక్కడ
దొరుకుతుంది?
ఏదైనా
షాప్లో
చిక్కుతుందా?
లేదు.
అది
నీనుంచే
రావాలి.
అది
నీలోనే
ఉంటున్నది.
సత్యము,
ధర్మము
రెండూ
చేరితే
శాంతి
లభిస్తుంది.
శాంతి
ఏర్పడినప్పుడు
నీలో
ప్రేమ
అనేది
ప్రకాశిస్తుంది.
అప్పుడు
క్రోధము,
ద్వేషము,
అసూయ,
డంబము,
ఆడంబరము
ఏమాత్రము
నీ
దగ్గరికి
రావు.
8
▾
Meaning
Keep
ప్రేమ
అనేది
సర్వులను
ప్రేమిస్తుంది.
ఎవ్వరినీ
ద్వేషించదు.
ఎప్పుడు
ద్వేషము,
అసూయలు
ఉండవో
అప్పుడింక
పోట్లాటలే
ఉండవు.
కనుక,
‘సత్య
ధర్మము
శాంతి
ప్రేమలతో
నీ
నిత్య
జీవన
యాత్ర
సాగించు’.
ఆదాయంకోసం
అసత్యమాడితే
కలిగేది
నష్టమే!
మీరు
ఎట్టి
పరిస్థితిలోనైనా
సత్యాన్నే
పలుకుతూ
రండి.
తప్పించుకొనే
నిమిత్తమై
మీరు
అసత్యం
ఆడవద్దు.
అసత్యంవల్ల
మీరు
అప్పటికి
తప్పించుకొన్నా
మీ
హృదయం
ఎప్పుడూ
అశాంతిగానే
ఉంటుంది.
మీ
హృదయంనుండి
సత్యం
వెళ్ళిపోయిందంటే,
మీరేమీ
మంచి
పనులు
చేయలేరు.
సత్యమే
మీలో
లేకపోతే
ధర్మము
నెలా
ఆచరించగలరు?
సత్యమే
దైవము,
దైవమే
సత్యము.
రెండు
సత్యాలు
లేవు,
ఉన్నది
ఒకే
సత్యము.
అట్టి
సత్యాన్ని
మీరు
కాపాడుకుంటూ
రండి.
మీరు
ఏది
చేసినా
సత్యంగా
చెప్పండి.
“నేను
దీనిని
మూడు
రూపాయలకు
తీసికొన్నాను.
ఏదో
కొంత
ఆదాయంకోసమని
నీకు
ఐదు
రూపాయలకు
ఇస్తున్నాను”,
అని
మీరు
సత్యం
చెబితే
ఆ
రెండు
రూపాయలు
మీకు
మిగులుతాయి.
అట్లుగాకుండా
దురాశతో
“దీనికి
పది
రూపాయలు”
అని
అసత్యం
చెప్పవద్దు.
ఒక్క
అసత్యం
చెప్పడంవల్ల
అది
ఇంకా
అనేక
అసత్యాలకు
దారితీస్తుంది.
మానవుడు
ఈనాడు
కష్టాలకు
గురికావడానికి
కారణం
ఇదే!
అసత్యం
పలికిలేని
పాపం
తెచ్చుకోకూడదు.
ఆదాయంకోసమని
అసత్యం
చెబితే
దానివల్ల
మీకెంతో
నష్టం
కల్గుతుంది.
ప్రేమస్వరూపులారా!
మీరు
ఎల్లప్పుడు
ప్రేమతో
ఉండండి.
ఎవరిని
పలుకరించినా
ప్రేమతో
పలుకరించండి.
మీరు
ప్రేమతో
ఉంటే,
సర్వమూ
మీకు
సమకూరుతుంది.
మీ
అందరియందు
ప్రేమ
ఉన్నది.
కాని,
దానిని
మీరు
సరియైన
రీతిగా
ఉపయోగించుకోకుండా
విరుద్ధమైన
మార్గంలో
ఉపయోగిస్తున్నారు.
కాళ్ళతో
నడవవలసిన
మానవుడు
తలతో
నడిస్తే
ఎంత
దూరం
పోగలడు?
కాళ్ళ
నిచ్చినది
నడవడంకోసం.
అట్లే,
నోరు
ఇచ్చినది
సత్యం
చెప్పడంకోసం.
సత్యం
చెప్పవలసిన
నోటితో
అసత్యం
చెబితే,
కాళ్లతో
కాకుండా
తలతో
నడిచినట్లవుతుంది!
భగవంతుడు
మీకు
తల
నిచ్చినది
ఎందుకోసం?
“ఏది
మంచిది?
ఏది
చెడ్డది?
9
▾
Meaning
Keep
ఏది
సత్యము?
ఏది
అసత్యము?”
అని
విచారించడంకోసం.
మీరు
ఏది
చేసినా,
“నేను
చేసేది
ధర్మమా
కాదా?
నేను
చెప్పేది
సత్యమా
కాదా?”
అని
మొట్టమొదట
విచారించండి.
సత్యాన్నే
చెప్పండి.
సత్యమార్గములో
పయనించండి.
దైవాజ్ఞను
అనుసరించి
ప్రవర్తించండి.
సత్యమే
భగవంతునియొక్క
పేరు.
కనుక,
భగవంతునియొక్క
నామాన్ని
స్మరిస్తూ
రండి.
నామస్మరణచేతనే
కష్టాల
కడలిని
దాటవచ్చు
మీరు
ఊరకే
ధనము
ఖర్చుపెట్టి
పూజలు,
పునస్కారములు
చేస్తే
ప్రయోజనం
లేదు.
ఆకలిగొని
ఉన్నవారికి
ఇంత
అన్నం
పెట్టండి.
గుడ్డలు
లేనివారికి
గుడ్డ
లివ్వండి.
ఇవన్నీ
ఎన్నైనా
చేసుకోవచ్చు.
కాని,
భగవన్నామాన్ని
వదలిపెట్టి
మీరు
ఏమీ
చేయవద్దు.
ఎవరికైనా
భిక్షం
పెడుతున్నప్పుడు
‘రామా’
అని
స్మరించి
భిక్షం
పెట్టండి.
మనసులో
అనుకోండి,
గట్టిగా
చెప్పనక్కర్లేదు.
మనస్సే
అన్నింటికీ
ఆధారం.
“మనయేవ
మనుష్యాణాం
కారణం
బంధమోక్షయోః”.
కనుక,
మనస్సులో
ఏది
మరచినా
దైవనామాన్ని
మాత్రం
మరువవద్దు.
నామమహిమ
చేతనే
రాముడు
సముద్రాన్ని
దాటి
లంకలో
ప్రవేశించి
రాక్షస
సంహారం
గావించాడు.
అట్లే,
మనము
నామముచేతనే
కష్టాలు,
బాధలు
అనే
సముద్రాన్ని
దాటుకోవచ్చు.
అశాంతి,
దుఃఖము,
కష్టము,
నష్టము,
విచారము,
రోగము
వీటన్నింటినీ
మనము
నిర్మూలించుకోవాలంటే
ఒక్క
నామమే
చాలు.
కామము,
క్రోధము,
ఈర్ష్య,
అసూయ,
డంబము
ఇవన్నీ
లంకాపట్టణములో
ఉన్న
రాక్షసుల
వంటివి.
ఈ
రాక్షసులను
మన
హృదయంలో
చేర్చుకోకూడదు.
కోపము
అనే
రాక్షసుణ్ని
లోపల
చేర్చుకుంటే,
అది
అన్నింటినీ
చెడుపుతుంది.
బంధు
మిత్రులను
కూడా
దూరం
చేస్తుంది.
కనుక,
కోపమును
దగ్గరకు
రానీయకూడదు.
ప్రేమస్వరూపుడు,
శాంతిస్వరూపుడు
అయిన
భగవంతునియొక్క
నామాన్ని
లోపల
నిరంతరం
స్మరిస్తూ
ఉండాలి.
ఈవిధమైన
ప్రేమను,
శాంతిని
మీరు
సాధించినప్పుడే
దేశమంతా
బాగుపడుతుంది.
దేశముయొక్క
క్షేమాన్ని
కాంక్షించే
వారు
ఎప్పుడూ
ప్రేమతో
ఉండాలి.
ఎవ్వరికీ
ఏవిధమైన
నష్టమూ
కలిగించకుండా
జీవించాలి.
“లోకాస్సమస్తాః
సుఖినో
భవంతు”
అని
భజనకి
చివరలో
మనము
చెబుతున్నాము
కదా!
10
▾
Meaning
Keep
భగవంతుణ్ని
ప్రేమతో
తలుచుకోవాలి.
ఆ
ప్రేమచేతనే
లోకమంతా
మంచిగా,
సుక్షేమంగా
ఉండగలదు.
భగవంతుని
మనసు
కరిగించడానికి
సామూహిక
భజన
చాలా
అవసరము
భక్తులైనవారు
ఎట్టి
పరిస్థితిలోనూ
ప్రేమను
మాత్రం
దూరం
చేసుకోకూడదు.
Love
lives
by
giving
and
forgiving,
self
lives
by
getting
and
forgetting.
ఎవరెన్ని
విధములుగా
మిమ్మల్ని
దూషించినా,
కొట్టినా,
తిట్టినా
మీరు
ప్రేమతోనే
జీవించండి.
ఎవరో
కోపం
వచ్చి
మిమ్మల్ని
తిడితే,
అది
భగవంతుడే
తిట్టాడనుకోండి.
మిమ్మల్ని
ఎవరైనా
కొడితే
వాళ్లని
తిట్టకండి.
“దేవుడే
ఈరకంగా
వచ్చి
నన్ను
శిక్షిస్తున్నాడు”
అని
అనుకోండి.
అన్నీ
చేసేది
భగవంతుడే.
కష్టమిచ్చేదీ
భగవంతుడే,
సుఖమిచ్చేదీ
భగవంతుడే,
రక్షించేది
భగవంతుడే,
శిక్షించేదీ
భగవంతుడే.
అన్నీ
భగవంతుడే
కనుక,
అన్నింటినీ
మీరు
భగవంతునికి
అర్పించండి.
ఏది
జరిగినా
అంతా
భగవంతుని
ప్రసాదమే.
ఎలాంటి
పరిస్థితి
వచ్చినప్పటికీ
‘ఇదంతా
భగవంతుడే
చేస్తున్నాడు’
అని
అనుకోండి.
ఈరకంగా
భావించుకుంటే
మీరు
ఎంతో
ధన్యులవుతారు.
సముద్రంలో
పెద్దపెద్ద
రాళ్ళనే
తేల్చినటువంటి
భగవన్నామము
మన
మనస్సును
సంసార
సాగరములో
మునిగిపోకుండా
రక్షించదా?
సంసార
సాగరంలో
మన
మనస్సు
తేలుతూ
ఉండాలి.
అప్పుడు
అదే
మనకు
వంతెనగా
మారుతుంది.
ఆ
వంతెనను
దాటి
మనము
క్రోధము,
కామము
అనే
రాక్షసులను
చంపివేయడానికి
వీలవుతుంది.
కాబట్టి,
భజన
చేయండి.
భగవంతుని
నామమునే
గానం
చేస్తూ
భజన
చేయాలి.
భగవంతుని
మనస్సు
కరిగించడానికి
భజన
చాలా
అవసరం.
సామూహిక
భజన
చాలా
సార్థకమైనటువంటిది.
ఇంతమంది
కలిసి
భజన
చేస్తుంటే,
ఏ
ఒక్కరి
మనసైనా
భగవంతునియొక్క
మనసును
కరిగింపజేస్తుంది.
ఇంతమందిలో
ఒక్క
మనసయినా
పవిత్రమైనది
ఉండదా?
కనుక,
సామూహిక
భజనలో
భగవంతుని
మనసును
కరిగించడానికి
ఎంతో
అవకాశమున్నది.
తెల్లవారుఝామున
లేచి
నగర
సంకీర్తన
చేస్తుంటే,
అందరూ
భగవంతుని
నామము
వింటూ
నిద్ర
లేస్తారు.
లేచిన
తక్షణమే
భగవంతుని
నామము
వింటే
వాళ్ళకు
ఎంతో
ఆనందము,
ఉత్సాహము
కలుగుతుంది.
11
▾
Meaning
Keep
కనుక,
భగవంతుని
నామాన్ని
మరువకుండా
నిరంతరం
స్మరించండి.
నామాన్ని
స్మరించడం
చాలా
ఉత్తమమైన
మార్గము.
ఇదే
నిజమైన
సాధన.
ఇట్టి
సాధనను
చేపట్టినప్పుడు
మీరెంతైనా
ధన్యులవుతారు.
Previous
←
Honour your parents, love them, serve them!
Next
Oneness is divinity
→