Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 2003 · Remember the Name with Prema
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Remember the Name with Prema
14 April 2003, Tamil New Year, Brindavan
1
▾
Meaning
Keep
His poems 374
Also in his talks
(26)
21 May 1973
The Opening Message
10 October 1986
A people that has morality is the true people
21 November 1986
We must regard service to man as service to Mādhava
2 January 1987
Sanātana Dharma is the essence of all the wisdom of the Vedas
2 June 1990
Ascent Of Man
23 November 1990
Restore the glory of Bharat
2 June 1991
Vijnana and Dharma
18 August 1996
Man Must Learn to Live as Man
19 October 1996
When the Home Is Set Right, the World Is Set Right
19 October 1998
Dīpāvali: Its Inner Meaning
22 November 1998
The Education of Bhārata Is What Develops the Divine Human Principle
10 September 2000
God is within you
22 November 2001
True education brings the wealth of character
19 January 2002
Hospitals must not become business centres
19 November 2002
Setting the Home in Order: The Housewife's First Duty
20 October 2003
Restore the ancient culture!
2 July 2004
If you call ‘Sai!’ with Prema, I answer ‘Here I am!’
23 October 2004
Foster the Spirit of Sacrifice
8 March 2005
Man is a child of immortality
6 May 2006
If you love your parents, the whole world will love you
14 August 2006
Follow the Ātma within you
21 January 2007
All parties must become one for the good of the country
15 August 2007
Win the svātantrya of the heart!
15 January 2008
Revere your mother as God, your father as God
6 August 2008
‘Education’ finds its fulfilment only when it is joined with ‘Educare’
23 November 2008
Foster the feeling of the one Ātma, and unity!
పరమ
పావనమైన
భారతావనియందు
సహనమన్నదె
మనకు
చక్కదనము
వ్రతములన్నిటియందు
వన్నె
గాంచినయట్టి
ఘన
సత్యశీలమే
కఠిన
తపము
మధుర
భావంబేది
మన
దేశమందన్న
మాతృభావము
కంటె
మాన్యమెద్ది?
ప్రాణంబు
కంటెను
మానంబె
ఘనమను
మన
దేశ
నీతిని
మంటగలిపి
నేటికిచ్చిరి
పరదేశ
నీతులరసి
వెస
విచిత్ర
స్వేచ్ఛయను
విచ్చుకత్తి
ఔర!
ఏమందు
భారతపాలనంబు
ఏనుగెట్టుల
తన
బలమెఱుగ
లేదొ
అట్టులైనారు
మన
భారతీయులు
నేడు
ప్రేమస్వరూపులారా!
ఈనాడు
మనం
‘తమిళ్
న్యూ
ఇయర్
డే’
అని
ఆనందాన్ని
అనుభవిస్తున్నాము.
ఇది
‘స్వభాను’
నామసంవత్సరం.
‘స్వ’
అనగా
ఆత్మ
అని
అర్థం.
స్వభావమనగా
ఆత్మభావము.
కనుక,
మానవుడు
ఈ
‘స్వభాను’
నామ
సంవత్సరంలో
తన
సహజ
స్వభావము
ననుసరిస్తూ
నూతనమైన
జీవితమును
ప్రారంభం
చేసుకోవాలి.
ఇప్పటికెన్నో
నూతన
సంవత్సరాలు
గడచిపోయినవి.
కాని,
మానవునిలో
నూతన
భావాలు
ఆవిర్భవించడం
లేదు.
ఇంకా
పాత,
రోత
భావాలతోనే
కాలము
గడుపుతున్నాడు.
2
▾
Meaning
Keep
దినదినమునకూ
నూతనమైన,
ఉత్తమమైన
భావములను
అభివృద్ధిపరచుకొని,
నూతనమైన
మార్గమును
అవలంబించి,
జనులకు
నూతనమైన
ఆదర్శాన్ని
అందించాలి.
అదే
నిజమైన
నూతన
సంవత్సరం.
వేదాంతములో,
‘అహం
ఏతత్
న’
అనేది
ప్రధానమైన
జ్ఞానసూత్రము.
దృశ్యకల్పితమైనది
‘నేను’
కాదు
అని
దీని
అర్థం.
దేహంకూడా
దృశ్యకల్పితమైనదే!
కనుక,
మానవుడు
దేహమే
నేననే
భ్రాంతిని
విడిచిపెట్టాలి.
“నేను
నిత్యసత్యమైన
ఆత్మస్వరూపుడను,”
అని
విశ్వసించాలి.
ఇట్టి
ఆత్మవిశ్వాసమును
ప్రగాఢంగా
కల్గి
యున్నప్పుడే
తాను
ఆదర్శవంతమైన
జీవితాన్ని
అందించగలడు.
కాని,
ఈనాటి
మానవుడు
ఆత్మవిశ్వాసమంటే
ఏమిటో
అర్థం
చేసుకోవడం
లేదు.
సత్యమే
ప్రత్యక్ష
దైవము
ఎక్కడ
విశ్వాసము
ఉంటుందో
అక్కడ
ప్రేమ
ఉంటుంది.
ఎక్కడ
ప్రేమ
ఉంటుందో
అక్కడ
శాంతి
ఉంటుంది.
ఎక్కడ
శాంతి
ఉంటుందో
అక్కడ
సత్యముంటుంది.
ఎక్కడ
సత్యముంటుందో
అక్కడ
దైవముంటాడు.
సత్యమే
ప్రత్యక్ష
దైవము.
మానవుడు
దైవాన్ని
అనేక
పేర్లతో
ఆరాధిస్తున్నాడు.
‘సహస్ర
శీర్షా
పురుషః
సహస్రాక్షః
సహస్రపాత్.’
అన్ని
శిరస్సులూ,
అన్ని
హస్తములూ,
అన్ని
నేత్రములూ
భగవంతునివే!
కనుక,
పేర్లు
ముఖ్యం
కాదు.
దైవం
ఒక్కడే.
ఇద్దరు
దేవుళ్ళు
లేరనే
సత్యాన్ని
గుర్తించాలి.
‘ఏకం
సత్
విప్రాః
బహుధా
వదన్తి.’
అదే
ఏకైక
సత్యము.
అది
దేశకాలపరిస్థితుల
ప్రభావానికి
అతీతమైనది.
ఏ
దేశమునందైనా,
ఏ
కాలమునందైనా,
ఏ
పరిస్థితియందైనా
సత్యమునకు
మార్పు
లేదు.
అమెరికన్
సత్యము,
ఇండియన్
సత్యము,
జర్మన్
సత్యము...
అంటూ
సత్యమును
విభజించడానికి
వీలుకాదు.
దానినే
Transcendental
Truth
అన్నారు.
అట్టి
సత్యమే
దైవమని
విశ్వసించి,
ఆరాధన
చేయాలి.
సత్యమార్గమును
అనుసరించాలి.
ఈనాడు
లోకం
ఇన్ని
అవస్థలకు
గురికావడానికి
కారణం
జనులు
సత్యమార్గమును
విస్మరించడమే!
“సత్యం
బ్రూయాత్
ప్రియం
బ్రూయాత్
నబ్రూయాత్
సత్యమప్రియం”
అన్నారు.
మనం
సత్యధర్మములను
అనుసరించినప్పుడే
జగత్తు
శాంతి,
సౌఖ్యములను
అనుభవించగలదు.
భారతీయసంస్కృతిలో
ప్రధానమైన
సూత్రము,
‘సత్యం
వద,
ధర్మం
చర.’
కాని,
ఈనాడు
సత్యమనే
పాదములను
కొట్టివేశారు,
ధర్మమనే
శిరస్సును
ఖండించారు.
అర్థ,
కామములనే
మొండెమును
పట్టుకొని
ప్రాకులాడుతున్నారు.
3
▾
Meaning
Keep
సత్యధర్మాలను
రక్షిస్తే
అవే
దేశాన్ని
రక్షిస్తాయి
భారతీయులీనాడు
తమ
దేశాన్ని
కాపాడుకునే
నిమిత్తం
అనేక
ప్రయత్నాలు
చేస్తున్నారు.
మనం
కాపాడవలసింది
దేశాన్ని
కాదు,
సత్యధర్మాలను
కాపాడాలి.
సత్యధర్మాలను
సంరక్షిస్తే
అవే
దేశాన్ని
సంరక్షిస్తాయి.
ఈ
జగత్తంతా
సత్య
ధర్మాలపైనే
ఆధారపడి
ఉంది.
సత్యధర్మాలే
మానవత్వానికి
నిజమైన
నేత్రములు
మరియు
ప్రాణములుకూడా.
కనుక,
మీరు
చేసే
వ్యాపారములందుగాని,
ఉద్యోగములందుగాని
సత్యధర్మములను
విధిగా
పాటించాలి.
గుడ్డలను
మార్చుకున్నంత
మాత్రమున
సరిపోదు,
గుణమును
మార్చుకోవాలి.
మీ
ప్రవర్తనలో
మార్పు
రావాలి.
సత్యధర్మములకు
మీ
జీవితాన్ని
అంకితం
గావించాలి.
అప్పుడే
మీలో
మానవత్వము
వికసిస్తుంది.
మానవత్వమనగా
ఏమిటి?
కేవలం
మానవాకారాన్ని
ధరించి
సంచరించడం
కాదు.
మీ
సర్వాంగములలోనూ
సత్యధర్మములను
ప్రసరింపజేసుకోవాలి.
ఎల్లప్పుడు
మార్పు
చెందని
సత్యముపై
దృష్టి
పెట్టుకోవాలి.
అట్టి
సత్యము
మానవత్వమునందే
ఉన్నది.
మానవుడు
సామాన్యుడు
కాదు.
మానవుడే
దేవుడు.
దేహములోని
అణువణువునందు,
కణకణమునందు
భగవంతుడు
రసస్వరూపుడై
సంచరిస్తున్నాడు.
కనుకనే,
వేదము
‘రసోవై
సః’
అని
చెప్పింది.
ప్రతి
అంగములోనూ
భగవంతుడు
రసస్వరూపుడై
సంచరిస్తూ
మన
దేహమును
కాపాడుతున్నాడు.
కనుకనే,
అతనికి
అంగీరసుడని
పేరు.
దేహమును
భగవంతుడు
కాపాడకుండిన
ఇంకెవరు
కాపాడగలరు?
ఐతే,
దేహము
అశాశ్వతము.
‘దేహము
నిశ్చలమని
నమ్మబోకు
మనసా!
హరిపాదములాశ్రయింపవే!’
దేహము
నీటిబుడగవలె
క్షణభంగుర
మైనది.
మనస్సొక
పిచ్చి
కోతివలె
మహాచంచలమైనది.
కాబట్టి,
దేహమునుగాని,
మనస్సునుగాని
నమ్మవద్దు.
అంతరాత్మను
అనుసరించాలి.
అంతరాత్మయే
మీ
ప్రత్యక్ష
దైవం.
‘నేనుండగా
నీకు
భయమెందులకు?’
భగవంతుడు
నిత్యుడు,
నిర్మలుడు,
నిశ్చలుడు,
నిస్వార్థపరుడు.
తాను
సర్వకాల
సర్వావస్థలయందు
భక్తరక్షణయందే
నిమగ్నుడై
ఉంటాడు.
భగవంతునిలో
స్వార్థం
ఏకోశానా
కనిపించదు.
మీ
స్వార్థాన్ని
భగవంతునిపై
ఆరోపించి
భ్రమకు
లోనుకాకండి.
సర్వమూ
తన
హస్తగతమైయుండగా
తనకు
స్వార్థమెలా
ఉంటుంది!
తాను
ఏ
పని
చేసినా
జనులయొక్క
క్షేమముకోసమే
చేస్తుంటాడు.
4
▾
Meaning
Keep
“సమస్త
లోకాః
సుఖినో
భవంతు”
అని
సదా
ఆశీర్వదిస్తూ
ఉంటాడు.
భగవంతుడు
ఎట్టి
ప్రమాణములకూ
చిక్కనివాడు,
అన్నింటికీ
అతీతమైనవాడు.
కనుకనే,
అతనిని
అప్రమేయుడన్నారు.
అట్టి
భగవంతుడు
మీ
హృదయమునందే
ప్రేమస్వరూపుడై
ప్రకాశిస్తున్నాడు,
ఆనందస్వరూపుడై
అలరారుచున్నాడు,
ధర్మస్వరూపుడై
ధర్మాన్ని
ఆచరిస్తున్నాడు.
సమాజసేవకు
తాను
ముందంజ
వేస్తూ
ప్రజలకు
తోడ్పడుతున్నాడు.
‘మానవుడా!
నేనుండగా
నీకు
భయమెందులకు?
నన్ను
అనుసరించు,’
అంటూ
మానవునికి
తగిన
ధైర్యాన్ని,
ఉత్సాహప్రోత్సాహాలను
అందిస్తున్నాడు.
దైవాన్ని
దర్శించాలంటే
జ్ఞాననేత్రం
కావాలి
ప్రాచీనకాలంలో
ఋషులందరూ
భగవంతుణ్ణి
చూడాలని
ఎంతో
కాలం
తపస్సు
చేస్తూ
వచ్చారు.
కొందరు
తపస్సు
చేస్తూ
ఉండగానే
మరణించారు.
మిగిలినవారు
మాత్రం
పట్టినపట్టు
విడువకుండా
అకుంఠితమైన
దీక్షతో
తపస్సును
కొనసాగించారు.
ఆ
తపః
ఫలితంగా
దైవత్వము
ఒక్కతూరి
వారికి
దర్శనమిచ్చింది.
అప్పుడా
ఋషులు
బ్రహ్మానంద
భరితులై
ప్రపంచానికి
ఈవిధంగా
చాటినారు
-
‘వేదాహమేతం
పురుషం
మహాన్తం
ఆదిత్యవర్ణం
తమసః
పరస్తాత్’,
‘ఓ
ప్రజలారా!
మేము
భగవంతుణ్ణి
దర్శించాము.
అతడు
తమస్సుకు
ఆవల
కోటిసూర్యుల
కాంతితో
ప్రకాశిస్తున్నాడు.
అతనిని
మీరుకూడా
దర్శించి
ఆనందాన్ని
అనుభవించండి.
అతడు
నిర్గుణుడు,
నిశ్చలుడు,
నిస్వార్థపరుడు.
అట్టి
భగవంతుణ్ణి
మీరు
స్మరిస్తూ
ఉంటే
మీకుకూడా
తప్పక
తాను
దర్శనమిస్తాడు.’
భగవంతుడు
ఎక్కడ
చూసినా
ఉన్నాడు.
అయితే,
అతనిని
చూడడానికి
తగినటువంటి
నేత్రము
కావాలి.
నేటి
మానవుడు
చర్మచక్షువులతో
రాముణ్ణి
చూడాలని
ప్రయత్నిస్తున్నాడు.
చర్మచక్షువులకు
రాముడెలా
కనిపిస్తాడు?
రాముణ్ణి
దర్శించాలంటే
జ్ఞాన
నేత్రమును
సంపాదించుకోవాలి.
బాహ్యదృష్టిని
విడనాడి
అంతర్దృష్టిని
అభివృద్ధి
పరచుకోవాలి.
ఈనాడు
భగవంతునికోసం
వెదికేవారు
ఎక్కడ
చూసినా
కనిపిస్తున్నారు.
కాని,
భగవంతునికోసం
వెదకనక్కర్లేదు.
‘సర్వతః
పాణిపాదం
తత్సర్వతోక్షి
శిరోముఖం...’
ఎక్కడ
చూసినా
ఉన్న
భగవంతునికోసం
వెదికే
అవసరమేముంది?
భగవంతునికోసం
వెదకనక్కర్లేదు.
నిజమైన
మానవునికోసం
వెదకాలి.
5
▾
Meaning
Keep
ఎందుకంటే,
భగవంతుడు
ఎక్కడ
చూసినా
కనిపిస్తూనే
ఉన్నాడు.
నిజమైన
మానవుడే
ఎక్కడా
కనిపించడం
లేదు.
ఆకారమానవుడు
కనిపిస్తున్నాడే
గాని,
ఆచారమానవుడు
కనిపించడం
లేదు.
ప్రపంచానికి
ఆచరణ
చాలా
అవసరం.
ఆచరణ
లేక
ఆకారము
ఉండీ
లాభమేమిటి?
త్యాగమే
యోగము,
భోగమే
రోగము
దేహమును
మీరేమాత్రం
నమ్ముకోకూడదు.
ఇది
మీకు
పరమాత్ముడిచ్చిన
పనిముట్టుగా
విశ్వసించి
దీని
సహాయంతో
మీ
కర్తవ్యకర్మలను
సక్రమంగా
నిర్వర్తించాలి.
సమాజసేవలో
పాల్గొనాలి.
కష్టాల్లో
ఉన్నవారికి
సహాయం
చేయాలి.
దీనులకు,
దిక్కులేనివారికి
చేయూత
నివ్వాలి.
సర్వజీవులపట్ల
ప్రేమను
పెంచుకోవాలి.
సత్య,
ధర్మములకు
మీ
జీవితాన్ని
అంకితం
గావించాలి.
ఈ
నూతన
సంవత్సరంలో
ఇలాంటి
నూతనమైన,
పవిత్రమైన
భావాలను
మీలో
ఆవిర్భవింపజేసుకొని
నూతనమైన
జీవితాన్ని
ప్రారంభించాలి.
కాని,
ఈనాడు
నూతన
జీవితము
ఎక్కడుంది?
దినాలు
గడుస్తున్నాయి.
ఒక
దినము
మారి
మరొక
దినము
వస్తున్నది.
కాని,
మానవుని
భావములు
మారడం
లేదు.
గుడ్డలు
మారుతున్నాయిగాని,
గుణము
మారడం
లేదు.
గుడ్డలచేత
కాదు,
గుణముచేత
సన్యాసి
కావాలి.
సర్వసంగపరిత్యాగియే
నిజమైన
సన్యాసి.
‘నకర్మణా
నప్రజయా
ధనేన
త్యాగేనైకే
అమృతత్వమానశుః’
సత్కర్మాచరణచేతగాని
లేక
సంతతిచేతగాని
లేక
ధనముచేతగాని
అమృతత్వం
సిద్ధించదు.
ఒక్క
త్యాగముచేతనే
అమృతత్వమును
పొందుటకు
వీలౌతుంది.
కాని,
ఈరోజుల్లో
త్యాగభావము
ఎవరికుంది?
ఏ
నూటికొక్కరికో,
కోటికొక్కరికో
ఉంటుంది.
దైవత్వం
సర్వుల
యందు
ఉంటుండాది.
ఐతే,
త్యాగజీవియందు
మాత్రం
ప్రత్యక్షంగా
గోచరిస్తుంటాది.
కనుక,
మానవునికి
త్యాగభావము
అత్యవసరం.
తాను
త్యాగజీవి
కావాలిగాని,
భోగజీవి
కాకూడదు.
త్యాగజీవికి
యోగము
ప్రాప్తిస్తుంది,
భోగజీవికి
రోగము
చేకూరుతుంది.
త్యాగమే
యోగము,
భోగమే
రోగము.
కనుక,
మనం
భోగాన్ని
త్యజించి
త్యాగాన్ని
అలవర్చుకోవాలి.
కొందరు
క్షణక్షణమూ
రామచింతన
చేస్తూ
ఉంటారు.
కణకణములోను
రామనామాన్ని
నింపుకుంటారు.
నిజంగా
అట్టివారెంతో
ధన్యులు.
వారి
జీవితమే
సార్థకజీవితము.
ప్రతి
వ్యక్తీ
దైవచింతన
చేయాలి.
6
▾
Meaning
Keep
Also in his talks
(1)
12 April 2003
The Chief Qualities of the Young
మనలను
కాపాడేది
దైవమే
గాని,
లోకము
కాదు.
లోకములో
నేటివరకు
ఎన్ని
సిద్ధాంతములో
మారినాయి.
రాజకీయరంగములో
ఎన్ని
పార్టీలో
వచ్చినాయి.
కాని,
వాటివలన
లోకానికి
కలిగిన
ఉపకారమేమిటి?
ఏమీ
లేదు.
ఎవరి
పొట్టను
వారు
నింపుకుంటున్నారు.
దైవత్వాన్ని
గుర్తించడానికి
ఎవ్వరూ
ప్రయత్నించడం
లేదు.
మనం
దైవానుగ్రహమును
సంపాదిస్తే
ఎన్ని
బాధలనైనా
నివారణ
గావించుకోవచ్చు;
సర్వసంపదలనూ
పొందవచ్చు.
భక్తుని
ప్రేమకు,
భగవంతుని
అనుగ్రహానికి
ఎంతో
సన్నిహిత
సంబంధ
బాంధవ్యమున్నది.
కేవలం
ప్రేమచేతనే
మనం
భగవదనుగ్రహాన్ని
పొందడానికి
వీలౌతుంది.
ధర్మమార్గమును
అనుసరించి,
త్యాగభావమును
పోషించుకొని
ఆనందాన్ని
అనుభవించాలి.
ఒకానొక
సమయంలో
రామదాసు
ఇలా
ప్రార్థించాడు:
‘స్వామీ!
నీకొరకు
నేనేమి
చేస్తున్నాను?
నీకు
నేనేమీ
అర్పితం
చేయలేదే!
అయినప్పటికీ
నాపై
ఎందుకింత
అనుగ్రహాన్ని
కురిపిస్తున్నావు?’
అప్పుడు
శ్రీరామచంద్రుడు
చెప్పాడు,
‘నాయనా!
నీవు
చేసే
త్యాగమే
నిజమైన
యోగము.
నీవు
మానసికంగా
చేస్తున్నది
నాకు
తెలుసుగాని,
నీకు
తెలియదు.
మానసికంగా
చేసే
త్యాగము
ఒక్క
దైవానికి
మాత్రమే
అర్థమౌతుంది.
పరులకు
అర్థం
కానక్కర్లేదు.
పరులు
అర్థం
చేసుకోలేరు
కూడా.’
మన
త్యాగము,
యోగము,
ప్రేమతత్త్వము
ఒక్క
దైవానికి
మాత్రమే
అర్థమౌతాయి.
దైవశక్తి
ఇట్టిది,
అట్టిది
అని
వర్ణించడానికి
వీలుకాదు;
ఇంత,
అంత
అని
అంచనా
వేయడానికి
ఎవ్వరికీ
చేతగాదు.
హృదయానికి
మాత్రమే
ఇది
అర్థమౌతుంది.
ఒక్క
ప్రేమతత్త్వమే
దైవత్వానికి
సరియైన
పోలిక.
ఒక
పర్యాయం
త్యాగరాజు
చెప్పాడు
-
కపి
వారిధి
దాటునా?
కలికి
రోట
గట్టునా?
లక్ష్మీదేవి
వలచునా?
లక్ష్మణుండు
కొలచునా?
సూక్ష్మబుద్ధిగల
భరతుడు
చూసిచూసి
మ్రొక్కునా?
అప్ప
రామశక్తి
ఎంతో
గొప్పరా!
హనుమంతుడు
క్షణక్షణమూ
రామనామాన్ని
స్మరిస్తూ
ఉండడంచేతనే
విశాలమైన
సముద్రాన్ని
అవలీలగా
దాటగల్గాడు,
పెద్దపెద్ద
పర్వతాలను
సహితం
అతి
సులభంగా
ఎత్తగల్గాడు.
7
▾
Meaning
Keep
రామనామము
అనంతమైన
శక్తి
కల్గినది.
ఒక
చిన్న
ఉదాహరణ:
లంకాపురికి
సముద్రంపై
వారధి
నిర్మించే
నిమిత్తం
వానరులు
పెద్దపెద్ద
బండరాళ్ళను
తెచ్చి
సముద్రములోకి
వేయడం
ప్రారంభించారు.
కాని,
ఆ
రాళ్ళన్నీ
సముద్రములో
మునిగిపోసాగినవి.
అప్పుడు
హనుమంతునికి
ఒక
ఉపాయం
తట్టింది.
ఒక
రాయిపైన
‘రా’
అని,
మరొక
రాయిపైన
‘మ’
అని
వ్రాసి
రెండింటినీ
సముద్రంలోకి
వేశాడు.
ఆ
రెండు
రాళ్ళూ
ఒకదానికొకటి
దగ్గరగా
వచ్చి
చేరుకున్నాయి.
రామనామదివ్యమహిమచేత
ఆ
బండరాళ్ళు
సహితం
సముద్రంపై
తేలియాడినాయి.
రామనామమనేది
మనకు
ఎక్కడా
లేని
శక్తి
సామర్థ్యముల
నందిస్తుంది.
రామతత్త్వముగాని,
కృష్ణతత్త్వముగాని
ఒకరు
చెబితే
అర్థమయ్యేవి
కావు.
చదువులచేతగాని,
పదవులచేతగాని
మనం
భగవంతుణ్ణి
చేరుకోవడానికి
వీలుకాదు.
ఒక్క
ప్రేమచేతనే
ఇది
సాధ్యమౌతుంది.
ప్రేమచేత,
ఆనందముచేత
‘రామా!
రామా!’
అని
స్మరిస్తే
రాముడే
స్వయంగా
మీచెంతకు
నడచి
వస్తాడు.
భక్త
త్యాగరాజు
పరమభక్తుడైన
త్యాగరాజుయొక్క
బిడ్డ
పెండ్లి
సందర్భంగా
అతని
స్నేహితుడు
మద్రాసు
దగ్గరున్న
చెంగల్పట్
అనే
గ్రామమునుండి
తిరువయ్యారుకు
వెళ్ళాడు.
పెళ్ళికుమార్తెకు
కానుకగా
ఇవ్వడానికి
శ్రీరాముని
చిత్రపటము
నొకదానిని
తనవెంట
తీసుకొని
వెళ్ళాడు.
ఆనాడు
బస్సులు,
కార్లు,
ఏరోప్లేన్లు
లేవు
కదా!
అందుచేత,
చెంగల్పట్
నుండి
తిరువయ్యారుకు
కాలినడకన
వెళ్ళాడు.
ఆ
చిత్రపటమును
చూసి
త్యాగరాజు
పట్టలేని
ఆనందముతో,
‘నను
పాలింపగ
నడచి
వచ్చినావా
రామా!’
అంటూ
గానం
చేశాడు.
త్యాగరాజు
రామతత్త్వంతో
ఏకత్వాన్ని
అనుభవించినవాడు.
రాముణ్ని
తనకు
అత్యంత
సన్నిహితుడైన
మిత్రునిగా
భావించినవాడు.
కనుకనే
ఒకానొక
సందర్భంలో,
‘రారా
మా
ఇంటిదాక...
రఘువీర
సుకుమార
నే
మ్రొక్కెద...
రారా
మా
ఇంటిదాక,’
అని
గానం
చేశాడు.
మన
పాతస్నేహితుణ్ణి
ఇంటికి
ఆహ్వానించేటప్పుడు
‘రండి,
దయచేయండి’
అని
చెప్పము
కదా!
భగవంతుడుకూడా
మనకు
పాతస్నేహితుడే!
కనుకనే,
త్యాగరాజు
రాముణ్ణి
‘రారా’
అంటూ
తన
పాతస్నేహితుణ్ని
సంబోధించినట్లుగా
సంబోధించాడు.
“ఎంత
వేడుకొందు
రాఘవా!
పంతమేలరా
ఓ
రాఘవా!”
అంటూ
తాను
మొరపెట్టుకున్నాడు.
8
▾
Meaning
Keep
Also in his talks
(15)
16 August 1987
To show men the ideal, God displays many Līlās
22 June 1989
Win the Grace of God
12 February 1990
There is no place where God is not
17 February 1990
Prema itself is God
25 May 1990
Vagaries of the Mind
14 August 1990
Role of the Avatars
21 May 1991
The Vedic Heritage Of India
25 May 1991
Kenopanishad
1 August 1996
The vyāvahārika lies merged in the pāramārthika
22 August 1996
You Yourself Are God
30 September 1998
God's Prema Is Eternal, Everlasting
20 November 2000
Prema and Service Are Like Wings That Carry Us to the Heights
12 October 2002
The So'ham principle itself is the principle of the Trimūrti
23 November 2002
Satya Is the Paramātma Made Manifest
18 September 2004
Parents Are the Visible Embodiments of God
“రామచంద్రా!
నిన్ను
వేడుకోవడం
నా
కర్తవ్యం.
నీ
హృదయం
కరిగేటట్లుగా
వేడుకుంటున్నాను.
కాని,
నా
ప్రార్థన
నీ
హృదయాన్ని
కరిగించలేకపోతున్నది.
అయితే,
ఏదో
ఒకనాటికి
నీ
హృదయం
తప్పక
కరుగుతుంది.
అంతవరకు
నేను
కాచుకొని
ఉండాలి.
తొందరపడకూడదు,”
అని
తన
మనస్సును
శాంతింపజేసుకున్నాడు.
అప్పుడే
రాముడతనికి
దర్శన
మిచ్చాడు.
‘నేను
నీవాడను,
నీవు
నావాడవు’
సాధకునికి
భగవంతుడు
అనుగ్రహించే
వర
ప్రసాదములు
ఇట్టివి,
అట్టివి
అని
చెప్పడానికి
వీలుకాదు.
ఎంతెంతో
ఘనమైన
వరములను
ప్రసాదిస్తుంటాడు,
ఆనందింపజేస్తుంటాడు.
ఇంతటి
దయామయుడైన
పరమాత్ముణ్ణి
మీరెందుకు
దూరం
చేసుకుంటున్నారు?
మీరు
భోజనము
చేయడానికి
ముందు
“బ్రహ్మార్పణం
బ్రహ్మహవిర్బ్రహ్మాగ్నౌ
బ్రహ్మణాహుతమ్...”
అనే
శ్లోకాన్ని
పఠిస్తున్నారు.
వెంటనే
మీ
లోపలినుండి,
‘అహం
వైశ్వానరో
భూత్వా
ప్రాణినాం
దేహమాశ్రితః
ప్రాణాపాన
సమాయుక్తః
పచామ్యన్నం
చతుర్విధమ్’
అని
జవాబు
వస్తున్నది.
‘నాయనా!
నేను
వైశ్వానరరూపంలో
నీ
ఉదరమునందే
ఉంటున్నాను.
నీవు
భుజించే
నాలుగు
విధములైన
ఆహారాన్ని
నేనే
జీర్ణము
చేస్తున్నాను.
నీవు
నన్ను
ప్రత్యేకంగా
ఆహ్వానం
చేయనక్కర్లేదు.
నేను
నీవాడను.
నీవు
నావాడవు.
నేను
నీ
ఇంటనే,
వెంటనే,
జంటనే,
కంటనే
ఉన్నాను,’
అని
ప్రామిస్
చేస్తున్నాడు.
కాని,
ఈ
ప్రామిస్‌ను
మీరు
సరిగా
అర్థం
చేసుకోవడం
లేదు.
ప్రేమస్వరూపులారా!
భగవంతుడు
దయామయుడు,
ప్రేమస్వరూపుడు.
అతిమధురమైనటువంటివాడు.
కనుకనే,
అతనిని
‘పుంసామ్
మోహనరూపాయ’
అని
వర్ణించారు.
అతడు
అందరినీ
మోహింపజేస్తాడు.
ఈ
ప్రపంచములోని
సమస్త
పదార్థములూ
మానవుణ్ని
ఆకర్షిస్తున్నాయి,
మోహింపజేస్తున్నాయి.
కాబట్టి,
ప్రతి
పదార్థమూ
దైవస్వరూపమే!
కాని,
ఈ
సత్యాన్ని
మీరు
అర్థం
చేసుకోలేక
పోతున్నారు.
ఎన్ని
విన్నా,
ఎన్ని
చదివినా
మీకు
దైవతత్త్వం
అర్థం
కాకుండా
ఉన్నది.
9
▾
Meaning
Keep
దైవాన్ని
అర్థం
చేసుకోవాలంటే
ఒకే
మార్గమున్నది.
దైవాన్ని
ప్రేమించండి.
దైవాన్ని
ఒక్క
ప్రేమమార్గములోనే
పొందవచ్చును
ప్రేమస్వరూపులారా!
మిమ్మల్ని
మీరు
సామాన్య
మానవులుగా
భావించుకోవడం
చాలా
పొరపాటు.
‘నేను
మానవుడను
కాను,
దైవస్వరూపుడను,’
అని
విశ్వసించండి.
‘అహం
ఏతత్
న’
అనే
జ్ఞాన
సూత్రమును
మీరు
సదా
జ్ఞప్తియందుంచుకోండి.
“ఇది
(దేహము)
నేను
కాదు.
నేను
నీవే,
నీవు
నేనే.”
ఈవిధమైన
ఏకత్వాన్ని
మనం
దృష్టిలో
పెట్టుకున్నప్పుడు
మనకు
ఏమాత్రం
భేదమే
ఉండదు.
మిమ్మల్ని
ద్వేషించే
వ్యక్తి
దారిలో
మీకు
ఎదురయ్యాడనుకోండి.
మీరతనిని
దూషించడం
ప్రారంభిస్తే
అతనుకూడా
మిమ్మల్ని
దూషిస్తాడు.
రోడ్డుమీదే
మీ
ఇద్దరిమధ్య
యుద్ధం
జరుగుతుంది.
ద్వేషాన్ని
విడనాడి
ప్రేమతో,
‘హలో
ఫ్రెండ్!
హౌ
ఆర్
యు?’
అని
పలుకరించండి.
తక్షణమే
అతనిలో
ఉన్న
ద్వేషము
మటుమాయమైపోతుంది.
ప్రేమతో
శత్రువునుకూడా
మిత్రునిగా
మార్చుకోవచ్చు.
కనుక,
ద్వేషమునకేమాత్రం
చోటివ్వకండి.
అసూయకు
అవకాశమివ్వకండి.
దైవమే
మీ
నిజమైన
స్నేహితుడని
భావించండి.
దైవాన్ని
ఒక్క
ప్రేమచేతనే
పొందడానికి
వీలౌతుంది.
ఇంకేరకమైన
మార్గములోనూ
తాను
చిక్కడు.
ఒక్క
ప్రేమమార్గములోనే
దైవము
చిక్కగలడు,
మిమ్మల్ని
అన్నివిధాలుగా
రక్షించగలడు.
ఈ
నూతన
సంవత్సరంలో
మీరు
నూతనమైన
పవిత్రమైన
భావములను
అభివృద్ధిపరచుకుంటూ,
దైవచింతన
చేసుకుంటూ,
దైవమే
మీకు
సర్వ
సౌఖ్యములను
అందిస్తాడనే
విశ్వాసముతో,
ప్రేమతో
మీ
జీవితాన్ని
గడుపుతూ
రండి.
మీరు
తప్పక
సుఖశాంతులను
అనుభవించగలరు.
మీరు,
మీ
బంధు
మిత్రులు
మాత్రమే
కాదు,
లోకమంతా
సుఖంగా
ఉండాలని
ఆశించండి.
లోక
శ్రేయస్సుకు
మీరు
పాటుపడండి.
అప్పుడే
మీకు
నిజమైన
శాంతి
లభిస్తుంది.
మీరు
ఇతరులకు
ఉపకారం
చేస్తే
మీకుకూడా
ఎల్లప్పుడు
ఉపకారమే
లభిస్తుంది
గాని,
అపకారం
జరగదు.
10
▾
Meaning
Keep
Also in his talks
(11)
22 June 1989
Win the Grace of God
1 April 1995
Make God your true friend
18 February 1996
The Name is the great boat for life
3 October 1996
Man's Aim and Goal Is the Vision of His Own Svarūpa
11 April 1997
The greatness of nāmasmaraṇa
26 September 1998
God Is the Very Foundation of the World
25 December 2001
Though faiths differ, Mādhava is one
24 February 2002
God loves the inner feeling
26 February 2002
Sai's message is the message of Prema
14 April 2002
Sumitrā and Ūrmilā, Given to Sacrifice
30 March 2004
If you remember the name of Rāma, neither attachment nor disease will cling to you
(శ్రీవారు
‘రామ
రామ
రామ
సీతా...’
అనే
భజన
గీతమును
తాము
ఆలపించి
భక్తులచేత
పాడించిన
తరువాత
తమ
దివ్యోపన్యాసమును
కొనసాగిస్తూ
ఇలా
అన్నారు)
ప్రేమస్వరూపులారా!
భగవన్నామాన్ని
ప్రీతితో
ఒక్కతూరి
పలికితే
మీ
హృదయము
ఆనందంతో
ఉప్పొంగిపోతుంది,
కఠినమైన
హృదయముకూడా
కరిగిపోతుంది.
మంచుగడ్డయైనా
కరగడానికి
కొంత
టైమ్
తీసుకుంటుందిగాని,
ప్రేమతో
మీరు
భగవన్నామస్మరణ
చేసినప్పుడు
భగవంతుని
హృదయం
క్షణంలో
కరిగిపోతుంది.
మీలో
దైవశక్తి
క్షణంలో
పెరిగిపోతుంది.
కనుక,
దైవనామాన్ని
స్మరిస్తూ
రండి.
మీరు
ఎక్కడికైనా
ప్రయాణం
చేస్తున్నప్పుడుకూడను
పరులకు
తెలియకుండా
హృదయంలో
నామస్మరణ
చేసుకోండి.
‘సర్వదా
సర్వకాలేషు
సర్వత్ర
రామచింతనం.’
ఇంతకంటే
మించిన
గొప్ప
సాధన
లేదు.
సర్వసాధనల
యొక్క
సారమిదియే!
కనుక,
ప్రేమస్వరూపులారా!
నామస్మరణ
చేయండి.
కలియుగములో
నామ
స్మరణకంటే
మించినది
లేదు.
హరేర్నామ
హరేర్నామ
హరేర్నామైవ
కేవలం
కలౌ
నాస్త్యేవ
నాస్త్యేవ
నాస్త్యేవ
గతిరన్యథా
Previous
←
Make Your Parents Happy: That Is My Happiness
Next
Ancient traditions are the steps to rising higher
→