Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 2001 · The principle that is the root and base
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
The principle that is the root and base
26 March 2001, Ugādi, Prasanthi Nilayam
1
▾
Meaning
Keep
From
the Nirvāṇaṣaṭkam, verse 4
Also in his talks
(5)
11 July 1987
The world is the very form of the Lord of the world
27 May 1990
Egoism and Attachment
27 September 1992
Worship Prakṛti and win the grace of the Paramātma
22 September 1996
Though Forms and Names Differ, the Principle of Brahman Is One!
7 May 2001
Love of God, fear of sin, morality in society
న
పుణ్యం
న
పాపం
న
సౌఖ్యం
న
దుఃఖం
న
మంత్రో
న
తీర్థం
న
వేదా
న
యజ్ఞాః
అహం
భోజనం
నైవ
భోజ్యం
న
భోక్తా
చిదానంద
రూపః
శివోఽహం
శివోఽహం
ప్రేమస్వరూపులారా!
ఆదియందు
వేదము
సర్వమానవులయందు
సమత్వమైన
భావములు
ప్రబోధిస్తూ
వచ్చింది.
మీరు
పుణ్యులు
కాదు,
పాపులు
కాదు;
యజ్ఞములు
కాదు,
యాగములు
కాదు;
పుష్పములు
కాదు,
పూజలు
కాదు;
పశువులు
కాదు,
జంతువులు
కాదు,
మానవులు
కాదు.
మరి
మీరెవ్వరు?
శివస్వరూపులే!
కాని,
మూలాధారతత్త్వమును
తెలుసుకోలేకపోవటం
చేత
మీరు
రూపనామములను
చూసి
భ్రమిస్తున్నారు.
రూప
నామములు
ప్రవృత్తి
లక్షణములు
మాత్రమే.
వీటిని
మీరు
విశ్వసించరాదు.
నివృత్తి
మార్గంలో
ప్రవేశించి
మూలాధారతత్త్వమును
చక్కగా
గుర్తించాలి.
(శ్రీవారు
ఒక
నిమ్మకాయను
సృష్టించి)
ఇది
ఏమిటి?
ఒక
నిమ్మకాయ.
దీని
ఆకారమును
బట్టి,
రుచిని
బట్టి,
ప్రవృత్తిని
బట్టి
దీనిని
నిమ్మకాయ
అంటున్నాము.
కాని
ఇది
నిమ్మకాయ
కాదు;
కణములయొక్క
సమూహమే.
దీనిలోని
ప్రతి
కణమునందు
ఈ
నిమ్మకాయ
ఉంటున్నది.
కణములకు
ఆద్యంతములు
లేవు.
ఇవి
మహాశక్తితో
కూడినవి.
ఈ
మహాశక్తి
పవిత్రమైన
చైతన్యంతో
కూడినటువంటిది.
ఈ
నిమ్మకాయ
పరిపూర్ణమైన
చైతన్యస్వరూపమే.
దీనిని
భుజించే
వ్యక్తి
కూడా
‘నేను’
అనే
చైతన్యంతో
కూడినవాడే.
కనుక,
తినువాడు
చైతన్యస్వరూపుడే,
తినబడే
పదార్థము
కూడా
చైతన్యస్వరూపమే.
సర్వమూ
చైతన్యమయమే.
ప్రతి
మానవుడు
‘నేను’,
‘నాది’
అనే
రెండు
పదములను
ఉపయోగపెడుతున్నాడు.
“ఈ
కర్చీఫ్
నాది,
ఈ
గ్లాసు
నాది,
ఈ
దేహము
నాది,
ఈ
ఇల్లు
నాది,
ఈ
కారు
నాది”
-
ఈ
‘నాది’
అనేది
ప్రవృత్తిభావం.
‘నేను’
అనేది
నివృత్తితత్త్వం.
‘నేను’
అనే
చైతన్యం
ఏనాటికీ
మారదు.
ఇది
Constant
Integrated
Awareness.
ప్రతి
వ్యక్తియందు
‘నేను’
అనే
చైతన్యం
ఉన్నది.
అందుచేత
ప్రతి
మానవుడూ
చైతన్యస్వరూపుడే.
2
▾
Meaning
Keep
Also in his talks
(27)
5 September 1987
Today satsaṅga is what man needs most urgently
5 October 1992
What man must seek is real, eternal happiness
23 November 1997
The God who fills everything is ‘I’
5 April 1998
Who can recognise the principle of Śrī Rāma
14 April 1998
God pervades all
26 September 1998
God Is the Very Foundation of the World
28 September 1998
The Five Elements Are the Very Forms of the Paramātma
11 October 1998
Human Life Is the Fruit of Our Resolves
21 November 1999
No sādhana greater than service
23 November 2001
Self-confidence is the very stairway to Ānanda
25 December 2001
Though faiths differ, Mādhava is one
16 March 2003
The principle of Prema: the divine power of attraction
21 March 2004
I am you, you are I
11 April 2004
Truth itself is the form of God
15 April 2004
The principle of Prema is Divinity itself
17 October 2004
Develop the Feeling of the One Ātma
22 November 2004
Only When Oneness Is Experienced Does Human Birth Find Its Fulfilment
25 December 2004
Pray for the Sake of God's Prema
8 March 2005
Śivatva is the very consciousness in all beings
23 November 2005
All Are Embodiments of God
26 February 2006
All is full of Brahman
30 March 2006
See only good, do only good, be good
14 April 2006
Fix your mind on Divinity; place your trust in Oneness
2 May 2006
The body itself is the temple; you yourself are God
11 August 2006
Divinity is attained only through Prema for God
13 April 2008
The Name of Rāma is best; the thought of Rāma is enough
24 May 2008
Remembering the Name is the way across
మానవుడు
తనయందున్న
మూలాధారతత్త్వమును
గుర్తించుటకు
ప్రయత్నించాలి.
దీనికి
మూడు
రకములైన
గుణములుండాలి.
మొదటిది,
దైవానికి
తనను
తాను
అర్పితం
చేసుకోవటం;
రెండవది,
తనది
అనుకున్నది
సమస్తమూ
దైవానికి
అంకితం
చేయటం;
మూడవది,
ఆత్మతత్త్వమును
గుర్తించేంతవరకూ
ప్రశ్నిస్తూనే
ఉండటం.
దీనినే
‘పరిప్రశ్న’
అన్నారు.
“నేను
దేహమును
కాదు,
మనస్సును
కాదు,
బుద్ధిని
కాదు,
చిత్తమును
కాదు,
దృశ్యకల్పితమైన
జగత్తులోని
అశాశ్వతమైన
వస్తువును
కాదు”
అనే
సత్యాన్ని
గుర్తించేంతవరకూ
ప్రశ్నించటమే
పరిప్రశ్న.
ప్రాచీన
కాలమునుండి
వేదము
ఇట్టి
అంతర్ముఖమైన
భావములను
బోధిస్తూవచ్చింది.
‘నేను’
అనేది
ఆత్మ;
‘నాది’
అనేది
మాయ
మొట్టమొదట
కణములయొక్క
తత్త్వాన్ని
విచారణ
చేయాలి.
ఈ
కణములు
అణువులతో,
పరమాణువులతో
కూడినవి.
ఈ
అణువులు,
పరమాణువులు
దివ్యశక్తితో
చేరినవి.
ఈ
దివ్యశక్తి
సర్వత్రా
ఉన్నది.
“సర్వతః
పాణిపాదం
తత్సర్వతోక్షి
శిరోముఖం
సర్వతః
శ్రుతిమల్లోకే
సర్వమావృత్య
తిష్ఠతి”
చైతన్యం
సర్వత్ర
నిండియున్నది.
ఈ
చైతన్యమునకే
‘వెలుగు’
అని
పేరు.
వెలుగు
సర్వత్ర
ఉన్నది.
ఈ
వెలుగే
‘నేను’
అని
పిలువబడుతున్నది.
దీనికే
ఆత్మ
అనీ,
పరమాత్మ
అనీ,
పరంజ్యోతి
అనీ,
శివం
అనీ
అనేక
పేర్లు
పెట్టారు.
ఈ
వెలుగు
స్వతస్సిద్ధమైనది;
ఒకరు
ఉద్భవింపజేసేది
కాదు.
దీనినుండియే
ప్రపంచమంతయు
ఆవిర్భవిస్తున్నది.
ఈ
వెలుగుకే
‘నేను’
అని
పేరు
పెట్టింది
వేదము.
‘నేను’
అనే
శాశ్వతమైనతత్త్వం
లోపల
ఉన్నది;
‘నాది’
అనబడే
మాయాస్వరూపమైన
పదార్థాలు
బయట
ఉన్నాయి.
‘నేను’
అనేది
ఆత్మ;
‘నాది’
అనేది
మాయ.
ఆత్మ
ఎన్నటికీ
మార్పు
చెందదు.
అట్టి
మార్పు
చెందని
మూలాధారతత్త్వమే
సమస్త
పదార్థములయందు
లీనమైయున్నది.
కాని
మానవుడు
ఈ
మూలాధారతత్త్వమును
గుర్తించుకోలేక
అనేకరకములైన
అభ్యాసములచేత,
వాసనల
చేత
భ్రాంతిలో
మునిగిపోతున్నాడు;
“ఇతడు
నా
తండ్రి,
ఈమె
నా
తల్లి,
ఇతను
నా
తమ్ముడు,
ఈమె
నా
బిడ్డ”
అని
ఈవిధంగా
దేహాభిమానమును
పురస్కరించుకొని
సంబంధ
బాంధవ్యములను
కల్పించుకొంటున్నాడు.
3
▾
Meaning
Keep
పుట్టిన
తరువాతనే
“ఈమె
నా
బిడ్డ”
అంటున్నావు.
పుట్టక
పూర్వం
ఆ
బిడ్డ
ఎవరు?
వివాహానికి
పూర్వం
భార్య
ఎవరు?
భర్త
ఎవరు?
ఇవన్నీ
కదలిపోయే
మేఘములవంటి
సంబంధ
బాంధవ్యములే.
కాని
ఇవే
ప్రధానమని
నీవు
భ్రమిస్తున్నావు.
దేహం
నీవు
కాదు,
నీది
నీవు
చూడలేనివి
ఎన్నో
ఉన్నాయి;
చూస్తున్నవి
ఎన్నో
ఉన్నాయి.
నీవు
చూసినదే
సత్యమని
భావిస్తున్నావు.
కాని
చూసినది
సత్యం
కాదు.
నీ
లోపలున్నదే
బయట
ప్రతిబింబంగా
కనిపిస్తున్నది.
కనిపించేది
ఏదీ
‘నేను’
కాదు.
‘నేను
నేనే!’
దానిని
ఎవ్వరూ
కల్పించటానికి
వీలుకాదు,
ఎవ్వరూ
త్రోసిపుచ్చటానికి
వీలుకాదు.
ఆ
‘నేను’
అనేదే
నిత్యసత్యమైన
తత్త్వం.
అది
“నిర్గుణం,
నిరంజనం,
సనాతనం,
నికేతనం,
నిత్య,
శుద్ధ,
బుద్ధ,
ముక్త,
నిర్మలస్వరూపిణం.”
‘నేను’
అనేదే
ఈశ్వరత్వం.
దీనిని
పురస్కరించుకొనియే
వేదము
“ఈశ్వరస్సర్వ
భూతానాం”
అన్నది.
సర్వభూతములందు
ఈశ్వరత్వమున్నది.
సర్వులూ
పరమాత్మ
స్వరూపులే.
కాని
ఒక్కొక్కరిని
ఒక్కొక్క
పేరుతో
పిలుస్తున్నాం
మనం.
ఇది
కేవలం
ప్రాకృతమైన
గుర్తుకోసమే.
“ఏయ్
పిల్లవాడా!
ఇలా
రా”
అంటే
ఏ
పిల్లవాడు
వస్తాడు?
అట్లుకాకుండా
“రామా!
ఇలా
రా”
అంటే,
ఆ
పేరు
గలవాడు
వెంటనే
వస్తాడు.
ప్రాకృతమైన
దృశ్యములను
నిరూపించే
నిమిత్తం
ఈ
పేర్లు
పెట్టుకున్నాం.
ఈ
పేర్లు
పుట్టినవి
కావు;
ఇవి
పుట్టిన
దేహానికి
పెట్టిన
పేర్లు
మాత్రమే.
పుట్టిన
దేహం
నీవు
కాదు.
కాని
దేహమే
‘నేన’నే
భ్రమను
పెంచుకోవటంచేత
అది
నీవుగా
మారిపోయింది.
‘నా
దేహం’
అంటున్నావు.
‘నాది’
అనుకున్నప్పుడు
‘నేను’
ప్రత్యేకంగా
ఉండాలి
కదా!
ఈ
కర్చీఫ్
‘నాది’,
ఈ
టంబ్లర్
‘నాది’
ఈ
మైకు
‘నాది’,
అన్నప్పుడు
ఇవన్నీ
నాకంటే
ప్రత్యేకంగా
ఉన్నాయి
కదా!
అయితే
‘నేను’
ఎవరు?
నిద్రించే
సమయంలో
నీ
దేహం
ఎక్కడుందో
నీకే
తెలియదు;
నీ
దేహాన్ని
నీవే
మరచిపోతావు.
సమాధి
స్థితిలోకూడా
నీ
దేహం
నీకు
తెలియదు.
దేహమే
నీవైతే
దేహాన్ని
ఎలా
మరచిపోగలవు?
కాబట్టి
దేహం
నీవు
కాదు,
Not
you.
దేహం
నీది.
ఈ
ప్రపంచంలో
‘నేను’,
‘నాది’
అనే
రెండు
తత్త్వాలను
చక్కగా
గుర్తించుకుంటే
సృష్టి
అంతా
అర్థమౌతుంది.
‘నాది’
అనేది
ప్రవృత్తిలక్షణం.
ఇది
ప్రాకృతమైన
వస్తువులకు,
బాహ్యమైన
చర్యలకు
సంబంధించినది.
4
▾
Meaning
Keep
‘నేను’
వీటికి
అతీతమైనది.
వేదము
‘అహం
బ్రహ్మాస్మి”
అన్నది.
అనగా
నేను
బ్రహ్మ
అని
చెప్పిందేగాని,
నాది
బ్రహ్మ
అని
చెప్పలేదు.
ఈ
‘నేను’
అనే
తత్త్వాన్ని
చక్కగా
గుర్తించటానికి
ప్రయత్నించాలి.
ఏకత్వాన్ని
గుర్తించటమే
నిజమైన
జ్ఞానం
ప్రేమస్వరూపులారా!
మీరు
మొట్టమొదటి
నుండి
‘నేను’,
‘నాది’
అనే
విభాగం
చేయటం
చేతనే
ఈ
సందేహాలకు
అవకాశమిస్తున్నారు;
అణు
పరమాణువులతత్త్వాన్ని
గుర్తించుకోలేకపోతున్నారు.
సృష్టి
అంతా
పరమాణువులతో
కూడినదే.
పరమాణువుల
చేరికయే
ఈ
నిమ్మకాయ.
ఇది
నిమ్మకాయ
కాదు,
పరమాణువుల
స్వరూపమే.
మన
ఉపయోగంకోసం
దీనికి
నిమ్మకాయ
అని
పేరు
పెట్టుకున్నాం.
జగత్తులో
అన్నింటికీ
మన
ఉపయోగంకోసమే
పేర్లు
పెట్టుకుంటున్నాంగాని,
సత్యమును
గుర్తించే
నిమిత్తం
కాదు,
జ్ఞానమును
అందుకొనే
నిమిత్తం
కాదు.
జ్ఞానమనగా
ఏమిటి?
“అద్వైత
దర్శనం
జ్ఞానం.”
ఏకత్వాన్ని
గుర్తించటమే
నిజమైన
జ్ఞానం.
కనుక
మొట్టమొదట
మీరు
మూలాధారతత్త్వమును
గుర్తించటానికి
ప్రయత్నించాలి.
నీటికి
మూలాధార
మేమిటి?
ఆక్సిజన్,
హైడ్రోజన్లను
కలిపి
మీరు
నీరును
తయారు
చేస్తున్నారు.
మీ
అనుకూల
నిమిత్తం,
జగద్వ్యవహార
నిమిత్తం,
ప్రాకృతమైన
జీవిత
నిమిత్తం
మీరీవిధమైన
మార్పులు
చేసుకుంటున్నారుగాని,
ఈ
మార్పులన్నీ
కేవలం
మిథ్యములే.
మిథ్యమనగా
ఏమిటి?
సత్యము,
అసత్యము
కానటువంటిది;
అనగా
కంటికి
కనిపిస్తుందిగాని,
తరువాత
కనిపించకుండా
పోతుంది.
కాని
మూలాధారతత్త్వం
మూడు
కాలములందూ
మార్పు
చెందనిది.
కనుకనే
“త్రికాలాబాధ్యం
సత్యం,”
అన్నారు.
అంతరాత్మను
అనుసరించటమే
నిజమైన
ధర్మం
ఈనాటి
మానవుడు
అనేక
భ్రమలకు
లోనై,
అధికారమును,
ధనమును
ఆశించి
పెడమార్గం
పడుతున్నాడు.
ఇవి
ఎంతకాలం
నిలుస్తాయి?
వస్తాయి,
పోతాయి.
“మా
కురు
ధనజన
యౌవన
గర్వం,
హరతి
నిమేషాత్కాలః
సర్వం.”
క్షణభంగురమైన
యౌవనాన్ని
చూసుకొని
ఆశలను
పెంచుకొని
జీవితాన్ని
వ్యర్థం
గావించుకోకూడదు.
మీరు
జీవితాన్ని
సార్థకం
గావించుకునే
నిమిత్తం
జన్మించారుగాని,
వ్యర్థం
గావించుకునే
నిమిత్తం
కాదు.
“శరీర
మాద్యం
ఖలు
ధర్మసాధనం”
దేహం
ధర్మాచరణ
నిమిత్తమై
ఏర్పడినది.
5
▾
Meaning
Keep
ధర్మాన్ని
గుర్తించటమే
జీవిత
మర్మం.
ఏమిటి
మానవ
ధర్మం?
తనకు
నచ్చినదంతా
ధర్మమేనా?
కాదు,
కాదు.
అంతరాత్మను
అనుసరించటమే
నిజమైన
ధర్మం.
కాని
మానవుడు
తన
అంతరాత్మను
విస్మరించి,
బయట
కనిపించే
ప్రతిబింబాన్ని
ఆశించి,
మాయలో
మునిగిపోతున్నాడు.
అద్దంలో
కనిపించే
ప్రతిబింబం
సత్యమౌతుందా?
కాదు.
ఎందుకంటే,
అద్దంలో
చూసినప్పుడు
మీ
కుడికన్ను
ఎడమకన్నుగా
కనిపిస్తుంది.
ఇది
ప్రతిబింబలక్షణం
(Reflection
of
the
inner
being).
కనుక
మీరు
మూలాధారతత్త్వమును
గట్టిగా
పట్టుకోవాలి.
అప్పుడు
బాహ్యమైన
చింతలన్నీ
మిమ్ముల
వీడిపోతాయి.
కాని,
మీరు
మూలాధారతత్త్వాన్ని
మరచి
బాహ్యచింతలనే
అనుభవిస్తున్నారు.
పుట్టటం,
సుఖాలను
అనుభవించటం,
గిట్టటం
-
ఇంతేనా
జీవితం?
కాదు,
కాదు.
మూలాధారతత్త్వాన్ని
పట్టాలి;
మూలస్థానాన్ని
చేరుకోవాలి.
మూలాధారాన్ని
విస్మరించటంచేతనే
కష్టాలు
ఈనాటి
మానవునిలో
భ్రమలు
అధికమైపోతున్నాయి.
కనుకనే,
ఎన్ని
సంవత్సరాలు
గడచినప్పటికీ
తాను
ఉన్నచోటనే
ఉంటున్నాడు.
ఈ
క్రొత్త
సంవత్సరం
పేరు
వృషనామ
సంవత్సరం.
దీనిలో
ఏ
మార్పులు
సంభవిస్తాయో
అని
అనేక
మంది
అనేక
రకములుగా
ఊహలల్లుతున్నారు.
జరగవలసింది
జరుగుతుంది;
చేయవలసింది
చేస్తారు;
ఉండవలసినచోట
ఉండాలి.
మీ
మనస్సు
ఎప్పుడూ
మూలాధారతత్త్వంపై
ఉండాలి.
దానిని
వదలి
ఏమి
చేసినా
ప్రయోజనం
లేదు.
మానవుడు
మూలాధారతత్త్వాన్ని
విస్మరించటంచేతనే
సంవత్సరాలు
గడిచేకొలదీ
కష్టాలు
పెరిగిపోతున్నాయి.
చెప్పకూడదుగాని,
చెప్పక
తప్పదు.
గడచిన
సంవత్సరములకంటే
ఈ
సంవత్సరం
అమితమైన
శ్రమలకు
గురి
కావలసివస్తుంది.
రాజకీయంగా
ప్రపంచమంతా
అల్లకల్లోలంగా
ఉంటుంది.
భూకంపాలు
అమితంగా
పెరిగిపోతున్నాయి;
ఇంకా
పెరుగుతాయి.
దీనికి
మూలకారణమేమిటి?
మానవుని
కర్మలే.
ప్రపంచంయొక్క
మంచిచెడ్డలు
మానవుని
చర్యలపై
ఆధారపడియుంటాయి.
ఈనాడు
అన్నదమ్ముల
మధ్యకూడా
కలహాలు
బయల్దేరుతున్నాయి;
రాజకీయాలలో
మానవత్వం
పూర్తిగా
నశించింది.
ఒక్క
భారతదేశంలోనే
కాదు,
అన్ని
దేశాలలోనూ
పరిస్థితి
ఈవిధంగానే
ఉన్నది.
అయితే
మంచివారికి
ఎప్పటికీ
ఎలాంటి
ప్రమాదములూ
ఉండవు.
6
▾
Meaning
Keep
దైవాన్ని
కోరవలసినవి
శాంతి,
ఆనందం
గుజరాత్లో
పటేల్
అనే
శ్రీమంతుడుండేవాడు.
అతను
పరమ
భక్తుడు.
ఒక
రోజు
ఉదయం
అతను
స్నానం
చేసి
పూజలో
కూర్చున్న
సమయంలో
అతని
మిత్రుడు
వచ్చాడు.
పూజ
అయ్యేంతవరకు
అతను
వేచియున్నాడు.
తరువాత
మాటల
సందర్భంలో
“పటేల్!
నీవద్ద
కావలసినంత
ధనమున్నది.
అన్ని
విధాలుగా
సుఖపడుతున్నావు
కదా!
ఇంకా
దేనికోసం
నీవు
భగవంతుణ్ణి
పూజిస్తున్నావు?”
అని
అడిగాడు.
అప్పుడు
పటేల్
చక్కని
జవాబిచ్చాడు.
“నేను
భగవంతుణ్ణి
పూజించేది
ధనంకోసం
కాదు,
సుఖసంతోషాలకోసం
కాదు.
నాదగ్గర
లేనిది
శాంతి.
అది
భగవంతునిదగ్గరుంది.
నాదగ్గర
లేనిది
ఆనందం.
భగవంతుడు
ఆనందస్వరూపుడు,
ఆనందనిలయుడు.
కనుక
అతని
దగ్గరున్న
శాంతిని,
ఆనందమును
నేను
అందుకోవాలని
ఆశిస్తున్నాను.
అందుకోసమే
నేను
ప్రార్థిస్తున్నాను”
అన్నాడు.
ఇదే
నిజమైన
భక్తి.
మీదగ్గర
లేనిది,
భగవంతుని
దగ్గర
ఉన్నది
ఏదో
దానిని
పొందే
నిమిత్తం
మీరు
భగవంతుణ్ణి
ప్రార్థించాలి.
మీదగ్గర
లేనిది
శాంతి,
మీదగ్గర
లేనిది
ఆనందం.
కాబట్టి
అతనిని
ప్రార్థించి
అతనినుండి
ఆనందమును,
శాంతిని
పొందాలి.
బాహ్యప్రపంచంలో
ఎంత
ప్రయత్నించినా
మీకు
శాంతి
లభించదు.
అనేక
మంది
విదేశీయులు
“స్వామీ!
మాకు
శాంతి
కావాలి”
అంటారు.
అప్పుడు
నేను
చెబుతాను
-
మీరే
శాంతిస్వరూపులు.
మీరాశించే
Peace
మీయందే
ఉన్నది.
బయట
ఉన్నదంతా
Pieces
మాత్రమే.
మీరే
శాంతి,
మీరే
సత్యము,
మీరే
ప్రేమ,
మీరే
అహింస,
మీరే
దైవం.
ఈ
సత్యాన్ని
మీరు
విశ్వసించినప్పుడు
దుఃఖమునకు,
విచారమునకు
అవకాశమే
ఉండదు;
ఆనందంగా
జీవించటానికి
వీలౌతుంది.
మీరు
ఆనందాన్ని
అనుభవించాలంటే
“నేనే
దైవం”
అనే
విశ్వాసాన్ని
పెంచుకోండి.
హనుమంతుని
రామభక్తి
ఒక
పర్యాయం
రామచంద్రుడు
హనుమంతుణ్ణి
అడిగాడు
-
“హనుమా!
నీవు
నన్ను
ఏరీతిగా
ధ్యానిస్తున్నావు?”
అని.
అప్పుడు
హనుమంతుడు
“స్వామీ!
దేహరీతిగా
నేను
నీ
దాసుడను.
మనోరీతిగా
నేను
నీ
అంశమును.
ఆత్మరీతిగా
నేనే
నీవు,
నీవే
నేను!”
అన్నాడు.
ఇట్టి
ఏకత్వాన్ని
గుర్తించటంచేతనే
హనుమంతుడు
నిరంతరం
ఆనందంగా
ఉన్నాడు.
“శాంతుడు,
గుణవంతుడు,
బలవంతుడు
హనుమంతుడు”
అని
రాముడు
అతనికి
గొప్ప
బిరుదులిచ్చాడు.
7
▾
Meaning
Keep
అంతటి
శాంతుడు,
అంతటి
గుణవంతుడు,
అంతటి
బలవంతుడు
మరొకడు
లేడు.
ఎట్టి
బలము?
రామనామమే
గొప్ప
బలము.
ఈనాడు
అనేకమంది
రామనామాన్ని
జపిస్తున్నారు.
కాని
నామమును
కేవలం
పెదవులకు
మాత్రమే
పరిమితం
చేస్తున్నారు.
కాని
హనుమంతుడు
అట్లా
కాదు;
హృదయ
పూర్వకంగా
స్మరించేవాడు.
అదే
నిజమైన
భక్తి.
సీత
తన
తండ్రియైన
జనక
మహారాజు
తనకు
బహూకరించిన
ఒక
విలువైన
ముత్యాల
హారమును
శ్రీరామ
పట్టాభిషేక
సమయంలో
హనుమంతునికి
బహుమతిగా
అందించింది.
కాని,
హనుమంతుడు
ఆ
హారములోని
ఒక్కొక్క
ముత్యమును
కొరికి,
తన
చెవిదగ్గర
పెట్టుకొని
పారవేయసాగాడు.
ఆ
దృశ్యం
చూసి
సీత
చాలా
ఆశ్చర్యపడింది.
“అయ్యో,
నా
తండ్రిగారు
నాకిచ్చిన
విలువైన
ముత్యాలహారాన్ని
కొరికి
పారవేస్తున్నాడే!
హనుమంతుడింకా
కోతి
చేష్టలు
మానుకోలేదు”
అనుకుంది.
హనుమంతుని
చర్యలో
గల
ఆంతర్యం
రామునికి
తెలుసు.
కాని
సీతకుకూడా
అర్థం
కావాలనే
ఉద్దేశ్యంతో
“హనుమా!
ఎందుకీవిధంగా
విలువైన
ముత్యాలను
కొరికి
పారవేస్తున్నావు?”
అని
అడిగాడు.
హనుమంతుడు
“స్వామీ!
వీటియందు
రామనామం
ఉన్నదా,
లేదా
అని
చూస్తున్నాను.
రామ
నామం
లేనిది
ముత్యమైనా,
పగడమైనా
నాకు
రాయితో
సమానం”
అన్నాడు.
రాముడు
ఎంతో
ఆనందించి
“నాయనా!
నీకు
నన్ను
నేనే
ఇచ్చుకుంటున్నాను”
అని
పలుకుతూ
ప్రేమతో
కౌగిలించుకున్నాడు.
చిత్తశుద్ధికోసమే
భగవచ్చింతన
విషమును
ఎంతటి
విలువైన
బంగారు
పాత్రలో
పోసినా
అది
ప్రాణం
తీస్తుందేగాని
రక్షించదు.
అమృతమును
సామాన్యమైన
ఇత్తడి
పాత్రలో
పోసినా
అది
తన
సుగంధమును,
మాధుర్యమును
కోల్పోదు.
విషంతోకూడిన
బంగారుపాత్ర
కన్న
అమృతంతోకూడిన
ఇత్తడిపాత్రయే
కోరదగినది.
అనగా
చిత్తశుద్ధియే
ప్రధానమైనది.
భగవచ్చింతన
దేనికోసం?
చిత్తశుద్ధికోసమే.
అయితే,
భగవన్నామం
కేవలం
పెదవులనుండి
వస్తే
ప్రయోజనం
లేదు;
హృదయంనుండి
రావాలి.
ఏది
చేసినా
భగవదర్పితభావంతో
చేయాలి.
కొంతమంది
ధనమిచ్చి
పురోహితునితో
పూజ
చేయిస్తారు.
పురోహితుడు
చేసిన
పూజకు
ఫలితం
పురోహితునికే
వస్తుందిగాని,
మీకెలా
వస్తుంది?
8
▾
Meaning
Keep
Also in his talks
(29)
15 September 1986
The inner meaning and greatness of the festival of Onam
23 November 1986
Inquiry into Ātma-jñāna itself is Sanātana Dharma
26 February 1987
There is no sādhana greater than remembering the Name
9 January 1988
God in the heart, work in the hands
20 June 1988
You yourselves are embodiments of God!
3 September 1988
The body itself is a temple!
18 October 1988
Believe That God Alone Is the True Friend, and Try to Follow Him!
23 March 1989
Do all actions only to please God
24 November 1990
Share in Bhagavan's love
24 May 1991
Isaavaasya Upanishad - Renunciation And Pleasure
22 July 1994
The fullness of Prema
14 January 1995
Prema is like a compass
1 April 1995
Make God your true friend
16 August 1996
‘Love all, worship all’
20 August 1996
Every Man Must Cultivate the Vision of Prema
21 November 1996
Only When Man Is Free of Resolves Can He Attain Śānti
5 October 1997
“Śarīramādyaṁ khalu dharmasādhanaṁ”
18 April 1998
The universe is the form of Viṣṇu
20 April 1998
Inquiry into the eternal and the transient is essential
29 April 1998
God Alone Is the Ground of Ānanda
9 July 1998
By God's Grace Anything Can Be Achieved
4 September 1998
Remembering the Name of God Removes All Sorrow
1 October 1998
Aham, Ātma, Mind, Speech
14 April 2002
Sumitrā and Ūrmilā, Given to Sacrifice
21 July 2002
We Must Journey from Vyaṣṭi to Samaṣṭi
2 April 2003
Leave the delusion of the body; think of God
5 July 2003
Give up attachment to the body and develop attachment to God
5 October 2003
I am not the body; I am the embodiment of Prema
1 January 2004
For true devotees, every day is a festival!
కనుక,
ఎవరితోనో
చేయిస్తే
ప్రయోజనం
లేదు;
మీరే
స్వయంగా
చేయాలి.
ఎవరో
తింటే
మీ
ఆకలి
తీరుతుందా?
మీ
ఆకలికి
మీరే
భుజించాలి
కదా!
అదేరీతిగా,
మీ
శాంతికోసం
మీరే
పూజించాలి.
దైవత్వంయొక్క
రహస్యాన్ని
ఈనాడు
ఎవ్వరూ
గుర్తించుకోలేకపోతున్నారు.
‘నేను’
అనేదే
మూలాధారతత్త్వం.
కనుక
మీరే
దైవం.
కాని,
మీరు
దేహమే
‘నేన’ని
భావిస్తున్నారు.
చాలా
పొరపాటు.
దేహం
ఎలాంటిది?
మలినపుకొంప
రోగముల
మ్రగ్గెడు
సేవకగంప
జాతసం
చలనము
పొందు
దుంప
భవసాగరమీదగలేని
కంప
అం
బులపొది
లెమ్ము
చూడు
మనమెచ్చు
దలంపగ
దేహమింక
ని
శ్చలమని
నమ్మబోకు
మనసా!
హరిపాదము
లాశ్రయింపవే!
అయితే
దేహమున్నంతవరకూ
ఎట్టి
రోగములూ,
బాధలూ
రాకుండా
చూసుకోవాలి.
అది
కోరుకోవటంలో
తప్పులేదు.
దేహం
బాగుంటేనే
ఏ
పనైనా
చేయవచ్చు.
దేహం
ఆరోగ్యంగా
ఉన్నప్పుడే
మనస్సు
కూడా
ఆరోగ్యంగా
ఉంటుంది.
దేహం
ఆరోగ్యంగా
లేనప్పుడు
మనస్సు
ఆరోగ్యంగా
ఉండదు.
కాబట్టి
దేహారోగ్యాన్ని
కాపాడుకోండి;
ఆత్మతత్త్వంపై
మనస్సును
నిల్పండి.
“నేను
మాత్రం
బాగుండాలి,
ఇతరులేమైనా
ఫరవాలేదు”
అనే
సంకుచితమైన
భావాన్ని
విడనాడండి;
మీరు
సమాజంలో
జీవిస్తున్నారు.
సమాజమే
లేక
మీరెక్కడుంటారు?
కనుక
“లోకాస్సమస్తా
స్సుఖినో
భవంతు”
అందరూ
సుఖంగా
ఉండాలని
కోరుకోండి.
సమత్వాన్ని
పోషించుకోండి.
అప్పుడే
మీకు
ఆనందం
ప్రాప్తిస్తుంది.
ఈ
క్రొత్త
సంవత్సరం
పేరు
వృష.
కేరళలో
క్రొత్త
సంవత్సరాన్ని
‘విశు’
అంటారు.
“ప్రభవ,
విభవ,
శుక్ల,
ప్రమోదూత,
ప్రజోత్పత్తి,
అంగీరస,
శ్రీముఖ,
భావ,
యువ,
ధాత,
ఈశ్వర,
బహుధాన్య,
ప్రమాధి,
విక్రమ,
వృష,
చిత్రభాను,
స్వభాను,
తారణ,
పార్థివ,
వ్యయ,
సర్వజిత్తు,
సర్వధారి,
విరోధి,
వికృతి....”
ఈ
విధంగా
మొత్తం
60
సంవత్సరాలున్నాయి.
ఇవన్నీ
నారదుని
బిడ్డల
పేర్లు;
అతడు
నారదిగా
మారినప్పుడు
పుట్టారు.
తన
బిడ్డల
పేర్లు
శాశ్వతంగా
నిలవాలని
నారదుడు
ఆశించటంచేత
వారిపేర్లు
సంవత్సరములకు
పెట్టబడినాయి.
ఈ
సంవత్సరం
కొంత
మంచిని
కూడా
చేకూర్చుతుంది.
మీరు
మంచితనమును
పెంచుకోండి;
పవిత్రమైన
భావాలను
అభివృద్ధి
పరచుకోండి;
ఆనందమయ
జీవితాన్ని
గడపండి.
9
▾
Meaning
Keep
ఈనాడు
క్రొత్త
సంవత్సరం
ప్రారంభమైందని
పాయసం
వండుకొని
భుజిస్తే
సరిపోదు.
మీ
ప్రవర్తనను
సక్రమంగా
తీర్చిదిద్దుకోవాలి.
ప్రపంచం
యొక్క
మంచిచెడ్డలు
మీ
నడతపై
ఆధారపడియున్నది.
కనుక
మీరు
సత్యసంకల్పాలను
పోషించుకున్నప్పుడే
సత్యజీవితాన్ని
గడపగలరు.
పదిమందికి
సంతోషాన్ని
కల్గించండి,
ఆదర్శాన్ని
అందించండి.
భగవత్ప్రేమను
సాధించండి.
అందు
నిమిత్తం
హృదయపూర్వకంగా
భగవన్నామాన్ని
స్మరించండి.
Previous
←
God's grace comes only through the right use of the senses
Next
The Rāmāyaṇa is the essence of the Veda
→