Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Sathya Sai Speaks 1996 · Religion Is What Shows Forth the Oneness in Manyness
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
Religion Is What Shows Forth the Oneness in Manyness
6 September 1996, Sai Kulwant Hall
1
▾
Meaning
Keep
Also in his talks
(7)
11 October 1986
God belongs to all
2 May 1988
Humanness Is the United Form of Mind, Word and Deed
23 March 1989
Do all actions only to please God
2 July 1989
The Ātma Principle Is Everywhere
29 August 1992
Life is fulfilled only when one born saying ‘Koham’ attains the experience of ‘Soham’
8 September 1996
The Unseen Divinity Is the Basis of the World Fashioned as the Seen
21 October 1996
In God's Creation Everything Is Pure!
మృత్పిండమేకం
బహుభాండరూపం
సువర్ణమేకం
బహుభూషణాని
గోక్షీరమేకం
బహుధేనువర్తి
ఏకం
పరాత్మా
బహుదేహవర్తి
ప్రేమస్వరూపులారా!
మట్టి
ఒక్కటే
కాని
యీ
మట్టిద్వారా
రూపొందే
రూపనామములు
అనేకములు.
బంగారము
ఒక్కటే
కాని
అనేక
రూపనామములతోకూడిన
ఆభరణములు
వేరువేరుగా
ఉంటున్నాయి.
గోవులపాలు
ఒకే
రంగు,
తెలుపు.
కానీ,
గోవులు
వివిధ
రంగులతో
వ్యత్యాసముగా
గోచరిస్తాయి.
భగవంతుడు
ఒక్కడే!
కానీ,
అనేక
రూపనామములు
ధరించి
యావత్
విశ్వమునే
మోహింపచేస్తుంటాడు.
జగత్తునందు
మనము
చక్కగా
విచారణ
చేసి
చూసిన
ఒకే
పదార్థము
అనేక
రూపనామములు
ధరించి
అనేక
విధములుగా
వినియోగపడుతూ,
అనుభవించబడుతూ
వస్తున్నాది.
విత్తనము
ఒక్కటే!
కానీ
కాండము
వేరు,
కొమ్మలు
వేరు,
రెమ్మలు
వేరు,
ఆకులు
వేరు,
పూవులు
వేరు,
కాయలు
వేరు.
ఇవన్నీ
వివిధమైన
రూపనామములు
గలిగి
వివిధ
రీతులుగా
వినియోగము
జరుగుతూ
ఉంటున్నాది.
కానీ
ఒకే
పదార్థము.
నిమిత్తకారణము,
ఉపాదాన
కారణము
శాశ్వతముగా
ఉంటాయి
‘ఏకోహం
బహుస్యాం’.
దివ్యత్వము
ఒక్కటే
అయినప్పటికి
అనేకంగా
గోచరిస్తున్నాది.
దీనికి
మూడు
కారణములు
మనము
విచారించాలి.
ఘటమనే
కార్యమునకు
కుమ్మరి
నిమిత్త
కారణము.
అది
కార్యము.
ఇది
నిమిత్త
కారణము.
దీనికి
ఉపాదాన
కారణమే
మట్టి.
ఈ
కుండలు
పగిలిపోవచ్చు
కాని,
మట్టి
ఏనాటికి
మారదు.
ఇది
ఉపాదాన
కారణము.
ఈ
ఉపాదాన
కారణమైన
మట్టిని
ఆధారము
చేసుకొని
కుమ్మరి
కుండలు
చేస్తూ
వచ్చాడు.
2
▾
Meaning
Keep
కుండలు
పగిలినంతమాత్రమున
కుమ్మరి
పగలలేదు.
మట్టి
వేరు
రూపము
పొందలేదు.
అదే
విధముగా
ఒక
ఆభరణము
ఉంటున్నాది.
ఈ
ఆభరణము
ఒక
కార్యము.
దీనికి
కంసాలి
నిమిత్త
కారణము.
బంగారు
ఉపాదాన
కారణము.
ఎన్ని
నగలుగా
దాన్ని
మార్చినప్పటికిని
బంగారును
మార్చుటకు
వీలుకాదు.
కనుక,
ఉపాదాన
కారణమైన
భగవంతుడు,
తానే
ఒక
నిమిత్త
కారణస్వరూపుడై
సృష్టికర్తగా
ఉండి
అనేక
రూపనామములైన
కుండలను,
ఆభరణములను
నిర్మిస్తున్నాడు.
కానీ
నిమిత్త
మాత్రము,
ఉపాదాన
కారణము
రెండింటి
ఏకత్వమును
మనము
గుర్తించటానికి
ప్రయత్నించాలి.
మట్టి
ఉండి
కుమ్మరి
లేకపోతే
కుండలు
తయారుకావు.
కుమ్మరి
ఉండి
మట్టిలేక
కుండలు
చేయలేడు.
ఈ
కుమ్మరి,
మట్టి
రెండూ
ఉండినప్పుడే
కుండలు
తయారౌతాయి.
కనుక,
ఉపాదాన
కారణమే
దైవత్వము.
సృష్టికర్తయే
నిమిత్తమాత్రమైన
శక్తి.
దేహములే
కుండలవంటివి.
కుండలతో
అనేక
విధములైన
కర్మలాచరిస్తూ
పనులను
చేసుకుంటూ
సుఖమును,
ఆనందమును
పొందుతున్నాము.
కానీ
అది
క్రిందపడినప్పుడు
పగిలిపోతుంది.
కాలము
ఆసన్నమైనప్పుడు
దేహము
వదులుతుంది.
అయితే,
నిమిత్త
కారణము,
ఉపాదాన
కారణము
ఎప్పటికి
శాశ్వతముగా
ఉంటున్నాయి.
Pot
is
useless.
ఒకటి
వినియోగము,
రెండవది
దుర్వినియోగము.
ఈనాడు
దేహములను
మనము
సద్వినియోగము
చేసుకుంటున్నామా?
దుర్వినియోగపెడుతున్నామా?
దివ్యత్వమునకు
ఐదు
పేర్లుంటాయి
దైవత్వమునకు
ఐదు
పేర్లుంటున్నాయి.
మొదటిది
పరనామము.
రెండవది
వ్యూహనామము,
మూడవది
విభవనామము,
నాల్గవది
అంతరాత్మనామము,
ఐదవది
అర్చననామము.
ఈ
విధంగా
ఐదునామములతో
దైవనామము
జగత్తునందు
పని
చేస్తుండాది.
పరనామమనగా
వైకుంఠనివాసము.
వైకుంఠమనగా
కుంఠితముకానిది
వైకుంఠము.
మార్పులేనిది
వైకుంఠము.
అక్కడ
పరనామముతో
ఉంటాడు
పరమేశ్వరుడు.
అక్కడ
ఎవరూ
ప్రవేశించుటకు
వీలుకాదు.
సర్వము
తాను
చూస్తూ
ఉంటాడు.
సర్వము
వింటూ
ఉంటాడు.
3
▾
Meaning
Keep
సర్వము
తాను
కల్పిస్తూ
ఉంటాడు.
కానీ
ఎవరికి
కనిపించడు,
ఎవరికి
వినిపించడు,
ఎవరికి
సాక్షాత్కరించడు.
దీనినే
పరనామము
అన్నారు.
రెండవది
వ్యూహ
నామము.
అనగా
పాలసముద్రములో
పవళించినవాడు
శేషతల్పముపైన
అని
అర్థము.
అయితే
దీనిని
దేవతలుమాత్రమే
దర్శించగలరు.
సామాన్య
మానవులు
దీనిని
దర్శించలేరు.
అయితే
యీ
దేవతల
అభీష్టములన్నీకూడను
ఈ
వ్యూహనామము
సంసిద్ధముగా
నెరవేరుస్తుంది.
మీరందరు
సినిమాల్లో,
డ్రామాల్లో
విని
ఉంటారు.
హిరణ్యకశిపుడు
లోకములన్నింటిని
పాలిస్తూ
వచ్చాడు.
దేవతలు
శేషతల్పముపైన
పరుండిన
నారాయణుని
ప్రార్థించాడు.
వారి
ప్రార్థనలు
మన్నించి
తాను
తిరిగి
ఈ
లోకమునకు
కదలి
వచ్చాడు,
సహాయము
చేసే
నిమిత్తమై.
వ్యూహనామము
అనగా
కేవలము
దేవతలకు
మాత్రమే
గోచరించేవాడు.
మూడవది
విభవనామము.
అనగా
మానవ
శరీరము
ధరించి
దశావతారములుగా
రామకృష్ణాది
అవతారములుగా
ఈ
మానవదేహముతో
లోకసంరక్షణ
నిమిత్తమై
అవతరించటము
విభవనామము
అన్నారు.
ఈ
ప్రపంచముతో,
ఈ
పార్థివమైన
జగత్తుతో
ఈ
ప్రాకృతమైన
జగత్తుతో
సంబంధబాంధవ్యము
కలిగించుకునే
అవతారమే
విభవనామము.
దుర్గుణములను,
దురాలోచనలను,
దుచ్చింతనలను,
దుష్టులను
సరైన
మార్గములో
నిలిపి
భగవద్భక్తి,
సచ్చింతనలు,
సదాచారము
వారికి
అందించే
అవతారములే
విభవనామముయొక్క
పేర్లు.
లోకములో
ఈనాడు
దశావతారములు
అని
వేటినైతే
మనము
భావిస్తున్నామో
అవన్నీ
విభవనామమునకు
సంబంధించినవే!
కేవలము
భక్తులకు,
భగవంతునికి
మాత్రమే
సన్నిహిత
సంబంధముతో
ఉండేది,
నాల్గవది
అంతరాత్మనామము.
ప్రతి
మానవునియందు
చైతన్యముచేత
నఖశిఖపర్యంతము
సంచరిస్తూ
సంరక్షిస్తూ
ఆ
దేహమునకు
తగిన
భద్రతను
కల్పిస్తుండేదే
యీ
నామము.
దానిపేరే
అంతరాత్మ.
ప్రతి
మానవునియందు
అంతరాత్మ
ఉంటున్నది.
అదియే
దైవత్వము.
ఇక
అర్చననామము.
అనగా
కేవలము
భక్తి
ప్రపత్తులచేత
ప్రార్థనలు,
భజనలు,
కీర్తనలు
సల్పుతూ
భగవంతుని
వర్ణిస్తూ
భగవంతుని
కీర్తిస్తూ
అనుగ్రహానికి
పాత్రులు
కావటానికి
ప్రయత్నము
చేసేది.
4
▾
Meaning
Keep
కృతయుగ,
త్రేతాయుగములలో
ధర్మమూల
మిదం
జగత్
ఈ
విధమైన
అవతారములు
అనాదికాలమునుండి
యుగయుగములనుండి
కూడను
జరుగుతూనే
వస్తున్నాయి.
యీనాటి
పిల్లలకు
చాలా
ఆశ్చర్యము
కావచ్చు.
కృతయుగముయొక్క
మహత్తరశక్తిని
విన్నప్పుడు
ఎటువంటి
వారికైనా
ఆశ్చర్యము
కలుగుతుంది.
యిది
నమ్మదగినదా
అనే
అనుమానము
కలగటానికి
అవకాశమున్నది.
కృతయుగములోని
మానవుడు
వందలకొలది
సంవత్సరములు
బ్రతికేవాడు.
అంతేకాక,
భౌతికమైన
శరీరము
యింత
చిన్నదిగా
ఉండేదికాదు.
ఆజానుబాహులైనవారు.
ఆ
కృతయుగ
మానవుడు
ఏవిధంగా
బ్రతుకుతూ
వచ్చాడు?
ఏ
ఆధారముతో
బ్రతుకుతూ
వచ్చాడు?
కృతయుగంలో
అస్థిపంజరమై
ఎముకలుండినంతవరకు
ప్రాణముండేది.
అస్థిపంజరమై
కండరములు,
రక్తము
లేకపోయినా
ఎముకలలోనే
ప్రాణముండేది.
త్రేతాయుగములో
height
తగ్గిపోతూ
వచ్చింది.
వయస్సుయొక్క
ప్రమాణము
తగ్గిపోతూ
వచ్చింది.
దేహములో
కండరములు,
మాంసము
ఉండినంతవరకు
ప్రాణముండేది.
ద్వాపరయుగము
వచ్చింది.
ద్వాపరయుగములో
రక్తము
ఉండేవరకు
ప్రాణముండేది.
భారతయుద్ధములో
చక్కగా
తెలిసినదే!
భీష్ముడు
నేలకూలాడు.
శరతల్పముపై
పరుండినాడు.
దేహములోనుండిన
రక్తమంతా
కారిపోయేంతవరకు
బ్రతికే
ఉన్నాడు.
56
దినములు
ప్రాణముతో
ఉండినాడు.
ప్రాణమునకు
ఏది
కారణము?
రక్తమే
అతని
ప్రాణము.
అంబులు
తగిలి
రక్తము
నిదానముగా
కారిపోతూ
వస్తున్నది.
56
దినములు
జరిగింది.
రక్తము
ఉండినంతవరకు
ప్రాణముండేది.
కలియుగము
ప్రారంభమైంది.
కలియుగములో
అన్నముండినంతవరకే
మానవుడు
బ్రతుకుతాడు.
అన్నము
తిన్నప్పుడే
బ్రతుకుతాడు,
అన్నము
లేకపోతే
క్షీణించిపోతాడు.
కనుక
అన్నగత
ప్రాణమని
చెబుతూ
వచ్చింది.
కలియుగంలో
మానవులు
అన్నము
లేకపోతే
దినదినమునకు
క్షీణించిపోతారు.
ఆనాడు
అన్నముకాదు
ప్రధానము.
ఆనాడు
వారు
God
తో
సంబంధము
పెట్టుకున్నారు.
ద్వాపరయుగములో
ధనమూల
మిదం
జగత్
ద్వాపరయుగము
వచ్చేటప్పటికి
head
తో
సంబంధము
పెంచుకున్నారు.
కృతయుగ,
త్రేతాయుగములలో
God
తో
సంబంధము
ఉండేది.
దీనిని
చక్కగా
మీరు
అర్థము
చేసుకోండి.
5
▾
Meaning
Keep
కృతయుగము,
త్రేతాయుగము
ధర్మమూల
మిదం
జగత్.
ధర్మముతో
జగత్తు
నిలుస్తూ
వచ్చింది.
క్రమక్రమేణా
ద్వాపరయుగము
వచ్చేటప్పటికి
ధనమూల
మిదం
జగత్.
కౌరవులు,
పాండవులు
యుద్ధము
చేయటానికి
మూలకారణము
ఏమిటి?
ఐదు
గ్రామములు
అయినా
యివ్వమని
పాండవులు,
యివ్వటానికి
వీలుకాదని
కౌరవులు,
ఇలా
ధనముతోనే
యీ
వ్యవహారమంతా
జరిగింది.
ఈనాడు
కలియుగమందు
ధర్మమూల
మిదం
జగత్తుకాదు.
ధనమూల
మిదం
జగత్తుకాదు.
దయమూల
మిదం
జగత్తు.
ఈనాడు
ఏ
హృదయములోకూడా
దయలేదు.
హృత్-దయ
అని
పేరుంది
గానీ
హృదయములో
దయలేదు.
ఈనాడు
దయ
లేకపోవటంచేత
అనేక
అవస్థలకు
గురౌతున్నాడు
మానవుడు.
కలియుగములో
వేద,
శాస్త్రములపై
విశ్వాసము
లేకుండా
పోయింది
ఈ
కలి
ప్రారంభమునకు
పూర్వము
బుద్ధ,
జైన
మతములకు
ఎక్కువ
ప్రచారమున్న
కేరళ
రాజ్యములో
‘కాలడి’
అనే
చిన్న
పల్లెలో
శివగురు,
ఆర్యాంబ
అనే
దంపతులకు
ఒక
కుమారుడు
కలిగాడు.
అప్పటి
పరిస్థితి
ఏరీతిగా
ఉంది?
ఆనాటి
రాజులు
ఒకరి
రాజ్యముపైన
ఒకరు
దండెత్తిపోయి
ప్రజలను
అనేక
విధంగా
హింసిస్తూ
కేవలము
భౌతిక
సుఖములకోసమని
ప్రాకులాడుతూ
వచ్చారు.
ఈ
విధమైన
యుద్ధములు
జరగటంచేతనే
మానవుని
మనస్సులలో
ఒకరిపై
ఒకరికి
ద్వేషములు
ఏర్పడుతూ
వచ్చాయి.
ఈ
ద్వేషములచేత
ఐకమత్యము
క్షీణించి
పోయింది.
ఐకమత్యము
లేకపోవటంచేత
అన్ని
విధములైన
అనాచారములు
ప్రారంభమైనాయి.
అన్యాయ,
అక్రమ,
అనాచార,
అసత్య,
దౌర్జన్యములు
పెరిగిపోయినాయి.
ఇంతటితో
పోక
ఆనాటి
పండితులు,
వేదవిదులు,
చదువరులు,
మేధాసంపదగలవారు
వీరందరు
వేదమంత్రములకు
అనేక
అర్థములు
కల్పించుకుంటూవచ్చారు.
శాస్త్రముయొక్క
స్వరూపమును
పూర్తిగా
మార్చేశారు.
వేదమును
విరుద్ధమైన
అర్థముతో
బోధిస్తూ
వచ్చారు.
కనుకనే
వేదములపై
విశ్వాసము,
శాస్త్రములపై
విశ్వాసము
లేకుండా
పోయింది.
ఆసమయములో
వీటిని
ఉద్ధరించేవారు
ఒకరు
కావాలి.
6
▾
Meaning
Keep
Also in his talks
(5)
21 May 1991
The Vedic Heritage Of India
1 April 1995
Make God your true friend
14 August 1998
Prema Alone Is the Path, Prema Alone the Goal
20 November 1998
The Body Is Truly the First Means to Dharma
9 August 2006
The Ati Rudra, supremely powerful
ఏనాడు
వేద,
శాస్త్రములకు
విరుద్ధమైన
మార్పులు
సంభవిస్తాయో
అప్పుడు
భగవంతుడు
ఏదో
ఒక
రూపములో
అవతరిస్తాడు
యదాయదాహిధర్మస్యగ్లానిర్భవతి
భారత
అభ్యుత్థానమధర్మస్య
తదాత్మానం
సృజామ్యహం
ఎప్పుడు
ధర్మము
క్షీణిస్తుందో,
ఎప్పుడు
అన్యాయములు
అభివృద్ధి
పొందుతాయో,
ఏనాడు
వేదమునకు
విరుద్ధమైన
మార్పులు
జరుగుతాయో,
శాస్త్రవిరుద్ధమైన
నడత
ఏనాడు
ప్రారంభమవుతుందో,
అలాంటి
సమయములో
భగవంతుడో
లేక
భగవంతుని
శక్తియో
లేక
అవధూతలో
యీ
విరుద్ధమైనదానిని
సవరించే
నిమిత్తమై
అవతరిస్తారు.
అదే
అర్చన
నామములు
అని.
ఈ
అర్చననామములలోపల
భగవంతుని
తత్త్వమును
పూర్తిగా
నిరూపించాలనే
ఉద్దేశ్యముతో
కొంతమంది
మహనీయులు
లోకములో
అంశరూపములలో
ఉద్భవిస్తుంటారు
అనగా
అంశావతారములని
పేరు.
విభవ
అవతారములు,
పూర్ణ
అవతారములు.
అర్చననామములు,
అంశావతారములు.
అప్పుడప్పుడు
ఈ
విధమైన
అవతారములు
ఉద్భవిస్తూవచ్చాయి,
అన్ని
దేశములందుకూడా!
ఒక్క
భారతదేశమందేకాదు.
జీసస్కూడా
మొట్టమొదట
I
am
the
messenger
of
God
అన్నాడు.
నేను
దేవుని
దూతను
అన్నాడు.
ఏమి
దూత?
రెండు
రకములైన
దూతలుంటున్నారు.
అవధూత
ఒకటి,
యమదూత
ఒకటి.
యమదూతలు
హింసించే
దూతలు,
అవధూతలు
రక్షించే
దూతలు.
కనుక
I
am
the
messenger
of
God
అన్నాడు,
మొట్టమొదట.
క్రమక్రమేణా
ఈ
అంతరాత్మతత్త్వాన్ని
గుర్తించుకుంటూ
వచ్చాడు.
అప్పుడు
I
am
the
son
of
God
అన్నాడు.
అనగా
ఏమిటి?
భగవంతుని
కుమారుడైనప్పుడు
భగవంతుని
ప్రోపరిటీలో
యితనికి
రైటు
ఉంటుంది.
తండ్రి
ప్రోపరిటిలో
కుమారునికి
హక్కు
ఉంది.
అట్టి
పవిత్రమైన
సదాలోచనలు,
సచ్చింతనలు,
సద్గుణములంతా
అతనిలో
ఆవిర్భవిస్తూ
వచ్చాయి.
అప్పుడే
I
am
the
son
of
God
అన్నాడు.
ఆ
ఆస్తి
ఎప్పుడు
కుమారునికి
సంక్రమించిందో
ఇక
తండ్రికి
వేరే
ఏ
ఆస్తిలేదు.
అంతా
కుమారునికి
అప్పచెప్పాడు.
ఈ
సత్యమును
గుర్తించుకున్నాడు.
అందులో
ఉన్నది,
యిందులో
నున్నది
అదే.
ఆత్మ
ఒక్కటే!
సర్వాత్మభావము.
అప్పుడు
I
and
My
Father
are
one
అన్నాడు.
అదే
విధముగా
పర్షియాలోకూడా
మొట్టమొదట
వారు
మెసెంజర్సుగా
వచ్చారు.
మహమ్మద్.
ఆయన
దూతగా
వచ్చాడు.
I
am
in
the
light
అన్నాడు.
భగవంతుడు
స్వర్గములో
ఉంటున్నాడు
అతనియొక్క
లైటులో
నేను
జీవిస్తున్నాను
అన్నాడు.
క్రమక్రమేణా
ఈ
దివ్యత్వము
గుర్తించుకుంటూ
వచ్చాడు.
7
▾
Meaning
Keep
అప్పుడు
The
light
is
in
Me
అన్నాడు.
తాను
లైటులో
జీవించినట్లుగా
ఊహించాడు.
లైటు
బయటలేదు,
అంటే
నాలో
ఉంది.
The
light
is
in
Me
అనుకున్నాడు.
అదే
reflection
of
the
inner
being.
లోపలనున్న
వ్యక్తి
బయట
కనిపిస్తున్నాడు.
ఈ
విధమైన
దీనిని
అభివృద్ధి
గావించుకుంటూ
రాగా
చివరిగా
నేనే
లైటు
I
am
the
light
అన్నాడు.
I
am
in
the
light,
the
light
is
in
me,
I
am
the
light.
యివన్నీ
ద్వైత,
విశిష్టాద్వైత,
అద్వైతములతో
చేరినవి.
అద్వైతమును
శంకరులవారు
జగత్తుకు
చాటించాలనే
ఉద్దేశ్యముతో
మొట్టమొదట
తాను
ఒక
దాసుడుగా
భావించుకుంటూ
వచ్చాడు.
అయితే
దురదృష్టవశాత్తు
శంకరుడు
పుట్టిన
మూడవ
సంవత్సరములోపలనే
తండ్రి
శివగురువు
మరణించాడు
ఒక
పది
దినములకు
ముందుగా
శివగురువుకు
ఒక
కాంతి
కనుపించింది.
నీ
కుమారునకు
ఉపనయన
సంస్కారము
గావించమన్నాడు.
ఆ
కాంతియే
మాట్లాడింది.
అదే
the
light
is
in
me.
ఆ
శివగురువు
త్వరలో
మూడవ
సంవత్సరములోపునే
కుమారునికి
ఉపనయన
సంస్కారము
చేశాడు.
గాయత్రి
మంత్రము
ప్రారంభించాడు,
యీ
పిల్లవాడు.
తండ్రి
మూడవ
సంవత్సరములోనే
మరణించాడు.
తల్లి
దుఃఖమును
భరించుకొని
యీ
పిల్లవానిని
పెంచుతూ
వచ్చింది.
మొట్టమొదట
ఒక
గురువుదగ్గర
ప్రవేశపెట్టింది.
ఆ
గురువు
అనేక
విద్యలు
నేర్పుతూ
వచ్చాడు.
నాలుగు
వేదములు,
ఆరు
శాస్త్రములు,
పదహారవ
సంవత్సరములోపలనే
నేర్చాడు.
50
సం॥లైనా
నాలుగు
వేదములు,
ఆరుశాస్త్రములు
పఠించుటకు
వీలుకాదు.
ఈ
బిడ్డ
చాలా
special.
ఒక్కతూరి
చూస్తే
చాలు.
గురువుకే
చాలా
ఆశ్చర్యము
వేసింది.
తల్లి
బాధ
భరించుకోలేక
పోయింది.
ఒకనాడు
గురువు
దగ్గరకు
పోయి
‘మా
అబ్బాయికి
వివాహము
చేయాలి’,
అని
కోరింది.
పిల్లవాడు
చెప్పాడు:
‘నాకు
వివాహము
అక్కరలేదు.
నేను
సన్యసించాలని
ఆశ
పడుతున్నాను.
నా
దేహము,
నా
మనస్సు,
నా
సర్వస్వము
భగవంతునికే
అర్పితము
చేయాలనుకున్నాను.
ఇది
నా
శక్తికాదు
నా
ప్రోపరిటీకాదు
నా
ఆస్తికాదు.
ఇది
భగవంతుడిచ్చిన
శక్తి.
నేను
భగవంతునికి
అర్పితమైనవాడను.
నాకు
వివాహము
అక్కరలేదన్నాడు.
సన్యాసము
తీసుకోవాలని
పట్టుపట్టాడు’.
చాలా
ఏడ్చింది,
తల్లి
ఆర్యాంబ.
అది
లోకములో
సహజమే!
ఒకనాడు
తల్లి
నీటికోసమని
కావేరికి
వెడుతున్నాది.
వెనుకనే
పోతున్నాడు.
‘అమ్మా!
నాకు
ఆజ్ఞ
యియ్యి,
నాకు
ఆజ్ఞ
యియ్యి’
అంటూ.
8
▾
Meaning
Keep
దేనికి?
సన్యాసమునకు
అనుజ్ఞ
యివ్వాలి.
కానీ
ఆమె
పట్టు
వదలలేదు.
ఆమె
నీరు
ముంచుకుంటున్నప్పుడు
కావేరిలో
ఉరికాడు.
ఒక
చేయిపైకి
ఎత్తాడు.
‘అమ్మా
నన్ను
ఒక
మొసలిమింగుతున్నాది.
యిప్పటికైనా
సన్యాసమునకు
ఆజ్ఞ
యీయమ’న్నాడు.
తల్లి
‘నాయనా
నీవు
బ్రతికి
ఉంటే
అంతే
చాలు
సన్యాసము
తీసుకో!
రా
వెనుకకు’
అంది.
గట్టుకు
వచ్చిన
తరువాత
చెబుతున్నాడు.
‘నన్ను
మొసలి
పట్టుకుంది.
ఏమిటి
యీ
మొసలి.
సంసారమనే
సముద్రములో
భార్య
అనే
మొసలి
నన్ను
మింగుతూ
వచ్చింది.
సర్వసంగపరిత్యాగినైతే
ఆ
మొసలి
వదలిపోతుంది’.
సన్యాసమంటే
ఏమిటి?
బుద్ధులు
మారటమే!
తల్లికి
నమస్కరించుకొని
ఆ
పదహారవ
సం॥లోనే
ఇల్లు
వదిలాడు.
తల్లి
ఒక
వాగ్దానము
కోరింది,
‘నా
అంత్య
సమయములో
మాత్రము
నిన్ను
చూడాలి.
కనుక
నీవు
రావాలి’
అంది.
ఆనాడు
బస్సులు,
కార్లు,
ప్లేన్లు
ప్రయాణసౌకర్యములు
లేవు.
అనేక
విధములుగా
ప్రయాణము
చేసి
అన్ని
క్షేత్రములు
దర్శించాడు.
ఎక్కడెక్కడ
వేదపండితులు,
శాస్త్రపండితులు
ఉన్నారో
వారందరిని
వాదములో
ఓడించాడు.
అందరికి
అద్వైతము
బోధించాడు.
మీరు
భిన్నముగా
భావిస్తున్నారు.
ఆకారములు
భిన్నమే!
తలలు
భిన్నమే!
కానీ
హృదయము
ఒక్కటే!
అదియే
దైవత్వము.
చెఱుకులు
ఎన్నియో
ఉండవచ్చు.
అన్ని
చెఱుకులనుండి
వచ్చే
రసము
ఒక్కటే!
అట్టి
చెఱుకు
రసమువంటి
దైవత్వము
అందరియందు
రసస్వరూపుడై
ఉంటున్నాడు.
అనేక
పండితులను
ఓడించాడు.
వారిలో
ఒకరైన
మండన
మిశ్రుడు
కర్మ
సిద్ధాంతమును
ఆధారము
చేసుకున్నాడు.
ఈ
కర్మ
సిద్ధాంతమును
ఖండించి
కేవలము
అద్వైతసిద్ధాంతము
బోధించాలని
అతనితో
వాదము
చేశాడు.
ఈ
విధంగా
యావత్
భారతదేశములోపల
కన్యాకుమారి
మొదలు
కాశ్మీరమువరకు
అనేక
పర్యాయములు
ప్రయాణము
చేశాడు.
కట్టకడపటికి
పండితులనందరిని
ఒప్పించాడు.
ఉన్నది
ఒక్కటే!
రెండుకాదు.
‘ఏకమేవ
అద్వితీయం’.
కేవలము
రూపనామములచే
మనము
భ్రమిస్తున్నాము.
అన్నింటికి
ఆధారమైన
మూలాధారమును
పట్టుకోవాలి
అన్నింటికి
ఆధారమైన
మూలాధారమును
మనం
పట్టుకోవాలి.
మూలాధారములేక
ఏమీ
చేయుటకు
వీలులేదు.
9
▾
Meaning
Keep
బంగారులేక
ఏ
నగలు
చేయుటకు
వీలుకాదు.
మట్టిలేక
కుండలు
చేయుటకు
వీలుకాదు.
అది
మూలాధారము.
అలాంటి
ప్రధానమైనది
ఒక్కటే
ఉన్నది.
అది
మహమ్మదీయులనుకోండి,
హిందువులనుకోండి,
అందరికి
ఉన్నది
ఒక్కటే!
పేర్లు
వేరు
వేరు.
God
is
one
and
goal
is
one.
ఈ
అద్వైతమును
అర్థమయ్యేరీతిగా
మీకు
బోధించాలి.
అద్వైతము
అంత
సులభముగా
అర్థమయ్యేదికాదు.
శంకరాచార్యులవారు
భారతదేశమంతటా
పర్యటించి
పండితులందరిచేత
అద్వైతసిద్ధాంతము
ఒప్పించాడు.
అతను
స్థాపించినదే
అద్వైతసిద్ధాంతము.
అదే
అద్వైతమతము.
మతము
అనగా
ఏమిటి?
భిన్నముగా
చూచేదికాదు
మతము.
అనేకత్వములోని
ఏకత్వమును
నిరూపించేది
మతము.
ఇలాంటి
అద్వైతమును
అందరు
అంగీకరిస్తూ
వచ్చారు.
చివరకు
చాలా
చిన్న
వయసులో
అనగా
కేవలం
32వ
సం॥లో
తాను
శరీరమును
వదిలాడు.
అతను
వచ్చిన
పని
అయిపోయింది.
తాను
బోధించిన
అద్వైత
సిద్ధాంతమును
మున్ముందు
మీరు
కాపాడుకోవాలి.
అప్పుడు
5
లింగములు
తీసుకువచ్చాడు.
ఒక్కొక్క
లింగము
ఒక్కొక్క
ప్రదేశములో
స్థాపిస్తూవచ్చాడు.
దేశములో
నలుమూలలా
నాలుగు
పీఠములను
స్థాపించి
అందులో
ఆ
నాలుగు
లింగములను
ప్రతిష్ట
చేశారు.
చివరగా
యోగలింగమును
కంచిలో
పెట్టాడు.
సురేశుడు,
అతనే
మండనమిశ్రుడు.
ఆయన
శిష్యుడు.
అతను
అద్వైతమత
ప్రబోధద్వారా
లోకములో
అల్లర్లను
చల్లార్చి,
ద్వేషమును
నిర్మూలముగావించి
ఏకాత్మ
భావముచేత
ఆనందము
అభివృద్ధి
పరచటానికి
తగిన
కృషి
చేశాడు.
ఈ
విధంగా
దేశమంతట
శంకరుల
శిష్య
పరంపర
బయలుదేరి
ఆయన
బోధలను
ప్రచారము
చేస్తూ
వచ్చారు.
విద్యారణ్యులవారు
కూడ
శంకరుని
శిష్య
పరంపరలో
ఒకరు.
ఈ
శిష్యులలో
ఒకరితో
ఒకరికి
ఐకమత్యము
లేకుండా
పోయింది.
ఒకరు
చెప్పినది
యింకొకరు
అంగీకరించలేదు.
క్రిష్టియన్
మతములోకూడా
ఇదే
పద్ధతి.
జీసస్
పోతూనే
ఆయన
11మంది
శిష్యులు
ఒకరితో
ఒకరికి
భేదములు
ఏర్పడిపోయాయి.
కట్టకడపటికి
ఒక్కరు
నిలిచారు.
అతనే
మేథ్యూ.
అతను
tax
collector.
అతను
తాను
వ్రాసుకున్నవి
మాత్రమే
ప్రచారము
చేస్తూవచ్చాడు.
మొట్టమొదట
చేరినవాడు
పీటర్.
పీటరును
పట్టుకోటానికి
వస్తే
నేను
క్రీస్తు
follower
ను
కాదు
అన్నాడు.
యింత
స్వార్థము
యింత
స్వప్రయోజనము.
ఆ
ఉపదేశములన్నీ
ఛిన్నాభిన్నముగా
మారిపోయాయి.
10
▾
Meaning
Keep
His poems 158
Also in his talks
(12)
6 October 1986
Serve the Lord of all in the form of society!
2 October 1988
Brahman Itself Is the Root Power of the World!
1 July 1996
Learning Without Practice Is Futile
27 August 1996
When the Anātma Is Removed, the Ātma Is Seen Everywhere
17 April 1998
Desires are the root of unrest
28 September 1998
The Five Elements Are the Very Forms of the Paramātma
25 December 1998
Those Who Spread God's Prema Are the True Messengers of God
9 October 2001
God in human form
12 March 2002
The worship of God protects the nation
6 May 2003
Easwaramma, the ideal mother
25 December 2003
Give up the illusion of the body, and you yourself are God
11 February 2007
Prema for God is the divine medicine for every worry
తరువాతి
కాలములో
శంకరులవారు
చెప్పిన
అద్వైతసిద్దాంతమును
రామానుజులవారు
సవరించి
విశిష్టమైన
అద్వైతమని
పేరు
పెడుతూవచ్చారు.
శంకరులవారు
చెఱుకురసము
అద్వైతము
అన్నాడు.
ఇది
ఎంతకాలము
పెట్టుకోటానికి
వీలవుతుంది?
శాశ్వతంకాదు.
అమృతరసంకాదు.
యిది
అమృతమయముగా
మార్చాలని
చెప్పాడు.
చెఱుకురసమును
సంస్కరింపచేసి
చక్కెరగా
మార్చి
దేనిలోనైనా
చేర్చండి.
బియ్యపుపిండిలో
వేసుకోండి,
గోధుమపిండిలో
వేసుకోండి.
తీయగా
ఉంటుంది.
దేనిలో
వేసినా
దీని
గుణము
తీపే!
ఈ
సుగర్
శాశ్వతము.
దేనికైనా
ఉపయోగపెట్టుకోవచ్చును.
దీనినే
శుద్ధమైన,
విశిష్టమైన
అద్వైతము
అన్నారు.
ఇవన్నీ
ఒక్కొక్కటి
విపులీకరించి
మీకు
బోధిస్తాను.
మూడవది
ద్వైతము.
దీనిని
స్థాపించినవాడు
మధ్వాచార్యులు.
శంకరాచార్య,
రామానుజాచార్య,
మధ్వాచార్య.
ఈ
ముగ్గురూ
అద్వైతము,
విశిష్టాద్వైతము,
ద్వైతమనే
మూడు
మతములను
స్థాపించారు.
అయితే
ముగ్గురు
ఒకదానినే
అంగీకరించారు.
అదే
రసము
అన్నారు.
అయితే
మధ్వాచార్యులు
‘నేను
సుగర్
కాకూడదు.
సుగర్
తినేవాడుగా
కావాలి.
సుగర్ను
నేను
అనుభవించాలి.
నేను
సుగర్
అయితే,
ఏవిధంగా
నాకు
ఆనందము
లభ్యమవుతుంది?
కాబట్టి
నన్ను
సుగర్ను
భుజించేవాడుగా
తయారుచేయమ’న్నాడు.
ఎప్పుడు
సుగర్
తినేవాడిగా
మారగలవు?
తన్ను
తాను
అర్పితము
చేసుకున్నప్పుడే
తాను
సుగర్
తినేవాడుగా
తయారౌతాడు.
అంతవరకు
మాత్రం
కాదు.
ఎన్ని
విధములైన
సాధనలైనా
చేయి.
ఎంత
తపస్సు
అయినా
చేయి.
ఎన్ని
యోగములైనా
చేయి.
ఎన్ని
జపాలు,
ధ్యానములైనా
చేయండి.
ఎన్ని
గ్రంథములైనా
చదవండి.
కానీ
ఆ
సుగర్
తినే
అధికారము
రాదు.
ఇవన్నీ
తాత్కాలికముగా
మనస్సును
అరికట్టే
విధానములు.
కాని,
అన్ని
సాధనలు
మనస్సుద్వారా
జరిగేవి
కనుక,
ఆ
మనస్సును
భగవంతునికి
అర్పితముచేయాలి.
దానినే
మధ్వాచార్యులు
చెప్పారు:
ఏ
హృదయంబునొసగితివో
ఈశనాకు
మగిడి
దానినే
అర్పింతు
మహితమూర్తి
పరగ
వేరేమి
తెత్తు
నీపాదార్చనకును
అంజలిఘటింతు
అందుకోవయ్య
నీవు.
11
▾
Meaning
Keep
Also in his talks
(14)
22 February 1982
The Sādhana of Unity
28 January 1992
The Ātma dwelling in all beings is one!
3 March 1992
Singing the Name of God makes the five elements holy
18 February 1996
The Name is the great boat for life
15 July 1996
Dharma Is Our Real And Permanent Property
27 August 1996
When the Anātma Is Removed, the Ātma Is Seen Everywhere
3 October 1996
Man's Aim and Goal Is the Vision of His Own Svarūpa
10 October 2002
Earn divine Prema
19 August 2003
The heart alone is Kṛṣṇa's birthplace
15 April 2004
The principle of Prema is Divinity itself
13 May 2006
Humanness finds its fulfilment only when steadiness and oneness are both there
31 May 2008
Oneness is divinity
22 July 2008
Man finds Śānti only when he turns his mind towards God
23 November 2008
Foster the feeling of the one Ātma, and unity!
ఇదుగో
నా
హృదయమును
అర్పిస్తున్నాను.
అంటే
భగవంతుడుకూడా
తీసుకో
సుగర్
నీకు
అందిస్తున్నాను
అంటాడు.
‘యద్భావం
తద్భావతి’.
భక్తుడు
ఏ
రూపము
కోరితే
ఆ
రూపము
ధరిస్తాడు
భగవంతుడు
నీవు
ఏ
విధంగా
అర్పితము
చేస్తావో
భగవంతుడుకూడా
ఆవిధంగా
నిన్ను
అనుగ్రహిస్తాడు.
కనుక,
మొట్టమొదట
నీలో
భావములను
స్థిరము
చేసుకో.
భగవంతుడు
ఎప్పటికి
మారదు.
నీయొక్క
భావములో
భగవంతుని
పలుకులకు
మార్పు
కలుగుతున్నాది.
నీటికి
ఏ
రూపముంది?
గాలికి
ఏ
రూపముంది?
ఏమీలేదు.
భగవంతుడుకూడా
అంతే!
భక్తుని
ప్రేమ
బంధముచేత
ఆ
రూపాన్ని
పొందుతాడు.
గాలిని
foot
ball
లో
చేరిస్తే
ఆ
రూపము
పొందుతుంది.
గాలిని
balloon
లో
చేరిస్తే
బెలూన్
రూపము
ఉంటుంది.
నీటిని
ఏ
పాత్రలో
పోస్తే
ఆ
రూపము
పొందుతుంది.
భగవంతునిది
ఏ
రూపము?
నీవు
ఆశించిన
రూపమే
ధరిస్తాడు.
ఈ
రూపమే
ఆ
రూపమే
అని
భగవంతునికి
భేదములులేవు.
భక్తుడు
ఏ
రూపము
కోరితే
ఆ
రూపము
ధరిస్తాడు
సర్వరూపధరం
శాంతం
సర్వనామధరం
శివం
సచ్చిదానందరూపం
అద్వైతం
సత్యం
శివం
సుందరం.
భగవంతుడు
శాంతస్వరూపుడై
అన్ని
రూపములు
ధరిస్తుంటాడుట!
అన్ని
నామములు
తనవిగానే
ధరిస్తాడుట!
ఎవరతను?
సత్
చిత్
ఆనందం.
‘సచ్చిదానందరూపం,
అద్వైతం,
సత్యం
శివం
సుందరం’.
ఎంత
చక్కగా
ఉంటున్నాది!
నిజానికి
మూడూ
ఒక్కటే!
సత్యమే
సుందరం.
సత్యములేక
సుందరము
ఎక్కడనుంచి
వస్తుంది?
ఆకర్షణ
ఉంటుందిగానీ
beauty
ఉండదు.
సత్యం
శివం
సుందరం.
ఆ
సుందరము
సత్యము
చేరితే
goodness.
ఈ
మూడు
ఒక్కటే.
వీటినే
ప్లేటో
బోధిస్తూ
వచ్చాడు.
అరిస్టాటిల్
ప్లేటో
శిష్యుడు.
‘నాయనా
అన్ని
శాస్త్రములు
చదివావు.
అన్నిటియందు
ఉన్నవి
మూడే!
సత్యం
శివం
సుందరం.
Truth,
goodness,
beauty
ఈ
మూడు
ఉంటే
మానవుడు
దేవుడై
పోతాడు’,
అని
బోధించాడు.
12
▾
Meaning
Keep
మొట్టమొదట
మానవతా
గుణములు
తెలుసుకోవటానికి
ప్రయత్నించాలి
ఈనాటి
మానవుడు
తన
మానవత్వమునే
తెలుసుకోలేకపోతున్నాడు.
మానవుడు
మానవునియందున్న
మానవతా
విలువలే
తెలుసుకోలేకపోతున్నాడు.
ఇంక
దైవగుణములు
ఏ
విధముగా
తెలుసుకోగలడు?
కొన్ని
లక్షల
సంవత్సరములైంది,
మానవుడు
పుట్టి.
కానీ
యింకా
మానవత్వము
పుట్టలేదు.
ఏనాడు
మానవునియందు
మానవత్వము
పుట్టుతుందో,
ఏనాడు
మానవునియందు
మానవత్వము
దర్శిస్తాడో
అప్పుడే
మానవునియందు
దైవత్వము
దర్శించగలడు.
మానవునియందున్న
మానవగుణములే
గుర్తించలేకపోతే
యింక
దైవగుణములు
ఏ
రీతిగా
గుర్తిస్తాడు?
ఉట్టికెగరలేనమ్మ
స్వర్గానికి
ఎగురుతుందా?
తన
మానవతా
గుణములే
తాను
తెలిసికోలేకుండాపోతున్నాడు.
దైవగుణములు
ఎట్లా
తెలుస్తాయి?
మొట్టమొదట
మానవతాగుణములు
తెలుసుకోటానికి
ప్రయత్నించాలి.
అప్పుడే
దైవగుణములు
తేలికగా
అర్థమవుతాయి.
మొట్టమొదట
మహానీయులు
ఏ
మార్గములో
దైవమును
తెలుసుకోగలిగారు
అనే
దానిని
తెలుసుకోవాలి.
అప్పుడే
పిల్లలందరికి
నిర్మలభావము
కుదురుతుంది.
నిస్వార్థప్రేమ
పెరుగుతుంది.
నిశ్చింతగా
జీవిస్తారు.
Previous
←
Saccidānanda Is Man's Very Nature!
Next
Advaita Is the Principle of the One Ātma
→